(Part 5 - Day 5)
-- #కాలసూచక
#మల్టీవర్స్ సీరియల్ డ్రాఫ్టు డైలాగ్స్!
***************
పరశురాముడు 21 సార్లు రాజమేధం చేశాడు. నేను నిన్ను 42సార్లు నరమేధం చేస్తా. ముట్టుకోటానికి ముక్కలు కూడా దొరకవు
భగవంతుడి ఉనికి స్త్రీల వల్లనే నిలబడింది. ఆయన ఆడవాళ్ళ నెత్తిన వేసిన కష్టాలే ఈ ప్రపంచంలో భక్తి నిలబడటానికి మూలం, ఆయన ఉనికికి మహామూలం
నీ ఆగ్రహం అగ్గి అయితే నేను దాన్ని ఆర్పే బుగ్గినిరా
ఆడవాళ్ళ విసుగు అణువిస్ఫోటనం లాంటిదిరా! దాన్ని తట్టుకునే శక్తి మగవాళ్ళకు లేదు
ఇప్పటికైనా మంచిపని చేస్తే స్వర్గంలో గంటలు మోగుతాయ్. చెడ్డ పనులు చేస్తూనే ఉంటే నరకంలో మోగుతాయ్. నీకు ఎక్కడ గంటలు కొట్టాలనుందో చెప్పు. మిగతాది నేను చూసుకుంటా!
కణుపు నుంచి కణుపు దాకా చెరుకుగడలో రసం ఊరుతూనే ఉంటుంది. అట్లా మనిషిలో కూడా మంచితనం తల నుంచి పాదాలదాకా ఉండాల్సిందే! లేకుంటే మనిషి అని పిలవనక్కరలా!
స్నేహితులంటే జంతువులే! ప్రశ్నా ఉండదు, విమర్శా ఉండదు....
ఈరోజు బతికున్న కుక్కే నిన్న చచ్చిపోయిన సింహంకన్నా బెటర్
కీర్తిశేషులు అంటే ఒక్క చచ్చిపోయినవాళ్లే కాదురా! పెళ్ళిచేసుకున్న వాళ్ళు కూడా
No comments:
Post a Comment