Thursday, November 25, 2021

దాదాపు పుష్కరం (2009) తర్వాత ఈరోజు వెబ్సైటులోని ప్రసార ప్రముఖులు సెక్షను తాజీకరించబడింది

 దాదాపు పుష్కరం (2009) తర్వాత ఈరోజు వెబ్సైటులోని ప్రసార ప్రముఖులు సెక్షను తాజీకరించబడింది


ఏమిటా తాజీకరణ?


గత రెండు సంవత్సరాలుగా పుటక చావు తీరున ఉన్న ఆడియోల ఎం.పి3 తబ్జీలు పని (తబ్జీలు అంటే కన్వర్షను) మళ్ళీ మొదలుపెట్టినాను. 


హోష్టింగు సర్వీసు వాడి ఆర్కిటెక్ఛర్ మార్పులతో వెబ్సైటులో పబ్లిషించిన వందలాది ఆడియోలు పనిచెయ్యటం ఇష్టారాజ్యంగా ఉండటంతో తలకాయనొప్పి ఎందుకని మొత్తం సమూలంగా ఎం.పి3 లుగా అందచేద్దామని మొదలుపెట్టిన పని అది. 


గత రెండేళ్ళల్లో చాలా సెక్షన్లు పూర్తి చేస్తిని... ఇంకా తతంగం ఉన్నది... పూర్తిచెయ్యాల


అన్నిటినీ మళ్ళీ పని చెయ్యించాలంటే నేను మళ్ళీ అప్పట్లో యవ్వనంలో కష్టపడ్డట్టు రోజుకి ఐదారు గంటలు ఆ వెబ్సైటు మీదే ఉండాలి. ఇప్పుడా ముసలోళ్ళమైపోతిమి. ఎక్కడినుంచి ఆ ఓపిక మళ్ళీ తెచ్చేది? అందువల్ల ఆ పనికి చావు పుటకలుగా ఉన్నది..


వీలున్నప్పుడు, మూడు కుదిరినప్పుడు అందుకోటమే! అలాటి మూడు ఈరోజు ఉండె. అందుకని ఆ మూడు చచ్చిపోకముందే, ఒక సెక్షనుకన్నా పునర్జన్మ ప్రసాదిస్తే పోతుందని ఆ పని మొదలుపెట్టి పూర్తిచేస్తిని 


ఎంజాయించండి


ఓం తత్ సత్! 

No comments:

Post a Comment