Friday, June 18, 2021

చూద్దాం చరిత్ర గుర్తుంచుకుంటుందో లేదో!

History has been written. Today marks the milestone of completing 2000 designs of telugu alphabets. Proud to have done that all by myself as an alphabets drawing challenge. Hope one day some telugu person beats my record. Oct 9, 2020 to June 18, 2021. #digitalart #drawing #art #telugualphabets 


Proud moment video here -  https://www.facebook.com/100053709950289/videos/318509876616008/


అక్టోబరు 9, 2020 న మొదలయిన తెలుగు అక్షరాల చిత్ర ప్రయాణం, మధ్యలో ఒక నెలన్నర మినహాయించి, ఈరోజుకు 2 వేల ఆకృతులకు చేరుకున్నది. ఈ 18వ తారీకు చరిత్రలో నిలబడిపోవాల్సిన రోజు. చూద్దాం చరిత్ర గుర్తుంచుకుంటుందో లేదో! అది, ఆ చరిత్ర తర్వాతి తరమైన వైష్ణవి తన పిల్లలకు పేపరు కటింగుల్లోనో, రికార్డుల పుస్తకంలోనో చూపిస్తూ చెప్పుకునేలా ఉంటే చాలు. అంతకు మించి ఇంకేం అక్కరలా!

ఈరోజటితో ఈ యజ్ఞం సమాప్తం. మళ్ళీ కొత్తదేమిటి అని వెతుక్కోవాలి కామోసు. చేయటానికి విశ్వంలో అనంతమైన పనులు ఉన్నవి - ఏదో ఒకటి దొరక్కపోదా? 

ప్రపంచాన్ని, మానవజాతిలోని మంచివాళ్ళను, మా తెలుగక్షరాలను జాగ్రత్తగా చూస్తూనే ఉండు పరమాత్మా! 

జై పరమేశ్వరా! జై శ్రీరాం!

No comments:

Post a Comment