Monday, June 14, 2021

ఆవిడ పెట్టే చింతావకాయకూ మరుగు లేదు. నాకు ఇంట్లో మరుగు దొడ్డీ లేదు. ఊఁ

 ఇంతలో 

"తిల్మా, తిల్మా ఎక్కడున్నావే?" అంటూ వచ్చింది తుశీల పిన్ని నడుమ్మీద పెద్దజాడీ వేసుకుని

తిల్మా ఓరకంట చూస్తూ "ఆ వచ్చావూ? ఇంక నువ్వొక్కత్తివీ రాలేదు అనుకుంటున్నా" అన్నది

తుశీల పిన్ని హుష్షోమంటూ జాడీ దించి "ఇదిగో నీకోసం కొత్తచింతావకాయ పెట్టి తీసుకొచ్చా. ఇదే చివరి జాడి. వస్తూ వస్తూ ఏలూరు ఎంకట్రావ్ ఇంట్లో ఇంకోటి దించొచ్చా. నేను ఇక్కడికొచ్చేలోపలే జాడీ మొత్తం నాకేసి ఉంటారు" అని ఇక ఇకగా పకపకగా అన్నది

"నువ్వూ సరే, నీ చింతావకాయా సరే! చస్తున్నాం తినలేక, వెధవ తద్దినం నువ్వూనూ" అని లోపల అనుకున్న తిల్మా అదే ముక్క బయటకు అనబోతూండగా సిరియాళ్ సురేశ్ భుజాన వేళాడుతున్న ఐపాడులోంచి కెవ్వుమని కేక వినపడ్డది

మోకాలు తడుముకున్న సురేశ్ ఏమిటా, అందులోని అరుపులకు కారణమేమిటా అని అయిపాడు వంక చూసాడు

అయిపాడులో విస్ఫోటనం

బిర్టిష్ లైబ్రరీ వీరాధివీరుడు పూర్చారి బాన్వాస్ విస్ఫోటిస్తున్నాడు ఆనందంతో అక్కడ

"తుశీల పిన్ని వచ్చిందంటే ఇక తిరుగులేదు. ఆవిడ పెట్టే చింతావకాయకూ మరుగు లేదు. నాకు ఇంట్లో మరుగు దొడ్డీ లేదు. ఊఁ ..మరుగుదొడ్డి సంగతి ఎందుకు కానీ, తిల్మా గారూ తుశీల పిన్ని చింతావకాయకు నేనైతే నూటికి తొమ్మిదివేల మార్కులు ఇస్తాను. మీరెన్ని ఇస్తారు?" అని 764 పళ్ళు బయట పెట్టి చేతిలో ఉన్న పుస్తకాలన్నీ విసిరేస్తూ గిర గిర తాండవం చేస్తున్నాడు   

పూర్చారి బాన్వాసును ఆ విధంగా ఎప్పుడూ ఎవరూ చూడలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది

ఇంతలోనే బాన్వాస్ మళ్ళీ అందుకుని "ఇదిగో తుశీల పిన్నీ! ఆ చింతావకాయ కాస్త మా బల్త్కారుకు తగిలించు. పాపం సూటు జేబికి చిరుగుచిల్లుపడి నీరసంగా చూస్తున్నాడు. నీ పచ్చడితో పోయిన ఉత్తేజం అంతా తిరిగిరావాలి. నసాళానికి అంటి పూర్తి యవ్వనవంతుడై మరిన్ని బల్త్కార్లు చెయ్యాలి, లెక్కలేనన్ని జాలిం లోషన్లు నెత్తికి రాసుకోవాలి, మా తండాకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి" అని అన్నాడు  

ఇదంతా ఇందాక ఫోను పెట్టెయ్యకుండా అయిఫోను ఆనులోనే ఉంచిన కవి తాపిసరుకు జోష్ వచ్చింది

వెంటనే ఒక కవిత అందుకున్నాడు

వొక జాడీ

వొకే వొక జాడీ

వొకటే వొకటే ఆ వొకటే జాడీ

అందులో ఉన్నది చింతావకాయ పచ్చడి

నా నాలుకకు రాసుకుంటే అవుతుంది చిత్తడి 

అందులో ఉన్న ఆయిలు రంగు ఎరుపు

పేదవారి రక్తాలు తాగుతున్న మూతులూ ఎరుపు

జాడీలో ఉన్న ముక్కలు ఒకటే

సమాజాన్ని నరుకుతున్న శవాలు ఒకటే

జాడీలోని చింత పులుపు 

నా పక్కనున్న టెకీలాలోకి ఉంచుకున్న నిమ్మకాయ పులుపు

ఇదంతా ఒక బ్లడ్డు బాతు

ఈ కవితే నాకూ బెడ్డూ బాతూ 

అని రక్తసిక్త కవిత పూర్తిచేసాడు

అది విన్న అందరికీ రక్తం మరిగింది

ఆవేశం ఎగదన్నుకొచ్చింది

తుశీల పిన్ని కూడ జై తాపిసర్ అంటూ జాడి మీదెక్కి, తనకి రాని బహరతపూడికూచి నాట్యం మొదలుపెట్టింది

ఇంతలో బేరియా బ్రిమ్మాండ్ కమాంజా నుంచి అలలు అలలుగా సంగీతం

ఆ సంగీతానికి పరవశుడైన పూర్చారి బాన్వాస్ తాండవం అక్కడ అయిపాడులో స్పీడందుకుంది

అంత తాండవానికి, అంత స్పీడుకు బిర్టిష్ లైబ్రరీలో భూకంపం వచ్చింది

దాంతో ఇక్కడ, అక్కడా అయిపాడు కనక్షెను పోయింది

అప్పుడు....

No comments:

Post a Comment