Saturday, November 24, 2018

పుస్తకాల మీద ప్రొమోషను! + 352 page Mairavana Book

అయ్యా, అమ్మా

అమెజాను వాడు పుస్తకాల మీద ప్రొమోషను పెట్టినాడు

20 డాలర్ల విలవవి కొంటే 5 డాలర్లు డిస్కవుంటు అని

చెక్ అవుట్ చేసేప్పుడు వాడవలసిన ప్రొమో కోడ్: NOVBOOK18

అనగనగా వాల్యూం 1 తో పాటు ఇంకో పుస్తకం కొన్నారంటే - ఆ పుస్తకం ఫ్రీ!

Promotion is available until mid-night tomorrow (NOV 25th)

ఎంజాయ్ చేసుకుంటారని తెలియచెయ్యటం

లంకె ఇక్కడ

https://www.amazon.com/Vamsi-M-Maganti/e/B07C83SWPZ

భవదీయుడు
వంశీ

PS: 352 Page Mairavana Book is available now

Link here

http://a.co/d/2263Uoi 

Wednesday, November 14, 2018

1935వ సంవత్సరం హరిశ్చంద్ర సినిమా

ఈరోజు ఏదో వెతుకుతుంటే హార్డుడ్రైవులో ఈ పాత PDF బయటపడె

ఇది పాత పాత ఫేసుబుకు అకవుంటు ఉన్నప్పుడు అందులో వేసినాను, ఆ పాత ఫేసుబుకుకు, కొత్త ఫేసుబుకుకు కూడా పూర్తి మంగళం పాడినాను కనక మరల ఇప్పుడు ఇక్కడ వేసినాను - అంతే!

1935వ సంవత్సరం హరిశ్చంద్ర సినిమాది

Took One Lakh + Six Months అని పుస్తకం మీద ఘనంగా వేసినారు :)Tuesday, November 13, 2018

తెలుగు - వెలిగిపోవటం అంటే ఇదేనేమో!

ఈరోజటి అమెజాను వాడి రాంకింగులు

మొదటి ఇరవైలో ఆరు భవదీయుడివి

అందునా మొదటి ఆరు నావే! :)

తెలుగు వెలిగిపోవటం అంటే ఇదేనేమో!

ఈసారి లాంగు వీకెండులో ఆనులైను అమ్మకాలు బావున్నవి - అందువల్లే రాంకింగు పైకి వచ్చినదని అనుకోలుMonday, November 12, 2018

పొగలోయ్ పొగలు

పొగలోయ్ పొగలు

Sun rise shines through the front door glass

Ofcourse the smog, smoke from CAMP / Paradise fire fills the whole valley and homes ...

That’s what the sun has to shine throughకామాంచి పళ్ళు - 1935లో వెలువడిన రామబాణం పత్రికలో విశ్వనాథుని రచన

టేకుమళ్ళ రామచంద్ర రావు, పురాణం సూరిశాస్త్రి, ఎస్‌.ఎమ్‌.ఎల్‌.ఎన్‌. దాసు సంపాదకులుగా, పింగళి వీరయ్య పంతులు ముద్రాపకుడిగా 1935లో వెలువడిన రామబాణం పత్రికలో విశ్వనాథుని రచన - కామాంచి పళ్ళు ((I think I know these - very small red fruits that used to grow on a small bush tree in our back yard in the village! We never ate them though, as our grand ma said they will upset your stomach! May be she was protecting them from us? We don't know....)

కామాంచి పళ్ళు

– విశ్వనాథ సత్యనారాయణగారు ఎమ్‌.ఏ.

కామాంచి పళ్ళెరుగుదురా మీరు
కామాంచి పళ్ళు

చిన్నప్పుడు
మా అన్నయ్యా నేను
వాముల దొడ్లో
రెండు కొత్తవాముల మధ్యా
గడ్డి సర్దటంలో
అణగిపోయిన
కామాంచిపళ్ళు
చూస్తూ కూర్చున్నాం

దేముడు తాంబులం వేసుకొని
నవ్వితే
నవ్వు బుడగలు, బుడగలు!
నవ్వుతూ
కామాంచి పళ్ళు కోసుకు తిన్నాం

కామాంచి పళ్ళెరుగుదురా మీరు
కామాంచి పళ్ళు

చదవటానికి
బస్తీలకెక్కాం
బస్తీలల్లో
కామాంచి పళ్ళుండవు

బజారు పోయి
పూస కొంటాం
పకోడీలు కొంటాం
జబ్బు చేస్తుంది

సెలవలకింటికి పోతే
పెరట్లో కామాంచి పళ్ళు
మా చెల్లాయి కోసింది
తిన్నాం తిన్నాం
మా చెల్లాయి పెళ్ళి
బుక్కాం రాలింది

కామాంచి పళ్ళెరుగుదురా మీరు
కామాంచి పళ్ళు

చదివాం, పూర్తి అయింది
వెదికాం, ఉద్యోగాల కోసం
అన్నీ ఉన్నవి,
అదృష్టం లేదు
చదివినప్పటి ఆశలు
అన్నీ ఆశలయినవి

జీవితం తోటే
కష్టాలు మొదలు
కామాంచి పళ్ళమాటే
మరచిపోయినాం

ఎప్పుడో ఒకసారి
కామాంచి పళ్ళు చూశా
అవి పళ్ళల్లేనే లేవు
మా పాప కోసి తెచ్చింది
తినా లేదు

కామాంచి పళ్ళెరుగుదురా మీరు
కామాంచి పళ్ళు

నా హృదయం పగిలింది
నేను దుఃఖించాను
ఎవరో నవ్వారు
నేను బ్రతకటానికి
అదుకు పెట్టాను
ఎవరో వెక్కిరించారు

ఏదో పాడాను
అది పాట అవునో కాదో!
ఒకసారి అవునని
ఒకసారి కాదని

లోకమో
తూర్పుకు వెళ్ళాను – నవ్వే
దక్షిణం వెళ్ళాను – నవ్వే
పడమట వెళ్ళాను – నవ్వే
ఉత్తరం వెళ్ళాను – నవ్వే
ఇంక ఎక్కడికి వెళ్ళను?
పెరట్లోకి వెళ్ళాను
కామాంచి పళ్ళు
సూదితో హృదయంలో గుచ్చి
వెలికిలాగిన సన్నని
నెత్తురు బొట్లు
కామాంచి పళ్ళు – కామాంచి పళ్ళు

కామాంచి పళ్ళెరుగుదురా మీరు
కామాంచి పళ్ళు

బంకమట్టి(జంబాలం)తో ఆయుధాలు

బంకమట్టి(జంబాలం)తో ఆయుధాలు

Did them yesterday!  ( one sword was from previous days though!)
Sunday, November 11, 2018

Smoked Surya!

Wildfires are about 60 miles from us

And thick smoke is everywhere!

Even Sun is not spared!

iPhone has no capability to capture the color or smoke

Sun is like mars, literally- Dark red to normal eyes

Even inside a movie theater - went to the atch GRINCH - the smoke is all over
Saturday, November 10, 2018

రామాయణంలో గరుడ వ్యూహం!

రామాయణంలో గరుడ వ్యూహం

మైరావణుడి పుస్తకంలో రామరావణ యుద్ధమప్పుడు - యుద్ధవ్యూహం గురించి రాస్తున్నప్పుడు వేసుకొన్న బొమ్మ ! ఇక్కడ పంచుకొనినాను

అంతే!
Friday, November 9, 2018

Mairavana - Cover 2

Another cover for the book

Let there be couple more 

will I make?

yeah - why not?

And one is picked! ;)Thursday, November 8, 2018

Air Dry Clay Art - 2

Telugu alphabets
Telugu numeric
Exclamation mark
Leaf
A deepavali lamp

Vajrayudha ( well - that was the intention, but.. :) )

Priming! Colors next..

Wednesday, November 7, 2018

తెలుగు అంకెలు - రేపు పొద్దున్న అమెజానులో లభ్యం!

తెలుగు అంకెలు - రేపు పొద్దున్న అమెజానులో లభ్యం!

అట్టే ఉపోద్ఘాతం లేకుండా, ఈ పుస్తకం గురించి రెండు ముక్కలు.

తెలుగులో కూడా అంకెలు వ్రాయవచ్చు అన్న సంగతి దాదాపుగా అందరూ మర్చిపోయారు.

ఆనాడు ఏనాడో, ఒక దశాబ్దం క్రిందట నేను తెలుగు క్లాసులు చెపుతున్నప్పుడు, విద్యార్థుల కోసం తయారు చేసి పెట్టుకున్న అభ్యాసపు కాగితాలు ఇవి. ఈనాడు ఆసక్తి ఉన్నవారికెవరికైనా ఉపయోగ పడుతుందేమోనని 100 + పేజీలలో కూర్చి పుస్తక రూపంలో తీసుకురావటం జరిగింది.

కనీసం ఒకరికైనా ఉపయోగపడితే ఈ పుస్తకం విలువ ఆకాశానికి ఎగిరినట్లే, ఈ పుస్తకపు జీవితం ధన్యమయినట్లే!

ఎందరో మహానుభావులు - అందరికీ వందనాలు

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS:- చూడాలని ఆసక్తి ఉన్నవారికి పుస్తకపు కవరు ఈ క్రింద అటాచించినాను 


Tuesday, November 6, 2018

"మైరావణ - The Magical Demon"

"మైరావణ - The Magical Demon"

200 పేజీల పుస్తకం ఈ వారంలో విడుదల

కవరు పేజీ ఇక్కడ అటాచించబడినది

ఊరకే తెలియచేద్దామని అంతే!
అనగనగా సరణిలోని 54వ వాల్యుము!

అయ్యా, అమ్మా

76వ పుస్తకం తయార్

అనగనగా సరణిలోని 54వ వాల్యుము ఇది

రేపు అమెజానులో లభ్యం

ఊరకే తెలియచేద్దామని - అంతే!

Monday, November 5, 2018

Air Dry Clay Art - 1First color attempt at “air dry clay” art !

Unfinished fall leaf !

the stem broke while coloring though.. :)

Sunday, November 4, 2018

75వ పుస్తకం - ప్లాటినం జూబిలీ!

అయ్యా, అమ్మా

75వ పుస్తకం తయార్

మామూలుగా 75వ దానిని ప్లాటినం జూబిలీ అంటారనుకుంటా! కాకుంటే సరిదిద్దండి ...

రేపు అమెజానులో లభ్యం

కవరు డ్రాయింగు - 2015లో వైష్ణవి గీసిన ఒక బొమ్మ

ఊరకే తెలియచేద్దామని - అంతే!

74 వ పుస్తకం - "అనగనగా" సరణిలోని 53వ వాల్యూం నిన్న పబ్లిషు చేయబడ్డది - అమెజానులో నిన్న రాత్రి నుండి లభ్యం 


Friday, November 2, 2018

"అనగనగా" సరణిలోని 53వ పుస్తకం!

అయ్యా, అమ్మా

"అనగనగా" సరణిలోని 53వ పుస్తకం ఈ రోజు పబ్లిష్ చేయబడ్డది

ఇది నా 74వ పుస్తకం

అమెజానులో లభ్యం

కొనుక్కోవాలనుకున్నవాళ్ళు కొనుక్కుంటారని తెలియచేయటమైనది

ఈ బ్లాగులో కుడివైపున ఆ పక్కగా ఉన్న "అనగనగా కథలు" బాక్సులో ఉన్న లంకె నొక్కితే మీ సౌలభ్యం కోసం అమెజానుయందు ఏర్పాటు చేయబడ్డ నా పేజీకి వెళుతుంది..

అక్కడ కొనుక్కోవచ్చును

ధన్యవాదాలు

భవదీయుడు
వంశీమూడు పుస్తకాలుAmazon's Best Selling New Releases

మొదటి పదిట్లో - మూడు - నా పుస్తకాలున్నవండి... :)

వార్త పంచుకుందామని ఇక్కడ వేసినాను

అంతే!

అంతకన్నా ఏమీ లెదు

ఇవే ఆ మూడు

  • అనగనగా వాల్యూములు 51, 52
  • నాగ్నజితి

అమెజాను వాడి రాంకింగు ఈ బొమ్మలో చూడవచ్చు 

 

Saturday, September 8, 2018

జై కాకమాని మూర్తి కవి

కాకమాని మూర్తి కవి

15వ శాతాబ్దంలో జీవించినాడు ఈయన అని అంటారు

ఈయన రచనలు చదివిన వారికి వంకాయ వంటి సంస్కృతాన్ని పట్టుకొని దాన్ని నిప్పుల మీద కాల్చి అందులోని సారాన్ని గ్రహించి తెలుగు కుంపట్లో వండి వార్చి పోపు పెట్టి ఘుమఘుమలాడించాడు ఈయన అని అనిపించటం సహజమే అయినా, ఆయన సొంత ఆలోచనలనే నిప్పులో పడేసి మధించాడు అనిపిస్తుంది నాకు

శబ్దాన్ని ధాంధూం గా వాడినాడు

అక్షరాలను పట్టుకొని ఢంకా మీదకెక్కించి దడదడలాడించినవాళ్ళు - ఈ తెలుగు ప్రపంచకంలో ముగ్గురే

తిక్కన, పోతన, శ్రీనాథుడు

అందరివీ విభిన్న ధోరణులు

వైవిధ్యమైన శిల్పాలు

వీరిలో తిక్కనకు సాటిరాగలవాడు ఈ కాకమాని కవి

గరుత్మంతుణ్ణి వర్ణిస్తూ

జంభారి దంభోళి ఝళిపించి నిప్పుకల్
రాల్చిన నొకయీక రాల్చినాడు
జగములెక్క నడంగ జరియించు నల్లని
మోపవలీలమై మోచినాడు
బరువు తానెఱిగిన శరముచుల్కగజేసి
మృడునకు బుర జయం బిచ్చినాడు
ద్విరసనాళికి వేల్పు వెనుసూటి సుధనాచి
రెల్లులో నట పార జల్లినాడు
......
.......
.......
....... పులుగుఱేడు


అంటూ సాగిపోతుంది ఇంద్రుడు, నాగులు, శివుడు ఆధారంగా ఒక పద్యం

పద్యాలే అనుకుంటే అంతకు మించిన వచనం

శేషాద్రిని వర్ణిస్తూ

అట్టి చుట్టు కైదువ జగజెట్టికి విడిదిపట్టయిన పెట్టె బెట్టు దిట్ట గట్టు కట్టుమట్టు దిట్టతనం బెట్టిదనిన.. అంటాడు

చుట్టుకైదువ జగజెట్టి - చక్రాయుధం కల మహావీరుడు (ఇంకెవరు ? ఆ శ్రీమహావిష్ణువు)
పెట్టెబెట్టు దిట్టగట్టు - శేషాద్రి
కట్టుమట్టు - మాంచి దృఢమైన
దిట్టతనం - అంటే తెలిసిందే

అలాగే ఇంకొన్ని...మచ్చుకి

1) ఏవం విధ గుణ నిధికిన్
ధావ నీధనాశ ధామ ధామ దవీయో
దేవానాంప్రియ దానవ
భావనా ద్యప్రమోద పధో నిధికిన్


2) ధాటీ ఘోట ఖురాగ్ర నిర్దళిత గో
త్రా ధూళికా గంధ చూ
ర్ణాటో పాళి పరిస్ఫుర త్ప్రదిత స
ర్వాశా వధూటీ కుచా
ఘాటా చ్ఛాచ్చద రాగ శాటిత అస్మా
ఖ్య విక్రమ ప్రక్రమా
త్యాటీకా హిత రాజహంసుడగు నా
హా రాజహంసుండిలన్


ఇంకొన్ని వర్ణనలు చూద్దాం

ఒక చోట సూర్యాస్తమయం ఎలా ఉన్నదీ? అంటూ కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు....

శివుడు ప్రదోష తాండవ వేళ కాలుజాడిస్తే ఊడిపడ్డ అందె లాగ సూర్యుడు పొద్దుగుంకిపోయాడట

ఆయన తాండవం చేస్తున్నప్పుడు నెత్తి మీదనున్న గంగ కదలగా చిందిన నీటి బిందువులే నక్షత్రాలట

అంతా పట్టలేక శివుడు నోటి నుంచి బయటకొచ్చిన హాలాహలమే చీకటి అట

వీటిలో కొన్ని పూర్వకవులను అనుసరించినట్టు కనపడ్డా - ఆ ఆలోచనలను తెలుగించడంలో ఉన్నది ఈయన శక్తి

ఈయన ఆదిశేషువు మీద రాసిన ఒక పద్యంలోని ఒక పంక్తి ఆధారంగా ఒక అనగనగా కథ అల్లుకొని రాసినాను 2015వ సంవత్సరంలో

ఆనాడు రాసుకున్న డ్రాఫ్టును యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను, చదువుకోండి

*******

అనగనగా

అనగనగా ఒక రోజు

ఆ రోజు ఇప్పటిది కాదు

ఎప్పటిదో

ఆదిశేషుడికి, భారం మొయ్యవయ్యా అంటూ భూమిని ఆయన నెత్తి మీదకు ఎక్కించిన రోజు

ఆదిశేషుడు మోస్తూ ఉన్నాడు ఆ నాటి నుంచి ఆ భూమిని

ఇంతలో బ్రహ్మ మానవ సృష్టి మొదలుపెట్టాడు

ఇంతలో వేరే పనులు కూడా ఎక్కువైపోవటంతో ప్రజాపతులను సృష్టించాడు

వాళ్ళను సృష్టించి - ఒరే నాయనా మనుషులను వాళ్ళ సంతను తామరతంపర చేసే బాధ్యత మీదేనన్నాడు

ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయాడు

ఆయన మడమ అటు తిప్పటం తరువాయి, ఇచ్చిన పని తొందరగా వదిలించుకుంటే కాస్త సుఖంగా కూర్చోవచ్చు కదానన్న ఆలోచనతో ఆ ప్రజాపతులు రెచ్చిపోయి మనుషులను వృద్ధి చేసారు

ఆ తర్వాత వదిలేసారు

ఆ మనుషులు అసలే బుద్ధిశాలులు

అందుకని తమను తాము, దానితో పాటు తమ సంతతిని ఇంతింతగా అంతంతగా వృద్ధి చేసారు

దాంతో భూమి బరువు పెరగటం మొదలుపెట్టింది

మొదట్లో సన్నగా నాజూకుగా ఉన్న భూమి, ఈరోజు భరించలేనంత బరువు ఉన్నది

దాంతో ఆదిశేషుడికి తలనొప్పి మొదలయ్యింది

మరి అంత బరువు నెత్తి మీద మోయాలంటే సులభమా?

కాదు

అందుకని తలకాయనొప్పి వచ్చింది

ఇలా ఉండగా నారదుడు వచ్చాడు ఆయన వద్దకు

నారదుణ్ణి చూసి కూడా ఆదిశేషువు ముభావంగా ఉన్నాడు

తలనొప్పి ఉన్నప్పుడు ఎవరన్నా పలకరిస్తే తిక్క రేగిపోతుంది కదా!

అందుకని మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు

నారదుడేమో అసలే వాగుడుకాయ

మాట్లాడకుండా ఉంటే ఆయనకు నడవదు

అందుకని ఆయనే పలకరించాడు శేషుణ్ణి

ఏమయ్యా - చూసి కూడా చూడనట్టు ఉన్నావే! ఏమయ్యింది అని అడిగాడు

శేషుడు - అయ్యా, తలకాయనొప్పిగా ఉన్నది మీ వద్ద ఏదన్నా మందు ఉన్నదా అని అడిగాడు నారదుణ్ణి

నారదుడు తన అంగవస్త్రం వంక చూసాడు

క్రితం వారం తను దగ్గు, కఫంతో, తలనొప్పితో బాధపడుతూ ఉంటే, అమ్మ సరస్వతి శొంఠి కషాయం కాచి ఇచ్చి, శొంఠి నూరి తలపట్టు వేసి ఉపశమనం అందించి, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందని తన అంగవస్త్రం చివర ఒక శొంఠి ముక్కను కట్టి ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది

చప్పున ఆ శొంఠి ముక్క తీసి చూసాడు

ఇదిగో ఇది ఉంది - చూడు ఉపయోగపడుతుందేమో అని అన్నాడు

శేషుడికి అంత బాధలోనూ నవ్వు వచ్చింది

అయ్యా మీకు ఉన్నది ఒక తల - దానికి సరిపోతుంది ఆ ముక్క... నాకు వెయ్యి తలలు... ఇదెక్కడ సరిపోతుంది ? మంచి ఉపాయమే చెప్పారు అని ఎత్తిపొడిచాడు

నారదుడికి ఏం చెయ్యాలో తెలియలా

సరే, నీ తలనొప్పి తీర్చలేకపోయినందుకు బదులుగా ఒక వరం ఇస్తా - నేను వెళ్ళిపోయాక తూర్పు వైపు చూడు.. ఆ దిశలో నీకు కనపడ్డ మొదటి ప్రాణికి నీ తలనొప్పి సంగతి చెప్పు... నేను తీర్చలేకపోయినాను కాని ఆ ప్రాణి నీ తలనొప్పి తగ్గిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు

నారదుడు వెళ్ళిపోయాక శేషువు తల ఎత్తి చూసాడు

తూర్పు దిక్కు వైపు

అక్కడ కనపడ్డది ఒక ప్రాణి

ఏ ప్రాణి అది?

ఏనుగు

ఐరావతం లా ఉన్నది

చక్కగా నిగనిగ మెరిసిపోతూ

శేషుడు పిలిచాడు ఆ ఏనుగును

పిలిచి అడిగాడు - ఏమయ్యా - నాకు తలనొప్పిగా ఉన్నది నువ్వు తీర్చగలవా అని

ఏనుగు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది

ఆదిశేషువేమిటి, నాకు కనపడటమేమిటి? పైగా నన్ను సలహా సాయమూ అడగటమేమిటి? అని అపిరితిపిరి అయిపోయింది

ఆయన ముందు వణికిపోతూ నిలబడ్డది

అయ్యా నేను మీ తలకాయనొప్పి తీర్చగలటమేమిటి , నా తలకాయనొప్పే నేను తీర్చుకోలేను - తల చెట్లకేసి బాదుకుంటూ ఉంటా - అట్లాటిది మీ తలనొప్పి నేనెట్లా తీర్చేది అన్నది ఆయనతో

బాదుకోవటం అన్న మాటతో శేషుడికి వెలిగింది

ఏదీ నా తల మీద బాదు ఒకసారి చూద్దాం అన్నాడు

ఏనుగు నెమ్మదిగా కాళ్ళతో ఆయన తల తొక్కటం మొదలుపెట్టింది

ఇదేదో కాస్త ఉపశమనంగానే ఉన్నది, అయినా అంత మృదువుగా చేస్తే ఎట్లా? కాస్త గట్టిగా తొక్కు అన్నాడు

గట్టిగా తొక్కటం మొదలుపెట్టింది

అయినా శేషుడికి ఆనట్లా

అందుకని - ఏం చేస్తే బాగుంటుందోనని ఆలోచించాడు

ఏనుగు వంక చూశాడు. ఏనుగేమో పుల్లలా ఉన్నది. ఇలా పుల్ల కాళ్ళు వేసుకుని ఎంత తొక్కితే ఏం లాభం అనుకున్నాడు

ఆలోచించి - ఏనుగు బరువును అమాంతంగా  పెంచేసాడు

అప్పటిదాకా సన్నగా పుల్లలా ఉండే ఏనుగు ఏనుగంత అయ్యింది

కాళ్ళు ఏనుగు కాళ్ళంత లావు అయినాయి

ఇప్పుడు తొక్కు అన్నాడు

ఇంత లావైపోయానేమిటి అనుకుని ఆశ్చర్యపోతున్న ఏనుగు - అంత బరువున్న కాళ్ళతో తొక్కటం మొదలుపెట్టింది

అప్పుడు ఆనింది ఆదిశేషువుకు

ఆ బరువు ఆని, కాస్త ఉపశమనం లభించింది

అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలా

ఉపశమనం హరించుకుని పోయింది

ఇలా లాభం లేదని మళ్ళీ ఏనుగు వంక చూసాడు

తొండం కనపడ్డది

ఆ తొండం అటు ఇటూ ఊగుతోంది

అది చూసి ఆ తొండానికి అపరిమితమైన శక్తి ఇచ్చాడు

ఆ తొండంతో ఒక్కొక్క తలని చుట్టి మర్దన చెయ్యమన్నాడు

ఒక పక్క తొక్కుతూ, ఇంకోపక్క తొండంతో తలను చుట్టి మర్దన చెయ్యటం ప్రారంభించింది

అప్పుడు పూర్తిగా ఉపశమనం లభించింది ఆదిశేషువుకు

ఉపశమనం లభించింది కానీ - చెమటలు పడుతున్నాయి

ఆ మర్దన వల్ల

ఆ తొక్కుడు వేడి వల్ల

మళ్లీ ఏనుగు వంక చూసాడు

చెవులు కనపడ్డవి ఈసారి

వెంటనే వాటిని పెద్దవి చేసాడు

చిన్న చెవులుగా ఉన్నవి కాస్తా ఏనుగు చెవులంత అయినాయి

చేటలంత అయిపోయినాయి

ఇదిగో ఆ చెవులు ఊపి కాస్త గాలి విసురు అన్నాడు

ఏనుగు తన చేట చెవులను చూసుకుని మురిసిపోయింది

ఆయన అడిగినట్టే ఊపింది

అంతే!

రివ్వున వీచింది గాలి

చెట్టూ పుట్టా అన్నీ ఊగిపోయినాయి ఆ విసురుకు

అంత ఉద్ధృతంగా ఉన్నది ఆ గాలి

ఆ గాలి తగిలి శేషువు చెమటలు తగ్గినాయి

అలా ఏనుగు కాళ్ళతో తొక్కుతూ, తొండంతో మర్దిస్తూ, చెవులతో గాలి వీచుతూ శేషువుకు పూర్తి ఉపశమనం కలిగించింది

ఆ రోజటి నుంచి శేషువుకు తలనొప్పి ఎప్పుడు వచ్చినా సరే - ఏనుగు కాళ్ళు, తొండం, చెవులు ఉపయోగిస్తూనే ఉన్నది

ఆయనకు ఉపశమనం కలిగిస్తూనే ఉన్నది

ఆ మహానాగరాజుకు సేవకుడిగా ఉన్నానన్న ఆనందంతో ఘీంకరిస్తూ ఉన్నది

అలా ఓం తత్ సత్ జరిగింది

*****

జై కాకమాని మూర్తి కవి

Wednesday, August 15, 2018

శ్రీనివాస కళ్యాణం - ఒక మంచి సినిమా!

ముద్దపప్పు

అనగా ఉత్తగా ఉడికించిన పప్పు - కారం వేయకుండా, పోపు పెట్టకుండా ఉడికించిన పప్పు

ఇప్పుడు విస్తరి తీసుకోండి

వేడి అన్నం వడ్డించుకోండి

ముద్దపప్పు కలపండి

దానికి చెయ్యి జారేంత నెయ్యి జతచెయ్యండి

ఒక ముద్ద నోట్లో పెట్టండి

స్వర్గం కనపడిందా?

అందులోకి వెళ్ళిపోయారా?

ఇప్పుడు ఆ స్వర్గం నుంచి కిందకు రండి ఓ సారి

మీ అమ్మనో, అమ్మమ్మనో, నాన్నమ్మనో కాస్త ఆవకాయ్ వెయ్యండి అన్నపూర్ణమ్మలూ అని అడగండి

వారు దయ ఉంచి మీ విస్తట్లో వేసిన ఆవకాయను నెయ్యి కలిపిన ముద్దపప్పుతో కూడిన రెండో ముద్దలో కలపండి

ఆ రెండో ముద్ద ఇప్పుడు నోట్లో పెట్టండి

పది స్వర్గాలు కనపడతవి

పది స్వర్గాలు చాలనుకునుటే అక్కడే ఉండిపోండి

వంద స్వర్గాలు కావాలంటే మళ్ళీ కిందకొచ్చెయ్యండి

అలా మూడో ముద్ద, నాలుగో ముద్ద... పదో ముద్ద... ఇరవయ్యో ముద్ద లాగించెయ్యండి

అంతే!

చాలా చింపులు

అలాటి స్వర్గాలే - గోంగూర పచ్చట్లో మజ్జిగపులుసు కలుపుకున్నా కనపడతవి, మాగాయలో వెన్న వేసుకుని తిన్నా కనపడతవి, వేడన్నంలో ఉసిరి పచ్చడి కలుపుకొని తిన్నా కనప్డతవి , పెసరట్టు ఉప్మాతో తిన్నా కనపడతవి, ఇంకా ఇలాటి తెలుగు వారికే ప్రత్యేకమైన వంటకాలు తిన్నా కనపడతవి

సరే! అదలా పక్కనబెడితే - తెలుగులో సినిమాలు రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అని మాట్లాడేవారు చూడవలసిన సినిమా ఒకటున్నది

అట్లాటి సినిమా ఈ వారంలో నేను రెండు సార్లు చూసి వచ్చినాను

అవును తెలుగు సినిమానే

మొన్న ఒకసారి, నిన్న ఒకసారి

నా దురదృష్టం కొద్దీ మా ఊళ్ళో ఈ సినిమా ప్రదర్శనకు నిన్ననే చివరిరోజుట

లేకుంటే ఇంకో రెండు సార్లు చూసే పని

దానితో కాస్త మన:క్లేశం కలిగిన మాట నిజం

ఆ క్లేశాన్ని ఇలా పోష్టు రూపంలో రాసుకునన్నా తీర్చుకుందామని ప్రయత్నం

ఆ మంచి సినిమా పేరు "శ్రీనివాస కళ్యాణం"

దీని దర్శకులు సతీశ్ వేగేశ్న గారట

కథ వారిదే

మాటలు వారివే

స్క్రీన్ ప్లే వారిదే

దర్శకత్వం కూడా

ఆ సినిమా నాకు నచ్చటానికి ఎన్నో కారణాలు

- మా అమ్మమ్మకు నాకు మానసికంగా ఉన్న అనుబంధమే ఈ సినిమాలో హీరోకు వాళ్ళ నాయనమ్మకు ఉండటం

- ఈ దేశంలో ఎవరూ లేక ఒంటికాయ శొంఠికొమ్ములా బతుకీడుస్తూ బయటకు మేకపోతు గంభీరంగా ఉన్నా లోపల ఎంతోమంది మనుషులు నా చుట్టూ ఉండాలని, రోజూ ఆ దేవుడిని కోరుకునేవాడిని కనక, ఈ సినిమా నన్ను ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళి విహరింపచేసింది కనక

- ఏం చేసినా సరే, ప్రపంచం ఎటు పోతున్నా సరే మన సంప్రదాయాలు బతకాలని తాపత్రయపడే నాకు, అదే తపన ఈ సినిమా దర్శకుడి గారికీ ఉన్నదని ఆయన తీసిన విధానంతో తెలిసింది కనక. సంప్రదాయం ఒక్కొక్కరికీ, ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండవచ్చును. కానీ సామాజికంగా కొన్ని సంప్రదాయాలు ఉంటవి. అవి సార్వజనీనమైనవి. ఎన్నో వందల ఏళ్ళుగా కొద్ది కొద్ది మార్పులతో ఆట్టే తేడా లేకుండా ఉనికి సాగిస్తూ వచ్చినవి అవే! అలాటి వాటిల్లో, ఆ జాబితాలో పెళ్ళి కూడా ఒకటి. అలాగే పెద్దవాళ్ళను గౌరవించుకుంటూనే మనం మనలా బతకటం ఒకటి. అలాటి సంప్రదాయాల గురించి నేను మాట్లాడుతుంది. అలాటి సంప్రదాయాల గురించే సతీశ్ గారు చూపించింది. అందువలన నచ్చేసింది

- నే రాసుకొన్న అనగనగా కథల్లో, ఒకనాడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం రాసుకున్న కథలో ఒక చెరువు ఒడ్డున కాపరం పెట్టుకున్న రామచిలుక, చెరువు ఎండిపోయినా, చెట్టు మోడువారినా, మిగతా పక్షులు, చివరకు తన కుటుంబంలోని వారు కూడా ఊరు, చెరువు, తొర్ర వదిలేసి ఏకాకులుగా ఎక్కడో బతుకుతూ ఉండగా, ఆ చెట్టు వద్దకు విశ్రాంతి తీసుకుందామని వచ్చిన ఒక ముసలమ్మతో తాను ఎందుకు ఆ చెట్టు వదలలేదు అన్నదానిని చెపుతూ ఆ చిలక పలికిన సంభాషణలు ఈ చిత్రంలోని సంభాషణల సారంతో సరిపోవటం వలన. అందువలన నచ్చేసింది

- నేను మా ఆవిడతో ఎప్పుడూ అంటూ ఉంటాను.. దాదాపుగా ఇరవైయేళ్ళ అనుబంధం మాది. డబ్బుల సంగతి ఎప్పుడు వచ్చినా సరే, డబ్బులు ముఖ్యం కాదమ్మా మనకు, మనుషులు ముఖ్యం అని చెపుతూ ఉంటాను. ఆ ఇది, మా నాన్నగారి దగ్గరినుంచి వచ్చింది నాకు. ఆయనా అంతే. ఏనాడు డబ్బులది ప్రథమస్థానం కాలా మా ఇంట్లో. మనుషులే ఆ వరసలో ముందు. అలాటి సంభాషణాలే సతీశ్ గారి కలంలో జాలువారి హీరో తండ్రి రాజేంద్రప్రసాదు గారి నోట బయటకు వచ్చినాయి. ఒకేలా ఆలోచించే వ్యక్తులు ఈ ప్రపంచకంలో ఒకరికి మించి ఉంటారన్న సత్యం నిజం చేసినారు సతీశ్ గారు. అందువలన నచ్చేసింది

- హీరో శ్రీనివాస్ ప్రతిరోజు ఇంటికి ఫోను చేసి క్షేమం కనుక్కుంటూ ఉంటాడు. ఆ శ్రీనివాసు నేనే! ఏనాడు కూడా, నాకు జ్వరం రోగం రొష్టు రొప్పు వచ్చి మీదపడిన రోజున కూడా ఇంటికి ఫోను చేసి, పెద్దవాళ్ళ రోజు ఎట్లా గడిచింది అని అడుగుతాను కనక. సతీశ్ గారు నన్ను శ్రీనివాసును చేసారు కనక. అందువలన నచ్చేసింది

- చిత్రంలోని ఏ పాత్ర అనవసరంగా గొంతు పెంచి అరుచుకోకుండా, వెకిలితనం లేకుండా, చాలా బద్ధులై, ఓవర్ యాక్షను చెయ్యకుండా నటించారు. అది సతీశ్ గారి గొప్పతనమే. యాక్షను, కొట్లాటలు, రక్తాలు లేకుండా, మంచి కథతో వినోదం పంచవచ్చని నిరూపించిన సతీశ్ గారికి నేను అభిమానినైపోయినాను. అందువలన నచ్చేసింది

- హీరోయిను పేరు శ్రీదేవి కావటం వలన. అందువలన నచ్చేసింది

- ఇంకా ఎన్నో ఉన్నవి ఇలాటి కారణాలు - వందల్లో

అయితే సినిమాలో ఒక చోట సతీశ్ గారు హీరోయిను చేత అనిపిస్తారు - ఇతన్ని ప్రేమించడానికి నీకు వంద కారణాలు ఉండవచ్చు, కానీ పెళ్ళి చేసుకోవాలని అనుకోవడానికి ఒక్క కారణం చెప్పు చాలు అని - దానికి హీరోయిను చెప్పిన మాటకు తండ్రి వద్ద ఇక సమాధానం ఉండదు

ఈ పైన నేను ఎన్నో కారణాలు చెప్పినాను - ఈ సినిమా గురించి. అయితే ఒకే ఒక్క కారణం ఇది మంచి సినిమా ఎందుకో చెప్పు అని ఎవరన్నా అడిగితే - మనుషులతో వాళ్ళ మనసులతో, వారి మధ్య ఉన్న బంధాలతో, గౌరవాలతో, ప్రేమతో, సంప్రదాయాల మీద అభిమానాలతో ఒక చక్కని కథ అల్లుకోవచ్చని, ఆ కథతో ఒక సినిమా తీయవచ్చని, అలాటి ఒక గొప్ప సినిమా నేను చూడగలనని నిరూపించబడటమే!

ఇక సంగీతం ఈ సినిమాకు ప్రాణం

మహానటితో నాకు పరిచయమైన మికి జె మెయర్ గారు అదరగొట్టేసారు

కొన్ని చోట్ల నా గుండెను పట్టి పిండేసారు

గుండెను గొంతులోకి తెచ్చేసారు

ఆ సంగీత దర్శకుడు సతీశ్ గారి గుండెను బాగా పట్టుకున్నారు

పట్టుకుని ఈ సినిమా చూస్తున్న నన్ను సాత్త్విక భావాలకు గురిచేసినారు

సాత్త్విక భావమంటే సత్వానికి సంబంధించిన భావమనే అనుకోకూడదు

సాత్త్విక స్వభావాలు ఎనిమిదని లోకోత్తరం

సాత్త్వికం అంటే ఒక భావం

భావాలు మనుషులకు కాక ఎవరికుంటయ్యి?

ఆ భావం ఏదైనా కావొచ్చు

అయితే ఆ ఏదైనా ఈ ఎనిమిదిట్లో ఇరకాల్సిందేనని లోకధర్మం, శాస్త్రసమ్మతం

ఆ ఎనిమిదినిట్లా నిర్వచించారు

“స్తంభః స్వేదః రోమాంచః స్వరభంగః వేపథుః వైవర్ణ్యం అశ్రుః ప్రళయమ్ ఇతి అష్టౌ సాత్త్వికా స్మృతాః ”

స్తంభః అంటే నిశ్చేష్టత

స్వేదః అంటే చెమటలు పట్టటం

రోమాంచః అంటే గగుర్పాటు కలగటం

స్వర భంగః అంటే గొంతు గద్గదం కావడం

వేపథుః అంటే ఒంట్లో వణుకు పుట్టటం

వైవర్ణ్యం అంటే కళ తప్పిపోవటం

అశ్రుః అంటే కళ్ళలో నీళ్ళురావటం

ప్రళయమ్ అంటే పూర్తిగా వివశుడైపోవటం

ఇవీ ఎనిమిది సాత్త్విక భావాలు

ఈ ఎనిమిదిట్లో స్వేద:,వేపథుః, వైవర్ణ్యం తప్ప మిగతా భావాలన్నిటికీ గురైనాను నేను

సోదరుడు శ్రీమణి రాసిన పాటలన్నీ ఎంత బావున్నవో!

టైటిలు పాట అయితే అదిరింది

ఆ అదరటంలో కొంత తేడా ఉన్నది కానీ బాలసుబ్రహ్మణ్యం గారు బాగా కవరు చేసుకొచ్చారు ఆ పాటను, పూర్తి న్యాయం చేసినారు ఆ గేయరచనకు

తేడా అని ఎందుకంటున్నానంటే - మికి జె మెయర్ గారు - నాకిష్టమైన కాశీకి పోతాను రామాహరి పాట ట్యూనును, అన్నమయ్యలోని ఉయ్యాల పీసు ట్యూనుతో కలిపి కాసింత మార్పు చేసి కొత్తలోకాలకు తీసుకునిపోయినారు

పెద్దన్నగారు చైతన్యప్రసాదు గారికి కూడా ఈ సినిమాలో భాగం ఉండి ఉంటే బాగుండేదనిపించిన మాట వాస్తవం

ఇలా రాస్తూ పోతూ ఉంటే ఒక 500 పేజీలు రాయవచ్చును, రాసేస్తాను కూడాను - అందువలన ఇక్కడికి ఆపేస్తా

ఒక మంచి సినిమా, అదీ తెలుగులో చూడగలను అన్న ఆశను నిజం చేసిన సతీశ్ గారికి, వారు రాసుకున్న కథకు, సంభాషణలకు వేవేల నమస్కారాలు. ఆ కథకు పూర్తి న్యాయం చేసిన నటీనటులకు, ఆ సినిమాకు పనిచేసినవారందరికీ వేల కృతజ్ఞతలు

చివరగా ఒకటే మాట - శ్రీనివాస కళ్యాణం - ఒక మంచి సినిమా - సినిమాను విపరీతమైన లాజికుతో కాక సినిమాగా చూడగలిగిన వారు, మంచి మనుషుల మీద ఇంకా నమ్మకం మిగిలి ఉన్నవాళ్ళు అందరూ, చూడవలసిన సినిమా - చూసి తీరవలసిన సినిమా

పోతే - నెల్లూరు జిల్లాలో ఒక మాట వాడతారట

ముండమోపి అని

వారు ముండమోపి అని అన్నారంటే ఇతర జిల్లాల వారి వాడుకభాషలోని అర్థం కాకుండా వేరే అర్థం ఉందట

నెల్లూరు జిల్లా వారి అర్థం - పనికిమాలిన వా(డు)(రు) అని అట

మరి ఈ సినిమా బాలేదన్న వారిని, రివ్యూలో ఈ సినిమా బాలేదని రాసినవారిని ఆ నెల్లూరు జిల్లా వారు చూస్తే ఆ మాటే ప్రయోగిస్తారేమో!

సినిమా నచ్చనివారికి ఈ సినిమా నచ్చినవారు, నేను మరో రకంగా కనపడవచ్చు

అదీ సమ్మతమే! :) 

ఓం తత్ సత్!

Monday, July 23, 2018

షష్టిపూర్తి పుస్తకానికి ఎంత దూరం?

అయ్యా, అమ్మా - 59వ పుస్తకం పబ్లిషుడు

అందువలన ఆ విషయం మీకు సవినయంగా తెలియచేయటమైనది

ఈ 59వ పుస్తకంలో - మీరు తేల్చాల్సిన సంగతులు కొన్ని

  • తను చేసిన పనికి యముడే కారణమని మృత్యువు యముడి మీదకు ఎందుకు ఎక్కినాడు ? చివరికి తేలిందేమిటి?
  • ఒకానొక ముసలమ్మ తనకు తాంబూలం తెచ్చిచ్చిన చిచోరుడు అనే పిల్లవాడిని ఎందుకు అతలాకుతలం చేసింది?
  • ఈగల మీద యుద్ధం ప్రకటించిన తేనెటీగల వల్ల అడవిలో ఏం జరిగింది?
  • తొర్రలోని రామచిలుక ఊరిలోని ముసలమ్మకు సంబంధించిన జీవిత సత్యాన్ని ఒక్క మాటతో ఎలా ఛేదించింది?

ఇలా ఇంకా ఇంకా మీకు మీరుగా తెలుసుకోవాల్సిన సంగతులు,  మీ పిల్లలకు తెలపాల్సిన సంగతులు ఉన్నవి

పుస్తకం కొని, చదివి, మీరు పై సంగతుల్లో అన్ని సంగతులు తేలిస్తే మీ జీవితపడవ ప్రయాణం సాఫీగా సాగుతుందన్న హామీతో !

కొనాలనుకుంటే, సంగతులు తేల్చాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చునండోయ్

https://www.amazon.com/author/vamsimaganti/

హరి ఓం తత్ సత్!

షష్టిపూర్తి పుస్తకానికి, అనగా అరవయ్యవ పుస్తకానికి ఇంకొక్క అడుగే దూరం!

జై బోలో పాఠకా!

జై బోలో పరమేశ్వరా!

మీరంతా పిల్లాపాపలతో వారాంతం సంతొషంగా గడిపినారన్న ఆశతో, ఆకాంక్షతో - హరి ఓం తత్ సత్

పోతే ఇంకొక విషయం కూడా

షష్టిపూర్తి పుస్తకం అన్నాను కాబట్టి దాని సంగతి కూడా చెప్పేస్తా ఇక్కడే :-

హైదరాబాదుకు మొన్న వచ్చినప్పుడు కాక ఆ క్రితంసారి, అంతక్రితంసారి మా అమ్మ దగ్గర, పిన్ని దగ్గర, చిన్న అమ్మమ్మల దగ్గర ఉజ్జాయింపుగా ఒక వంద వంటకాయలు కొట్టించుకున్నా

వంటకాయలు అంటే మొట్టికాయలలాంటివే

వారు చేసే వంటలు నా బుర్రలోకి ఎక్కటానికి కొట్టించుకున్న బొప్పికాయలే ఈ వంటకాయలు

జగదిదితనలభీముడినైన నేను, వారి వద్ద - వారి చిన్నప్పుడు వారి అమ్మ, అమ్మమ్మల కాలంలో వారి వారి నాయనమ్మలు, అమ్మమ్మలు రాచ్చిప్పల్లో ఏం చేసే వారో అవన్నీ, వాళ్ళకు గుర్తున్నంతమటుకు కాగితాల మీద నాలుగైదు లైన్ల చొప్పున, ఉజ్జాయింపు లెక్కల్లో రాయించి తెచ్చినాను

ఆ ఒరిజినల్ రెసిపీలే కాక, వాటికి ట్విష్టులిచ్చి నా పరాక్రమం చూపిస్తూ ఇప్పటి వంటలు రాచ్చిప్పలోకి ఎక్కించినాను

ఈ రోజు దేనికో లెక్క వేయగా అన్నీ కలిపి దాదాపు 500 దాకా దేకినాయని, ఆ సంఖ్య చూసినాక కళ్ళు విచ్చుకోవటం అయినదని తెలియచేసుకుంటున్నాను

ఆ పైన ఒక ప్రతిజ్ఞ చేసినాను

ఏమా ప్రతిజ్ఞా?

అవన్నీ ఒక పుస్తకంలోకెక్కించాలన్న భీషణమైన ప్రతిజ్ఞ అది

టైటిలు, బొమ్మలు అన్నీ తయారు చేయుచుంటిని

వచ్చే వారానికి అన్నీ పుస్తకరాచ్చిప్పలోకి పడితే, విడుదలకు సంధించెద - లేనిచో ఆ పై వారం ప్రయోగించెద

ఈ రాచ్చిప్ప 60వ పుస్తకం అవుతుంది

అందుకని జయ జనార్దనా అని పాడుకొనుచున్నాను

ఇది మీకు ప్రకటనా ఫలకం (నోటీసు బోర్డు) కావునన్నూ, వచ్చే వారం దాకా మీరు చొంగకాయలు సవరించుకుంటూ ఉంటారనిన్నూ ఆశిస్తూ

మరియొకసారి ఓం తత్ సత్!

Monday, July 16, 2018

రోజూ ఇలా ఎవరో ఒకరు ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి పోతే....

అనగనగా

ఒక రోజు

ఆ రోజు ఎప్పటిదో కాదు

నిన్నటిదే, నిన్నటి ఆదివారపు రోజు

నేను బే ఏరియా వెడదామనుకొనగా - అత్యంత విచారకరంగా నేను వెళ్ళి కలవాల్సిన కుటుంబం వారికి తెలిసినవాళ్ళ పిల్లవాడిదో భర్తదో బర్తడే కావటమ్మూలాన వెడుతున్నామని, అందువలన ఉండమని నిక్కచ్చిగా , ఆనందంగా చెప్పినారు - దానితో వారి ఆనందములో బొగ్గులు పొయ్యటం ఎందుకని అనుకోని ఇంటియందు కూర్చొని "2037లో" అన్న పుస్తకం కూర్పు చేసి Circa 2037 అన్న టైటిలు పెట్టి పబ్లిషు చేసెదమని కూర్చొనినాను.

కుర్చీయందు కూర్చొనగానే, అంతకు ముందు రోజు చంద్ర రెంటచింతల వారికి అటు వచ్చినపుడు కలుస్తానని చెప్పిన సంగతి గుర్తురాగా, అయ్యా - నా ప్లాను పటాపంచలు అయినది - అందువలన వచ్చుట లేదు అని చెపుదామని ఫోను చేసినాను

ఎన్నో ఏళ్ళ నుంచి తెలిసిన వారే అయినా ముఖపరిచయమూ, వాక్పరిచయమూ లేకపోవటంతో ఇదే వారితో మొదటిసారి మాట్లాడటంగా చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయింది

చక్కగా, చాలా మర్యాదగా, వినయంగా, పరమశ్రోత్రియంగా మాట్లాడినారు వారు. సోషలు మీడియానందు ఎట్లాగున ఉండెదరో అట్లాగునే మాటలాడినారు. ఆనందము వేసినది

నేను విషయం చెప్పిన పిదప - ఫరవాలేదండి, నేను ఖాళీనే, నేనే వచ్చేస్తా మీ వద్దకు మీకేమన్నా అభ్యంతరమా అని అడిగినారు

తప్పించుకు తిరిగే మనుషులున్న కాలంలో అయ్యా మీ ఇంటికి రావచ్చా అని అడిగేవారుండటం నా అదృష్టం. నాలోని సప్తసముద్రాలు ఉప్పొంగినాయి. వచ్చెయ్యండి భోజనానికి అనినాను. వారు భోజనం అనగానే సిగ్గుపడినారు. వద్దండి అని వంకరలు తిరిగినారనిపించినది. ఫోను కావటం వల్ల కళ్ళకు కనపడలేదు కాని.

వచ్చెయ్యండి ఆలస్యం చేయకుండా అని ఒత్తిడి చేయటంతో వారు ఆఘమేఘాల మీద బయలుదేరినారు.

నేను ఇంతలో వంకాయ ఉల్లిపాయ టమాట మసాల కూర, బెల్లపు కొత్తిమీర చారులతో నాకు వచ్చిన దిక్కుమాలిన వంట ఏదో చేసినాను.

రెండు గంటలు అయినది

బెల్లు మోగినది

తలుపు తీసినాను

చక్కగా బాలచంద్రుడి వలె స్వచ్ఛమైన నవ్వుతో కళ్ళలో మెరుపులతో ఒక సుందరాకారుడు

వెంటనే మనసుకు చాలా ఆనందమయినది

అంత నిర్మలంగా నవ్వుతూ ఇంటికి వచ్చే వాళ్ళను చూస్తే ఆనందమేగా మరి

లోపలికి వస్తూనే చక్కని పుస్తకం ఒకటి చేతిలో పెట్టినారు

రాములవారి బొమ్మ అట్ట మీద ఉన్న పుస్తకం అది

రాములవారంటే నాకు మనసు ఆగదు

ఆ బొమ్మ చూసి తన్మయమయినాను

ఆ పుస్తకం తెచ్చిచ్చిన చంద్రుల వారికి ధన్యవాదాలు తెలుపుకొనినాను

పైన రెండు గంటలు అనినాను కదా? రెండు గంటలు అనగా మధ్యాహ్నము రెండు గంటలు కాదు - వారికి ఫోను చేసిన పిదప జాలువారిన గంటల సంఖ్య అది....

వారి రాక సమయము సుమారు 12 గంటలకు


ఆ తరువాత ఒక అరగంట పిచ్చాపాటీ

ఆ తరువాత భోజనానికి లేచినాము

వంకాయ కూర నచ్చినదో లేదో తెలియదు కానీ, నేను రెండు సార్లు వారి పళ్ళెంలో వెయ్యటంతో గుడ్ల నీరు కుక్కుకొని లొట్టలు వేసుకుంటూ తినినారు... సీమ వారయ్యుండటం మూలాన , మా ఉసరి పచ్చడి, ఆవకాయ కారం నసాళానికి అందలేదనుకుంటా - ఆ ఇదీ ఒక కారమేనా అనుకొంటూ పచ్చడి ఒక ముద్ద నలిచినారు అనిపించినది... ఆ తరువాత బెల్లపు చారు పోయగా ఇబ్బంది పడినారు.. అసలే వంకాయ కూర కాస్త తీపిగా చచ్చినది - నాకే నచ్చలేదు.... ఎందుకనగా - మొన్న ఉల్లిపాయలు తెచ్చునపుడు ఉత్త ఉల్లిపాయలు, తీపి ఉల్లిపాయలు (రెండూ ఒకే రకముగా ఉంటవి మా దరిద్రపు పచారీ కొట్లయందు....) పక్క పక్కగా ఉండగా పొరపాటున తీపి ఉల్లిపాయాలు తెచ్చి తగలడినాను .... అది వంటలో గుప్పెడు వంకాయల కూరమూకళ్ళో వేసినాక ఎనిమిది కిలోల కారం వేసిన ఆ తీపి పోలేదు.... చింతపండు వేస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుందేమోనని ఊరకుంటిని....దానికి తోడు ఈ తీపి చారేందిరా నాయనా , ఇదేమి కృష్ణా జిల్లా వంటలో ఏమో రా నాయనా అనుకున్నారో ఏమో - అయ్యో వద్దండి, వద్దండి అని చేతులు అడ్డము పెట్టినారు.... ఆ తరువాత గడ్డపెరుగు వేసుకొని భోజనము పూర్తించినారు

ఆ భోజన సమయమందు ఎన్ని కబురులో ?

మహామహోపాధ్యాయ శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి సంగతుల నుంచి - బే ఏరియాలో ఉన్న కథకుల దాకా ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడుకొనినాము

చివరకు భోజనము పూర్తి అయినది

ఇక తరువాత ఆనందకరంగా ఎన్నో విశేషములు, సంగతులు, ఫేసుబుకింగులు ఇలా ఒకటీ రెండు కాకుండగా ఎన్నో విషయాల మీద చక్కగా కబుర్లతో సమయము గడిచినది

వయసులో చిన్నవారే కానీ మనసు చాలా పెద్దది ఆయనది. నా పుస్తకాల మార్కెటింగు విషయంలో ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చినారు వారు! వాటిలో కొన్ని ఇంతకుముందు గురువుగారు షాడో మధుబాబు గారితో, సత్య పామర్తి గారితో మాట్లాడిన విషయాలు ఉన్నవి. మరికొన్ని కొత్తకొత్త పుంతలు తొక్కే సలహాలు ఇచ్చినారు. అందుకు వారికి ధన్యవాదాలు. అవన్నీ ఎప్పటికి ఆచరణలోకి పెట్టగలనో ఏమో, కానీ ప్రయత్నం చేస్తానని వారికి మాట ఇచ్చినాను...ఒకసారి మాట ఇచ్చినాంటే చేసి తీరతాను కనక - చేస్తాను ....

చంద్రగారూ - చేస్తాను... కాస్త ఓపిక పట్టి నా బద్ధకాన్ని భరించండి

ఆ తరువాత సుమారు నాలుగు గంటలు అవుతూండగా ఇక శలవు పుచ్చుకొనినారు వారు

రోజూ ఇలాటి మంచివారు, మన గోలే కాకుండగా అవతలి మనుషుల గురించి, మనసుల గురించి ఆలోచించే మనుషులు ఎవరో ఒకరు ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి పోతే, మనసులు మనుషులు బాగుంటారు

తెలుగు దేశంలో ఇంటిలో ఎంతోమంది మనుషులు అలవాటు అయిన ప్రాణం... ఈ దేశంలో చాలా మటుకు ఒంటికాయ శొంఠికొమ్ము బతుకు అయినాక ఆ తీపి గుర్తులు పోయినాయి.... కానీ చంద్ర గారి లాంటి వారు ఉన్నంతమటుకు, ఇక్కడ ఈ దేశంలో ఆ గుర్తులు నిత్యం చిగురిస్తూనే ఉంటాయ్. నాకు ఆనందం కలిగిస్తూనే ఉంటాయ్.

ఏదేమైనా సీమ వారి ప్రేమలు ఆప్యాయతలు వేరండి....

చక్కగా భేషజం లేకుండా నిజమైన మనుషుల్లా ఉంటారు....

నాకు నా చిన్నప్పటి ఆడిటింగుల జమానా నుంచి తెలుసు ఆ సంగతి, పైగా మా ఇంటి పక్కన పోర్షనులో సీమ వారే ఉండేవారు - ఎంత ఆప్యాయంగా ఉండేవారో... 

చివరిగా - ఈ వారం వారి హైదరాబాదు ప్రయాణం చక్కగా సాగి, క్షేమంగా లాభంగా తిరిగిరావాలి అని కోరుకుంటూ

ఓం తత్ సత్!

Saturday, July 7, 2018

అవకాశం చిక్కటం అదృష్టం !హైదరాబాదు నందు ఒకానొక అద్భుతమైన సాయంత్రం పూట , అదృష్టం జెర్రిపోతులా పాకుతూండగా ముగ్గురు సాహితీ మాంత్రికులతో అర్భక పిపీలకం ( నేనే ఆ పిపీలకాన్ని - ఇటు చివర బట్టతల మరియు తెల్ల మీసాలతో ఉన్న శాల్తీని).... రవి ఇ.ఎన్.వి గారి ఫోనులో బంధించబడి నాకు వచ్చిన పిదప బ్లాక్ & వైటు చేసి ఇక్కడ పోష్టినాను

ఇటు చివర, నాకు ఎదురుగుండా కళ్లజోడుతో తెలుగు సాహితీ లోకానికి లభ్యమైన మరో ఆచార్య తిరుమల రామచంద్ర గారిలాటి మహావ్రాతకర్త రవి ఇ.ఎన్.వి గారు

ఆయన పక్కనే ఆలోచనల్లో, క్రియేటివిటీలో, వ్రాతలో వందమంది ఐన్స్టీనులకు సాటైన షాడో గారు - ఆయనతో, ఆ మా గురువుగారితో కూర్చుంటే సమయమే తెలియదని చెప్పటం - చదివేవాళ్ళు అతిశయోక్తి అనుకుంటారేమో కానీ, ఆ మాట ఆయన షాడో పుస్తకాలు రాసినంత నిజం!

ఆయనకు ఎదురుగా,నా పక్కన సాహిత్యానికి, ఆప్యాయతకు, మానవతకు మారుపేరైన అట్లూరి వంశోద్భవుడు అనిల్ అట్లూరి గారు - ఇలా ఆ ముగ్గురితో గడిచిన సాయంత్రం నా జీవిత డైరీలో ఒకానొక అత్యంత ఆనందకరమైన పేజీ ...******


ఈ పై భేటీలో, పిచ్చాపాటిలో - రవి ఇ.ఎన్.వి గారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనకు రాసిన అద్భుతమైన వ్యాఖ్యానం - పుట్టపర్తి నాగపద్మిని గారు అచ్చువేయగా - ఆ పుస్తకం కాపీ మా అందరికీ అందచేసినారు********


అదే హైదరాబాదు నందు ఇంకొక అద్భుతమైన సాయంత్రం పూట , అదృష్టం ఇంకొకసారి జెర్రిపోతులా పాకుతూండగా అన్నగారు, మా పెద్దన్నగారు, సినీ గేయ బాహుబలి శ్రీ చైతన్యప్రసాదు గారితో ఒక రెండు గంటలు గడిపే సమయం చిక్కింది.... ఆ ఆనందాన్ని వారి అబ్బాయి ప్రణవ్ ఫోనులో ఇలా బంధించినారుఅప్పుడే సహస్రవర్ష అందించి నన్ను ఆయన రాతలో తడిపేసారు, గుండెలను తడిమేసారు .....

బ్రహ్మాండంగా ఉన్నది ఆ పుస్తకం....

కవరు పేజీ కళ్ళు తిప్పుకోనీకుండా కట్టిపడేసింది ...
లోపల రాత గుండె వేగాన్ని తగ్గనివ్వకుండా పరుగెత్తించింది...
**********

ఆ తర్వాతి రోజు రెండు చేతులతో, పది వేళ్ళతో ఎడాపెడా తెలుగు సాహిత్యాన్ని పరుగెట్టించే సవ్యసాచి కస్తూరి మురళీకృష్ణగారు మా ఇంటికొచ్చి ఆతిథ్యం స్వీకరించినారు... నవ్యసాహిత్య విపణివీధి, ప్రచురణల అచ్చువీధి ఎలా ఉన్నదీ అన్న సంగతుల మీద చక్కగా మంచి లాజిక్కుతో అనర్గళంగా ఉపన్యసించినారు.

వీడ్కోలు తీసుకుంటూ వారు ఈ మధ్య అచ్చు వేసిన రైలు కథల సంకలనం ఆదరంగా, ప్రేమతో ఇచ్చి వెళ్లినారు....ఆ పుస్తకంలోని కథలు బావున్నవి... కొన్ని నాకు బాగా నచ్చినాయి.... వాటి గురించి వివరంగా తర్వాత రాస్తాను 

వారితో కూడా ఒక ఫుటో తీసి ఉంటే బాగుండేది కాని, ఎందుకో ఆనందంలో ఇద్దరమూ గొళ్ళెము మరచితిమి


********


ఆ తర్వాతి రోజు ఏడువందల తొంభై తొమ్మిది చేతులతో, మున్నూరు కోట్ల అంశాల మీద ఎడాపెడా రాసేస్తూ తెలుగు బ్లాగులను పరుగెట్టించి, ఆ తర్వాత ప్రచురణా రంగంలో తనదైన ఖచ్చిత, రత్నఖచిత ముద్ర వేసిన సవ్యసాచీమణి వలబోజు జ్యోతి గారు మా ఇంటికొచ్చి ఆతిథ్యం స్వీకరించినారు...

నవ్యసాహిత్య విపణివీధి, ప్రచురణల అచ్చువీధి ఎలా ఉన్నదీ అన్న సంగతుల మీద చక్కగా మంచి లాజిక్కుతో అనర్గళంగా వారు కూడా ఉపన్యసించినారు.

వీడ్కోలు తీసుకుంటూ రెండు పుస్తకాలను ఆదరంగా అందించినారు...ఒకటి జ్యోతి గారు పుస్తక శతప్రచురణలు పూర్తి చేసిన సందర్భంగా అచ్చేసిన పుస్తకం కాగా, రెండవది కొవ్వలి సత్యసాయి మాష్టారు గారి పదనిసలు పుస్తకం (ఇదీ జ్యోతి గారు అచ్చువేసిందే!)

రెండూ చాలా బ్రహ్మాండంగా ఉన్నవి...

ఆ పుస్తకాలు రెండిటినీ ఫోటోలు తీసినాను కాని, ఇక్కడ వేద్దామని చూస్తే అత్యంత విచారకరంగా File is corrupted అని వస్తున్నది ...

వారితో కూడా ఒక ఫుటో తీసి ఉంటే బాగుండేది కాని, ఎందుకో  కస్తూరి వారితో జరిగినట్టే ఆనందంలో ఇద్దరమూ కెమెరా గొళ్ళెము మరచితిమి !


**********

అలా హైదరాబాదులో ఉన్న కొద్ది రోజుల్లో అనుకోకండా ఇంతమందిని ముఖీనంగా కలవగలిగిన అవకాశం చిక్కటం నిజంగానే అదృష్టం

పోతే - కలవటానికి కుదరక కొద్దిమందితో ఫోనులో మాట్లాడే అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడినాను - శ్రీ బాలాంత్రపు హేమచంద్ర గారు, సోదరి అయ్యలసోమయాజుల మాధవి, కొవ్వలి సత్యసాయి మాష్టారు గార్లతో మాట్లాడటం ఒక మంచి అనుభూతి

ఉన్న కొద్ది రోజుల్లో మా ఇంటర్నెట్టు, ఆ పైన జీమెయిలు సతాయించడంతో, అందులో ఉన్న సోదరి చంద్రలత ఫోను నంబరు తెలవక ఆవిడతో మాట్లాడటం కుదరక చాలా చింతించినాను! అలాగే మా పెద్దగురువుగారు డాక్టర్ కె.బి.గోపాలం గారిని కలవలేకపోవటం కూడా చాలా చింతించే వార్త !

ఇంకో ఇద్దరు ముఖ్యమైన మనుషులు, నా జీవితానికి ఒక రకంగా చుక్కాని లాంటి వాళ్ళు శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు, పామర్తి సత్యనారాయణ గార్లను ఈ సారి కూడా కలవటం కుదరలా - అది కూడా అత్యంత విచారకరం

మరల వచ్చే జనవరి-ఫిబ్రవరిలో హైదరాబాదు వచ్చినపుడు  మరింత మందిని ముఖాముఖీగా కలిసే అదృష్టం కలుగుతుందని ఆశిస్తూ

ఓం తత్ సత్!
Monday, June 4, 2018

రంభలతో మన సాహితీ భవిష్యత్తు......

సాహిత్యం

ఆసక్తి

పత్రికలు

సాహిత్యమ్మీద ఆసక్తిలో పత్రికలు

ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం అని వర్తమాన నానుడి

ఏ సంపాదకులను చూసినా ఏమున్నది సాహిత్యకారణం అని భవిష్యత్ నానుడి

ఏ పత్రికా పాఠకులను చూసినా ఏమున్నది జన్మకారణం అని పురాతన నానుడి

మనం వర్తమానంలోకి చూడనక్కరలా

మనం భవిష్యత్తులోకి చూడనక్కరలా

ఒకడు పత్రిక పెడతాడు

ఒకడు పుస్తకాలు రాస్తాడు

అందరూ సాహిత్య సేవ చేసేవారు వీరని అనుకుంటారు

అలా అనుకున్నవారు పొరపాటు పడతారు

ఈ లోకంలో, ఈ ప్రపంచకంలో సేవ చేసేవారు ఎవరూ లేరు

సేవ చేసుకునేవారే

అంతా సేవ చేసుకునేవారే

కావడి కొయ్యేనోయ్ అన్న మాట సత్యమైతే, ఈ సేవా సత్యమే!

అయితే సత్యం ఎల్లకాలాల్లో ఒకలాగున ఉండదు

ఒకడికి సత్యం, ఇంకొకడికి అసత్యం

ఆ సత్యపు స్థాయి చూసే వాడి కన్ను కామెర్ల స్థాయిని బట్టి ఉంటుందని వాక్కు

కాలపు సత్యం ఒకటుంటుంది

యుగపు సత్యం ఒకటుంటుంది

మానుష సత్యం కూడా ఒకటుంటుంది

సత్యం, యుగ సత్యం దివికేగిపోయినాయి

కాలం చేసినాయి

ఈనాడు మానుష సత్యం ఒకటే మిగిలి ఉన్నది

యుగం మనిషి సృష్టేనని వాదించే మనుషులున్న కాలం ఇది

కాలం కూడా మనిషి సృష్టేనని వాదించే మనుషులున్న కాలం ఇది

కాలమన్నది ఎప్పుడూ ఉన్నది

మనుషులు దానికి ఒక కొలమానం, ఒక పనిముట్టు, ఒక సాధనం పెట్టుకున్నారు అంతే

కాలానికి తోడు ఎప్పుడూ సత్యమే

ఏకవస్త్ర సత్యమే

పొరలు లేని సత్యమే

అది ఎరిగిననాడు ఆ సత్యం తేటతెల్లమవుతుంది

మానుష సత్యం అలాక్కాదు

మనిషి శరీరంలానే పొరలు పొరలుగా ఉంటుంది

ఉల్లిపొరలుగా ఉన్నది

ఒకరు ఒక పుస్తకం రాసారు

ఒకరు ఒక వ్యాసం రాసారు

పుస్తకం నచ్చినవారికి ఆ రచయిత నచ్చుతారు

ఆ పుస్తకంలోని పొరలు నచ్చుతాయి

ఆ రచయితలోని పొరలు నచ్చుతాయి

వ్యాసం నచ్చినవారికి ఆ వ్యాసకర్త నచ్చుతారు

ఆ వ్యాసంలోని పొరలు నచ్చుతాయి

ఆ వ్యాసకర్తలోని పొరలు నచ్చుతాయి

ఒకరు ఒక పత్రిక పెట్టారు

ఒకరు సంపాదకులయ్యారు

ఇంకొకరు గుంపుగా సంపాదకులయ్యారు

ఆ పత్రిక నచ్చినవారికి ఆ పత్రికలోని పొరలు నచ్చుతాయి

ఆ పత్రికా సంపాదకుల్లోని పొరలు నచ్చుతాయి

అలా నచ్చినవారు సంపాదకులు సేవ చేస్తున్నారంటారు

తమ విలువైన సమయం వెచ్చిస్తున్నారంటారు

పాఠకుల కోసం వెచ్చిస్తున్నారంటారు

కాదు

కానే కాదు

గజ్జి, గుల, జిల, తీంట్రము, తీవిరము, దురద, దూల, నవ్వ, నస, నసిమిరి అన్న పర్యాపదాలు కల కండూతి అది

అది ఎవరికి ఎంత ఎక్కువగా ఉంటే అంత సేవ చేస్తున్నట్టు

అది ఎవరికి వారికి లోపల తెలిసిన సత్యమే

పులిమేస్తున్నారు దానిని

నలిమేస్తున్నారు దానిని

జనాల మీద

పాఠకుల మీద

చదివేవారి మీద

సంపాదకులు సంపాదకీయం రాయగానే ఒక ముచ్చట

వ్యాసకర్త ఒక వ్యాసం రాయగానే ముచ్చట

ఒక రచయిత ఒక పుస్తకం రాసాననగానే ఒక ముచ్చట

ఒకటి రాసానని, ఇంకొకటి

ఇంకొకటి రాసానని ఇంకొకటి

అలా కాంక్ష

ఇది పత్రికలకు, సంపాదకులకు వెరసి మొత్తంగా మనుషులకు కూడా అతుక్కునే వాదం

ఇదంతా వాదనా విధానం

వాదనలో రకరకాల ఇళ్ళు

ఎవరి ఇల్లు వారి ఇష్టం

ఎవరి ఇంట్లో లక్ష్మణ రేఖలు వారికి

లక్ష్మణ రేఖలు దాటేవారు కొంతమంది

ఒకరు ఆనాడు లక్షమణ రేఖ దాటినందువల్ల రామాయణం దొరికింది మనకు

ఈనాడు లక్ష్మణ రేఖ దాటనివ్వట్లా ఎవరూ!

చరిత్ర నేర్పిన పాఠమని అనుకుంటున్నారు

అంతా పిచ్చి

ముండమోపితనం అది

నెల్లూరు భాషలోని ముండమోపితనం అది

లక్ష్మణ రేఖలు ఎక్కువయినాయి

అవసరం ఉన్న చోటని లేదు

అవసరం లేని చోటని లేదు

అంతా జాగ్రత్త

అంతా ముందుజాగ్రత్త

ఇదంతా ముందుచూపుతనమని ముసుగు

ఆ ముందుచూపుతో సేవ చేసేవారంతా ఎంతో చేస్తున్నారని అపప్రథను సత్యంగా భ్రమింపచేస్తున్నారు

దానికి వత్తాసు

వత్తాసు కూడా నచ్చటం వల్ల

ఇదంతా నచ్చటం వల్లే

ఒకరు నచ్చటం వల్ల

వారి తోడు లేకపోతే తమ ఉనికి ఏమయిపోతుందోనన్న భయం

భయభ్రాంతులు వారు

అంతా అంతే!

సత్యం కాదది

సేవ అది

ఆ మనుషులకు, ఆ తోడుకు, ఆ సంపాదకులకు, ఆ పత్రికలకు, ఆ వ్యాసకర్తలకు, ఆ రచయితలకు, ఆ వగైరాకు సేవ అది

తద్వారా స్వసేవ అది

నచ్చింది రంభ

తావలచింది రంభే!

అలాటి రంభలతో మన భవిష్యత్తు ఈరోజే, ఈ వర్తమానంలోనే కనపడుతోంది

మన సాహితీ భవిష్యత్తు

చాలా చక్కగా కనపడుతోంది

(ఒకప్పటి ఫేస్ బుక్ పోష్టు - ఈ రోజు ఏదో చదువుతుంటే నవ్వు అలుముకోగా, ఏనాడో అలికిన ఈ పేడ గుర్తుకువచ్చి ఇక్కడ పోష్టినాను. పోతే అందరూ తెలుసుకోవాల్సిన సంగతేమిటంటే - ఈ రోజు నేనూ ఒక రచయితనే. ఎవరి తోడు కోసం చూడని రచయితనే! ఎవరి తోడు లెక్కచెయ్యని, ఎవరి సత్యాన్ని లెక్కచెయ్యని మనిషినే! తోడు ఉంటే సేవ, సేవ ఉంటే స్వసేవ, తద్వారా ముసుగు, తద్వారా అసత్యం - అంతా ఒక చక్రం .... కాలమే తన సత్యాన్ని ప్రకటిస్తుందన్న నమ్మకంతో....:) )

Friday, June 1, 2018

సాహిత్యము చంక నాకుతున్నదా?

బహుముఖీనం

బహుముఖం

బహుముఖం అంటే ఏమిటి?

ఎక్కువ దృక్కోణాలు కలిగినది అని

దృక్కోణం అంటే ఏమిటి?

ఏదైనా ఒక దానిని పరిశీలించే పద్ధతి

ఉదాహరణకు వంకాయను తీసుకొందము

వంకాయను ఒకని చేతియందు పెట్టి దాని మీద వాని పద్ధతిని పరిశీలించెదము

వంకాయ ఒకనికి పంకజముఖి

ఒకనికి దురద

ఒకనికి పచ్చడి

ఒకనికి కూర

ఒకనికి పచ్చిపులుసు

ఇంకొకనికి ఇంకొకటి

అది వాని వాని రుచిని బట్టి ఉండును

అది వివిధ సమయాలయందు వివిధములుగానుండును

సాయంకాలమందు నచ్చకపోవచ్చును

మధ్యాహ్నము బాగుండవచ్చు

అదీ కాక వంటవాని హస్తలాఘవం దానిని ప్రభావితం చేయును

వంటవాని రోజు ఎట్లా ఉండునో ఆ రోజు వంకాయ అట్లా ఉండును

వానికి తిక్క ఉన్నచో వంకాయ కూడా అటులనే ఉండును

వానికి మంచిగా ఉన్నచో వంకాయ కూడా అటులనే ఉండును

వంటవానిని, మనిషిని వదలి ఇప్పుడు అసలు సంగతికి వచ్చెదము

అనగా వంకాయ వద్దకు వచ్చెదము

వంకాయ అనగా వార్తాకము

ఈ వంకాయ అను పద్రాథమునకు ఎన్నో రూపాలు, ఎన్నో రకములున్నవి

బండ వంకాయ, చిన్న వంకాయ, పొడుగు వంకాయ, సన్నతోలు వంకాయ, ముళ్ళ వంకాయ, గుత్తివంకాయ, కత్తెర వంకాయ, అడవి వంకాయ, జింకులక వంకాయ ఇలా ఎన్నో రూపాలు ఆ వంకాయకు

ఇదంతా ఒక దేశంలోనే

ఒక ప్రాంతంలోనే

వాటిలో మరల ఏలాటి నేలలో పండితే ఆలాటి సారము ఆ వంకాయకు

రాయలసీమ దేశపు వంకాయకు కోన సీమ దేశపు వంకాయకు తేడా

తెలంగాణా దేశపు వంకాయ  కోస్తా అనధ్ర దేశపు వంకాయకు భిన్నం

కొన్ని కనరు

కొన్ని అకనరు

కొన్ని రుచి కొన్ని అరుచి

చివరాఖరికి చెప్పొచ్చేదేంటంటే ఇలాటి వంకాయ, బహురూప వంకాయ - మన సాహిత్యానికి ప్రతీక

తెలుగు సాహిత్యానికి వంకాయకు అట్టే తేడా లేదు

పచ్చిపులుసు చేయు కవుల వలన కవిత్వము నడిచినది

రకరకాల పదార్థములు వేసి వంకాయను జిగటగా జారుడు చేసినారు కవులు

పచ్చడి చేయు కథకుల వలన రోటిపచ్చడి కథలు పోయి మిక్సరు పచ్చడి కథలు వచ్చినవి

అది గమనించినారో లేదో!

కూర చేయు కథకులు కథకళి ఆడుచున్నారు

కథకులలో కనరు కల కథకులు ఉన్నారు

కవులలో కనరు కల కవులు ఉన్నారు

ఏలాగున చూసినా సాహిత్యమనే వంకాయను వివిధ విధాలుగా వండుచున్నారు

వంకాయ వంటల మీద పుస్తకాలు అచ్చు వేసి డబ్బులు చేసుకున్న రచయితలు రాజ్యమేలే పొలం మన తెలుగు నేల

వంకాయతో అనగనగా కథలు రాసి పబ్లిషు చేసే నాలాటి వాళ్ళు ఎంతో మంది

శ్రీనాథుడు వంకాయ మీద రాసినాడు కనక గొప్పవాడు అయినాడు

అతని సాహిత్యము గొప్ప పేరు అందుకున్నది

పాత కాలపు సాహితీ కారులంతా వంకాయ కూర తిని సాహిత్యము రాసినారు

అందుకే వారి వంకాయ సాహిత్యము అన్ని పుంతలు తొక్కినది

ఈనాడు వంకాయ వాడకము తగ్గినదా?

లేదే!

అప్పుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడూ అట్లానే ఉన్నది

పాత వంకాయ మీద మందులు పిచికారీ చేయలేదు కనక స్వఛ్చముగా నున్నది

ఈనాడు మందులు పిచికారి చేయకపోతే వంకాయ బతకదు కనక కల్తీగా ఉన్నది

వంకాయకు కూడా కాలప్రభావం తప్పదు అని నిరూపితమైనది కావున చింత అనవసరం

ఈనాటి వంకాయే రేపటి సాహిత్యము

రేపటి వంకాయే ఈనాటి సాహిత్యము

అందువలన వంకాయ బహుముఖీనతను, దాని జగదిదిత పరాక్రమమును వాడుకొను సాహితీ రచయితా విమర్శక శిఖామణుల మీద నిప్పులు పోయక, దయ వుంచి కొత్త కథలు, కొత్త విమర్శ రాసి ఎవరైనా చూపించగలరేమోనని ఆశగా వేచి చూడటమే మనం చేయగలమేమో!

వంకాయ వలెనె సాహిత్యమూ నడిచినది, నడుచుచున్నది... వంకాయను కొత్త నవీన శతాబ్దాములో ఇంకేదో విధములుగా చేయుమని ఎవరైనా చెప్పినా వినకుండ మీ పని మీరు చేయుడు.

నాశనమైనా, వినాశనమైనా, ప్రాభవమైనా అంతా మీరు చేసినదే!

ఎవరు చేసిన దానికి ఫలము వారనుభవింతురు అని మన పెద్దవారు వంకాయను పిండి మరీ చెప్పినారు....

ఎంత చేసినా వంకాయ వంకాయే కద?

దాని కథ వంకాయ కథే కద

దాని కవిత్వం వంకాయ కవిత్వమే కద

ఏమో - ఎవరికి ఎరుక?

Thursday, May 31, 2018

ఆ ఆకాశవాణి ఫోల్డరులో.....

సన్నిధానం శ్రీనివాసరావు గారనే వారు ఎవరో నిన్న రాత్రి ఈమెయిలు పంపించి హేమలత లవణం గారి పాత బొమ్మలు ఏవన్నా ఉన్నవా అని అడిగినారు

వారికి ఈమెయిలు పంపించినాక ఆ చిత్రంతో పాటు ఆ ఆకాశవాణి ఫోల్డరులో, ఆ సంవత్సరంలో ఉన్న మరి కొన్ని ఇక్కడ వేస్తే పని అయిపోతుందని అనిపించి వెయ్యటం! అంతకు మించి ఇంకేమీ లేదు...

ఇవి ఇంతకుముందు ఎన్నో ఏళ్ళ క్రితం, నా ఫేస్ బుక్ అక్కవుంటు బతికి ఉన్నప్పటి సంగతి లెండి. అప్పుడు అక్కడ కూడా పంచుకున్న గుర్తు

Btw - these are from 1973/74