Wednesday, September 18, 2019

ఆర్యసిద్ధాంతానికి, దాని అనుచరగణానికి తోలు ఒలిచేసి ఇకపై కనపడకుండా భూస్థాపితం చేసిన రాత! - ఒక బ్రిలియంటాద్భుత వ్యాసం!

సోదరుడు రవి ఇ.ఎన్.వి రాసిన ఒక బ్రిలియంటాద్భుత వ్యాసం

ఆర్యసిద్ధాంతానికి, దాని అనుచరగణానికి తోలు ఒలిచేసి ఇకపై కనపడకుండా భూస్థాపితం చేసిన రాత!

మొత్తం వ్యాసం ముందు ఫేసుబుకులో వేసినట్టున్నాడు

ఫేసుబుకులోలేని నాక్కూడా పంపించగా, ఈ వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రతివ్యక్తికి చేరవెయ్యకపోతే నాకు నేనే ద్రోహం చేసుకున్నవాడినవుతానని పంచేసుకుంటున్నాను

చదివెయ్యండి

మొదటిసారి చదివాక ఎక్కనివారికి సూచన- జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చదివెయ్యండి

అదే అర్థమయిపోతుంది

సత్యం తెలిసిపోతుంది

జ్ఞానం పెరిగిపోతుంది

ఇన్నాళ్ళు చీకట్లో మగ్గిపోతున్న వారంతా బయటకు వచ్చేసే అవకాశం మెండుగా ఉన్నది

చదివాక కూడ వెలుగులోకి రాలేకపోతే ఇక తూరుపు దిక్కే.... 

రవి బ్లాగు ఇక్కడ చూడవచ్చును

https://indrachaapam.blogspot.com/

ఇక చదువుకోండి

***********

#లింగిస్టు

పాడు జన్యువులు - 1.

"లింగన్నా, ఇంతకు ముందు చెప్పిందంతా మలయాళం అవార్డు సినిమాలాగా అసలు అర్థం కాకుండా ఉండాది. ఇదంతా ఏందసలు? నాకు మొత్తం కథను ఫస్టు నుండి చెప్పి కనువిప్పు కలిగిస్తావా?"

"ఓ, అంతా చెప్పాలంటే మొగలిరేకులు అంతవుతుంది. అసలు కథ చెప్పల్నా? మా లింగిస్టులు ఏర్పరుచుకున్న డమ్మీ కథ చెప్పల్నా?"

"నువ్వేం అనుకోక పోతే డమ్మీ వద్దు.అసలు కథనే కట్టెకొట్టె తెచ్చె అన్నట్టు చెప్పు."

"హ్మ్. ఈ కథ 17 శతాబ్దంలో మొదలు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇంగ్లీషోళ్ళు ఇండియాను దోపిడీ చేస్తున్న రోజులు. మామూలుగా ఇంగ్లీషోళ్ళు - అమెరికాకు పోయిరి. అక్కడ స్థానికులను మొత్తం చంపి, వీళ్ళే స్థిరపడిరి. అట్లే ఆస్ట్రేలియాకు పోయిరి, అక్కడా అందర్నీ చంపి తమ సెట్ అప్ పెట్టుకునిరి. ఇండియాలోనూ అదే కథ నడుపుదామని అనుకున్నారు. బాఘా ప్రయత్నించిరి కానీ ఇండియాలో అందర్నీ చంపి పారేసేకి వీలవలేదు. శతవిధాలా ప్రయత్నం మటుకు చేసిరి.

చంపడం వీలు కాదు గనక బానిసలుగా చేస్కోవల. ఆ ప్రయత్నం ఆరంభించి, ఇండియా హిస్టరీ ని కొత్తగా రాయాలనుకొనిరి. అందుకు గార్ధభ జోన్స్ ను రప్పించినారు. వాడు పైజామా కొలతలో ఉన్న భారతదేశ చరిత్రను చడ్డీ కి కుదించి రాశేసినాడు.ఇది మొదలు.

చరిత్రను విజయవంతంగా గబ్బు లేపిన తరవాత ఆంగ్లేయులు భాష మీద పడిరి.వాళ్ళకు తెలిసొచ్చిందేమంటే - సంస్కృత భాష చాలా ఆధునికంగానూ, సాఫిస్టికేటెడ్ గానూ, వ్యవస్థీకృతంగానూ, అద్భుతంగానూ, మధురంగానూ ఉన్నాది. ఆ భాషలో ఎప్పుడో తెలీని కాలాల్లోనే విస్తారమైన వాఙ్మయం ఉంది. అది వేల ఏళ్ళుగా రక్షింపబడుతా వస్తా ఉంది.

ఇది చూచి దిమ్మ తిరిగింది. బానిసలకు ఇంత గొప్ప భాషనేపథ్యం ఉండడమా? ఎంత అవమానం? అని ఆంగ్లేయులు బాఘా ఫీల్ అయిరి. ఈ మొత్తం వేదాలను, వేద వాఙ్మయమూ, భాష దీన్నంతా ’కబ్జా’ చెయ్యాలని అజెండా తయారయింది. దీనికి సమర్థుడైన వ్యక్తి వాళ్ళకు దొరికాడు. 

వాడే జెర్మన్ దేశస్థుడు, 20 ఏళ్ళ యువకుడు అయిన మూత్ర ముల్లర్.

మూత్ర ముల్లర్ కు ఒక పేజీకి 4 పౌనుల చొప్పున ఫీజు ఇచ్చి, వేదాలను - సాధ్యమైనంత ఇరగ్గొట్టి, డైల్యూట్ చేసి, ఇంఘ్లీషుకు, తగినట్టు అనువాదం చెయ్యమని వానికి పని చెప్పిరి.

మూత్రముల్లర్ - పోసి రమ్మంటే పోయి వచ్చేంత మేధావి.

 వీడు సంస్కృతం చదువుతా చదువుతా ఈ భాషలో కొన్ని శబ్దాలు - గ్రీకు, హిట్టైట్, హిబ్రూ భాషల్లో ఉన్న శబ్దాలతో పోలి ఉన్నాయని గమనించినాడు. అంతే కాకుండా ’ఆర్య’ అనే శబ్దం వేదాల్లో (అరుదుగా అయినా) ఉండటం చూశాడు. 

అంతే! ఓ కథ తయారు చేసినాడు.

సంస్కృత, గ్రీకు, హిబ్రూ ఇత్యాది భాషలన్నీ కూడా PIE (Proto Indo European) అనే ఒక ఊహాత్మక భాష నుండి వచ్చినాయి. ఆ భాషను మాట్లాడే వాళ్ళు ఆర్యులు. ఆ ఆర్యులే భారతదేశానికి ఎగేసుకుంటా వచ్చి భారతీయులకు సంస్కృతం నేర్పించ్చినారు. ఫీఏ నుండి సంస్కృతం వచ్చింది.

ఈ కథ బాగా హిట్టయ్యింది. ఈ కథ విన్న జర్మన్ల కిడ్నీలు పులకించాయ్. అంటే తమ జాతి - ఎంతో కాలం మునుపే సాంస్కృతికంగా, సామాజికంగా, ఇలా అనేకరకాలుగా ముందంజ వేసింది! తము ప్రపంచంలోనే అధికులు! అప్పట్లో ఓ సంస్థ (వొడాఫోన్ కావాల్ను) ఆరంభోత్సవానికి మూత్రముల్లర్ వెళ్ళాడు. అక్కడ వాడు - అగ్నిసూక్తం ’అగ్నిమీళే పురోహితం...’ చదివాడు. అది విన్న వాళ్ళకు ఏమీ అర్థం కాకపోతే మూత్ర చెప్పాడు - ’ఇది ప్రపంచం లోనే పురాతనమైన మన జాతి వాళ్ళు పఠించిన మంత్రం.’

హిట్లర్ కూడా తను ఆర్యుణ్ణని నమ్మాడు.

ఇలా ఆర్యుల కథ మొదటి ఫేస్ సమాప్తం.

మొదటి ఫేస్ తాలూకు ఇంఫెరెంచెస్ ఏమంటే -

౧. సంస్కృతం భారతదేశంలో పుట్టలేదు.

౨. సంస్కృతాన్ని - PIE అనే (ఉందా లేదా తెలీని) ఒక భాష మాట్లాడే వాండ్లు భారతదేశానికి మోసుకొచ్చినారు.

౩. భారతజాతి ఔన్నత్యానికి, భాషకు, ఘన సంస్కృతికి మూలం ఆర్యులు.

౪. ఆ ఆర్యులు - (చూచాయగా) జెర్మన్లు.

"

"కట్టె కొట్టె తెచ్చె అని జెప్పమంటే ఇంత కథ చెప్పుకొస్తా వున్నవేందన్నా?"

"తప్పదు. నిజానికి ఇది కూడా చాలా తక్కువ. అసలు కథ మొగలిరేకులు అంతుంది, ఇంతకు ముందర చెప్పినట్టు."

"సరే కానీ, రెండో ఫేస్ చెప్పు"

"పోస్టుతా"

(ఇంకా ఉండాది)

#లింగిస్టు

పాడు జన్యువులు - 2.

"అట్లా మూత్రముల్లర్ ఒక కృత్రిమమైన ఆర్యుల సిద్ధాంతాన్ని ఒకటి రెడీ చేసి బానిసభావానికి పాదు తీసినాడు. ఇది ’ఆర్యన్ సుప్రిమసీ థియరీ’ అనుకోవచ్చు. ఈ ఆర్యుల సిద్ధాంతానికి ఊహ తప్ప ప్రమాణం ఏదీ లేదు. ఫీఏ అనే భాష ఉన్నట్టు కానీ,ఆ భాష లో సాహిత్యం, శాస్త్రం ఆఖరుకు ఆ భాషలోని శబ్దాలతో కనీసం ఒక ఊరు, ఇలా ఏదీ లేదు.

ఆ తరవాత ఫేస్-2 మొదలయ్యింది.

కాలక్రమంలో ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్న భారతదేశంలో పురాతత్వ శాస్త్రం (ఆర్కియాలజీ) ఊపందుకున్నది. త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటి పాకిస్తాను ప్రాంతాన హరప్పా, మొహంజొదడో లలో ఒక పట్టణం (పట్టణ నాగరికత) బయట పడింది. అంతే కాక ఓ 37 శవాలు కూడా కానవచ్చినాయి.

ఏదో పాపం, భారతీయులను సాంస్కృతికంగా దోచుకుని బానిసలుగా చేసుకుందాము, అని ప్రయత్నించే ఇంగ్లీషోళ్ళు - మూత్రముల్లర్ జెర్మన్లను ఆర్యులుగా చేసేప్పటికి కొంచెం కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్టు బాధపడుతా ఉన్నారు. వాళ్ళకు ఈ హడప్పా, మొహెంజొదరో శవాలు చూసేప్పటికి ప్రాణం లేచొచ్చింది. శవపురాణం మొదలయింది

మరొక కట్టుకథ!

’భారతదేశం అనేది ద్రవిడులనే స్థానికుల సొంత భూమి. వీళ్ళు తమ పదునైన బుద్ధితో వ్యవసాయం చేస్కున్నారు, పశువులను మేపుకున్నారు, పశుపతి దేవుణ్ణి పెట్టుకున్నారు, నగరాలు నిర్మించినారు, చక్కగా అభివృద్ధి చెందినారు. వీళ్ళను     ఆర్యులు అనే వాళ్ళు ఐరోపా నుంది మధ్య ఏశియాకు వచ్చి, ఆడ నుండి ఈడికి వచ్చి, సింధు నది ఒడ్డున నరికి పారేసిరి. నరుకగా మిగిలిన ద్రవిడులు - పాకిస్తాన్ నుంచి ఉరికెత్తుకుని దక్షిణ భారద్దేశానికి - ఏకాయెకి తమిళనాడుకు వచ్చి సెటిల్ అయిరి. దానికి ప్రూఫ్ ఇదుగో ఈ 37 శవాలు. ఈ శవాలు ద్రవిడులవి. వీళ్ళను ఏసినది ఆర్యులు. ఇదంతా క్రీ.పూ. 1500 లో జరిగిండాది. ఎందుకు క్రీ.పూ. 1500? అది ఇంకో ’ఋతురాగాలు’. దాన్ని ఇప్పుడు చెప్పే ఓపిక లేదు.  "

" కిడ్నీ బోగ్లింగు!  ఫాక్షన్ సినిమా కంటే థ్రిల్లింగ్ గా ఉంది కద లింగన్నా. అసలు పాకిస్తాన్ బోర్డర్ యాడ? తమిళనాడు యాడ? ఆర్యులు 37 మంది ద్రవిడులను వేసేది ఏంది?

ఆర్యబాబా - 37 ద్రవిడులు సినిమా తీయొచ్చు"

"ఔను. వినే నీకే ఇంతగా కిడ్నీ పులకిస్తే - ఆ థియరీ మీద ఆకాశహర్మ్యాలు కట్టిన మా లింగిస్టుల కిడ్నీలు ఎంత పులకించి ఉండల్ల? ఊహించు. "

"అవునన్నా. జివ్వు మంటా ఉంది"

"సరే ఫేస్ -2 కొనసాగిస్తా. ఈ ఆర్య బాబా - 37 శవాలు, దాన్నుండి వచ్చిన కథలు విని ఆంగ్లేయులకే కాదు, ఈ తూరి భారతదేశంలో కొన్ని వర్గాలకు కూడా కిడ్నీలు జివ్వుమన్నాయి"

"ఇంటరెస్టింగ్. ఎవరు వాండ్లు?"

"ద గ్రేట్ మార్క్సిస్టులు, దళిత, సమానత్వ, ఉదారవాద, సెక్యులర్ వాద, లౌకికవాద, తమిళ జాతీయవాద వగైరా వగైరా వాదులు"

"వీళ్ళ కిడ్నీలు ఎందుకు పులకించాయ్"

"కుహనా కమ్యూనిస్టులకు తెలిసిన విద్య ఒక్కటే. ఒకడు దోపిడీదారు - ఇంకొకడు దోచుకోబడే వాడు. వాళ్ళకు ఈ ఫార్ములా తక్క వేరేది తెలీదు. ఇప్పుడు ఈ ఫార్ములా కు తగిన కథ దొరికింది. 

ఐరోపా నుంచి వచ్చిన ఆర్యులు ఎవరో కాదు, బ్రాహ్మణులు,క్షత్రియులు. ద్రవిడులు ఎవరో కాదు, దళితులు, పీడిత వర్గాల వారు. ఎక్కణ్ణుంచో వచ్చిన బ్రాహ్మలు, క్షత్రియులు స్థానికులను దోచుకున్నారు. దళితులు (ద్రవిడులు) దోచుకోబడ్డారు. బ్రాహ్మలు సంస్కృతంను బలవంతంగా రుద్దారు. తమ దేవుళ్ళయిన విష్ణువు దుర్గ వంటి సాఫిస్టికేటెడ్ దేవుళ్ళను తీస్కొచ్చారు. ఇవతల ద్రవిడులకున్న పశుపతి, ఇత్యాది గ్రామదేవతలను తొక్కేశారు. ఇట్లా"

"సూపర్ లింగన్నా. అసలు సంస్కృతంలో దర్శనాలు కానీ, ఉపనిషత్తులు కానీ దేవుళ్ళకన్నా తత్వానికి కదా విలువిచ్చింది. వీటన్నిటిని వెనక్కి నెట్టి, లేని యవ్వారాన్ని బానే తీస్కొచ్చిండారే. తీస్కొచ్చి బానే కథలు చెప్పిండ్రే"

"అవును. వినేటోడు వెర్రోడైతే హరిదాసు ఆంగ్లంలో హరికత చెప్పెనని. నిజానికి భారతీయుల ప్రాచీన విద్యావ్యవస్థలో ప్రశ్నలు ఎక్కువ. శిష్యుడు గురువును తెగ అడిగేవాడు. లేకుంటే గురువే శిష్యుడికి ప్రశ్నలు ఇచ్చి చచ్చీచెడి సమాధానం వెతకమనేటోడు. భృగువల్లీ సూక్తం నుండి బౌద్ధంలో జెన్ వరకూ ఉదాహరణలు. ఇప్పుడు మటుకు ఈ చరిత్రలో వేల బొక్కలు కనిపిస్తా ఉన్నా ఒక్క ప్రశ్న ఎవడూ అడిగే పరిస్థితి లేదు. స్కూల్లో ఇవే పాఠాలే చెప్పేది. పిల్లలు అడగరు. టీచర్లకు తెలియదు. తెలిసినా చెప్పరు, చెప్తే మార్కులు రావు. పుస్తకాలు ప్రింటు చేసే ణ్ఛేఋట్ లాంటివి మార్క్సిస్టుల గుప్పెట్లో ఉన్నాయి. ఇదంతా ఓ పెద్ద రచ్చ."

"అన్నా, ఒక అనుమానాస్పద డవుటు. బ్రాహ్మలు, క్షత్రియులు ఆర్యజాతి, యాణ్ణుంచో వచ్చి దోచుకున్నారు గనక కమ్యూనిష్టులకు ద్వేషం ఉంది.

ఇంగ్లీషోళ్ళూ ఐరోపానే గదా. వాండ్లూ ఆర్యులు గదా. వారి మింద కోపం లేదా?"

"ఇంటెలిజెంటు క్వశ్చను. ఈడ సత్యాలు తెలుసుకునే ఓపిక ఆసక్తి ఎవుడికీ లేవు. ఎవుడి స్వార్థం వానిది. అందుకని ఇట్లా కొశ్చన్లు రావు, రానీరు."

"సరే యాడికో బోతాండాము. జర కంక్లూడు జెయ్యన్నా"

౧. సింధునాగరకత - ద్రవిడులది.

౨. ద్రవిడులను - ఐరోపా నుండి వచ్చిన ఆటవిక జాతి ఆర్యులు చంపారు, దోచారు, తరిమారు. బతికిన ద్రవిడుల మీద సంస్కృతాన్ని బలవంతంగా రుద్దినారు.

౩. ద్రవిడులు - పీడిత తాడిత వర్గాలు. ఆర్యులు ఉన్నత వర్గాలు.

 ౪. ఇది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. (ఆర్య భూమి ఐరోపా అనడానికి, విచిత్రంగా ఇంత వరకూ ఐరోపాలో, సెంట్రల్ ఏషియాలో ఒక్క ఆర్కియాలజీ ఎవిడెన్సు లేదు.  అన్నీ ఊహలే. )

"ఫేస్ 3 కి పోదామా అన్నా? ఫేస్ 3 అంటే ఏందసలు"

"ఆర్యన్ ఇన్వేషన్ - ఆర్యన్ మైగ్రేషన్ - ఆర్యన్ టూరిష్ట్ అయింది. సరస్వతి నది, విస్తారమైన పురాతత్వ పరిశోధనలు, బీ బీ లాల్, నరహరి ఆచార్ వంటి అద్భుతమైన భారతీయ శాస్త్రవేత్తలు, వీళ్ళందరి పరిశోధనలు. అయినా 3 కు పోవలనా? బోరు ...తున్నాది."

"సరే జూస్సాం."

(ఇంకా ఉండాది)

#లింగిస్టు

పాడు జన్యువులు - 3.

"ఏంది లింగన్నా, బోరు అని జెప్పి మళ్ళా వస్తివి?"

"అవును సామీ, బోరే కానీ చెప్పేది చెప్పాల కదా."

"ఎవురైనా మన మాటలు వింటా ఉండారంటావా?"

"ఈడ ముష్టిమొహంతో సెల్ఫీ అచ్చువేస్తే వచ్చే లైకులు, ఈ చాట భారతానికి యాడొచ్చీని?. కానీ నెట్ లో చానా మంది ఐఐటీ వాండ్లు, పెద్ద చదువులు చదువుకున్న వాండ్లు వాండ్ల సంపాదన పెండ్లాం బిడ్డలను పట్టించుకోకుండా అబద్ధాలతో పోరాడతా ఉన్నారు. మనం కనీసం అబద్ధాన్ని అర్థం చేసుకోవాల కదా. అందుకని ఈ రాతలు. ఇందులో అన్ని నిజాలు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు కానీ, పనిగట్టుకుని చెప్పే అబద్ధాలు లేవు."

"కిడ్నీ కరిగే మాట అన్నావు లింగూ. ఇక ఫేస్ - 3".

"ఫేస్ 3 కి ముందర, ఫేస్ 1, ఫేస్ 2 లను చూస్సాం. ఫేస్ 1 లో ఆర్యులు ఐరోపాలో జాతి అన్నాం. వాండ్లే భారతదేశానికి వచ్చి అన్నీ నేర్పించిరి అన్నాం. ఫేస్ 2 లోమాట  మార్చి, ఆర్యులు ఉన్నిండ్రి కానీ, భారద్దేశానికి వచ్చి ద్రవిడులను చంపిరి అన్నాం. ద్రవిడులు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించి ఉండిరి - ఇట్లా ఉన్నోళ్ళకు - వాళ్ళ (ద్రవిడ) భాష కూడా ఒకటి స్థానికంగా ఉండి తీరాల కదా. అదీ అప్పటికే గొప్పగా ఉండాల కదా, కానీ లింగిస్టులం మాత్రం ద్రవిడభాష గుడకా బయట నుండి కాలబడింది అని రకరకాల థియరీలు జెప్తాం అన్నమాట.

బేసిక్ గా ఏమంటే - ఎన్నో వర్శన్లు తయారు చేస్తాం. ఏ అబద్ధం ఎప్పుడు అతుకుతుందో ఆ అబద్ధం ఆడి అప్పటికి పని జరుపుకుంటాం. ఏవైనా సమాధానం లేని కొశ్చన్లేస్తే, ఆ కొశ్చన్లను, ఆ కొశ్చన్లేసే వాళ్ళనూ అస్సలు పట్టించుకోం. వాళ్ళసలు మనుషులే కాదన్నట్టు."

"హ్మ్. అన్నా, నువ్వు మళ్ళీ మొగలిరేకులు మోడ్ లోకి పోతాండావు."

"ఓహ్, సరే. ఎక్కడో ఆర్యులు వచ్చి 37 మందిని వేసెయ్యడం, తరమడం - ఇదంతా మెహర్ రమేషు ’శక్తి’ సినిమాలో ఈజిప్టు నుండి గుర్రాల్లో హంపికి వచ్చిన పూజాబేడీ నిర్వాకాన్ని తలపిస్తా ఉంది. ఈ అసహ్యాన్ని తట్టుకోలేక బీ.బీ. లాల్ వంటి గొప్ప పురాతత్వ శాస్త్రవేత్తలు మరింతగా శోధించిరి.

ఇటు హర్యానా, గుజరాత్, ఢిల్లీ ఇట్లా అనేక ప్రాంతాల్లో వ్యాపించిన ఓ నాగరికత బయటపడింది. ఇది సుమేరు, మెసపొటేమియాల కన్నా చాలా పెద్దది. ఇంకొక సైడు, ఆ శవాల్లో రకరకాల వయసులోళ్ళున్నారు. వాండ్లను ఎవరో వచ్చి ఏసినట్టు ఆయుధాల ఆనవాళ్ళు గట్రాలేవు. పైగా వాళ్ళు - ఏదో గొప్ప ఉపద్రవం వచ్చి  సచ్చిన కేసుల్లా ఉన్నారు. వాళ్ళ శవాలు కూడా చివికిపోకుండా ఉన్నదానికి ఏదో కారణం ఉంది. ఇది ఆర్యుల దండయాత్ర అయుండే అవకాశం లేదు."

"హయ్యో. ఫాక్షనిస్టు సినిమా కాదన్నమాట."

"ఉండుండు తొందరపడాకు. సినిమా ఫాక్షనే. టైటిల్ సాత్వికం. అతి మూత్రం శ్రీను సినిమా ...సమేత లాగా"

"అదెట్లా?"

"పైన చెప్పినట్లు దండయాత్ర కాదు అనేతలికి ఆ ఆర్యుల దండయాత్రను పుస్తకాల్లో దూర్చిన ’కురుకుల్లా స్టాపర్’ లాంటి మేతావులందరు కొంచెం ఉలిక్కిపడిరి. ఆర్యుల దండయాత్ర కాదా, అయితే ఆర్యుల వలసయాత్ర (ఆర్యన్ మిగ్రతిఒన్ థోర్య్) అనేస్కో అనిరి"

"ఓహ్ టైటిల్ మారిందన్నమాట"

"టైటిల్ ఒగటే మారిండేది. లోపల సినిమా మటుకు ఫాక్షనిజం. ఎందుకంటే ఆర్యులు బ్రాహ్మలు, క్షత్రియులు అయితేనే కుహనా కమ్యూనిష్టులు నోరారా తిట్టుకునేకి వీలయ్యేది. వాళ్ళంతా వలసొచ్చినోళ్ళు, టూరిస్టులు అంటే వీళ్ళ నోటి తీట తీరదు కదా.

ఇంకో సంగతి. ఈ గలాటా మధ్యలో మరొకటి జరిగింది. ఈ దేశంలో మహాభారతకాలానికి ముందు ’సరస్వతి’ అని ఒక నది ఉండేది. దాన్ని గురించి వేదాల్లో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.మహాభారతంలో బలరాముడు - యుద్ధం అయిన తర్వాత తీర్థయాత్రలకు పోతూ,ఈ నది యెండిపోయి ఉండేది చూస్తాడు, చెప్తాడు. ఈ నది ఆనవాళ్ళు కూడా పరిశోధనల్లోనూ, సేటిలైట్ ఇమేజింగు, ఆర్కియాలజీ వగైరా వాటిలో బయటకు వచ్చింది. ఎప్పుడో క్రీ.పూ. 2000 కు ముందే నది ఎండి ఉంటే, ఆ తర్వాత 1500 లో ఆర్యులు వచ్చి, సరస్వతి నదిని, దాని తీరాన వెలసిన వేద సంస్కృతి చెప్పేదేంది?., పైగా భారతీయ సంస్కృతి అంతానూ ఒక ప్రవాహంలా వస్తా ఉంది. ఏదో ఒక పాయింట్ దగ్గర మొదలయినట్లు లేదక్కడ. నిజానికి ఈ ఇంగ్లీషు వాండ్లకు, ఇతరత్రా వాదులకు, తమిళ రాజకీయవాదులకు వేదాలను, సింధునాగరికతను కలిపి స్టడీ చేసే ఉద్దేశ్యం లేదు. అలా చేస్తే తప్పుడు సిద్ధాంతాల పునాదులు కూలిపోతాయి.

ఇట్లా, ఆర్కియాలజీ, హైడ్రాలజీ, అస్ట్రానమీ పరంగా చిక్కులు వచ్చే తలికి ఆర్యన్ ఇన్వేషన్ కాస్తా ఆర్యన్ మైగ్రేషన్ అయి కూర్చున్నాది.

ఇంకా కొంచెం తెలివిగా చూస్తే - భారతదేశం నుండే బయటకు విజ్ఞానం ప్రసరించిన దాఖలాలు కనిపిస్తా ఉండాయి.

ఇది ఫేస్ - 3"

"టు కంక్లూడ్..."

౧. ఆర్యుల దండయాత్ర కు ఆధారాలు సరిపోట్లేదు.

౨. సింధునాగరికత అనుకున్న దానికన్నా చాలా పెద్దది.

౩. సరస్వతి నది తీరాన గొప్ప నాగరికత పరిఢవిల్లింది. ఈ నది ప్రస్తావన వేదాల్లో ఉన్నాది.

౪. సైన్సు పరిధి విస్తృతం కాసాగింది. దరిమిలా అబద్ధం పైకి తట్టు తేలుతా వస్తా ఉంది.

౫. ఆర్యుల దండయాత్ర - ఆర్యుల వలస అయినా కమ్యూనిష్టుల కథనం, బ్రాహ్మలు దోపిడీ దారులన్న సూత్రంలో మార్పు లేదు. తర్కం ఒప్పుకోకున్నా, ద్వేషానికి మాత్రం ఢోకా లేదు.

౬. భారతదేశం బయట నుంచి లోపలికి కాక, ఇక్కడ నుండే బయటకు భాష, సంస్కృతి, ఇతరత్రా విజ్ఞానం వెళ్ళిందా!

"మీ లింగరిస్టులు ఏం చెప్తా ఉండారు?"

"చెప్పెడిదేంది? ఎన్ని అబధ్దాలు ఋజువైనా మొదటి సిద్ధాంతమే. భారతీయ భాషలు బయట్నుంచొచ్చినాయి. ద్రవిడులను ఆర్యులు చంపినారు, తొక్కినారు. అయినా సరే, ద్రవిడ భాషలు ఆర్యుల నుండి, వాళ్ళ నివాసం ఐరోపా, మధ్య ఆసియా నుండే వచ్చినాయి.  వగైరా వగైరా."

"అంటే ద్రవిడులను ఆర్యులు తొక్కి నారతీస్తా ఉన్నా, ద్రవిడులు ఆర్యుల నుండి భాషలు నేర్చుకుంటా ఉన్నారన్నమాట. అదీ తమ భాష, ఆర్యుల నుంచి ఫ్రెష్ గా నేర్చేసుకుంటన్నారు.

సింప్లీ అమేజింగ్ అన్నా!"

(ఇంకా ఉండాది)

#లింగిస్టు

పాడు జన్యువులు - 4.

"అన్నోయ్. ఇంతకూ ఈ టైటిల్ కూ ఈ సోది రాతలకూ సమ్మందం ఏంది?"

"భలే కొశ్చన్ అడిగితివి తమ్మీ. ఆడికే వస్తా. ఫేస్ - 4"

"రా సామీ. అయితే మొగలిరేకులు, ఋతురాగాలూ వద్దు."

"సరే. ఆర్యుల దండ యాత్ర/వలస/తీర్థయాత్ర/టూరిస్ట్ థియరీలన్నింటికీ - ఆర్కియాలజీ, హైడ్రాలజీ, అస్ట్రానమీ, ఇంటర్నల్ ఎవిడెన్సులూ అన్నీ దొరక్కుండా ఆ థియరీలు ఫెయిలవుతా వచ్చినాయి.

మరొక పద్ధతీ వచ్చె. అణుధార్మికత కు చెందిన కార్బన్ డేటింగు ద్వారా కార్బన్ డిపాజిట్ల కాలనిర్ణయం.

భారతదేశంలో కూడా ఎక్కడ పడితే అక్కడ పురాతన శిథిలాలు, శకలాలు దొరుకుతూ పోయాయ్. వాటి కాలాలు క్రీ.పూ;6000,8000 ఇలా ఎంతో ప్రాచీనమైనవిగా ఉన్నాయ్.

ఆంధ్రదేశంలో జ్వాలాపురంలో ఏకంగా ఊహించలేనంత పురాతనైమయిన వేలాది ఏళ్ళకు పూర్వం అర్తిఫచ్త్స్ బయటపడినాయి. తమిళనాడులో కలడి లో క్రీ.పూ. రెండు వేల ఏళ్ళ నాటి నివాసాలు బయటపడ్డాయి. అంటే - ద్రవిడుల నివాసం సింధునది పక్కన, ఆర్యులు తరిమిన తర్వాత వీళ్ళు తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు వగైరా అన్నీ తలాతోక లేని కథలుగా తేలిపోతున్నాయి."

"అంటే అబద్ధం ఋజువైపోనాదా? మన హిస్ట్రీ బుక్కులు మారినాయా?"

"అంత ఎక్సయిట్ మెంట్ దేనికి బ్రో? మనది భారతదేశం. అబద్ధాలు బయటపడినా ఇప్పటికీ మన పిల్లలకు మనం అబద్ధాలే చెప్తున్నాం."

"సరే. అశ్వాన్ని ముందుకు దూకించు అన్నా"

"అశ్వం - మంచిగ గుర్తు చేసినవులే తమ్మీ.

మరొక సన్నాయి నొక్కు మొదలయింది. ఆ శక్తుల నించి. గుర్రాలు భారతదేశంలో  లేవని, అవి బయట నుండి వచ్చినాయని, వాటిని తెచ్చింది ఆర్యులని..ఇట్లా...ఇది పొలిటికల్లీ కరెక్ట్ సిద్ధాంతం. అయితే కొన్ని చోట్ల ప్రాచీన మానవుని చిత్రలేఖనాలు ఉన్న గుహల్లో గుర్రాల బొమ్మలు ఉన్నాయి. యథావిధిగా వీటిని మెయిన్ స్ట్రీమ్ లోనికి రానివ్వలేదు."

"ఓహ్. ఇంతకూ జన్యువులు? "

"హ్మ్. అన్ని రంగాల్లో తప్పులు కుదరకపోయే తలికి కొత్త సైన్స్ ను తీసుకొచ్చిరి ఆంగ్లేయులు. ఇప్పటికి వాళ్ళ పరిపాలన, అదీ అన్నీ పోయినాయి కానీ బుద్ధి మాత్రం అట్లే ఉంది. ఈ కొత్త సైన్స్ పేరు - జెనెటిక్స్.

ముందు హప్లొగ్రౌప్స్ గురించి లెక్చరిస్తా. జన్యుశాస్త్రంలో (జెనెటిక్సు) హప్లొగ్రౌప్స్ అంటే కొన్ని గుంపులకు ఒకే మూలపురుషుడు ( చొమ్మొన్ అంచెస్తొర్ ) ఉండటం.

ఈ గుంపులు ఎలా ఉంటాయి? - తండ్రి జన్యువుకు చెందిన Y క్రోమోజోము + ంత్డ్ణా (ంఇతొచొంద్రిఒన్ డ్ణా) కలిపి ఒకతని జన్యువు.

ఆ1అ1, ఆ1అ1, ఋ1అ1...ఇలా పలు కాంబినేషన్లలో ఈ హప్లొగ్రౌప్స్ ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణాలో వందమంది జన్యువు లు సేకరించారనుకుంటే ఆ వందమందిలో పైని కాంబినేషన్లలో ఏ కాంబినేషన్ లో అయినా ఒక దానిలో ఒక్కొక్క వ్యక్తి జన్యువు ఉండే ఛాన్సుంది.

ఆ1బ్2 అనేది చాలామందిలో ఉందనుకుందాం. ఆ ఆ1బ్2 జన్యువు ఉన్న వాళ్ళందరూ వేలాది ఏళ్ళ క్రితం నాడు పుట్టిన  ఒకని వారసులే.. ఆతని వంశం వాళ్ళకే ఈ జన్యువు ఉంటుంది. ఈ జన్యువు ఉన్నవాడు అమెరికాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్న్నా, ఆ జన్యువు ఉన్న వాళ్ళందరి మూలపురుషుడు ఒకడే."

"ఇది మరీ తమిళ సినిమాను హిందీ చానెల్లో సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టున్నాది."

"ఈ మాత్రం తప్పదు. ముందుకు పోతే - ఋ1అ1 అనే ఒక జన్యువు మాత్రం, ప్రపంచంలో అక్కడక్కడానూ, ఇంకా ఐరోపాలో చాలాచోట్ల చాలా జాతుల్లో ఉన్నట్టు తేలింది."

" ఓహ్! కొంచెం తెలుస్తా ఉందన్నా. ఇవే జన్యువులు భారద్దేశంలోనూ ఉంటే - ఆర్యులే భారతదేశానికి పూర్వీకులని ఋజువు అవుతుందన్నమాట! అయిందా?"

" మొదటి లైను కరెక్టు. :)  ఋజువు - ఇక్కడ మటుకు చాలా భయంకరమైన పాలిటిక్స్ నడుస్తా ఉండాయి."

" ఇప్పుడు మటుకు మొగలిరేకులే ఆశిస్తా ఉండాను."

"నిజానికి నాకూ అంతగా తెలీదు, కానీ తెలిసినది రాస్తా ఉండా."

"సరే గ్యాప్ తీస్కో. తీస్కొని ముందు కథ చెప్పు".

"చెప్తా. ఈ కొత్త జన్యుశాస్త్రంతో మొదట ఆశావహంగా అనిపించినా తరవాత ఆంగ్లేయులకు బాగా మెట్టేట్లు తగిలే పరిస్థితి వచ్చింది."

"అమేజింగ్. మరి చెప్పు.."

"చెప్తా..మళ్ళీ.."

(ఇంకా ఉండాది)

#లింగిస్టు

పాడు జన్యువులు - 5.

"ఋ1అ, ఋ1అ1 అనే హప్లొగ్రౌప్స్ ఐరోపా లో ఇబ్బడిముబ్బడిగా నిండినాయి. ఇవే జన్యువులు భారతదేశంలో బ్రాహ్మణ క్షత్రియ వర్గాలలో దొరకాల. అయిపాయ. ఆర్యుల సిద్ధాంతం ఋజువైపోతుంది! ఇదీ ఆంగ్లేయుల స్కెచ్. ఈ ఋ1అ1 నే ఋ-ం17 అనీ అంటారంట. "

"అన్నా. ఒక డవుటు. మామూలుగా సైన్స్ అంటే మొదట డాటా దొరుకుతుంది. ఆ డాటాను ప్రాసెస్ చేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ప్రతిపాదనలు చేస్తారు. కానీ ఇక్కడ రివర్సు. ఆర్యులని ఒక లేని తెగను ఊహించేసి, వాళ్ళ ఉనికి కోసం వేల కోట్ల ధనం వెచ్చించి ఆ ఊహను కరెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎందుకిలాగ?"

"నువ్వడిగిన ప్రశ్నలో మొదటి పార్టు ఏం చెప్తుంది? అబద్ధాన్ని పూజించటాన్ని చెప్తుంది. ఏ మనిషైనా అబద్ధాన్ని ఎందుకు నమ్ముతాడు/పూజిస్తాడు/విశ్వసిస్తాడు? - స్వార్థం వల్ల. లేదా భూమ్మీద జీవితం అశాశ్వతం అన్న ఒక వైరాగ్యభావన మనసు లోతుల్లో లేకపోవడం వల్ల. మరొక రకంగా చెప్పాలంటే - సత్యాన్ని తనలో కాక బయట వెతకడం వల్ల. రెండవ పార్టు - ఎందుకిలాగ? - ఈ ప్రశ్నను నీలోనే ఉంచుకో"

"సరే సరే ముందుకు పద."

"హా. ఇంతకు ముందు సోది తో అర్థమయిందేది? ఆర్యులు గొప్ప - ద్రవిడులు తక్కువ. ఆర్యులు - ఉత్తమ కులం/వర్ణం  ద్రవిడులు తక్కువ కులం/వర్ణం.  ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఈ మార్క్సిస్టు, ఉదార/సమానత్వ/తమిళజాతీయ వగైరా వగైరా శక్తులు రామరావణ యుద్ధానికి, దేవదానవ యుద్ధానికి ముడిపెట్టేసి ఊహించేసుకున్నారు. ముఖ్యంగా ఆవేశం పాలు అధికంగా ఉండే అమాయక తమిళులు మరీనూ.

మసిరత్నం అనే ఆయన ’రావణ్’ అని ఒక సినిమాను తీశాడు. ’కాలా’ అన్నది ఆ సూత్రం మీద వచ్చిన సినిమానే. ఇంకా ఆర్యులు - ఉత్తర భారతీయులు. ద్రవిడులు - దక్షిణాత్యులు. ఇది కాస్తో కూస్తో ఆలోచించే భారతీయుల తలల్లోనూ పరోక్షంగా తొలుస్తుంటుంది. హిందీని తమిళులు అవసరానికి మించి ద్వేషించడానికి మూలాలు ఇక్కడ ఉండే అవకాశం తోసిపుచ్చలేనిది.

అలా ఉంటే ఈ ఋ1అ1  జన్యువు ఇండియాలో ఏ జాతి/కుల/వర్ణ వర్గాల్లో ఉంది? పరిశోధనల్లో తేలినదేమంటే - బ్రాహ్మల్లో కన్నా, సహారా అనే మధ్యప్రదేశ్ ఆదిమజాతుల్లోనూ, చెంచులనే ఆంధ్ర ఆదిమజాతుల్లోనూ అత్యధికంగా ఉంది. (27%). భారతదేశమంతానూ కలిపి 17% శాతం ఉంది. ఇది దళిత, బ్రాహ్మణ, ఇత్యాది వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల్లో ఉన్నాది.

ఆర్య ద్రవిడ వాదులకు దీంతో పచ్చివెలక్కాయ పడినట్టయింది. బ్రాహ్మల్లోనూ, దళిత, చెంచు వర్గాల్లోనూ ఒకే జన్యువు ఉందని సైన్సు మొరుగుతూ ఉంది. ఇలా ఆర్య ద్రవిడ సిద్ధాంతం పూర్తీగా తప్పని ఋజువయ్యింది. అదీ విదేశీయుల సైన్స్ మూలంగానే ఋజువవుతోంది."

"ఇది మరీ గొప్ప ట్విష్టన్నా"

"ఇక్కడ ఇంకో విషయం.  మామూలుగా తాము ఆశించిన రిజల్టు రాకుంటేనో, తమ అబ్సర్వేషన్స్ - తమ థియరీకి ఆపోజిట్ గా ఉంటేనో ఈ ఆంగ్లేయులు వాటిని కప్పిపెట్టటం/పూడ్చిపెట్టటం మొదట్నించీ వస్తున్న దరిద్రపు అలవాటు. అట్లా చాలా శాసనాలలో, పురాణ గ్రంథాలలో ఈ ఆంగ్లేయుల కైవాడం ఉంది. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది.

అయితే ఈ మధ్య మీడియా, ఫేస్బుక్కులు వగైరాల ప్రభావంతో వీళ్ళ చీప్ ట్రిక్స్ బయటపడి పోతున్నాయ్. శాస్త్ర విషయాలు బయటకు వచ్చేస్తున్నాయ్. నాలాంటి అణాకాణీ గాండ్లకు కూడా కొన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయ్"

"కరెక్టు. :) "

" ఇది ఇట్లా ఉంటే - 2015 లో ఫ్రాన్సులో జరిగిన ఓ పరిశోధనలో ఋ1అ అన్న జన్యువు 15, 450 ఏళ్ళనాటిదని, దాని మూలం అనగా చొమ్మొన్ అంచెస్తొర్ పాకిస్తాన్- భారతదేశంలో ఉద్భవించిందని తెలియవచ్చింది. అంటే - ఈ ఆర్యులు, క్రీ.పూ 1500 గట్రా, బయట నుండి వచ్చినారు గట్రా అన్నీ అబద్ధాలు. భారతదేశంలో నుంచే బయటకు అన్నీ పాకినాయ్ అని క్లూస్ దొరుకుతున్నాయ్. అది మళ్ళీ మాట్లాడుకుందాం. 

 ఈ పరిశోధన కు ప్రాచుర్యం దొరికిందా లేదా నాకు తెలీదు. ఇట్లా చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల వల్ల ద్రవిడ జాతీయవాద రాజకీయపార్టీల అస్తిత్వానికి ముప్పు. వాళ్ళు దాన్ని రానివ్వరు. కొన్నిటివల్ల కురుకుల్ల స్టాపర్ లాంటోళ్ళ కీర్తికి అడ్డు. వాళ్ళు రానీరు. ఇవన్నీ తరచి చూస్తే లింగాలజీలు గట్రా అన్నీ ఇంకో విధంగా స్టడీ చెయ్యాల్సి వచ్చే పరిస్థితి.అందుకని మా లింగిస్టులు కూడా కోప్పడతారు. :) "

"ఓహ్ పెద్ద అడుసు. అవును."

"సరే ఇంతకూ ఏమంటావన్నా? ఈ ఆర్య ద్రవిడ వాదాలు పోయి, ఇండియాలో ఒకళ్ళతో ఒకళ్ళు సుహృద్భావంగా, తమ సమస్యలను తాము పరిష్కరించుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉండాదా?"

"ఏమో తెలీదు. కానీ ఆ వైపుగా అడుగు పడినట్టుంది. చాలా మంది మేధావులకు ఈ అబద్ధాల వల్ల కడుపు రగిలి పోతూంది. ఇది మాత్రం నిజం. అయితే అబద్ధం మీద పెట్టుబడి పెట్టినోళ్ళు ఊరుకోరు. ఆర్కియాలజీ, హైడ్రాలజీ, అస్ట్రానమీ, జెనెటిక్స్ ఇలా ఎన్ని పోయినా ఇంకేదో అన్నా అంటారు. మనం స్వార్థాన్ని దగ్గరకు రానీయకుందా ఉంటే సాలు. అదీ సంది."

(ఇప్పటికి అయిపోయింది)

9 comments:

 1. అద్భుతమైన వ్యాసం

  ReplyDelete
 2. సరస్వతి నది ఆర్యావర్తం లో ప్రవహించి క్రీ.పూ.2000 మునుపు యెండిపోయింది. నది ఇక్కడ ఉంటే దాన్ని గురించి, దాని పేరు కూడా తెలీని మధ్య ఏషియా వాళ్ళు వ్రాయుడు ఏంది? అదీ నది యెండి సచ్చిన తరవాత వచ్చిందని చెప్పే వాఞ్మయంలో దాని వైభవాన్ని కీర్తిస్తా ౠక్కులు చెప్పడం ఏంది?

  మొత్తం బొక్కలే. అయినా ఇంకా ఇదే చెల్లుతూంది. ఈ అబద్ధాలే పిల్లలకు చెప్తున్నాం. ఎన్ని స్వార్థ శక్తులు పగబట్టాయో ఈ భారతదేశం మీద.

  ReplyDelete
  Replies
  1. అవును.... ఆ బొక్కల కాడ గోతి నక్కల్లా కూర్చుని అదే జీవనాధారంగా బతుకుతున్న NRI ళింగిష్టుల్, ఛరిత్రకారుళ్, నారిగాళ్ ఇంగా శానామంది ఉండార్....

   మతీసతీ లేని దేశవాళీ గొడ్డుల్సే కాక, ఆ దేశంలో గొప్పగొప్ప ఇద్యాలయల్లో సదూకోని బయటకొచ్చి సెటిలయి పుట్టిపెరిగిన దేశమ్మీద సందు దొరికితే చాలు బురదెత్తిపోసే ఈరగొడ్డుల్స్ ఆ శానామందిలో ఉండారు...

   ఆళ్లకీ ఆ మూత్రముల్లర్ గాడికి భేదమేందో కనీసం ఆళ్లకన్నా అర్థమైతే చాలు

   గొప్ప ఊరట కలిగించే విషయమేమంటే ఈ మధ్య యువతకు కాస్త తెలివిడి, జ్ఞానం కలిగి దేశానికి సంబంధించి, చరిత్రకు సంబంధించి మూసుకుపోయిన కళ్లు తెరుచుకుంటున్నారు... నయం!

   May they keep their eyes open

   Delete
  2. And thank you for taking this initiative sOdaraa!

   May god bless and be with you and may your tribe grow exponentially

   Love

   Delete
  3. అస్ లింఘరిస్టుల్నీ, అరెమికా కు పోగానే కళ్ళు నెత్తికెక్కిన అణాకాణీ గాళ్ళనూ ఎక్కువగా ఊహించి తల చెడగొట్టుకోకండి. నిదానంగా అయినా అబద్ధాలు అన్నీ నశించే రోజు ముందుంది.

   Delete
  4. నిదానంగా అయినా అబద్ధాలు అన్నీ నశించే రోజు ముందుంది - Hope so and wish for it to happen soon!

   Delete
 3. అద్భుతం
  నేనూ చదివాను...... ఓల్గా వంటి కథకులూ తమ కథలో వారి వర్గం వారు చెప్పిందాననీ తప్పుగా...ఇంకా తప్పుగా వ్రాసి అభ్యుదయులనీ పేరు సంపాదించుకున్నారు.
  ( ఆంధ్రజ్యోతి లో ఆ కథకూడా పడింది. చర్చ పెట్టిన పెద్దాయనకూ అవగాహన లేదు. నా ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. వాళ్ళు చెప్పింది నమ్మేయాలి. అంతే )

  ReplyDelete
  Replies
  1. ఆలస్యం చేయకుండా మీకు తెలిసిన ఇంకో వందమందికి ఇది చదవమని చెప్పండి .... వాళ్లకు కూడా సూచించండి - ఒక్కొక్కళ్లు ఇంకో వందమందికి ఈ వ్యాసాన్ని చేరవెయ్యమని...


   God bless

   And by the way - andhra jyothy link pls - i have no clue what you are talking about! Thank you

   Delete

Note: Only a member of this blog may post a comment.