Thursday, April 26, 2018

You are awesome!!

Yes, you are awesome!
YOU, yes YOU!
It happened because of you!

You bought the books!
You contributed to my charity box!
You made some poor souls smile!
You kept my fire alive! 

You read the stories! 
You passed it on! 
To the next generation!
Or to your self!

My 41st print book is published
Vol 26 of Anaganaga Series is published

Crossed the Silver Jubilee For Anaganaga Series! 

YAY!

Yes, in BOLD

available at amazon now

Thank you from the bottom of my heart!

Even if you did not buy it - thank you! 

You are seeing this post because I know you are good at heart!
Let the GOOD be shared, be spread! 

May your tribe grow!

Friday, April 20, 2018

భరత్ అనే నేను - సినిమా రివ్యాభిప్రాయం

అనగనగా

ఒకప్పుడు పూజలు పునస్కారాలు చేయునపుడు

ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం
కురు ఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం

అంటూ మొదలుపెట్టేవారు

ఈరోజు అది గుడికి పరిమితమయినది

అసలు పైదానికి అర్థమేమమనగా

పూజా సమయంలో మనం పూజించే దేవతలు అక్కడికి రావడం కోసం, మనలోపల ఉన్న, చుట్టుపక్కల ఉన్న రాక్షసులు వెళ్ళిపోవడం కోసం, గంట మోగిస్తున్నాం బాబూ అని

సరే, గుడి సంగతి అలా ఉంచితే - దేన్నైనా దేనికైనా అన్వయించవచ్చునన్నది ఎవరూ చెప్పని సూత్రం

ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని అన్వయానికి వెడదాం

ఈ ఆగమాన్ని తెలుగు సినిమాకు అన్వయించి చూద్దాం

తెలుగు సినిమా చరిత్రలోని స్వర్ణకలశపు రోజులను వదిలేసి ఈనాటి సినిమాలకు అన్వయించినపుడు ఇలా గంటల్ వాయించవచ్చు

ఆగమార్థంతు చిత్రానాం గమనార్థంతు ప్రేక్షకాం
కురు ఘంటా రవం తత్ర ప్రేతాహ్వాన లాంఛనం

దీని అర్థం ఈ పోష్టును చదివే అందరు, ఇంటర్నెట్ ఉపయోగరణీకులు, విజ్ఞులు గ్రహింతురుగాక

అయితే అటువంటి శ్మశానవాటికయందు కొన్నిసార్లు పూవులు పూయును

అవును శ్మశానవాటికయందు కూడా పూవులు పూయును

ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలయందు విచిత్రముగా కొద్ది కాలపు తేడాయందు బాహుబలియనబడు పూవు, శాతకర్ణి అనబడు పువ్వు, జనతా గారేజ్ అనబడు పువ్వు వికసించి సువాసనలు వెదజల్లినవి

వీనియందు, జనతా గారేజ్ అనబడు పూవును పూయించిన పూమాలి పేరు కొరటాల శివ అట

ఆయన బాగా పూయించినాడు దానిని

చితివాసనలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆనందముగా ఈ గారేజ్ పూ వాసనను ఆఘ్రాణించినారు

ఆ పూవుయందు రేకలు చాలా బాగున్నవి

జూ అనబడు ఒకాయన మంచి రేకగా వికసించినాడు

అయితే ఆ పూవును ఎంతో ఎత్తున నిలబెట్టిన కాడ పేరు మోహనలాలు

మోహనలాలు కాడ లేనట్లైతే ఆ పువ్వు నేలబారుగా ఉండెడిది

సరే ఆ పూవు సంగతి వదలి ఇంకొక పూవు వద్దకు వచ్చెదము

గత రాతిరి ఒక మొదటి రాతిరి ఆట అయినది

పాఠకులు విపరీతార్ధము తీసికొనకూడదు

మొదటి రాతిరి మహేశబాబుకు

ప్రేక్షకులకు కాదు

మా ఊరియందు ఫాల్సం అను పిచ్చకుంటుల ప్రదేశమొకటి యున్నది

అచట చాలమంది తెలుగువారు ఉండెదరు

అందువలన అచట అంతయు విశాపట్నం పిచ్చి ఆసుపత్రి వలె ఉండును

సరే, మహేశబాబు మొదటిరాతిరి ఆటను చూచెదమని వెళ్ళినాను

7.45కు ఆట

వెళ్ళి కూర్చొనగా ఎప్పటివలెనె హాలులో ఎన్నో సీట్లు ఖాళీగా ఉన్నా ఎర్రబస్సుల రిజర్వేషను వలె జాకెట్లు, కర్చీఫులు, అండరువేరులు వేసి పాకించినారు అచటి పిచ్చికుంటుల తెలుగువారు

ఈ జాతర అంతా అలవాటు అయి మనసు ఉక్కు కన్నా దృఢంగా మారిన వాడిని కనక అందరికీ దూరంగా మొదటి నుంచి రెండో వరసలో కూర్చుంటిని

అక్కడైతే కాస్త తల ఎత్తి చూడవలసి వచ్చినా సినిమా నడుచుచున్నప్పుడు - ఈ ముండమోపి తెలుగు వారు సెల్లుఫోనులండు ఆడుకొనునపుడు వచ్చు లైటు కనపడదు, టెలిఫోను కాలుల గుసగుసగుసల గావుకేకలు వినపడవు, ఆడువారి బాగులయందు దాచి తెచ్చుకొన్న జుర్రుడు ఫ్లాస్కులు, పుణుకుల పరపర శబ్దాలు వినపడవు

ఇంతకీ ఆ సినిమా పేరు - భరత్ అను నేను

విరామ సమయము వరకు సినిమా అదరహ

చాలా బాగున్నది

ప్రేక్షకుల నాడి నొక్కి పట్టి కొరడాలతో, కొట్టి, చలనచిత్రాన్ని తొక్కి నారదీసినాడు

ఆయన పేరు కొరడాల శివ అని యుండవలసినది

పొరపాటున కొరటాల శివగా యున్నది

ప్రస్తుత సమాజం పట్ల అందరిలోనూ అంతర్లీనంగా ఉండి రగుల్పాటు వ్యవహారాలను టచ్ చేసి చించవతల పారవేసినాడు

ఆ నాడి పట్టుకోవటంలో సిద్ధహస్తత బాగుగా కనపరచినాడు

తెలుగు చదవటం, రాయటం రాని మహేశబాబుతో అన్నీ విరగదీయించినాడు

అయితే విరామం తర్వాత సిద్ధహస్తత కాసేపు శ్మశానమయినది

ఆ రాయలసీమలో లేని ఫాక్షనును, ఉన్నట్లుగా భ్రమింపచేస్తూ రాయలసీమ ప్రజలను అవమానించటం ధ్యేయంగా పెట్టుకున్న సినిమా ప్రపంచంలోని ఇతర పువ్వుల దారిలో వెళ్ళినాడు ఈ దర్శకుడు కూడా

అయితే గొప్పతనమేమనగా విజ్ఞత కనపరచి కొద్దిసేపట్లోనే తిప్పుకొనినాడు

ఆ తరువాత బాగుపడినది

రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాటలు ఒక్కటి కూడా నచ్చలేదు

ఆయన ఇంకా బాగా రాయగలడు, కానీ ఈ సినిమాయందు వచ్చు పాటలలో ఒక లైను తరువాత వచ్చు లైను ఏదో ముందే తెలిసిపోయినది

ఆయన ఎందుకో తన సాహిత్యపు స్థాయిని తగ్గించుకొని రాసినారు

ఇంకొక ప్రధాన కారణం ఆ దేవిశ్రీ ప్రసాదం అనబడు దేవుడు ఇచ్చిన ట్యూను ప్రసాదం

జనతా గారేజికి అందించిన బాకుగ్రవుండు, సంగీతపు, పాటల స్థాయి ఎంతో ఎత్తున ఉండగా - ఈ సినిమాకు ఆ ఎత్తునుంచి నాగార్జునసాగరపు ఆనకట్ట కిందనున్న రాయిరప్పల స్థాయికి చేరినది

పొరపాటున ఈ పాటలకు నంది అవార్డు వచ్చునేమో అని ఆనందముగా ఉన్నది

ఏదైనా మన చేతులలో ఏమీ లేదు కద

తూరుపు తిరగటమే

ఛాయాగ్రహణము బాగున్నది

హేమమాలినిని పోలిన కైరా అడ్వానీ అనబడు నాయిక ఉన్నది కొద్దిసేపే అయినా బాగున్నది

ప్రకాశరాజ్యం ఎప్పటిలానే తోలుతుకారాము యాక్షనుతో అలరించినాడు

కర్మకాలి రావు రమేశము విలనవుతాడేమోయనుకొంటిని

ఆ దేవుని దయ వలన అంత పని జరగలేదు

సరే - పోష్టు పెరిగిపోవుచున్నది కావున ఇక్కడికి ఆపివేసెదము

చివరి తీరుమానమేనగా సినిమాల యందు లాజిక్కుల బొక్కలు వెతకాలనుకున్నవారు చూచు సినిమా కాదు

సినిమాను అందంగా పూయించిన కొర(టా)(డా)ల శివ, పూసిన మహేశబాబు ల ఆటలతో నిన్న రాతిరి బాగుగా గడచినది

ఇరువది డాలర్లు వదలినవి కాని, కంప్లెయినులు లేవు కనక - Solid Entertainer అని చెప్పవచ్చును

తెలుగు సినిమా స్థాయి ఇలాగే ఉంటే ఎంత బాగుండునో!

అది ఉత్త కలగా మిగిలిపోకూడదన్న ఆశ నిజమైతే ఎంత బాగుండునో !