Saturday, January 7, 2017

ఉప్మారవ్వా రావమ్మా ...

ఉప్మారవ్వా రావమ్మా
నా ఆకలి తీర్చమ్మా
ఒక్కసారి నన్నూ
ఓదార్చీ పోవమ్మా
ఉప్మారవ్వా ||

మధురమైన జీడిపప్పు
మైమరచి వేస్తేను
నోటిలోని స్వాద ముకుళము
మాయమౌతాదంటా
ఉప్మారవ్వా ||

గుమ్మైన ఉలిపాయ పచిమిరప
మైమరచి వేస్తేను
నోటిలోన నాకసొరగము
ప్రత్యక్షమౌతాదంటా
ఉప్మారవ్వా ||

రంజైన రామ్ములగ
మైమరచి వేస్తేను
నోటిలోన వైకుంఠమే
పవ్వళించునంటా
ఉప్మారవ్వా ||

ఘుమఘుమల పోపులే
మైమరచి వేస్తేను
నోటిలోన కైలాసమే
నాట్యమాడునంటా
ఉప్మారవ్వా ||

యెందరెందరో తిన్నారూ
యేమేమో అన్నారూ
సుతీమెత్తానైన నీకూ
బంగారు పతకాలూ బహుమానమిచ్చారూ
ఉప్మారవ్వా ||

ఉప్మారవ్వా రావమ్మా
నా ఆకలి తీర్చమ్మా
ఒక్కసారి నన్నూ ఓదార్చీ పోవమ్మా
ఉప్మారవ్వా ||

-- Sometime, long long time ago!

No comments:

Post a Comment