Wednesday, May 29, 2019

అద్భుతం అనే పదానికి కాస్తే కాస్త దూరంలో ఆగిపోయింది

కేసరి - హిందీ సినిమా నెట్ ఫ్లిక్సులో చూచినాను

అద్భుతం అనే పదానికి కాస్తే కాస్త దూరంలో ఆగిపోయింది

చాలా బాగున్నది

సినిమాలో ఫోటోగ్రఫీ, అక్షయ్, + 20 మంది - సూపరులో సూపరుగా అదిరించేసి నాలోని ప్రేక్షకుణ్ణి సమ్మోహితుడిని చేసినారని చెప్పటం అతిశయోక్తి కాదు

ఆ సినిమాను ఇలా ఒక డూడులులో బంధించినాను

తెలుగు సినిమా ఎప్పటికి ఈ సినిమాలో లేచిన ధూళి స్థాయికి వస్తుందో ఏమో!
80వ లంకె ఇక్కడ

అనగనగా - 80వ లంకె ఇక్కడ

https://www.amazon.com/dp/1070705381

Just fyi post


ఒక అణుబాంబులాటి పోష్టు

సోదరుడు రవి వ్రాసిన ఒక అణుబాంబులాటి పోష్టు

ఈ పోష్టులోని మాటరు కొంతమందికన్నా ఎక్కితే బయటివాళ్ళ వల్లే కాక మన దేశీ చరిత్రకారుల వల్ల మట్టికొట్టుకుపోయిన మన చరిత్ర మడ్డి తొలగి తళతళలు కనపడతవి, శిధిలమైపోయిన ఆలోచనలు మళ్ళీ పునర్జీవిస్తవి

తెలియనివారికి - రవి బ్లాగు ఇక్కడ: - https://indrachaapam.blogspot.com/

May god bless him!


*************

మొన్నామధ్య ఓ చరిత్రకు సంబంధించిన ఓ పోస్టు గురించిన ప్రస్తావనలో సారథి గారు ఓ ప్రశ్న అడిగారు.
అమరావతి స్థూపాన్ని "ఎప్పుడు" కట్టించారు? "ఎవరు" కట్టించారు?
ఆ రోజు సరిగ్గా ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడే ఈ ప్రశ్న రావడం యాదృచ్ఛికం.
మనం ఈ రోజు చరిత్రకు సంబంధించిన ఏ విషయాన్నైనా దాదాపుగా ఈ రకంగానే అనుశీలిస్తున్నాం.
ఎప్పుడు? - When?
AND / OR
ఎవరు? - Who?
విజయనగరసామ్రాజ్యం "ఎప్పుడు" మొదలయ్యింది? అధిపతు"లెవ్వరు"?
కృష్ణదేవరాయలు "ఎప్పుడు" సింహాసనం ఎక్కాడు?
ముఘలు సామ్రాజ్య సంస్థాపకు"డెవ్వడు"?
వగైరా వగైరా. ఈ మధ్యకాలపు విషయాలకు కూడా ఇదే పద్ధతి.
ఒలింపిక్స్ "ఎప్పుడు" మొదలయినాయి?
వరల్డ్ కప్ క్రికెట్ లో "ఎవరెవరు" గెల్చారు?
మనం చదివే పాఠ్యపుస్తకాల్లోనూ - అంతే. పోతన మహాభాగవతం పాఠ్యభాగానికి ముందు - పోతన 13 వ శతాబ్దపు వాడు. పోతన "ఎవ్వడు?" లేదా తిక్కన మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు. ఫలానా శతాబ్దపు వాడు.
చరిత్రకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఇంతే. నిజానికి కృష్ణదేవరాయలు అనగానే క్రీ.శ. 1509 లో పట్టాభిషేకం చేసికొన్నాడు అన్న విషయమే గుర్తొస్తూంది. అలాగే విజయనగరసామ్రాజ్యపతనం అనగానే క్రీ.శ. 1565 లో రాక్షసతంగడి యుద్ధం అని గుర్తొస్తుంది. Always we use "When" and "Who" !
ఎందుకిలా? ఎక్కడి నుంచి వచ్చిందీ "ఎప్పుడు, ఎవరు" అన్న స్పృహ?
మన భారతదేశచరిత్ర ను పాశ్చాత్యులు వ్రాసి తగలేసిన తర్వాత వచ్చిన పరిస్థితి యిది. అంతకు మునుపు మనకు చరిత్ర (ఇతిహాసం) అంటే "ఏమిటి? (What happened?), ఎందుకు? (Why)" అనే ప్రశ్నలు ప్రధానం తప్ప "ఎప్పుడు? ఎవ్వరు?" కాదు.
మన చరిత్రను మనం ఎలా చదివాం? - దీని కంటే ముందు ఈ ఎప్పుడు, ఎవ్వరు? గురించి కొంచెం ఆలోచిద్దాం.
ఎప్పుడు? - ఈ ప్రశ్న రావడానికి కారణమేమిటి?
రాయలు, విజయనగరం, ముఘలు వారు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, గుప్తులు, శాతవాహనులు, మౌర్యులు.........ఇంకా ముందు? ఇంకా చాలా చాలా ముందు?
****
పాశ్చాత్యుల - బైబిలు ప్రకారం క్రీ.పూ. 4000 కు ముందు సృష్టి లేనే లేదు. ఆధునిక భారతదేశ చరిత్ర వ్రాసినవాడు రాయల్ ఏశియాటిక్ సొసైటీ అధ్యక్షుడుగా నియమింపబడిన విలియమ్ జోన్స్. అతడొక కరడుగట్టిన కిరస్తానీ మతస్థుడు. Philosophy is the mother of all sciences. ఆ Philosophy కి మతం మూలం. విలియమ్ జోన్స్ కు తెలిసింది కిరస్తానీ మతం. అందులోని ఆ సృష్టి సిద్ధాంతాన్ని అతడు బలంగా నమ్మేవాడు. అతడే కాదు పాశ్చాత్యులందరూనూ. ప్రభువు చెప్పింతర్వాత ఆ సృష్టి సిద్ధాంతానికి తిరుగు లేదు! నేడు ఆ నమ్మకం సడలి ఉండవచ్చునేమో కానీ తరతరాలుగా వస్తూ వచ్చిన ఆ నమ్మకం తాలూకు పునాదులు, దానిద్వారా ఏర్పడిన ఆలోచనావిధానం అంత త్వరగా మారవు.
మరోవిషయం. పాశ్చాత్యుల దర్శనాల్లో "పునర్జన్మ" అన్నది లేదు. కాబట్టి ప్రస్తుత జన్మ అన్నది ప్రధానం. ఏది సాధించినా "త్వరగా" "ఈ రోజే", "ఇప్పుడే", "ఈ జన్మ లోనే" సాధించాలి. ఎప్పుడు? అన్నది చాలా ముఖ్యం.
భారతదేశపు దర్శనాల్లో పునర్జన్మ ముఖ్యమైనది. అలాగే సృష్టి అన్నది ఓ చక్రం. అది నిరంతరంగా తిరుగుతుంటుంది. కాబట్టి ఈ రోజు ఒకటి కోల్పోయినా ఇబ్బంది లేదు, మరోసారి తెచ్చుకోవచ్చు.
****
భారతదేశం - ఇతర దేశాలు నిద్ర లేవని రోజుల్లోనే గొప్ప సంస్కృతిని, పరిణతిని, ఔన్నత్యాన్ని సాధించింది. ఇది ఏ మాత్రం అవగాహన ఉన్నవానికైనా తెలిసిన విషయం. సహజంగానే విలియం జోన్స్ ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోయాడు. క్రీ.పూ.4000 కు పూర్వం సృష్టే లేకపోతే, సృష్టి జరిగి, ఆటవికదశ నుండి మానవుడు అభివృద్ధి సాధించే సరికి ఎంతకాలం పట్టుతుంది? అంతకు మునుపే భారతదేశం అంత గొప్ప ఔన్నత్యాన్ని సాధించడం కుదరని పని.
పైగా ఒక "బానిసజాతి" కి ఇంత ఔన్నత్యం ఎలా వస్తుంది? వీరె"వ్వరు" అసలు?
దరిమిలా వచ్చిన "కుదింపు" పథకమే "ఆర్యుల దండయాత్ర/తీర్థయాత్ర" సిద్ధాంతం. క్రీ.పూ. 1500 ప్రాంతంలో ఎక్కడి నుండో మధ్య ఏషియా నుండి గొర్రెలు కాచుకునే వాళ్ళు వచ్చి బానిసజాతీయులైన భారతీయులకు సంస్కృతభాష మొదలుకుని అన్నీ నేర్పారు. (పాశ్చాత్య యూనివర్శిటీ ప్రొఫెసర్స్ ఎంత ప్రయత్నించినా కొన్ని ముక్కలు నేర్చుకోలేని సంస్కృతాన్ని, ప్రాచీన పాశ్చాత్య గొర్లకాపర్లు వచ్చి ఇక్కడ వారికి నేర్పించారన్నమాట)
"ఎవరు" నేర్పారు? - ఆర్యులు. వారె"వ్వరు"? - మధ్య ఏషియా, ఐరోపా నుంచి వచ్చినవారు. "ఎప్పుడు" నేర్పారు? - క్రీ.పూ. 1500 నాడు. ఆ తర్వాతే రామాయణ భారతభాగవతాల నుండీ అన్నీ జరిగినాయి.
ఈ లొట్ట సిద్ధాంతానికి ఏ విధంగా కూడా ఋజువులు సరిపోకున్నా, ఎలాగైనా దాన్ని ఋజువు చెయ్యడం కోసం పాశ్చాత్యుల వద్ద నుంచి కోట్లకొలదీ సొమ్ము వెచ్చించబడుతోంది. కారణం - "ఎన్నడు?", "ఎవ్వరు?" అన్నవి పాశ్చాత్యప్రపంచానికి చాలా ముఖ్యం. అది వారికి అస్తిత్వ సమస్య. అది ఋజువు కాకపోతే తాము "అధిపత్య జాతి" కాదని ఒప్పుకునే పరిస్థితి!
నిజానికి "ఎవ్వరు?" అన్న ప్రశ్నయే అహంకారానికి సంబంధించినది. "మేం, తెల్లవాళ్ళం కాక మరెవ్వరు తెలివైన వారు?" అన్న అభిజాత్యం నుండి వచ్చిన ఆలోచన అది.
*****
అలా ఉంటే భారతదేశం లో చరిత్ర నిర్వచనం వేరు. మన కథలన్నీ - "అనగనగా ఒక రోజు..." ఇలా మొదలవుతాయి. "అనగనగా ఓ రోజు", ఆ రోజు ఏ రోజైనా పెద్ద తేడా లేదు. మహాభారతం మనకు ఇతిహాసం. ఈ ఇతిహాసం ఎప్పుడు జరిగింది ఎవరు అన్న ప్రశ్నలు ఒక వేళ ఉన్నా గిన్నా బలీయమైనవి కావు.
మహాభారతం లో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? - ఇవి మనకు అసలైన ప్రశ్నలు.
ఏం జరిగింది? - యుద్ధం.
ఎందుకు జరిగింది? - ధర్మం నశించటం వలన.
దరిమిలా మహాభారతం అన్న చరిత్ర (ఇతిహాసం) యొక్క సారాంశం ఏమంటే - ధర్మం పాటించాలి? ఆ ధర్మస్వరూపాన్ని వివరించటమే మహాభారతం. అందులో భాగంగానే భగవద్గీత ఉంది.
ధర్మాన్ని చరిత్రగా చదువుకోవటం వల్ల, ఆలోచనా విధానంలో ధర్మం పాదుకోవటం వల్ల, సమాజంలో ఈ విచక్షణ ఉండటం వల్ల - సామాజికుల్లో ఎవ్వడో ఒక్క గొప్ప తెలివైన వాడికి ధర్మాధర్మాలకతీతమైన "సత్యం" గురించిన స్పృహ రాకపోదు. ఆ ఫలితమే ఓ బుద్ధుడు, జినుడు, గోరఖ్, కబీర్ మొదలుకుని నేటి రామకృష్ణులు, రమణులు, ఓషోలు, జిడ్డు కృష్ణమూర్తులు.
దీనికి విరుద్ధమైన ఆలోచన "ఎన్నడు?" "ఎవ్వరు?" అన్నది. ఆ తరహా ఆలోచన నిండిన పాశ్చాత్యప్రపంచం నుండి బుద్ధుడి స్థాయి మహనీయుడు ఒక్కడు కూడా పుట్టలేదు!
********
ఆధునిక కాలంలో చరిత్ర/చరిత్ర కు చెందిన ఏ విషయమైనా సరే మనకు తట్టే ప్రశ్నలు "ఎవ్వరు"? "ఎప్పుడు"? - అన్నవే.
ఉదాహరణకు:- రేపో మాపో క్రికెట్ వరల్డ్ కప్ మొదలవబోతా ఉంది. ఆ వరల్డ్ కప్ "చరిత్ర" ఏంది?
"ఎప్పుడెప్పుడు" ఈ కప్ జరిగింది?"
"ఎవరెవరు" గెల్చారు?
ఇవి "సబ్జెక్ట్" కి చెందిన ప్రధానమైన అంశాలు కాబట్టి - వాటికి చెందిన రికార్డులు అనీ ఈ పద్ధతిలోనే అంటే, డేట్లు, వ్యక్తుల పేర్లు, ఇంకా మిగిలిన Facts అన్నె కుప్పలు కుప్పలుగా పేర్చుకోవాలి. ప్రపంచకప్ కు చెందిన రికార్డులు అన్నీ పెట్టుకోవడానికి ఇప్పటికే తడిసి మోపెడంత "డాటా" అయి ఉంటుంది. ఇంకో వందేళ్ళ తర్వాత ఈ డాటా దినదిన ప్రవర్ధమానమై - కొండలు కొండలు అవడం తథ్యం.
జాగ్రత్తగా చూస్తే, ప్రపంచ కప్ కు చెందిన ఈ మొత్తం "చరిత్ర" తాలూకు డాటా అంతానూ "గొప్ప చెత్త" తప్ప వేరే ఏదీ కాదు.
ఆధునిక చరిత్రకు చెందిన ఓ చిన్ని అంశం (వరల్డ్ కప్) లోనే అంత చెత్త పోగుపడి ఉంటే, ఇక దేశదేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇతరత్రా ప్రముఖులు, అణాకాణీ మొదలుకుని నిఖార్సు ఒక్కరూపాయ ప్రముఖులు, హీరోవిన్లు, అక్రమ సంబంధాలు, వీళ్ళందరి కాలాలు, అందరికీ చెందిన ఫాక్ట్స్, గట్రా వగైరా - అంతా కలిపి చరిత్ర పేరుతో జరుగుతూ పోయేది, పోగుపడుతూ పోయేదీ, జ్ఞానం పేరుతో నెత్తిన రుద్దబడేదీ - ఊహించలేనంత చెత్త, చెత్త, చెత్త! ఆ చెత్తను చదువుకునే మన తర్వాత తరాల వారు జీవితంలో చాలా చిన్న వయసులోనే పిచ్చివాళ్ళుగా మారడం తథ్యం. అదే భవిష్యత్తులో జరుగబోయే పరిణామం.
ఓషో ఓ చోట ఈ విషయాన్నే చెప్తాడు - "నేడు చదువు పేరుతో నేర్పిస్తున్న సబ్జెక్ట్ లలో తొంభై శాతం చెత్త! ఈ తొంభై శాతం చెత్తను "చదువు" నుండి తీసేస్తే, మిగిలే పది శాతం చాలా అమూల్యమైనది."
ఓ Fact - బయట ఎంత ప్రాముఖ్యంగా కనిపించినా, దాని విలువ అనంత కాలవాహినిలో కణం కూడా విలువ చెయ్యదు. Fact అన్నది ఓ ఆలోచనావిధానంలో భాగంగా ప్రజల మానసిక, ఆధ్యాత్మిక అవసరాలలో మమేకం కాకపోతే దాని విలువ తాత్కాలికం అవుతుంది. "ఏ రాజు" పరిపాలించాడు? - ఇది Fact. ఏ రాజు తనకు తెలిసిన ధర్మాన్ని "ఏ పద్ధతి"లో స్థాపించినాడు? - ఇది కొంచెం అనుశీలనం చేసి తెలుసుకోవలసిన సత్యానికి చెందిన అంశం!
బహుశా అందుకనే యేమో భారతదేశంలో ప్రముఖులు, మహనీయులు, కవులు, కళాకారులు ఎప్పుడూ కూడా తమకు చెందిన "పేర్లను","వ్యక్తిగత Facts" ను చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. అవి ప్రధానమైనవి కావు. ఏవ్వడు? - ఇది అప్రస్తుతం. ఏం జరిగింది?- ఇదే ప్రస్తుతం.ఎప్పటికైనా.
ఇంకో సందర్భం. హిమాలయాల మధ్య అల్చి అనే బౌద్ధారామం గురించి తెలుసుకునే వివరంలో ఓ సంగతి తెలిసింది. ఈ అల్చి విహారం ప్రస్తుతం దీన స్థితిలో ఉంది. పాశ్చాత్యప్రపంచం ఈ బౌద్ధదేవాలయాలను పునరుద్ధరించడానికి ముందుకు వచ్చి, అక్కడ ఓ "మ్యూజియమ్" ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేసిందట.
దీనిని టిబెటన్ లామాలు, దలైలామా గారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కారణం - అల్చి అన్నది ఓ భగవంతుని మందిరం. అక్కడ నిజంగా భగవంతుడు ఉన్నాడా ఉంటే "ఎవడు?" అన్న ప్రశ్న పిచ్చిది. అల్చిలోని చిత్రాల సౌందర్యం వర్ణించలేనంత గొప్పది, సౌందర్యం అన్నది ఎప్పుడూ పవిత్రమైనది, శుభకరమైనది. సత్యం శివం సుందరం. అక్కడ సౌందర్యం ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువు ఉండి తీరతాడు.
దేవాలయం విశ్వాసానికి, పవిత్రతకు ప్రతీక. అయితే ఒక పాశ్చాత్యుడికి అది "అమ్యూజ్ మెంట్" ని ఇచ్చే "మ్యూజియమ్". పైగా మ్యూజియమ్ వల్ల ప్రభుత్వానికి "ఆదాయం" వస్తుంది.
ఓ దేవాలయాన్ని మ్యూజియం గా, ఓ పత్రాన్ని చూస్తే పత్రహరితపు నిలువగా, ఓ చరిత్రను చూస్తే "ఎప్పుడు" , "ఎవ్వరు" అన్న ప్రశ్నలుగా, అస్సలు ప్రతి విషయాన్ని Fact గా కుదించటం నిజానికి అసహ్యమైన పని. ఇందువలన జీవితపు సౌఖ్యాలకు కొదువ లేని పరిస్థితి ఏర్పడుతుందేమో కానీ సుదూరకాలంలో ఇది మహాప్రమాదకారి.
కంటికి కనిపించే Facts ని ఆలోచనా విధానంగా మార్చేదే నిజమైన విద్య. ప్రయోజనకరమైన విద్య. అలాంటిది కావాలంటే దృక్పథం మారాలి. అని నా భావన.

******

Tuesday, May 28, 2019

అనగనగా కథల సిరీసులో 80వ పుస్తకం!

అయ్యా, అమ్మా

అనగనగా కథల సిరీసులో 80వ పుస్తకం ప్రచురించినాను

24-48 గంటల్లో అమెజానులో లభ్యం

కవరు అటాచించినాను
Telugu Books, Amazons Best Sellers, Childrens Books, Fairy Tales, Folk Tales, అనగనగా, చిన్నపిల్లల పుస్తకాలు, తెలుగు పుస్తకాలు

మహర్షి సీత అల్లాద్దిన్ జాన్ విక్ పోకీమోన్

గత రెండువారాలలో ఎన్నో సినిమాలు చూసినాను

1) పోకీమోన్
2) మహర్షి
3) జాన్ విక్ - చాప్టర్ 3
4) సీత
5) అల్లాద్దిన్
******

పోకీమోన్ - రయన్ రేనాల్డ్స్ కాస్త బతికించినాడు సినిమాను - పోకీమోన్ పికాచు పిచ్చగాళ్ళకు నచ్చవచ్చును. రెండుగంటల పరిధిలో ఉన్నది కనక గ్రాఫిక్సు బావున్నవి కనక చూడవచ్చును అంతకు మించి చెప్పేదేమీ లేదు సినిమాలో

****


మహర్షి - పరమ పనికిమాలిన సినిమా - రెండు స్తార్లు కూడా అనవసరం.....తెలుగు సినిమా వాళ్ళు కాస్త ముదిరారు... కుక్కలకు కుక్కబిస్కెట్టులు విసిరితే అదో సంగతి....జనాలకు కుక్కబిస్కెట్టులు విసురుతున్నారు ఈ సంతంతా కలిసి... సామాజిక సమస్యలు అన్న ముసుగులు విసిరి, ఉన్న నలుగురు హీరోల చేత ఈ సినిమా అబ్బ జబ్బ దబ్బ టైపులో స్టేటుమెంటులు ఇప్పించి తమ తమ అభిమానులందరినీ పిచ్చోళ్ళని చేసి థియేటర్లకు తరిమి బా డబ్బులు చేసుకుంటున్నారు... అంతా దూరదృష్టి... రేపు వచ్చే తమ చెత్త సినిమా కూడా వందకోట్ల పట్టికలోకి చేరాల కదా!

ఆ మహేశ బాబు గారు ఏనాటికి మొహంలో ఎక్స్ప్రెషను తెచ్చుకుంటాడో ఏమో తెలవకుండా ఉన్నది.... ఎప్పుడు చూసినా ఏడుపే పరమావధిగా ఉన్నది ఆయన మొహంలో... అది ఆలోచనాపూరిత మొహం అని భ్రమింపచేస్తున్నారు స్క్రీను మీద! రోబొట్ల మొహాల్లో కూడా కస్త ఎక్స్ప్రెషన్లు చూడవచ్చునేమో కానీ, ఈయన మొహంలో చాలా కష్టంగా ఉన్నది.....ఆ జూనియర్ ఎంటీయారును ఫాలో అవుతున్నాడనుకుంటా..... సూట్లు, గీట్లు, కాప్టర్లు, దుమ్ము, ధూళి ప్రేక్షకుల మీదకు విసిరి ధనలక్ష్మిని ధనాధన్ లాడించుకుంటున్నారు నిర్మాత దర్శకేంద్రులు

ఈ సినిమా వాళ్ళ దరిద్రం పాతాళంలోంచి ఎప్పుడు బయటకు వస్తుందో తెలవకుండా ఉన్నది....

**********


జాన్ విక్

బ్రూటల్ సినిమా స్కేలులో బ్రూటలేంద్ర సినిమా ఇది
అంత దారుణంగా ఇసుమంత లాజికు కూడా లేని సినిమానే అయినా ఎంటర్టైనుమెంటుకు తక్కువ లేదు
చకచకా నడిచి అబ్బా అనిపిస్తుంది


********

సీత

ఆనందభాష్పములు థియేటరులో ఫోని తుఫాను వలె చెలరేగినవి

తెలుగు సినిమా పందుల పెంటకుప్ప స్టేజి దాటి గాడిదల పెంటకుప్ప స్థాయికి చేరి పొర్లాడుతోంది అన్న ఆనందపు అలలలో ఆసరా దొరకక హాలులో ఉన్న మొత్తం అయిదుగురం కొట్టుమిట్టాడినాము

దీనికి ఎనిమిది డాలర్లు పెట్టినందుకు ధనలక్ష్మీ దేవత గారు ఉరేసుకుని చచ్చిపోతానని బెదిరింపులు చేస్తోంది

హతవిధీ

**********

అల్లాద్దిన్

విల్ స్మిత్ విరగదీసినాడు
అమ్మాయి అతి అందమైన అతి సుందరమైన అప్సరసల్లో టాపు
కుర్రోడు సూపరుమేను పోలిక

అద్భుతమైన గ్రాఫిక్స్

బాలీవుడ్ డాన్సర్ల గ్రూపుల తరహాలో డాన్సర్లను పెట్టి డాన్సులేయించినారు

సినిమా రెండుసార్లు చూచినాను

ఎంటరుటెయినుమెంటు అంటే అట్లా ఉండాల

పాత సినిమాను కూడా కొత్త కొత్తగా తీసి మెప్పించవచ్చు అని గై రిచ్చీ నిరూపించినాడు

****

అలా ఈ రెండు వారాలు గడిచినాయ్Thursday, May 23, 2019

అమెజాను వారి Top లిష్టులో

చాలా రోజులయ్యింది - అనగనగా పుస్తకాలు అమెజాను వారి లిష్టులో ఎట్లా ఉన్నవో చూద్దామని వెళ్ళినాను 

ఈరోజు అమెజాను వారి లిష్టులో టాపులో ఉన్న పుస్తకాలు ఈ క్రింద.......

నాలుగు భవదీయుడివి (చూడుడు: ఎర్ర రంగులో చుట్టినవి)

ఊరకే తెలియచేద్దామని ఈ పోష్టు

అంతే!
Wednesday, May 22, 2019

పేజీ పూర్తయ్యింది!

మొత్తంగా 90 కి పైగా టాకీ సినిమాల కథా సారాంశాలు, డైలాగులు, స్క్రిప్టులు, పాటలు, ఇతర వివరాలతో కూడిన పేజీ పూర్తయ్యింది

ఇక వేరే పనుల మీదకు వెళ్లిపోవచ్చు

మీ బ్రవుజరులో కుకీలను, హిష్టరీని డిలీటు చేసి పేజీ రిఫ్రెషు చేస్తే వివరాలు ప్రత్యక్షం

భవదీయుడు
వంశీ

Monday, May 20, 2019

తొలి తెలుగు టాకీ సినిమాలు - పాటల పుస్తకాలు, డైలాగులు, స్క్రిప్టులు...

అయ్యా, అమ్మా

ఫేసుబుకు నుండి అకవుంటు డిలీటు చేసి పూర్తిగా నిష్క్రమించాక - ఈ నెల మొదట్లో మళ్ళీ వెబ్సైటు మీద పనిచెయ్యటం మొదలుపెట్టినాను

అందులో భాగంగా, బంగారంలాటి తొలి తెలుగు టాకీ సినిమాలు (1930 వ దశాబ్దం నుంచి 1950వ దశాబ్దం దాకా), వాటికి సంబంధించిన పాటల పుస్తకాలు, డైలాగులు, స్క్రిప్టులు మొదలైనవి ఇంకా కొన్ని వివరాలు వెబ్సైటుకు ఎక్కించినాను

ఎక్కడ చూడవచ్చు అన్నది మీ ప్రశ్న అయితే - www.maganti.org కు వెళ్ళి ఎడమవైపున ఉన్న టాకీ సినిమాలు అన్న లంకె మీద నొక్కండి.

వివరాలు ప్రత్యక్షం

గమనిక:- ప్రస్తుతానికి ఈ పుటలో వేసిన 50+ సినిమాలు కాక చేతిలో ఇంకా 45 సినిమాల వివరాలు ఉన్నవి.. అవి వచ్చే వారాల్లో అప్ డేట్ (Update) చేయబడతవి

మీ వద్ద కూడా ఇలాటివి ఏవన్నా ఉంటే నాతో పంచుకోవచ్చును - ముందస్తు ధన్యవాదాలతో

భవదీయుడు
వంశీ

Sunday, May 19, 2019

227 పేజీలు, 21 అనగనగా కథలు

అయ్యా, అమ్మా

అనగనగా కథల సిరీసులో 78వ పుస్తకం ఈ రాత్రి ప్రచురించినాను

ఇది మొత్తంగా నా 108వ పుస్తకం

227 పేజీలు, 21 కథలు

24-48 గంటల్లో అమెజానులో లభ్యం

కవరు ఇక్కడ అటాచించినాను

ఊరకే తెలియచేద్దామని ఈ పోష్టు అంతే!

ధన్యవాదాలు
వంశీ
Thursday, May 16, 2019

Volume 77 - లంకె ఇక్కడ

లంకె ఇక్కడ

Once Upon A Time- Volume 77 - now available on Amazon

https://www.amazon.com/dp/1098937961

Regards
V


Wednesday, May 15, 2019

254 పేజీలు, 20 కథలు

అయ్యా, అమ్మా

అనగనగా కథల సిరీసులో 77వ పుస్తకం ప్రచురించినాను

ఇది మొత్తంగా నా 107వ పుస్తకం

254 పేజీలు, 20 కథలు

24-48 గంటల్లో అమెజానులో లభ్యం

కవరు ఇక్కడ అటాచించినాను

ఊరకే తెలియచేద్దామని ఈ పోష్టు అంతే!

ధన్యవాదాలు
వంశీ
Sunday, May 12, 2019

76వ పుస్తకం - దయ్యపు కథలు

అయ్యా, అమ్మా

అనగనగా కథల సిరీసులో 76వ పుస్తకం ప్రచురించినాను

24-48 గంటల్లో అమెజానులో లభ్యం

కవరు అటాచించినాను
మీ Guess కరెక్టే - ఈ పుస్తకంలో దయ్యపు కథలు ఉన్నవి 
  
ఊరకే తెలియచేద్దామని ఈ పోష్టు అంతే!

ధన్యవాదాలు
వంశీ

Friday, May 10, 2019

వైష్ణవి రాసిన "హారర్" కథాపుస్తకం

అమెజానులో లభ్యమవుతున్న, వైష్ణవి రాసిన "హారర్" కథాపుస్తకం The Mystery Of Cranborne Mansion  ఈరోజున ఎవరో టోకుగా 16 పుస్తక ప్రతులు కొన్నారు.... అది మీలో ఎవరన్నా అయి ఉంటే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.... ఆ పుస్తకమ్మీది లాభం Charity డబ్బాకు జతచేయబడుతుంది కనక మీకూ ఆ దానపు పుణ్యంలో లాభం కలిగింది.... కృతజ్ఞతలు

తెలియనివారికి, కొత్తవారికి - ఆ పుస్తకం లంకె ఇక్కడ, అమెజానులో ఉన్న తన రచయిత్రి (author) పేజీలో ఉన్నది

https://www.amazon.com/Vaishnavi-Maganti/e/B07MJHW5YV/ref=dp_byline_cont_book_1

ఒకనాడు సహరచయితగా నాతో పాటు అనగనగా కథల పుస్తకం "వాల్యూం 65" లో తన వంతు అనగనగా కథలు అందించింది - ఆ తర్వాత తనంత తానే ఈ సంవత్సరం జనవరిలో రాసిన పుస్తకమే -  పైన చెప్పిన హారర్ కథాపుస్తకం.Thursday, May 9, 2019

లంకె ఇక్కడ

అనగనగా కథల సిరీసులో 75వ పుస్తకం అమెజానులో లభ్యం

లంకె ఇక్కడ

https://www.amazon.com/dp/1097499197


ఊరకే తెలియచేద్దామని ఈ పోష్టు అంతే!

ధన్యవాదాలు
వంశీ

Wednesday, May 8, 2019

అనగనగా కథల సిరీసులో 75వ పుస్తకం అచ్చు అయినది!

అయ్యా, అమ్మా

అనగనగా కథల సిరీసులో 75వ పుస్తకం అచ్చు అయినది.

రేపు అమెజానుయందు లభ్యం.

ఇది నా 105వ పుస్తకం.

400 పేజీలు కల ఈ Special పుస్తకంలో 35 కథలు అచ్చు వేసినాను.

కొనుక్కోవాలనుకున్నవారు - రేపు అమెజానులో నా పేరు మీద ఉన్న రచయిత (Author) పేజిలో - కొనుక్కొనవచ్చును.

వైష్ణవి డిజైను చేసిన పుస్తకపు కవరు పేజీ ఇక్కడ

Tuesday, May 7, 2019

వాల్యూం 73

వాల్యూం 73 అమెజానులో లభ్యం

ఈసారి కాస్త త్వరగానే ఆమోదించినారు అమెజాను వారు

లంకె ఇక్కడ

https://www.amazon.com/dp/1097236145

కొనుక్కోవాలనుకున్నవారు కొనుక్కుంటారని తెలియచెయ్యటం

73వ దానితో పాటుగా పబ్లిషు చేసిన వాల్యూం 74 - అమెజాను వారు ఆమోదించిన తరువాత ఇక్కడే బ్లాగులో లంకె ఇవ్వబడుతుంది

గమనిక: అమెజాను వారు తెలుగు పుస్తకాలు తీసుకోవట్లేదు కనక అచ్చు వేసిన 83 తెలుగు పుస్తకాల తరువాతవి అన్నీ ఇంగ్లీషులోనే అచ్చు వేయబడి ఉన్నవి ...... కవరు పేజీ మీద తెలుగక్షరం లేకపోతే అది ఇంగ్లీషు పుస్తకమనీ, తెలుగు అక్షరం కనపడితే అది తెలుగులో ఉన్న పుస్తకమని లెక్క

అన్ని పుస్తకాలు చూడాలనుకుంటే - ఇక్కడే ఆ పక్కన సైడుబారులో ఉన్న "అనగనగా కథలు" అన్న లంకె మీద నొక్కండివాల్యూం 74 కవరు పేజీ ఇదిగో ఇక్కడ 


Monday, May 6, 2019

అయ్యా, అమ్మా- రెండు ముఖ్య విషయాలు

అయ్యా, అమ్మా

రెండు ముఖ్య విషయాలు

మొదటి విషయం:

దాదాపు రెండు నెలల విరామం తరువాత, మరల పుస్తక యజ్ఞం మొదలయ్యింది

అనగనగా కథలు - వాల్యూములు 73, 74 నిన్న రాత్రి అమెజానులో పబ్లిషు చేయబడ్డవి

ఇవి నేను రాసి ప్రచురించిన 103వ, 104వ పుస్తకాలు

వచ్చే 24-48 గంటల్లో అందుబాటులోకి వస్తవి

కొనుక్కోవాలనుకున్నవారు కొనుక్కుంటారని తెలియచెయ్యటం

రెండవ విషయం:

క్రితం వారం నా ఫేసుబుకు అకవుంటు డిలీటు చేసివేసినాను (డీ-ఆక్టివేషను కాదు - ఏకంగా డిలీటే!)

మరల ఫేసుబుకు దర్శనం 200 పుస్తకాలు అచ్చు అయిన తరువాతనే!

అప్పటిదాకా ఈ బ్లాగులోనూ, అమెజానులోనూ కలుస్తూ ఉందాం

అందాకా, ఆ తరువాత, ఎప్పటికీ - ఆ భగవంతుడి కృప అందరి మీద, ఈ సకల ప్రపంచమ్మీద ప్రసరిస్తూనే ఉండాలని కోరుకుంటూ

ఓం తత్సత్!