Sunday, October 17, 2021

బత్కమ్మ - కొత్త పాట

బత్కమ్మ 


పక్కా తెలంగాణా పాట


యమా రీజినల్


దీనికి కొత్త పాట వచ్చె


రహ్మాన్ అనే అరవాయన చేత సంగీత్ కొట్టించారు


ఎందుకు కొట్టించారు అని అడిగితే - రహ్మాన్ వల్ల రీచ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బత్కమ్మ వెలిగిపోతుంది అని ప్రధాన ఆర్గ్యుమెంట్


అయితే దీనిలో ఓ చిక్కుంది - రహ్మాన్ అనే వాడి వల్ల రీచ్ ఎక్కువవుతుంది, పాన్-ఇండియా అవుతుంది అనేది పరమ సోది కారణం/ఆర్గ్యుమెంట్ 


రహ్మాన్ అనే వాడి వల్ల రీచ్ ఎక్కువ ఎప్పుడవుతుందంటే రెండు జరగాలి - 1. ఆ పాట హిందీలో ఉండాలి. 2. హిందీలో ఉన్నా ఉండకున్నా సంగీతం బాగుండాలి


అలా రెండూ లేనివి ఆ రహ్మాన్ చేతినుంచి వచ్చి దిక్కు మొక్కు లేక పడున్న పాటలు కొన్ని కోట్లల్లో ఉన్నాయ్ 


అందుకు ఈ బతుకమ్మ పాటా అతీతం కాదు


ఇకపోతే ఈ రీజినల్ పాట గురించి అరవ్వాళ్ళు కాకుండా రీజినల్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది


పాట వాళ్ళది కనక, సొంతం కనక, ఎట్లాగైనా ఏదైనా మాట్లాడే ఇది వాళ్ళకు మాత్రమే సొంతం


సంగీతానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు - స్టేటుమెంటు బానే ఉంది, కానీ సాహిత్యానికి ఎల్లలున్నాయ్ అందుకని ఆ సాహిత్యానికి సంబంధించినవాళ్ళు, ఆ సాహిత్యాన్ని అమ్మవారి కోసం ఉపయోగించుకునేవాళ్ళు, జీవనంలో భాగం చేసుకున్నవాళ్ళు ఆ సాహిత్యాన్ని ఉపయోగించుకున్న పాట మీద మాట్లాడాల. బయటోళ్ళకు హక్కు లేదు, కానీ హక్కు ఉన్నదని అనుకొని, లేని దాన్ని పూసుకుని దాన్ని ఉపయోగించుకుంటే అది **** అంటారు 


తెలంగాణా ఏర్పడిందే రీజినల్ భావన మీద


ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఏర్పడిందో అలాగే తెలంగాణా కూడా


పక్కా, అతి పక్కా రీజినల్ వ్యవహారంతోనే ఆంధ్రావాళ్ళు అరవ్వాళ్ళకు దూరంగా జరిగి మద్రాసీ దరిద్రం వదుల్చుకున్నారు


కానీ అంటించుకున్న ఆ మద్రాసీ కంపు వదలటానికి చానా ఏండ్లు పట్టింది 


మద్రాసీ అంటే తెలుగోళ్ళకే కాక భారతదేశంలోనే అతి లోకువగా చూసే పరిస్థితి


ఒకరు లోకువగా చూస్తే అదో సంగతి


ఇద్దరు లోకువగా చూస్తే ఇంకో సంగతి


పదిమంది లోకువగా చూస్తే ఏదో సంగతి


మొత్తం రాష్ట్రాలన్నీ చూస్తే?


అందరూ అరవ్వాళ్ళను లోకువగానే చూస్తారు కనక డెఫినెటుగా అరవ్వాళ్ళలో ఏదో చెత్త ఉన్నదనే అర్థం కనక, అలాటి చెత్త మనకూ అంటుకుంటుందన్న వివేచన కలిగిన ఆంధ్రోళ్ళు, మనకంటూ ఒక ఇది ఉండాలి అది కంపైనా ఇంపైనా అన్న వివేకం కలిగిన ఆంధ్రోళ్ళు ఆ చెత్తను వదుల్చుకున్నారు 


దరిద్రం వదిలినా దోషం పోలేదన్నట్టు మద్రాసీ మాట తెలుగోళ్ళను వదల్లా. అందుకని కారణమేదైనా కానీ రెంగంలోకి ఎక్కువగా చక్రం తిప్పినవాడు ఎంట్రామన్న. ఎంట్రామన్న తెలుగు ప్రపంచానికి చేసిన సాయం ఏదన్నా ఉందా అంటే అది ఒకే ఒకటు - అదేందంటే - తెలుగు అనేది ఒకటి ఉందని, అది అరవం కాదని, తెలుగోళ్ళు మద్రాసీలు కాదని దేశానికే కాక ప్రపంచానికి చాటిచెప్పాడు. 


ఇక అవన్నీ మాటాడుకోవటం ఈ పోష్టు ఉద్దేశం కాదు కనక ఇక్కడకు ఆపొచ్చు 


సరే, అది అలా ఉంచితే - తెలంగాణా వాళ్ళు తెలుసుకోవల్సిందేమంటే ముందు బయటివాళ్ళను ప్రోత్సహించడం మానేసి, ఎందులోకి కూడా అరవ్వాళ్ళను కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళను కానీ తీసుకోకుండా సొంత బలం సంపాదించుకోవాల


సొంత రాష్ట్రం కావాలని దేశాన్ని కిందా మీదా చేసి, అల్లకల్లోలంగా విజయం సాధించి, బ్లడ్ బ్రదర్స్ అయిన ఆంధ్రోళ్ళను రాజకీయంగా తరిమి తరిమి కొట్టి రాష్ట్రాన్ని సంపాదించుకున్న తెలంగాణాకు ఇది పెద్ద కష్టం కాకూడదు


సరే, మళ్ళీ రీచ్ సంగతిలోకి పోదాం - రహ్మాన్ కొట్టాడు అన్న దానికన్నా, పాట సొంతోళ్ళ చేత కొట్టించి బాగుండేలా చూసుకుంటే దాని రీచ్ ఎక్కువ, దాన్ని కె.టి.ఆర్ ట్వీట్ చేశాడంటే దాని రీచ్ మరింత ఎక్కువ. దాని గురించి కె.సి.ఆర్ మాట్లాడాడంటే దాని రీచ్ మరింత మరింత ఎక్కువ. ముందు మనవాళ్ళకు, అందరికీ రీచ్ అయితే చాలు, అది రీజినలుగా బాగుంటే చాలు, వినటానికి అలవాటైపోయిన పాతదాని దగ్గిరిగా ఉంటే చాలు, పాడుకోటానికి గుర్తుండేలా ఉంటే చాలు, అది వైరల్ టు ద పవర్ ఆఫ్ వైరల్ అయితే చాలు - ఆ తర్వాత మనవాళ్ళే, ఆ సంగీతం అందించిన వాళ్ళే రహ్మాన్ అంత పేరు తెచ్చుకుంటారు. ఆ పాట సాహిత్యం అర్థం కాని ప్రపంచం మనదగ్గరకు వచ్చి నేర్చుకుంటుంది, అనువాదం చేసుకుంటుంది, సొంతం చేసుకుంటుంది  


ఈ ఎలెక్ట్రానిక్ జమానాలో అది కష్టమైన పనే కాదు - చిత్తశుద్ధి ఉండాలే కానీ 


అందుకని అరవ ప్రపంచాన్ని దాని మానాన దాన్ని మద్రాసులో వాళ్ళ సినిమాలకు వాళ్ళను అట్లానే వదిలేసి, వాళ్ళ టెక్నీషియన్సు, ఇతర జనాభాను కూడా అక్కడే వదిలేసి మన తెలుగోళ్ళకు ట్రెయినింగు ఇప్పించి ఆడిస్తే ఇట్లాటి బత్కమ్మ పాటలు వచ్చే అవకాశం తక్కువ. వచ్చినా కొత్తగా నేర్చుకుంటున్నాం కనక బెనిఫిట్ ఆఫ్ డవుట్ ఇచ్చే అవకాశం ఎక్కువ. మా వాళ్ళను వాడుకుని పైకొచ్చారు, మీ సినిమాలకు మా వాళ్ళు పని చేసి గొప్ప చేయించారు అన్న ఛండాలం అర్గ్యుమెంట్లు వినాల్సిన అవసరమూ రాదు


అప్పట్లో ఆ పరిశ్రమ అక్కడ మద్రాసులో కూడగట్టుకుని ఉంది కనక మనకూ దరిద్రం అంటుకుంది. పడవను నడిపిన కెప్టెన్లు మనవాళ్ళే కనక, అవకాశం కలిగించి ఉంటే, అదే పరిశ్రమ తెలుగుదేశాల్లో ఎక్కడన్నా ఉండుంటే అవే సినిమాలు అంతే క్లారిటీతో తూ చా తప్పకుండా అట్లానేనో అంతకన్నా బాగానో వచ్చేవి 


చరిత్ర మీద పడి ఏడవటం మంచిది కాదు కనక ఇప్పటికైనా ఆ మద్రాసీ కానుకను పూర్తిగా వదిలించేసుకుంటే బాగుంటుంది 
No comments:

Post a Comment