Wednesday, April 21, 2021

మర్కట నామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి నాడు

"అయ్యా, మర్కట నామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి నాడు అర్థరాత్రి రెండు గంటలకు ఐంద్ర ఖండములోని మా దేశాభివర్ధిని తద్దినపు పత్రికా కార్యాలయంలో బల్త్కార్ నారాయణ ఉపన్యాసము ఇచ్చెదడు, కావున ఎల్లరు విచ్చేయ ప్రార్థించుచున్నాము" అని సిరియా గ్రాంధీకములో ఉన్న "అల్మహబ్బా జిదబ్బర్ కదబ్రి కీఫ్కల్ ఇస్మా యె జింఘాలక్" కు అనువాదంగా సిరియాళ సురేశం తన పతరికలో ఒక నోటు అచ్చు వేసినాడు  


అది చూసి తండా సభ్యులంతా పొలోమని పోదామనుకుంటిరి. 


కానీ కోర్నా అనే వ్యాధి విజృంభణతో వెనుకడుగు వేసి వర్చువలుగా పెట్టుమని సురేశముతో కీచులాడిరి 


సురేశము సరేనని బోం జూం ఛకి అని సిరియాలో కనిపెట్టబడిన ఒక వర్చువల్ మీటింగు ఆయుధము యందు మీటింగు పెట్టి అందరకు లింకు పంపినాడు 


తండా సభ్యులంతా వయసైపోవటంతో వాజీకరణ బలం సన్నగిల్లి బలాత్కార వృత్తి నుండి రిటైరు అయినారు కనక ఎల్లుండి మీటింగు అనగా ఈరోజే లాగిన్ అయి కూర్చుంటిరి 


ఎల్లుండి వచ్చినది


సురేశం ఠంచనుగా అర్థరాత్రి రెండు గంటలకు హోష్టుగా వచ్చినాడు. వచ్చి ముందుగా తండా సభ్యులతో ఇలాగున అనినాడు - "ప్రియ బలత్కారులారా! మనకు ఈ విధమైన బోం జూం ఛకి మీటింగు కొత్త. అందుకని ముందుగా ఈ సభకు ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవలెను. ఎవరు అధ్యక్షులుగా ఉండామనుకుంటున్నారో వారు నాలుకలు బయటకు చాపండి" అని


సొన్నాసి సామిగాడు, గూండ్ మాధవేశ్ గాడు, పూర్చారి బాన్వాసు నాలుకలు బయటకు చాపినారు


సొన్నాసి సామిగాడి నాలిక పొడవు ఎక్కువ ఉండటంతో వాడిని సభాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు


అయితే తండాకు తెలియని విషయమేమనగా, సొన్నాసి వాడు దేవాంతకుడు కావటంతో ఇలాటివి వస్తాయని ముందే ఊహించి లబ్బరు నాలిక ఒకటి కొనుక్కుని తెచ్చి పెట్టుకుని మీటింగు మొదలు కాకముందే లబ్బరు నాలిక అసలు నాలుకకు అంటించుకొని కూర్చొనినాడు 


ఆ తర్వాత సభాలాంఛనాలు తన తాతయ్య తకతయ్య మెరుపులతో లబ్బరు నాలుక బయట పెట్టి అభినయిస్తూ సభను ప్రారంభించినాడు సొన్నాసి 


ఇంతలో బోం జూం ఛకి యందు అరుపులు కేకలు వినపడ్డవి


ఏమది అని అందరూ తమ తమ స్క్రీనుల వైపు చూడగా, సిరియాళ సురేశం ఫోను ఎత్తి స్పీకరునందు కేకలు పెట్టుచున్నాడు


ఏమయ్యింది అని అడిగినాడి గూండ్ మాధవేశ్


విప్లవాత్మక ఉపన్యాసము ఇవ్వవలసిన బలాత్కార నారాయణ ఏదో చెప్పాలని మాటలాడుచున్నాడు కానీ ఇవతలివారికి ఏమీ వినపడట్లేదని, ఇదేమి పిచ్చిముండా మీటింగని సురేశాన్ని అమ్మాల తిట్లు తిడుతున్నాడని, అందుకని నారాయణను శాంతపరుస్తున్నాని ఆవేశపడవద్దని సభాబలాత్కారులకి వెర్రి నవ్వు నవ్వుతూ చెప్పి శాంతపరిచాడు సురేశం 


కవి తాపిసర్ లేచి చేతిలో పెన్ను స్క్రీను మీద గుచ్చుతూ "మాట్లాడే ముందు నారాయణాన్ని అన్-మ్యూట్ బటన్ నొక్కి చావమని చెప్పిచావలేవూ" అని తమ దేశంలో తుకారం పండగలప్పుడు వేసే దిద్ధినక డాన్సు చేయటం మొదలుపెట్టాడు


ఆ డాన్సు చూసి బేరియా బ్రిమ్మాండం తన కమాంజా తీసి వాయిస్తూ - 


వో తాపిసరా 

దిద్ధినక డాన్సరా

ఏమేమి ఊపురా

ఏమేమి చూపురా

ఓహోహో అరుపురా

ఏహేహే కలమురా


అంటూ పాట మొదలుపెట్టాడు


సురేశానికి అర్థమయ్యింది ఇప్పుడు కనక తను కంట్రోల్ చెయ్యలేకపోతే ఈ తండా తన మీటింగును, విప్లవాత్మక నారాయణ స్పీచును హైజాక్ చేసేస్తుందని, తద్వారా చింతచెట్టు కింద ఉన్న పతరిక కార్యాలయంలో కూర్చుని జరుపుతున్న దానికి అర్థం ఉండబోదని ఒక్కసారిగా లేచి వంకీ జుట్టు తిప్పుకుంటూ "అరే! ఛుప్! బద్మాషుల్లెక్క ఏందిరా ఈ గోల! నేను నడుపుతున్నా ఈ మీటింగు. అందరూ చుప్" అన్నాడు


అది విని "హలో! ఇక్కడ సభాష్యక్షుడిని నేనున్నానని లెక్క కూడా లేకుండా నువ్వు నడపటమేంది? నేనే ఈ మీటింగు నడిపేది, లేకుంటే ఈ లబ్బరు నాలిక కొనుక్కొచ్చింది ఎందుకు" అంటూ సొన్నాసి సామి గాడు లబ్బరు నాలిక సంగతి బయట పెట్టేసినందుకు సిగ్గుపడుతూ నాలిక్కరచుకున్నాడు 

  

అయితే ఇంకా గోలగోలగా ఉండటంతో లబ్బరు నాలుక సంగతి ఎవడూ పట్టించుకోలా


సురేశం మళ్ళీ అరిచాడు "అరే చుప్!" అని


అప్పుడు అందరూ కాం అయినారు 


"ఇక ఇప్పుడు తండా గుర్వు విప్లవ పొర్ఫెసర్ డిస్టింగ్విషుడు బలాత్కార్ నారాయణ గగుర్పొడిచేలా ఉపన్యసిస్తారు" అంటూ సురేశం అనౌన్సించాడు 


అందరూ బల్త్కార్ నారాయణ స్క్రీను వైపు చూట్టం మొదలుపెట్టినారు


ఆ స్క్రీనులో అప్పటిదాకా కళ్ళు మూసుకుని, నోటియందున్న నాలుగు పళ్ళు బయటకు కనపడుతూ చిద్విలాసిస్తున్న నారాయణ తన చింత నిప్పుల్లాటి కళ్ళను తెరిచాడు


కళ్ళు విప్పి కంఠము సవరించుకొని కళ్యాని రాగములో ఒక పద్యము ఎత్తుకున్నాడు


"తండాధిపులారా విభు

దాగ్రేసరులారా సభ్యులారా యిపుడీ

తింత్రిణీ వృక్షము కింద మీక

గ్రమున ఉపన్యసించుటెంతానందము?" 


అది విని తన స్క్రీనులో మ్యూట్ బటను నొక్కుకుని గూండ్ మాధవేశ్ గాడు ఇలా అనుకుంటున్నాడు " వీడి తద్దినం చెయ్య! నాకు గ్రాంధీకం వచ్చి చావదని తెలిసే వీడు ఈ పద్యంతో మొదలుపెట్టాడు. పెద్దవాడైపోయాడు లేకపోతే డొక్కలో ఓ పోటు పొడుద్దును వీణ్ణి" అని


ఇంతలో ఏలూర్ ఎంకట్రావ్ స్క్రీను నుంచి "శభాశ్" అని చప్పుడు వచ్చింది 


అది విని కివ్స్ రామేరావ్ స్క్రీను నుంచి "వహ్వా" అని చప్పుడు వచ్చింది


దాని వెంటనే ఇస్బొట్లీ లోక్స్మణ్ణ్ స్క్రీను నుంచి "మ్మ్..మ్మ్.." అని శబ్దం వచ్చింది 


ఏలూర్ ఎంకట్రావ్ చెయ్యెత్తి తీర్మానం ప్రవేశపెట్టాడు


"కవితల్లో, పద్యాల్లో ఏనాడు వినని అగ్ర మకుటంతో, కళ్యాణి రాగములో టెంతానందము అని ముగిస్తూ ఇంత విప్లవాత్మక ధోరణి ప్రవేశపెట్టిన నారాయణకు జాలిం లోషన్ అవార్డు ప్రకటించాలి. దీనిని సపోర్టు చేస్తున్నవాళ్ళందరూ వెనక్కు తిరిగి పృష్టాల మీద చరచండి" అని


అందరూ తమ తమ కుర్చీల్లోంచి లేచి వెనకభాగాల మీద చరుచుకున్నారు


దాంతో మెజారిటీ ఉండటంతో ఏకగ్రీవంగా ఆ విప్లవాత్మక తీర్మానం ఆమోదం పొందింది


తీర్మానం ఆమోదం పొందుతూనే బేరియా బ్రిమ్మాండ్ కమాంజా వాయిస్తూ "కళ్యాణి రాగం విని చెవుల తుప్పు వదిలిపోయింది. ఈ పద్యం మహాఝంకార హుంకార క్రీంకారముగా చదవటం ఎవరి తరం? ఒక్క నారాయణ తప్ప ఎవరూ చదవలేరు. అభ్యాసము కూసు విద్య అని త్యాగరాజు ఊరికే అన్నాడా?" అని అనటంతో అందరూ అటువైపు తిరిగి ఒక సారి కిందకు పైకి చూసారు


ఇంతలో "అసలు ఈ నారాయణ అనే ఆయన ఎవరండీ? ఈ దేహాభివర్ధని పత్రిక ఏమిటి" అన్న ప్రశ్న వినపడ్డది


అన్ని స్క్రీన్లలో హాహాకారాలు చెలరేగినాయి


సురేశం ఈ ప్రశ్న వినీ వినగానే పరిస్థితి అదుపు తప్పుతుందని అందరినీ మ్యూట్ బటన్ నొక్కి మ్యూట్ చేసేసాడు 


అందరి ఆరున్నొక్క రాగాలు ఇక సద్దుకున్నాయి అనుకున్న ఆరున్నర నిమిషాలకు మళ్ళీ అన్-మ్యూట్ బటన్ నొక్కాడు


అందరికన్నా ముందు సొన్నాసి సామి గాడు ప్రశ్న వేసాడు - "ఎవరదీ? ఆ ప్రశ్న వేసింది? మొహం చూపిచ్చండి" అని


ఆ ప్రశ్న విని ఒకాయన తన స్క్రీనును నలుపు గుడ్డ వేసి నలుపు చేశాడు 


సొన్నాసికి కోపం వచ్చి - "ఎవరదీ. థూక్రాం అని స్క్రీను పేరు పెట్టుకుని నల్ల గుడ్డ వేసింది ఎవరు? తియ్యండి ముందు, లేకుంటే తాతయ్యా తకతయ్యా అవుతుంది జాగ్రత్త" అని బుగ్గ మీద చెయ్యి వేసుకుని అభినయిస్తూ అన్నాడు 


సొన్నాసి మాటలకు బిగ్గరగా నవ్వుతూ ఆ నల్ల స్క్రీను మీది నల్ల గుడ్డ వైదొలగింది


అక్కడ మొహానికి నల్లగుడ్డ కట్టుకుని కూర్చుని ఉన్న ఒక మనిషి స్క్రీనులో కనపడ్డాడు. ఒక్కటంటే ఒక్క కన్ను తప్పితే ఆ నల్లగుడ్డలో ఇంకేమీ కనపడట్లా. ఆ కన్ను కూడా నారాయణ కన్నుల్లా చింతనిప్పులా ఉన్నది 


"ఏయ్! తీయ్ గుడ్డ తీయ్! తీయ్!" అని అరిచాడు సొన్నాసి


అయినా ఆ నల్ల గుడ్డ మనిషి మట వినలా, నల్ల గుడ్డ తియ్యలా


తియ్యకుండానే మళ్ళీ ప్రశ్న వేసాడు - "అసలు నువ్వెవరు? ఈ నారాయణ ఎవరు? దేహాభివర్ధిని ఏమిటి?" అని


బిర్టిష్ లైబ్రరీనుంచి అప్పు తెచ్చుకున్న పుస్తకంలో తలదూర్చి పేరాగ్రాఫులు కిందనుంచి పైకి చదువుకుంటున్న పూర్చారి బాన్వాస్ రంగంలోకి దిగాడు - "అది దేహాభివర్ధని కాదు. దేశాభివర్ధని. మా గూండ్ మాధవేశ్ గాడికి గ్రాంధీకం రాక దాన్ని అప్పుతచ్చు చేశాడు వెధవ గుండు పీనుగ. ఇక మిగతా ప్రశ్నలకు సమాధానలు సొన్నాసి కానీ, సురేశం కానీ చెపుతారు" అని నాలుక చాపి మళ్ళీ బిర్టిష్ లైబ్రరీ పుస్తకం కిందకు వెళ్ళిపోయాడు 


ఇంతలో నారాయణ మైకెక్కాడు 


ఎక్కి 


ఈ సారి కాపీ రాగంలో 


రేపులోన తప్పు బట్టలోన ఉప్పు

రచన యందు నిప్పు రక్తియందు తిప్పు  

తప్పు తిప్పులు విప్లవములు

అదే నా సాహితి సమరాన గలాసులు 

నేను నేనే నేనంతే నేనే

నాకు నేనే నీకు నేనే

నీ అమ్మకు నేనే నీ అబ్బకు నేనే

సాహితీ దిబ్బకు కూడ నేనే

నేనే నేనే జగమంతా నా నూనే 


అని ఓ పద్యం పాడాడు


అది విని నల్లగుడ్డ మొఖమాయన అన్నాడూ - "ఒరే వీధి భాగవతంలో కేతిగాడిలా ఆ పాటలేమిట్రా నాయనా! నీ ఒప్పు తప్పు తిప్పు నిప్పు చూసి సంతోషించా కానీ, ఇంతకీ నీ ఉపన్యాసం ప్రారంభించవా? తెల్లవారు ఝామున నాలుగున్నర అయ్యింది, పోయి పండుకోవాల. తొందరగా విప్లవాత్మక సంగతుల ఉపన్యాసం అప్పగిస్తే విని పోతా" అని  


అప్పుడు అందరికీ జ్ఞానానికొచ్చింది నాలుగున్నరయ్యిందని


ఇంట్లో వాళ్ళు లేచే వేళయ్యిందని


వాళ్ళు లేస్తే చమడాలు ఊడగొడతారని "నారాయణా తొందరగా కానీ నీ ఉపన్యాసం" అంటూ సణుగుడు మొదలుపెట్టారు


అందరూ ఇలా తొందర పెడుతూ ఉంటే నారాయణకు అసహనం ఎక్కువయ్యింది 


సురేశం ఈ సభ మొదలుపెడతానని అనగానే పూర్చారి బాన్వాస్ కి కాల్ చేసి - "ఒరేయ్ నా ఉపన్యాసం మొదలుకాగానే నువ్వు బిర్టిష్ లైబ్రరీ నుంచి ఎత్తుకొచ్చిన పేరాగ్రాఫుల నకలు వర్డ్ దాక్యుమెంటులో కాపీ చేసి పంపిస్తే నేను అదు చూసి సుబ్బరంగా చదువేస్తానని" చెప్పినాడు


ఇప్పుడు చూస్తేనేమో వర్డ్ డాక్యుమెంటు రాలేదు


బాన్వాస్ స్క్రీను వంక చూస్తేనేమో అతను ఏ పేరాగ్రాఫులు కాపీ చెయ్యాల్నా, వర్డు కెట్లా ఎక్కించాల్నా అని కింద మీదా పడతా ఉన్నాడు 


ఇక్కడ తండా వాళ్ళేమో గలాసులు, పృష్టాలు ఎత్తి పట పట పర పర సవుండ్లు చేస్తున్నారు చదువు చదువు అని


ఎట్లా? ఏం చెయ్యాల ఇప్పుడు అని ఆలోచించాడు


వెంటనే మ్యూట్ బటన్ నొక్కుకోని ఊరికే సైగలు గీగలు చేస్తా పెద్దపెద్దగా నోరు ఆ చివర్నుంచి ఈ చివరిదాకా సాగదీసి అరుస్తూ ఉన్నట్టుగా యాక్షనించినాడు


అందరికీ వాని అరుపులు కేకల యాక్షను కనపడతా ఉన్నది కానీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలే


సురేశం మీదకు ఉవ్వెత్తున లేచినారు 


ఉపన్యాసాన్ని అన్-మ్యూట్ చెయ్యి అన్-మ్యూట్ చెయ్యి అని


సురేశం ఈ గందరగోళంలో అన్-మ్యూట్ ఎలా చెయ్యాల్నో మర్చి నూకినాడు 


బటన్లన్నీ ఎతుక్కుంటూ ఉండగా నారాయణ ఆయాసం నిట్టూర్పు వదిలి కుర్చీలో కూలబడినాడు 


కూలబడంగనే సురేశంకు అన్-మ్యూట్ బటన్ ఎక్కడున్నదో తెలిసె


నొక్కినాడు


నిట్టూర్పు, ఆయాశం బుసలు వినపడ్తున్నై తప్పితే ఇంకేం లేదు నారాయణ స్క్రీను కెంచి 


ఇంతలో ఏలూరు ఎంకట్రావ్ అన్నాడు - "ఆహా ఇంత విప్లవాత్మక స్పీచ్ ఇచ్చిన నారాయణకు జాతిరత్న లోషన్ లోధ్ర అనే పతకం ఇవ్వాల మనందరం. ఒప్పుకున్నోళ్ళంతా మోకాళ్ళెత్తండి" అని


నల్లగుడ్డ మొహమాయన అడిగాడు - "ఏంది ఎవరికీ వినపడని స్పీచ్ నీకెట్లా వినపడ్డది? " అని


"నీ బటన్లు సరిగా లేవు చూస్కో! అంతలా ఆయాసం పడుకుంట అరుచుకుంట ఇచ్చిన ఉపన్యాసం మాకందరికీ వినపడ్డది. నీ సిష్టంల ప్రాబ్లం ఉంది" అని విరుచుకు పడ్డాడు ఏలూర్ ఎంకట్రావ్ నల్ల్గుడ్డ ముఖమాయన మీద


ఇంతలో కివ్స్ రామేరావ్, ఇస్బొట్లీ లోక్స్మణ్ణ్ కూడా "మాకినపడ్డది మాకినపడ్డది అద్భుతమైన స్పీచి" అన్నారు 


అది విని సొన్నాసి సామి, తాపిసర్, బేరియా బ్రిమ్మాండ్ కూడా వంత పలికినారు ఇంతకు ముందు ఏం వినపడలేదు అన్న అరుపులు అరిచింది తామేననన్నది దాచిపెట్టి 


అప్పటికి అయిదున్నర అవటంతో సురేశం పెండ్లాం నిద్ర లేచి పొద్దున పొద్దున ఈ అరుపులు కేకలు ఏంది ఇంట్ల అంటూ గూబ గుయ్యిమనిపించింది అందరి స్క్రీన్ల ముందు


దాంతో సురేశం "అనివార్య కారణాల వల్ల ఇంతకన్నా ఎక్కువసేపు ఉపన్యాసపు సభ పొడిగించటం కుదరట్లేదు. అందుకని బై" అని మీటింగు ఎండ్ చేసినాడు 


ఆ తర్వాత వారం రోజులకి నారాయణకు జాలిం లోషన్ అవార్డు వచ్చింది


తండాలో అందరూ ఖుష్ అయినారు

No comments:

Post a Comment