మా బందరోళ్ళని కాదు కానీ - చిక్కడపల్లిలో పాత సుధా హొటలు పక్కన సందులో ఓ నాలుగు కొట్ల అవతల మాకు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న న్యూ బందర్ మిఠాయి భండార్ అని ఉన్న కొట్లోనుంచి పచ్చళ్ళు (టమాట, గోంగూర, నిమ్మకాయ, మాగాయి) - అన్నీ ఓ కిలో చొప్పున ఈసారి కూడా తెస్తిని.
ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళైపోవటం మూలాన, అందునా మా అమ్మ పరిస్థితి కాస్త సున్నితంగా ఉండటంతోనూ ఆవిడ పచ్చళ్ళు పెడతానన్నా వద్దు అని మానిపించేస్తిమి. కానీ పచ్చళ్ళకు అలవాటైపోయిన నాలుక కదా, అందుకని వెళ్ళినప్పుడల్లా ఆ కొట్లోనుంచి తీసుకొస్తూ ఉంటా....
టమాటాను మినహాయించి మిగిలిన మూడు చాలా బావుంటాయి...ఇంట్లో పచ్చళ్ళు చేసుకుని తిన్నట్టే ఉంటాయ్ కానీ వాళ్ళకు నిలవ ఉండాలి కనక కాస్త ఆయిలు ఎక్కువగా తగిలిస్తారు...ఆయిలు పక్కకు జరిపి పచ్చడి లాగించవచ్చు కనక అది పెద్ద ఇష్యూ కాదు...టమాటలో వారు కాస్త పాతచింతపండు వేసి చేస్తారు...ఆ పులుపు, ఆ టేష్టు నాకు పడదు - ఉన్న అసిడిటీ మరియు ఇతర కారణాల వల్ల.. నాకు నచ్చకపోతే ఏమి, ఇంట్లో వాళ్ళకు బావుంటుందంటారు కనక తీసుకోవటం. వెల్లుల్లి గట్రా లేనివి తీసుకువస్తాను.
వారి వద్దే ఊరుమిరపకాయలు, నల్లకారం, కరివేపాకు కారం, కాజు బెల్లప్పాకం, బందరు హల్వా (ఈ హల్వాను మా ఆవిడ కొన్ని లక్షల కిలోలు అలాగ్గా లాగించేస్తుంది - అంత ఇష్టం ఆవిడకు) కూడా ప్రతిసారి తెస్తాను...
మీలో ఎవరికైనా కృష్ణాజిల్లా టేష్టు కావాలంటేనూ, ప్రత్యేకించి బందరు టేష్టు కావాలంటేనూ, మీరు చిక్కడపల్లి వెళ్ళగలిగితే ఆ కొట్లో తీసుకోండి...
అక్కడ కవుంటరులో ఇప్పుడు వివేక్ అని పెద్దాయన వాళ్ళ అబ్బాయి ఉంటాడు.. చాలా నెమ్మదైన మనిషి. చక్కగా మాట్లాడతాడు. కొట్లోకి వెళ్ళగానే మా బందరు వాళ్ళ చక్కనైన పలకరింపు (పాత కష్టమర్లనే కాదు, ఈ పలకరింపు ఎవరికైనా ఒకటే), ఇంతకు ముందు వచ్చి కొనుక్కుని వెళ్ళినవారి సంగతి గుర్తుపెట్టుకొని మళ్ళీ వారికి అవే కావాలేమో అడగటం, ఇంటర్నేషనల్ పాకేజింగు చేసివ్వటం, మీరు ముందే ఆర్డరు చెయ్యగలిగితే మీరు చెప్పిన సమయానికి అన్నీ పాకెట్లలో తయారు చేసి ఉంచటం మొదలైనవే కాక ఇంకా చాలా చేసిపెడతాడు ...కొరోనా సమయానికి తగ్గట్టు ప్రికాషన్సు తీసుకుని మరీ!
అక్కడ పనిచేసే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆ అబ్బాయి దారిలోనే వెళ్ళిపోతూ ఉంటారు కనక మీకు ఇబ్బంది ఉండదు. ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ - దట్ ఈజ్ ట్రూ టు ద ట్రూత్.
So if you are ever in that area and you are in need of some thing good for your palette, go there and buy some and enjoy!
ఇంటర్నేషనల్ పాకేజింగు చేసివ్వటం ---- అంటున్నారు కదా ఎడ్రస్ ఫోన్# చెబుతారా?
ReplyDeleteLink here - https://www.facebook.com/NewBandharMithaiBhandaar/
ReplyDelete