Saturday, December 28, 2019

రజనీకాంత రావు - మూలస్తంభాలు - నృత్య సంగీత నాటిక

రజనీకాంత రావు - మూలస్తంభాలు - నృత్య సంగీత నాటిక

1960 / 1970

ఎక్కడ?

ఇక్కడ

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu1.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu2.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu3.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu4.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu5.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu6.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu7.pdf

http://www.maganti.org/pressarch/rajanikAntarAv/rajani_mUlastambhAlu8.pdf


13 యేళ్ళ వయసులో బాపు గీసిన బొమ్మలు

13యేళ్ళ వయసులో బాపు గీసిన బొమ్మలు

From 1946ఛందస్సునుంచి ఛందస్సు పుట్టటం

దర్భా యజ్ఞేశ్వర సోమయాజులు గారు 1941లో వ్రాసిన షట్ప్రత్యయ వివేకం అనే వ్యాసంలోంచి "ఛందస్సునుంచి ఛందస్సు పుట్టటం" అనే భాగం
Monday, October 14, 2019

ఉన్నవాటిల్లో కాస్తంత మంచి బొమ్మ

ఉన్నవాటిల్లో కాస్తంత మంచి బొమ్మ

జై సర్వేపల్లి
యంత్రాల తంత్రాలు - 1916లో ప్రచురితమైన ఒకానొక పత్రిక నుండియంత్రాల తంత్రాలు

1916లో ప్రచురితమైన ఒకానొక పత్రిక నుండి

ఔరా అనిపించలేని సైరా! - Sye Raa movie Review!

Here is a SOFT review version of SYE RAA movie for real movie lovers!

I do not want to spend my verbiage, particularly my telugu verbiage on this - so the SOFT version!

Anyways - here you go!

No need to watch the first half.

Just walk in to the movie after interval and you will be fine and you will thank this suggestion.

And...um...another suggestion is that, if its still in your town, wait until the last day and you might be lucky that tickets will be available for 5 dollars and 75 cents - which is what I paid.

Just FYI - first 3 days tickets were 25 dollars per person! Jesus christ!

They wanted to grab all they can in the first couple days! Or they already knew, if they wait, they would be losing every single penny!

But for me, waiting until the last day was worth it!

Otherwise it would have been a TV or Youtube watch only and seriously it was worth free youtube only!

It was ok to lose 2 dollars 25 cents at the theater as the rest was paid back in patchy entertainment.

Can't believe the main character actor utters "tella lam...ko…" at the end and its beeped out.

I thought when gaddalakonda ganesh uttered 'maadar...od" in the gaddalakonda ganesh movie, OMG, now this will be the trend in coming days and lo behold, it was here in this Sye Raa movie too!

Man!

Interesting that this trendy time - it's from the actor from same family

Sai Madhav Burra's dialogues are just pale.

He was very sharp in Gautami Putra Satakarni , how ever here he is very predictable with the dialogues.

Music was utter disaster

It was like how could you go wrong with Copy Paste ?

And this movie is a classic example of copy paste wrongs!

Ratnavelu was ok

No where near Bahubali's cinematographer Senthil or Bengal Tiger's cinematographer Soundar Rajan

Tamannaah was just ok too. The only moment she was exceptional was in the last dance shots. And then she gives up her life jumping into the bombs laden pontoons. Meh!

The lead actor's costumes and in some instances the hair do's were cool, that is all can be said about that hero

Oh btw, that hair-do is a copy of Prabhaas

No dialogue delivery

No goosebumpy action

NOTHING!

Jagapati Babu was meh all along except in the scene where he realizes his betrayal

Kicca Sudeep was cool

Tamil Paandi babu was cool too

Every one else - just meh!

And that includes Nayan Tara and the shahensha Amitabh Bacchan

And what is up with that beards?

Horrible make up job

If any one in the movie industry needs to see how beards are done, see bheeshma or watch some of gummaDi venkaTEswara rao movies

Geez - Anushka was as terrible in this movie as she was in rudramadEvi

She should stick to arundhati role or dEvasEna role - where its subdued arrogance

Full fledged - she cannot handle!

And her dubbing is so overly irritating, atleast in this movie!

And to top it off CGI was simply terrible, but the in-house movie men portrayed it as overly terrific

If 350 crores (which is roughly 50 million dollars) fetches this kind of terrible CGI, why even spend a dime?

Go back to the roots!

Just like in the 90's Siva ruined the movie going experience under the disguise of trendsetters, the future of telugu movies is full of ammaala booths and what not! That is for sure a visual you can already see and experience. Brace yourselves.

May god bless us all.

To finish this post, I will say this - The only good thing this movie did was to let the people, telugu people know that there was a hero among us, centuries ago! That is all.

తెలుగులో చెప్పాలంటే "ఔరా అనిపించలేని సైరా"

వార్తాపత్రికల్లో వార్తలు చదువుతుంటే కనపడ్డ సంగతులు చూసి మా ఊళ్ళో వారు అనుకుంటున్న రెండు మాటలు ఇక్కడ చెప్పి ముగించేస్తా!

1)"పెట్టిన డబ్బులు పోగొట్టుకుంటామేమో అని అందరి దగ్గరకు - ముఖ్యంగా - ము.మంత్రుల్, గవర్నర్ల వద్దకు పోయి మాది చూడండి మాది చూడండి అని బతిమిలాడుకుంటున్నారనుకుంటా"

2) "ఈ సినిమా "నంది అవార్డు" కొనుక్కోటం ఖాయం"

అచ్చంగా మాటకు మాటగా ఇదే అనుకుంటున్నారు మా ఊళ్ళో!

ఏమో నిజమే అవ్వొచ్చు!

ఇంకో విషయమేమంటే సినిమా చూసాక రివ్యూ రాద్దాం అనుకుంటే - టికెట్లు కొన్న Fandango సైటులో రివ్యూలు డిసేబుల్ చేసినారు....అది కూడా కొనేశారనుకుంటా! 

నిజజీవితపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పైలోకంలో ఎక్కడున్నాడో మహానుభావుడు - ఆయన జీవితాన్ని ఇంతకంటే గొప్పగా చూపించలేని మా సినిమా వాళ్ళ నైపుణ్యానికి బాధపడుతూ

ఓం తత్ సత్!

Sunday, October 13, 2019

సీతాఫలం - ఈ పేరు వినగానే, మన కపాలంలోని జ్ఞాపకబ్రహ్మం!

సీతాఫలం - ఈ పేరు వినగానే, మన కపాలంలోని జ్ఞాపకబ్రహ్మం - ఆ సీతాఫలం లోపల గుజ్జులో దాక్కునే నల్లని గింజల్లా, ఎక్కడో మన మెడకాయ మీద ఉన్న తలకాయ లోపలి గుజ్జులో దాక్కున్న గుర్తులని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది...నిన్న సాయంత్రం అల్లా కొన్ని గింజలు మన గుజ్జులోంచి బయటకొచ్చినై...అదీ క్లుప్తంగా ఈ టపాకి కథాను, కమామీషునూ...

ఇక్కడో మాట చెప్పాలె - మనబోటి సామాన్యుడి గుజ్జులో గింజల అందానికే మైమరచిపోయి - మనకు మనం చప్పటి అట్లు (అనగా చప్పట్లు అన్నమాట) వేసుకోటమే కాకుండా, చుట్టూ చేరిన భజన బృందానికి పంచటంతో - మొహమాటానికో, నిజంగానేనో ఆ చప్పటి అట్ల రుచి తగలగానే "ఆహా!, ఓహో!" అనిపించి వారిచేత కూడా భజనసేతుమురా లింగా అని చప్పట్ల భజన చేయిస్తే - మహా మహా పండితులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి "సీతాఫలం" జ్ఞాపకాలు ఎంతమందితో, ఎన్ని, ఎంతటి పనులు చేయించాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఈ టపా చివర - వారి స్వంత మాటల్లోనే చదువుకోవచ్చు......

ఇహ సీతాఫలానికొస్తే, శీతాకాలంలో విరివిగా లభించే కాయ/ఫలం కాబట్టి , దానికి ఒకప్పుడు తెలుగుదేశాన నివసించిన నియాండెర్తల్స్ చేసిన నామకరణమని మా మావయ్య ఉవాచ, ఘాట్టి నమ్మకమూనూ....అది కాదనే దమ్మూ, ఆయనతో వాదించే ఓపికా మా కుటుంబంలోని అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల జనాభాలో ఎవరికీ లేవు కాబట్టి అది కరకట్టే అయ్యుంటుందని భవదీయుడి అభిప్రాయం....

గొగ్గులు గొగ్గులుగానైనా ఒక అందమైన వరుసలో ఉండే ఈ గొగ్గు ఫలాల్లో గుజ్జు తీసుకు తినడానికి బోలెడు సమయం పడుతుందని మా ఇంటో చాలా మంది తినేవారు కాదు....మనమేమో ఎడ్డెమనగా తెడ్డెపు బుద్ధి కలవాడవటంతో, వాళ్ళు తినలేదు, తినలేరు కాబట్టి సత్తా చూపించటానికైనా , అరుగు మీద కూర్చుని కాళ్ళూపుకుంటూ మా రోడ్డెంబడి పొయ్యే వారిని చూస్తూ అమ్మ చూడకుండా ఓ అరడజను ఫలాలూ, అందులో ఉన్న గుజ్జు ఉప్ఫున ఊది పారేసి, గింజలేమో తుపుక్కుని ఊసి పారేసి ఆనందభరితుడను కావటం ఒక జ్ఞాపకం.

ఇంటో ఎవరూ తినకపోతే మీ ఇంటో అన్ని సీతాఫలాలెక్కడినుంచొచ్చినై అని అడుగుతున్నావా?

ఛా - చాలా జ్ఞానం ఉన్నది తవఁరికి ...అంతా సీతాఫలం మహత్యమేనా సుబ్బారావూ? 

అది సరే కానీ - మిగతాది చెప్పనీ - అయితే ఆనందం సాయత్రానికల్లా ఆవిరై పోయింది. చెంబు పుచ్చుకోవటం, చెరువు గట్టుకు పోవటం. సింహాసనం అధిష్టించటం. చెంబులు చెంబులు ఖాళీ చేసి నేల కరుచుకుపోవటం. ఇహ చెంబులెత్తలేని పరిస్థితొచ్చాకా, ఆ దేవదేవుడిని ప్రార్థించుకొని కష్టపడి ఓపిక తెచ్చుకుని ఇంటికి పోవటం, అరుగు కింద పడేసిన గింజలన్నీ అప్పుడే చూసిన అమ్మ చేతిలో చావు దెబ్బలు తినటం, తర్వాతి రోజు పొద్దునకు జలుబు చెయ్యటం, ఆ సాయంత్రానికి జ్వరం రావటం, కాంపౌండరు "మార్తి" వారి వద్దకు పోవటం, ఆయనతో తిట్లు తిట్టించుకుని క్రోసిన్ మందు తెచ్చుకుని వేసుకోటం - ఇల్లా బోలెడు గింజలండి....ఎన్ని చెప్పను......

అయితే సీతాఫలం తినటంలో ఉన్న ఆనందం ఏమని చెప్పేది....అది తినటం కూడా ఒక కళ.....చక్కగా మగ్గిన ఫలాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని, కింద తొడిమ భాగం వద్ద గట్టిగా పట్టుకొని కుడి చేయి మధ్య వేలుని అటువైపు, బొటన వేలుని ఇటువైపు - సరిగ్గా ఫల మధ్యానికి వచ్చేట్టు సరిచూసుకుని నెమ్మళంగా, నిమ్మళంగా ఒక రెండు నొక్కులు నొక్కగానే - ఫలం కొద్దిగా విచ్చుతుంది. అప్పుడు ఆ విచ్చుడు దారెంబడే కొద్దిగా గట్టిగా నొక్కితే అటు సగం ఇటు సగం చక్కగా చేతిలోకొస్తాయి....అప్పుడు ఎడమ చేతిలో ఉన్న సగభాగం కింద వైపు, అనగా గొగ్గుల వైపు పట్టుకుని నోటి వద్దకు తీసుకొచ్చి, పైనున్న కొద్దిపాటి తెల్లని గుజ్జుని నాకి, చప్పరించాలి.

అలా చప్పరించగానే రుచి నచ్చేస్తే ఎట్లా? ఒక అరనిముషం ఆ గుజ్జుని చప్పరిస్తూ నోరు లోపలంతా పుక్కిలించినట్టు నాలికతో తిప్పితే స్వర్గం బెత్తెడు దూరంలో కనపడుతుందన్నమాట. ఆ బెత్తెడు దూరం పాకటానికి మీరు రెండు చేతుల్లోని సగభాగాల్లోని గుజ్జు నాకాలి...అప్పుడు మీకు జయ విజయులు కనపడతారు.... వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తిస్తుంది....అంటే పోతారని కాదు కానీ, స్వప్నంలాటి , అంతటి నిజాన్ని మీరు ఆస్వాదించవచ్చు.....

సరే వైకుంఠాన్ని పక్కబెడితే, ఎడమ చేతిలో ఉన్న భాగం గుజ్జు కొద్దిగా నాకారుగా? ఇప్పుడు ఎడమ చెయ్యి వేళ్ళనన్నిటినీ ఆ భాగం చుట్టు కమ్మేసి, నోటి దగ్గర పెట్టేసి, నెమ్మదిగా కముకు దెబ్బలేసినట్టు నొక్కితే గుజ్జు మొత్తం లోపలికొచ్చేస్తుంది.....ఆ గుజ్జానందంలో పడిపోయి గింజలు ఉయ్యటం మర్చిపోయేరు....ఒహ వేళ మర్చిపోయారనుకోండి, నిజమైన వైకుంఠ దర్శనం ప్రాప్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండేం? అల్లాగే కుడి చేతిలో భాగాన్ని కూడా నాకెయ్యండి....స్వర్గలోక స్వప్న ప్రాప్తిని పొందండి...ఆనందో బ్రహ్మ....

అయితే రోజుకు ఒకటి మాత్రమే తినండి నాయనలారా! చెప్పలేదని ఆ తర్వాత నన్ను మొత్తొద్దు....ఏం?

ఒకవేళ పండిన ఫలం దొరకలేదనుకోండి...చక్కగా పచ్చి కాయలను తెచ్చుకొని ఇంట్లో ఒక మూలగా వెడల్పుగా పోసి వాటి మీద సీతాఫలాల ఆకులు వేస్తే మూడు రోజుల్లో చక్కగా పండుతాయి...ఆగలేమురా నాయనా అనుకుంటే చక్కగా నిప్పుల మీద వేసి కాల్చుకుని కూడా తినెయ్యొచ్చు...బ్రహ్మండంగా ఉంటుంది ఆ రుచి కూడా....

దిక్కుమాలిన గాస్ స్టవ్వుల మీద రుచేం రుచి కానీ, చక్కగా కుంపట్లో ఏస్కుని తినండేం? అల్లా కాల్చుకోలేం నాయనా, మాకు కుంపట్లెక్కడ దొరుకుతై అంతారా? బియ్యం బస్తాలుంటాయిగా అందులో వేసి పెట్టండి....మర్చిపోండి....నాలుగు రోజులయ్యాక బయటకు తియ్యండి...మీ స్వర్గ ఫలం రెఢీ....

సరే...నా జ్ఞాపకాల గింజల గోల ఆపేసి టపా అసలు కథలోకొస్తే - "చిన్ననాటి చేష్టలు - సీతాఫలము" అన్న వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచన ఒకటి ....ఇది 1983/84 మణిమంజరి పత్రికలో ప్రచురితం......

భాష మీద పట్టు ఉన్నవారు "పదాలను" బచ్చాలాట/చెడుగుడు వగైరా వగైరా ఎలా ఆడతారో , అలాగ్గా అనగా సుళువుగా - మనబోటి సామాన్యులకు చూపించే సీతాఫల జ్ఞాపకం ఇది.....ఇందులోని ఇంకో విశేషమేమంటే ఆ చిన్నపిల్లల్లోని అమాయకత్వం, ఆలోచనా పద్ధతి, ఉక్రోషం, ఆనందం, ఉత్సుకత, స్వచ్ఛత - అంతే స్వచ్ఛంగా, నిర్మలంగా, నిమ్మళంగా, అచ్చంగా, ఉన్నది ఉన్నట్టుగా, పొందికగా - పెద్దయ్యాక వ్రాయగలగటం ఒక వరం, కటాక్షం....అందరికీ లభించేది కాదది....

ఆ మహా పండితుడికి, అపర సరస్వతీపుత్రుడికి, మహానుభావుడికి సాష్టాంగ నమస్కారాలతో!

ఇహ చదువుకోండి....చిన్ననాటి చేష్టలు - సీతాఫలము

---- శ్రీ వేటురి ప్రభాకర శాస్త్రి

దమ్మిడీ కొకటి సీతాఫలము పండు
తమ్ములన్నల మేము తలకొక్కపండు
అమ్మ సమ్మతి గొంటి మారగించితిమి
"అమ్మ! నా కడఁగదే అతీపివాపి !!"

దమ్మిడీ చాలునే అమ్ముతున్నారే
మాయమ్మ కొనిపెట్ట మరియొక్కపండు
అమ్మగా అమ్మగా అయిపోవునేమో
అమ్మగా! అమ్మగా! ఆలసింపకువే

సీతాఫలము చాల శీతళిస్తుంది
జలుబు చేస్తుందిరా జ్వరము వస్తుంది
కొనను పొమ్మని అమ్మ కూకలేసింది
కొనలేదు మఱినాదు కొద తీరలేదు

చేత దమ్మిడి లేదు చేయునది లేదు
ఆతీపిపై వాపి అడచుకోలేను
ఆపండ్లగింజలే ఆటలాడుటకు
రెండు జేబులలోని నిండించుకొంటి
 
గింజలే, గింజలే, గుంజు లేనేలేదు
ఎందు కీగింజలని యేవ తోచునుగొంత
అంతలో నాఫలము నతిమధురిమము తోచు
పారవైచుట యెట్టు? లారగించుట యెట్టు?

 పప్పు తీపేమొ యని పగులగొట్టితిఁ గాని
అది బాద మక్రోటు ఆలుబకరా కాదు
కసుకుమని కొఱికితిని, తుసుకుమనియుమిసితిని
యాక్కులాలా! నోరువోక్కురోక్రై చెడెను


విసిరికొట్టితి గింజలన్నీ
కసరుకొంటిని వాటిఁమీదను
ఒక్కగింజే చేత మిగిలిన
దూహ గొల్పినదీ

నాటి సీతాఫలపు చవు లవి
యూటలూరెను నోటిలోపల
ఏవగింపును గోప ముడిగె నీ
కేమొ తల పొదవెన్

చూచితిని యోచించిచూచితిని మరిమరీ
సీతాఫలపుగింజ చేతఁబట్టుకొనీ
ఒక్కత్రుటిలో గింజ వ్రక్కలై యందులో
మొక్క వెల్వడినట్లు బుర్ధి పొడమినది

మొక్కయది పెద్దదై పెక్కుపూవులుపూచి
పిందెలై కాయలై ప్రిదిలి పండ్లైనట్లు
అవి నేను తినగలిగినన్నితిన్నట్లు మా
యమ్మకును "ఇంద" మనియాసగొల్పినయట్లు

అప్పుడే ఆగింజ జేకొని
యాస లెల్ల ఫలించినట్లై
పాటిదొడ్లో పాతిపెట్టితి
భద్రమగుచోటన్

ముఖము గడిగిన, కాళ్ళు గడిగిన
పుక్కిలించిన, మంచినీళ్లవి
పాదులోనే, నాకు పాదది
ప్రాణపదమాయెన్

నిక్కముగనే మొక్కమొలచెను
నేను నొక జనకుండ నయితిని
బిడ్డవలె నాచిన్న మొక్కను
బెంచదొదగితిని

పాదుచేయుట యెరువువేయుట
పదనుగొల్పుట నీళ్ళుపోయుట
పెరుగసాగిన మొక్కజూచుచు
మురిసిపోవుటయున్

గడచినవి రెండేడ్లుగాబోలు, నేపాతి
మొలపించినది మొక్క పూతపూచినది, నా
కిల్లంత గంతులే, గల్లంతులే, బలే
అల్లకల్లోలమే అది పండ్లుపండెనని

పూవులెన్నో రాలిపోయినవి, నాకెన్నొ
గడబిడల్ మనసులో, పొడమదాపిందెయని
ఎట్టకేలకు నొక్కచిట్టిపిం దగ పడెను
తియ నీరు నే బోసి దినదినము పోషింప

మేకెరువు తియనీరు మేపితిని చెట్టునకు
ప్రాకుతీగల ద్రెంచి పాఱవైచితి, మన్ను
క్రుళ్ళగించితి, చెట్టువ్రేళ్ళు తెగకుండగా
ఆపిందె క్రమముగా నేపునబెరిగినది


ఆనాడు నేదిన్న యాదమ్మిడీపండు
నురువుకంటెను బెద్దపెరిగినది యాకాయ
పచ్చికాయో పండొ ప్రతిదినము పరికింతు
పండిదిగొ తిందునని దండోరవేయుదును

మాయమ్మ చూచె, నది "నాయనా నీచేతి
చలువ సీతాఫలము ఫలియించినదిగాని
కోయకుమి యిప్పుడదికాయ కసుగాయసుమి
పక్వ మగునందాక బాగుగా బెరుగనీ

పెరిగి గింజలగళ్ళు విరిసి లో పిక్కటిలి
పండబాఱినతఱిని బ్రద్దలగు నప్పుడది
యొకనాడుమెత్తబడుటకు దాచియుంచియా
మర్నాడు తింటేను మహరుచిగ వుంటుంది

చెప్పకుండా కాయ చెట్నుంచి కోసేవు
కాయయును నీయాస కడకు వ్యర్థములవును
ఆరముగ్గినపండు అతిరుచ్యముగ నుండు
నన్నదమ్ములు మీరె యారగింతురు గాని"

అమ్మమాటలు నమ్మి యాగితిని గొన్నాళ్ళు
కాయకాయే పగులు కానరాకే పోయే
నే నాగలేనైతి నెరపితిని సాహసము
కత్తితో నొకగంటు గావించితిని దాన

అమ్మతో జెప్పితిని అది పగులు వాసెనని
నామాట తథ్యమని నమ్మినది మాయమ్మ
పగిలితే కోసుకో, పండేనేమో యనెను
కోసుకొనివచ్చితిని కొయ్యవంటిది కాయ
 
కసరుగాయే, కత్తిగంటే, పగులలేదు
ఇదియేమిరా తండ్రి యిట్లు చేసితివనెను
పనికిమాలినకాయ పారవేసెద ననెను
నాకాయ తెమ్మంటి చీకొట్టి తఱమినది

నాకెరుకపడకుండ నాకాయ దాచినది
దాని దెలియగ గోరి తంటాలు పడ్డాను
వెదకితిని వెదకితిని తుదకి గనుగొంటి నది
తవుటిలోపల గ్రుక్కి తట్టలో దాచినది

ఔపడిన దమ్మ నీ దాపరికమన్నాను
ఎంతయావర నీకు ఎట్లు కనుగొన్నావు?
ఉక్క కది మెత్తబడునో యేమొ రెన్నాళ్ళు
తెరచిచూడకురోరి తెలివిమాలినవాడ!

అనియెమాయమ్మనాయాత్ర మెరుగదుగదా
దమ్మిడీ కానాడు తాను గొనియియదాయె
నా చెట్టుకాయనే నన్ను తిననియదాయె
తలిదండ్రులు పెద్దతంటాలు పిల్లలకు

మర్నాడు చూచితిని మరి మెత్తబడలేదు
మఱియొక్కపుటాగి తెరచి చూచితి నంతె
మరికొంతసేపాగి తెరచిచూచితి నంతె
ఎంతయాగిన నంతె యేమిసేయగవచ్చు
 
అందులో నొకచెక్క తిందునని కోసితిని
వట్టివగ, రందు రవ్వంతైన రుచిలేదు
పారవైచితిని గోపారుణాక్షుండనై
ఆరజూచిన దమ్మ నారోతచేత యది

 పండునేమో కాయ పాడుచేసితివిరా
ఇంత తొందరయైన నెట్లురా నీబ్రదుకు
ఎబ్బెబ్బె నీవెంత యేబ్రాసివైతివిర
ఏడ్వవలసినదె నీ వింకేమి చేసెదవు

అని యసహ్యించుకొనె నను గసరుకొని రోసె
అవమాన మయ్యె నా కావురని యేడ్చితిని
నాసొమ్ము నే పాడుచేసుకొన్నా నన్న
గర్వమొక్కటి నాకు దుర్వారమై పొడమె


అవమాన మొకప్రక్క నాగర్వమొక ప్రక్క
పండుచెడెనన్న దుర్భర దుఃఖమొక ప్రక్క
ముప్పేటలై నన్ను ముప్పు త్రిప్పుల బెట్టె
రోతరోతపోయె నాతీరు నాకపుడు


ఆనాడు మానాన్న యఖిలంబు విన్నాడు
అనుచితము చేసితివి, పనికి మాలినవాడ
అనునంతలో నేను గసలుచును బలికితిని
నాచెట్టు నాకాయ నాయిష్టమేకదా

నష్టపడితిని పండు నాకె నష్టముదీన
నెవరిక్ కేమీ యంచు నవకతవకలు పలుక
నౌనోయి యవివేకి! యాచెట్టు నీ చెట్టె
నాస్థలములో నాటినాడవది యెఱుగుమా

నీవు నాబిడ్డడవు గావునన్ నావాడ
వే, యింతకును నెవ్వడేని యెదియేని యిది
నాది యని చెప్పుకోగా దగుట కద్దాని
జక్కరక్షింపదగు సామర్థ్యముండవలె
 
అది లేనివా డెవడు నిది నాది యనఁదగడు
అని యిట్లు మానాన్న మనసునొవ్వనియట్లు
మందలించెను నన్ను మందమందమ్ముగా
సిగ్గునం జిదికితిని సీతాఫలమువలన

చదువుచే తప్పిదము సవరించుకొందునని
పాఠములు రాత్రిదీపముముందు తెఱచితిని
తెనుగుపద్యములలో మొనగాడ నగుటచే
వేమన్న పద్య మది వేమారు చదివితిని


తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనె
విశ్వదాభిరామ   వినురవేమ

ఏమిరా చదివెదవు వేమన్న పద్యమా
వ్యర్థమే నీ చదువనర్ధమే చేసితివి
తెలివిగలవాడవైతే యిట్లు చేతువా
యనుచు మానాన్న పద్యార్ధము వివరించె

ఈపద్యమున నాకు లోప మొక్కటి తోచె
నాన్న! అది యడుగదగునా? అంటి, నడుగుమనె
వేగిరించిన నదియు విష మగు ననుదాని
కా పచ్చికాయ-ఫలమౌనె యను కథ చెల్లె

తామసంబున చేయదగదు కార్యం బనుట
కేదికథ? పద్యమున లేదేమి? లోపమిది
నాబుద్ధి దిద్దుటకె కాబోలు నీనాడు
పాఠమున వచ్చినది పద్యమిది యంటి

సీతాఫలము నీవు చెరచినా వనునేవ
తొలగె నీకీ ప్రశ్న తోచినది కాబట్టి
పండితుడవై నీవు ప్రథితిగాంచెద వేమొ
చదువుమా నాతండ్రి సత్కావ్యములు చక్క

 గుర్తించి సత్కృతుల గుణదోషముల నిట్టు
లాత్రపడెదవొ యేమొ ఆ చదువులో గూడ
సీతాఫలపు కథను చిరము స్మరియింపుమా
బుద్ధిగలవాడవై వృద్ధి పొందుమ తండ్రి

కవి వౌదువేని యీకథ కబ్బ మొనరింపు
మట్లె వేమన్న పద్యమున గల లోపమును
తామసంబున జేయదగ దెట్టి కార్యమను
దానికథ నొక దాని బూని రచియింపుమా
 
ఆనాటి మానాన్న యాశీర్వచన మెట్లు
ఫలియించెనో నేను పలుకజాలను గాని
ఆనాడు నేనాటినట్టి సీతాఫలము
ఫలియించుచున్న దిప్పటి కెన్నె ఫలములను

- REPOST from Oct 7th 2011
- Just to record and relive the journey of my verbiage from 8 years ago!

Friday, October 4, 2019

Enlightening and exceptional video!

Enlightening and exceptional.

Thank you!

https://youtu.be/8TwU0wO8jVw

May your tribe grow in abundance Raj Vedam garu


Thursday, October 3, 2019

వాడుకలో ఏ లింగము ఏ లింగమైనను చివరకు అదే పరమ లింగం!

అక్షరం అనగా నాశం లేనిది

అదే ఓంకారం

అదే జీవాత్మ

అదే పరమాత్మ

అదే పరబ్రహ్మం

అదే మోక్షం

నిత్యమైన బ్రహ్మతత్త్వాన్ని బోధించేది అదే

అదే వేదం

అదే ప్రామాణికత

అదే నీరు

అదే ఆకాశం

అదే యజ్ఞం

అదే జపం

అదే పుణ్యం

అదే ఖడ్గం

ఈ అక్షరం చేత ఉన్నవాడు అక్షరచణుడు

"అక్షరేణ విత్త:" అని వాక్యం

అక్షరాన్ని నమ్ముకొన్నవాడికి ధనలోటుండదని అన్వయం

ఒక అక్షరానికే అంత శక్తి ఉంటే, రెండు కలిస్తే ఆ శక్తిని ఆపతరమా?

పదులు వందలు కలిస్తే ఉప్పెనలే

ప్రపంచమే తలకిందులు

అలాటివారు, ఉప్పెనలు తెచ్చినవారు మన తెలుగు దేశంలో ఒకప్పుడు కోకొల్లలు

ఈనాటికీ అక్కడక్కడ ఉన్నారు

రేపటికి అసలెవరైనా, ఎక్కడైనా ఉంటారో ఎవరికీ తెలవదు

అలాటి అక్షరాలు బంధిస్తే ఛందం

అలాటి అక్షరాలను స్వేచ్ఛగా వదిలేస్తే వచనం

బంధించు వాడు అక్షరచ్ఛందుడు

వదిలేయువాడు వచనోచ్ఛందుడు

అక్షరచ్ఛందుడు దృఢనినిశ్చయము కలవాడు

వానితో సహవాసము చేయు అక్షరములు మరింత దృఢముగానుండును

వచనోచ్ఛందుడు స్వేచ్ఛాస్వాతంత్ర పిపాసి

వానితో సహవాసము చేయు అక్షరములు వాయువేగ గమకాలే

ఆ  అక్షరములకు జనని, అమ్మ, తల్లి - ఆ బ్రహ్మదేవుని పత్ని వాణి

ఆ దయగల తల్లి, ఆ వాణి వరము వలన గంటము దొరికె మానవులకు

ఆ తల్లిని తలచుకొంటూ గంటమునకు కూడా అక్షరజనని అని పేరిడినారు పూర్వీకులు

ఆ వాణి కృప వలన జ్ఞానము అబ్బును

అక్షరమే ఆ జ్ఞానానికి మూలం

అక్ష్రరమును జ్ఞాననాళికకు ఎక్కించుకొనినవాడు పండితుడు

వానికి అక్షరజ్ఞుడు అని పేరు ఖరారు

అక్షరమును జ్ఞాననాళికకు ఎక్కించుకొననివాడి పామరుడు

వానికి అక్షరఖరుడు అని పేరు తకరారు

అక్షరం ఆధారం

ఎన్నిటికో ఆధారం

అక్షరమే ఆధారము

ఎన్నో తంత్రాలకు

ఎన్నో మంత్రాలకు

ఎన్మో శాస్త్రాలకు

రుద్రము చదువునప్పుడు శరీపు అతిముఖ్య భాగాలని స్పృశించి దిగ్బంధనము చేయుట నేత్రానందకరం

జపతపాలు చేసేటప్పుడు ఆయా అవయవాల వద్ద మంత్రాక్షరాలను ఉంచడం న్యాసం

అక్షరాన్ని ఉచ్చరించి శరీరాన్ని స్ప్రశించటం న్యాసం

అంగన్యాస, కరన్యాసం అని వివిధమైన పేళ్ళు

ఇంకా ఎన్నో ఉన్నవి

మంత్ర పఠనంతో ఆయా అవయవాల దేవతలను ఆవాహన చేయటం అక్షరం బాధ్యత

అక్షరానికి అంత శక్తి ఉన్నది 

ఈ న్యాసాన్నే సభకు ఇస్తే స్వాగతోపన్యాసం

ఈ న్యాసాన్నే విశ్వవిద్యాలయానికి ఇస్తే స్నాతకోత్సవ ఉపన్యాసం

ఈ న్యాసాన్నే నివాళికి ఉపయోగిస్తే స్మారకోపన్యాసం

మరి సన్న్యాసానికి ఈ న్యాసానికి సంబంధమేమన్న ఉన్నదా అని సన్నాసులు అడగవచ్చును

అక్షరం బయటకు పలకకుండా లోపలే ఉంటే అదే సన్న్యాసం

అలా ఎన్నిటినో తన నెత్తిన మోస్తూ ఉండేది అక్షరమే

ఈ అక్షరాలను పంక్తుల్లో పేరిస్తే అది అక్షరపంక్తి

అదే అక్షరాలను మాలగా పేరిస్తే అక్షరమాల

అదే మన వర్ణమాల

ఈ అక్షరాలను రాయటానికి ఉపయోగించే దానికి అక్షరభూమిక అని పేరు

అది పలక కావొచ్చు, అది కాకితం కావొచ్చు, అది కీబోర్డు కావొచ్చు

ఏదైనా కావచ్చు

అక్షరానితో అనుబంధం ఉన్నదంటే అక్షరంతో మొదలవ్వాల్సిందే

పిల్లవాండ్లకు అక్షరం పరిచయం చేయటం అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం చేసి అక్షరం మరచిన పెద్దవాండ్లు నిరక్షరకుక్షులు

అక్షరములు నిలబెట్టుకొనినవాడు అక్షరాస్యుడు

అక్షరాలను నెత్తిన పెట్టుకొనినవాడు విద్వాంసుడు

వాడే అక్షరముఖుడు

నిలబెట్టుకోలేనివాడు అక్షరమూఢుడు

వాడే అక్షరవిముఖుడు

అక్షరాలు షడ్రూపాలు

అవే పంచాక్షరీ మంత్రాలు

గాయత్రీ మంత్రం 24 అక్షరాల సమాహారం

ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యో న: ప్రచోదయాత్


చతుర్వింశతి  అక్షరాలు ఇవి

వాటిని పఠించినవాడికి, పాటించినవాడికి మోక్షమే అక్కరలేదు

సరాసరి ఆ పరమాత్మే మనలో కొలువైపోతాడు

జనగణమన అధినాయక అన్నా అక్షరమే

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ దెల్పుడీ అన్నా అక్షరమే

తాటాకు మీద అక్షరమే

శాసనాలలోనూ అక్షరమే

అక్షరాలలో తెలుగు అక్షరాలు గొప్పవి

అక్షరానికి చావు లేదు

కాని మార్పు ఉన్నది

ఏనాటిదో ఱ ఇపుడు అగపడదు

ఏనాటిదో ఌ ఇపుడు అగపడదు

తొమ్మిదవ శతాబ్దము నాటి మూడవ చాళుక్య వర్ధనుని అహదన కరతామ్ర శాసనమూ అక్షరాల నిధే

అందులోని తెలుగు అక్షరాలతోనిండిన వాక్యం ఒకటి చూడుడు

-- మహాసత్థవల కొండుకలో నిరవద్య ప్రిధివి కవడిరజుళ్ గునవన నభియుళ్

ఈనాటి వారికి ఆ అక్షరక్రమం అర్థం కాకపోవచ్చును

కానీ ఆ నాటికి ఆ అక్షరం గొప్పది

శాసనముకెక్కినదంటే గొప్పది కాక ఏమి ?

ఆ శాసనం ద్వారా సమాజానికి, ఆనాటి సమాజానికి, ఈనాటి సమాజానికి ఉపయోగం కలిగింది

ఆనాడు ప్రజలను ఉత్తేజితులను చేసిన అక్షరాలు అవి

ఈనాడు పండితుల ఉత్సుకతను ఉత్తేజం చేసిన అక్షరాలూ అవే

ఆ శాసనం వల్ల చరిత్ర అక్షరబద్ధం అయిపోయింది

అంత శక్తీ ఆ అక్షరాలదే

ఈనాటి చరిత కూడా అక్షరబద్ధమే

రేపటి పండితులకి ఉత్సుకతే

ఈనాటి అక్షరాల భావభయభీతులేమిటో తెలుసుకోవటానికి

తెలియాలంటే అక్షరమే ఆయుధం

మృదుమధుర భావం పలికాలంటే అక్షరం కావాలి

ఆవేశం కట్టలు తెంచుకోవాలంటే అక్షరం కావాలి

కరుణతో పొంగి పొర్లాలంటే అక్షరం కావాలి

నవరసాలు ఆ అక్షరానికి సొంతం

అన్నమయ్య అక్షరాలు ఈనాడు చాలామందికి తెలియవు

ఈనాటి అక్షరాలు ఏ నాటికి ఎవరికీ తెలియవు

అదొక వింత

అన్ని భాషలయందు తెలుగుభాష గొప్ప

గొప్పదని మనవారే కాక ఎందరెందరొ చెప్పినారు కావున అది నిజమేనను మాట సత్యము

అటువంటి భాషకు ఆ సంపదను ప్రసాదించినవి వర్ణాలు

ఆ వర్ణాలు యాభైయ్యారు

వానిలో పరుషాలు, సరళాలు, సవర్ణాలు, తాలవ్యాలు, దంత్యాలు, ద్రుతాలు, కళలు, లఘువులు, ద్వివిధాలు, సంధులు ఇలా ఎన్నో ఎన్నెన్నో

ఇవన్నీ కలిసి వ్యాకరణంలో భాగమైనవి

వీనిని ఉపయోగించుకొని జయమాలిని విలాస్ అని రాయవచ్చును ఆదిదేవమ్మ పూటకూళ్ళ ఇల్లు అని రాయవచ్చు

ఏ రకము రాసుకొనుటకైనా ఈ అక్షరములు ఉపయోగపడును

అక్షరము ఖడ్గము అని చెప్పుకొనినాము కద పైన?

ఆ కత్తిని ఉపయోగించువాని మీద అక్షర శక్తి ఆధారపడియుండును

ఎవని చేతియందు చాకచక్యముగ తిప్పబడునో వాడు పండితుడు

ఎవని చేతియందు అయోమయముగ తిప్పబడునో వాడు పామరుడు, మూర్ఖుడు

అక్షర సమూహములకు లింగములు ఏర్పరచినారు వైయాకరుణులు

స్త్రీ లింగమని, పుం లింగమని, నపుంసక లింగమని విభజించినారు

వాడుకలో ఏ లింగము ఏ లింగమైనను చివరకు అక్షరమే పరమ లింగం

జగజ్జ్యోతి లింగం

పరమేశ్వర లింగం

పరమాత్మక లింగం

అందువలన అక్షరమును పట్టుకొని యుండుము

వినాశనానికి ఉపయోగించక మంచికి ఉపయోగించు

అదియే నిన్ను వైతరణి దాటించును

ఓం తత్ సత్!

-- ఇంకా ఎంతో రాయవచ్చు, ఒక మహాభారతమే రాయవచ్చు కాని ఇక్కడికి ఆపితే ఇంకొక పని చేసికొనవచ్చునని

( A Repost from 2015)

Wednesday, October 2, 2019

రాస్తే ఇట్లాంటి వ్యాసం రాయాల - చదివితే ఇట్లాటివి చదవాల

రాస్తే ఇట్లాంటి వ్యాసం రాయాల

చదివితే ఇట్లాటివి చదవాల

బ్రావో బ్రదర్

బ్రావో!

 https://sanchika.com/tenungurayani-swagatam/ 

సోదరా - రవీ - ధన్యులమైనాము

పెద్దావిడ వంట

పెద్దావిడ వంట

 https://v1011fm.iheart.com/featured/v-mornings/content/2019-09-30-this-abuelita-is-getting-millions-of-views-on-her-cooking-videos-watch

నాకెందుకు నచ్చిందంటే - ఆవిడ చెప్పే విధానం, ఆ పొయ్యి, ఆ రోలు, ఆ సాన ...ఇంకా...ఇంకా....ఎన్నో!

అందుకే పంచుకుంటున్నా

మీరూ చూసేసి ఆనందిస్తారని

Sunday, September 29, 2019

బాహుబలి పుస్తకం

బాహుబలి పుస్తకం

ఈరోజు అమెజాను వారి మొదటి వంద బెష్టు సెల్లర్సు లిష్టులో 87వ పుస్తకంగా నిలిచింది

ఈ రెండు వారాల్లో ఆ పుస్తకం అమ్మకాలు విపరీతంగా పెరిగినాయ్

(ప్రత్యేకించి బాహుబలి గీతరచయిత, ఆత్మీయ సోదరుడు, అన్నగారు చైతన్యప్రసాద్ గారి ఫేసుబుకు పోష్టు మూలాన అని అనుకోలు)

పుస్తకపు అమ్మకాల వలన వచ్చే లాభమంతా దానపు డిబ్బీలోకి చేర్చబడుతుంది

సంవత్సరాంతంలో ఆ డిబ్బిలో ఉన్నదంతా, నిజంగా అవసరమైన వారికి అందించెయ్యటం అనే పని గత  రెండు  సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది 

ఇదంతా మీ చలవే - ఋణగ్రస్త కృతజ్ఞతలు

భవదీయుడు
వంశీ

PS: Yes, I know there is a typo in the book title and that is because english is my second language! :)


Tuesday, September 24, 2019

My digital art samples for upcoming books!

My digital art samples for upcoming books!
Will be using ’em as part of the coversMonday, September 23, 2019

చెరుకుపల్లి జమదగ్ని శర్మ, తెన్నేటి హేమలత, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తురగా జానకీరాణి


చెరుకుపల్లి జమదగ్ని శర్మ, తెన్నేటి హేమలత, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తురగా జానకీరాణి

1963
తెలుగువాడి కథ - 1967 - శ్రీ విహారి & శాలివాహన

తెలుగువాడి కథ - 1967 - శ్రీ విహారి & శాలివాహన
రెంటాల గోపాలకృష్ణ గారి ఫోటో - 1966

రెంటాల గోపాలకృష్ణ గారి ఫోటో - 1966


జరుక్ శాస్త్రి గారి ఫోటో - 1957

జరుక్ శాస్త్రి గారి ఫోటో - 1957

Sunday, September 22, 2019

కవిపాదుషా - పువ్వాడ శేషగిరిరావు

కవిపాదుషా - పువ్వాడ శేషగిరిరావు


సి.పి.బ్రౌన్ దండకం - 1963 భారతి పత్రిక నుండి

సి.పి.బ్రౌన్ దండకం - 1963 భారతి పత్రిక నుండి

వార్నీ  ......

Saturday, September 21, 2019

ఉమర్ అలీషా - ఈనాటి కవులు సిగ్గుపడాలయ్యా నిన్ను చూసి!

ముస్లిము కవులు ఉమర్ అలీషా కవిగారిని చూసి ఎంత నేర్చుకునేదుందో!

ఆ భగవంతుడు, ఆ అల్లా, ఆ సరస్వతి ఆ మనిషి మీద ఎంత కరుణ చూపి ఆ వాక్శుద్ధి, విద్యావరాలివ్వకపోతే ఇలాటి రాతలొస్తాయీ?

అయ్యా అలీషా - ఎక్కడున్నావయ్యా!

నీ కాళ్ల మీద పడి ఎన్ని వేల దణ్ణాలు పెట్టేవాడినో ఈ కాలంలో నువ్వు ఈ భూమ్మీద ఉండి ఉంటే!

ఈనాటి కవులు సిగ్గుపడాలయ్యా నిన్ను చూసి

కవులెవరైనా సరే, ముస్లిములైనా హిందువులైనా, అసలెవరైనా సరే - నిన్ను చదివితే కనీస జ్ఞానం అన్నా వస్తుంది - ఆ పనన్నా చేస్తారో లేదో!

మా తెలుగు గడ్డ మీద నీవు పుట్టినందుకు, నువ్వు తెలుగు బిడ్డవయినందుకు అశ్రునయనాలతో, ఆనందభాష్పాలతో  సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ....

వీరి గురించి 2011లో ఒక పోష్టు వేసినాను

ఇక్కడ చూడవచ్చు

https://janatenugu.blogspot.com/2011/12/1930.html


************