Thursday, August 29, 2019

సాహో సినిమా Review!

అనగనగా ఒక లక్ష్మీదేవి

మామూలుగా దేవతలందరికీ, దేవీమాతలందరికీ ఏదో ఒక స్తోత్రం ఉంటుంది

అలానే ఆవిడకూ ఒక స్తోత్రం ఉన్నది

ఆ స్తోత్రమునందు

చన్ద్రాం ప్రభాసాం
యశసాం జ్వలన్తీం
శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం....
శరణమహం ప్రపద్యే
అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

అంటూ ప్రార్థించినారు మనవారు

దానినే తీసుకుని

చిత్రాం ప్రభాసాం
డాలర్ జ్వలంతీం
మేరా పైసా నష్టాం
తాం....
సుజీతాం ప్రపద్యే
నీకో దణ్ణాం
నీ మూలానే త్వాం వ్రణే((అవును అది వ్రణే నే వృణే కాదు)

అంటూ పాడుకుంటిని ఈనాటి సాయంత్రం

ఎందుకూ అలా పాడుకోవటం బాబూ?

ఎందుకా?

సాహో అనబడు ప్రభాసు గారి సినిమా చూచినాను

అది చూచి

కనులు తాటికాయలంతై
ఒడలు మైనాక పర్వతమంతై
మనసు కకావికలంతై
నన్ను నేనే తన్నించుకున్నంతై

పరిస్థితి దాపురించె

అయితే ఆఖరికి బుద్ధుడికి కూడా జ్ఞానోదయం అయినట్లే నాకూ అయినది

కష్టములు మానవులకు కాక మానులకు వస్తవా అని జీవితం నేర్పిన పాఠము గుర్తు తెచ్చుకొని గుండె నిబ్బరం చేసుకుని ఈ పోష్టు రాయ పూనుకొంటిని

ఆటశాలయందు నేనూ మరికొద్ది మంది మటుకే ఉంటిమి

ఐమాక్సు తీటవలన టికెటు అమ్మవారిని ఆ ఆటశాల వాడు నాకు 30 డాలర్లకు అమ్మినాడు

ఆ ముప్ఫై డాలర్లలో తిరిగివచ్చినవి ఇవీ

 • బాకుగ్రవుండు మ్యూజిక్కు వలన - 1 డాలరు
 • శ్రద్ధాకపూరాం ప్రభాసాం లిప్ లాకింగ్ ముద్దుకిస్సింగాం వలన - చిల్లుకానీ
 • సాబు సైరిలి వలన - 1 డాలరు
 • గ్రాఫిక్సు వలన - రెండు చిల్లుకానీలు
 • ఫైటింగుల వలన - అర్థరూపాయి

వినోదం పంచినవి ఇవీ

 • దేవదాసు శరీరానికి కటకటాల రుద్రయ్య క్రాఫు అతికించినట్టుగా ఉన్న ప్రభాసాం గారి విగ్గు
 • పరమానందయ్య శిష్యుల్లా ఉన్న విలన్లు
 • ఆ విలన్లకు అతికించిన సవరపు గడ్డాలు
 • డూడూ బసవన్న స్టెప్పుల్లా ఉన్న జాకెలిన్ కెన్నెడీ గారి అయిటం పాట

వెరసి మొత్తానికి అమితమైన గొరుగుడు సాయంత్రం తన కథను ముగించుకున్నది

ఈ సినిమా దర్శకులు "సుజీతాం" గారు ఈ సినిమా తీయటం కన్నా ఏదన్నా ఆఫీసులో "జీతాం" తీసుకుని ఏదన్నా పని చేసుకుంటూ ఉండుంటే బాగుండేది అని అనిపించిన మాట నిజం

అమ్మా లక్ష్మీదేవీ -

నా డబ్బులాం
ఏదో విధంగాం
మరల నాకు ఇప్పించాం
నీకు వేనకువేల దణ్ణాం
ఇప్పించిన మరుక్షణాం
ఆ డబ్బంతాం
నీ హుండీలో వేసేస్తాం


జై లక్ష్మీదేవాం


అయితే ఉపశమనం కలిగించే విషయమేమనగా ఎల్డొరాడో తెలుగు ప్రజలు మిగిలిన తెలుగు ప్రజల స్థాయికి అందనంత పై మెట్టులో ఉన్నారు

 • చాలా చక్కగా సౌమ్యంగా కర్చీఫులు, అండరువేరులు వేసి సీట్లను ఆపకుండా
 • వీర భీకర వంటవాసనగొట్టు బట్టలతో రాకుండగా, 
 • పక్కవారి గురించి ఆలోచన లేకుండా పిచ్చి పిచ్చి నవ్వులు పెద్ద పెద్ద గొంతులతో మాటలాడుకోకుండగా,
 •  సినిమా నడుస్తున్నప్పుడు చెల్లుఫోనులు తీసి ఫ్లాషులైటులతో ఫోటోలు తీయకుండగా, 
 • యూట్యూబులోనో ఫేసుబుకులోనో వీడియోలు ప్లే చెయ్యకుండగా, 
 • సమోసాలు పరపరలాడించి పక్కనవాడి కుర్చీకి నూనెచేతులు పుయ్యకుండగా 
- ఇలా తెలుగువారికే ఆభరణాభూషితాలైన ఎన్నో దరిద్రగొట్టు అలవాటులేవీ లేకుండా చూడముచ్చటగా ఉన్నారు

ఈసారి సినిమా చూస్తే ఆ ఫాల్సం థియేటరులకు కాకుండా ఎల్డొరాడొ థియేటరులకు వెళ్ళటం ఉత్తమం

చివరిగా మీ వినోదార్థం ఒక రెండు చిత్రాలు

ఖాళీగా ఉన్న ఆటశాల మరియు ఐమాక్సు క్లిప్పు

 

Telugu cinema has a LONG way to go even after spending 300+ crores

May god bless US all

May god bless the movie goers


Tuesday, August 27, 2019

ఈరోజు అమెజాను వారి బెష్టు సెల్లర్సులో "మైరావణుడు" 27వ స్థానంలో ఉన్నాడు

ఈరోజు అమెజాను వారి బెష్టు సెల్లర్సులో "మైరావణుడు" 27వ స్థానంలో ఉన్నాడు

"అనగనగా (2)" 50వ స్థానంలోనూ ,  "రుక్మిణి" , "సైరంధ్రి" , ఇంకా ఎన్నో "అనగనగా" లు కలిపి ఇంకో పది పుస్తకాలు మొదటి వందలో ఉన్నవి

ఇదంతా మీ పుణ్యమే

పాఠకదేవుళ్ళ పుణ్యమే

జై బోలో పాఠక్ మహరాజ్ కీ - జై

(క్రింది బొమ్మలు చూడుడు)

Sunday, August 25, 2019

జ్ఞానపీఠ్ వచ్చినా కూడా కలగని ఆనందం ఈ వార్త వల్ల కలిగింది

శ్రీమయి అని ఒక చిన్న అమ్మాయి రాసిన శబ్దార్థ శతకం పక్కనే నా పుస్తకాలు చోటు చేసుకోవటమనేది - జ్ఞానపీఠం వచ్చినా కూడా కలగని ఆనందం కలిగించింది..... May god bless the kiddo and may she write a 1000 books more.....

అసలు సంగతేమంటే - వారి నాన్నగారి జ్ఞాపికగా విజయభాస్కర్ గారు తమ సంస్థ నిర్వహించే పిల్లల ఆటల మాటల పోటీల్లో విజేతలకు, పాల్గొన్నవారికి - ఆ చిచ్చర పిడుగులకి - పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలన్న ఆలోచన తలపెట్టి అందుకోసం నా పుస్తకాలని ఎంపిక చేసుకుని ఆ పిల్లలకు ప్రదానం చేసినారు

ఆ ఘనాపాఠీల వంటి పిల్లల చేతిలో పుస్తకాలు, అదీ తెలుగు పుస్తకాలు, అందునా నా పుస్తకాలు ఉండటం ఆశీఃపూర్వకమే...

అందునా వారి సంస్థలో పెరిగి పెద్దదైన అమ్మాయి, తెలుగును నడిపించే తర్వాతి తరం (ఈ తరం) అమ్మాయి రాసిన పుస్తకం పక్కనే నా పుస్తకాలు ఉండటం బహుదానందకరం

విజయభాస్కర్ రాయవరం గారూ -  మీ దాతృత్వానికి, మీలోని భాషాభిమానికి, మీకు పిల్లల పట్ల ఉన్న ప్రేమకు సహస్ర సాష్టాంగ నమస్కారాలు

Rayavaram clan
May your army grow,
May your tribe grow,
May the kids be enriched,
May god bless our language,
May god bless us all

Thank you

Friday, August 23, 2019

మీలో ఒకరికి వీరిలో ఒకరు ఎక్కడో అక్కడ తెలిసే ఉండాలి అని అనుకోలు - Set 2

మీలో ఒకరికి వీరిలో ఒకరు ఎక్కడో అక్కడ తెలిసే ఉండాలి అని అనుకోలు

మీకు కాకపోతే మీ అమ్మానాన్నలకి, మీ బంధువులకి తెలిసే ఉండాలి

తెలిస్తే మీ వాళ్ళతో పంచుకోండి

తెలియకపోయినా పంచుకోండి

ఏమో - ఏ పుట్టలో ఏ సమాచారముందో ఎవరికి ఎరుక

వీరిలో వ్యాపారులున్నారు

వీరిలో కవులున్నారు

వీరిలో అందరూ ఉన్నారు

ఇది రెండవ సెట్టు

మరింతమంది మరి కొన్ని రోజుల్లో

భారతీయ వైశ్య రజతోత్సవ పారిశ్రామిక సంచిక (1955) నుండిWednesday, August 21, 2019

శ్రీ తూమాటి దొణప్ప గారు - రాజా విక్రమదేవ వర్మ వారి జయపుర సంస్థానం గురించి రాసిన వ్యాసం (1972)


శ్రీ తూమాటి దొణప్ప గారు - రాజా విక్రమదేవ వర్మ వారి జయపుర సంస్థానం గురించి రాసిన వ్యాసం

1972
రాయలసీమ నాటకకళాసేవ గురించి

రాయలసీమ నాటకకళాసేవ గురించి

భారతీయ వైశ్య రజతోత్సవ పారిశ్రామిక సంచిక (1955) నుండి

మీలో ఒకరికి వీరిలో ఒకరు ఎక్కడో అక్కడ తెలిసే ఉండాలి అని అనుకోలు - Set 1

మీలో ఒకరికి వీరిలో ఒకరు ఎక్కడో అక్కడ తెలిసే ఉండాలి అని అనుకోలు

మీకు కాకపోతే మీ అమ్మానాన్నలకి, మీ బంధువులకి తెలిసే ఉండాలి

తెలిస్తే మీ వాళ్ళతో పంచుకోండి

తెలియకపోయినా పంచుకోండి

ఏమో - ఏ పుట్టలో ఏ సమాచారముందో ఎవరికి ఎరుక 

వీరిలో వ్యాపారులున్నారు

వీరిలో కవులున్నారు

వీరిలో అందరూ ఉన్నారు

ఇది మొదటి సెట్టు మాత్రమే

భారతీయ వైశ్య రజతోత్సవ పారిశ్రామిక సంచిక (1955) నుండి