Wednesday, April 7, 2021

ఈ ఈమాటోళ్ళు ఏందో, వాండ్ల సంపాదకీయాలేందో?

 ఈ ఈమాటోళ్ళు ఏందో, వాండ్ల సంపాదకీయాలేందో? 

దాదాపు సంవత్సరన్నర తర్వాత ఆడికి పోతిని 

ఎందుకలాగా? 

మన దంతుర్తి శర్మ అన్న టాగ్ చేసిన మిత్రుల న్యూస్ఫీడులందు ఈమాట అన్న మాట కనపడి ఆశ్చర్య చకితుడనై ఆడికి పోతిని...

అక్కడికి పోయినంక 

ఒక దాసరి వచ్చి ఒక పాట పాడిపోయెను! 

మరల అదే స్థలమునకు దాసరి వచ్చెను

మరల అదే పాట పాడిపోయెను

ఆయనకు పాచిపళ్ళు ఉండెను 

అన్న తీరులో అప్పుడు ఆనాడు పురాతన కాలంలో చెప్పిందే కాస్త అటూ ఇటూగా ఇప్పుడూ చెప్పి వాక్యాలకు ఎదుగూ బొదుగూ లేకుండా చేస్తున్నారబ్బా!

ఎదుగూ బొదుగూ లేని వాటికి చాలా ఉదాహరణలు బోల్డు బోల్డుగా ఉన్నాయ్ కాని ఈ సారికి  వేరే దారిలో పోయి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం

ఈ కింది వాక్యములు, పేరాగ్రాఫును  తీసికొనుడు 

"మూఢభక్తి లాంటి భాషాభిమానమే తప్ప ప్రాచీన సాహిత్యం చదివి సమకాలీనులు తెలుసుకోదగినదీ, నేర్చుకోదగినదీ ఏమీ ఉండదన్న నమ్మకమే చాలామందిలో స్థిరపడిపోయి ఉంది. ఆవేశపూరితంగా, తాత్కాలికోద్వేగాన్ని మాత్రమే కలిగిస్తూ, ఆలోచనారహితమైన అభిప్రాయప్రకటనగా మిగిలిపోతున్న సమకాలీన సాహిత్యాన్ని గమనించే కొద్దీ, స్పష్టమైన ప్రణాళికతో చిరస్థాయిగా నిలబడగల రసానుభూతితో కళాత్మకంగా సాగే మహాకావ్యాల ప్రాధాన్యం అవగతమవుతుంది." 

ఇక్కడ కొన్ని ప్రశ్నలు - ఉన్న లక్ష ప్రశ్నల్లో కొన్ని మాత్రమే! 

"ఎవరా చాలామంది? 

ఏమా కథ? 

వాళ్ళల్లో స్థిరపడిపోయింది అన్న ఇది వీళ్ళకెట్లా తెలిసింది? 

నాకు తెలిసిన కొన్ని వేలమందిలో ఒక్కడు కూడా ఇలా అనుకోగా చూడలేదే? 

అందరూ ఎంతో కొంత నేర్చుకోగా చూసిందే ఉన్నది కదా, మరి సంపాదకీయం అన్న హెడింగు కింద ఇట్లాటి స్వాభిప్రాయం రాసి అదే జనాల గొంతుయందు తోసుడు కార్యక్రమం వదలకుండా పట్టుకు వేళాడుతున్నారెందుకు? 

కర్మకాలి చదివినవాడు ఇది నిజమని అనుకుంటే అప్పటిదాకా లేని మూఢభక్తి వచ్చి చేరితే?దానికి బాధ్యులెవరు? 

మరి సమకాలీన సాహిత్యంలో కూడా ఏకంగా కేంద్ర సాహిత్య అకాడెమీ నుంచి అవార్డులొచ్చే, అవార్డులొచ్చిన కతలు ఉన్నాయ్ కదా? 

అవి తాత్కాలికోద్వేగాన్ని మాత్రమే కలిగిస్తున్నాయా? అవి ప్రణాళిక లేకుండా, రసానుభూతి లేకుండా, కళాత్మకం కాకుండా సాగినాయా?  "

ఇలా ఇంకా కొన్ని వందల వేల లక్షల ప్రశ్నలున్నాయ్

కానీ అవన్నీ రాసుకుంటూ పోతే వాళ్ళ సంపాదకీయంలా అయిపోతుందేమోనన్న భయంతో ఇక్కడికి ఆపివేస్తుంటిని

జై ఏప్రిల్ మొదటిరోజు ! జై దంతుర్తి శర్మన్న!

No comments:

Post a Comment