Wednesday, January 11, 2017

వీళ్ళ పేర్లన్నీ వింతగా ఉంటాయండి

వీళ్ళ పేర్లన్నీ వింతగా ఉంటాయండి

ఎవరి పేర్లండి ?

రాయలసీమ వాళ్ళవి

ఏం ఎందుకలాగన్నారు ?

పుల్లారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని అదేదో గమ్మతు పేర్లుంటాయ్. ఆ పేర్లకు అర్థమేమిటో ఇంతమటుకు ఎవరికీ తెలీదు

మీకు తెలియదని వేరేవారికి తెలియదని ఎందుకనుకుంటున్నారు ?

అయితే మీకు తెలుసా సార్ ?చెప్పండి అయితే

పుల్లా రెడ్డి - ఈ పేరు "ఫుల్ల" నుంచి వచ్చింది. ఈ ఫుల్ల అనేది సంస్కృత శబ్దం. ప్రఫుల్ల, ఉత్ఫుల్ల అని వినినావా ఎప్పుడన్నా?

వినలేదు కానీ ప్రఫుల్ అని బెంగాలి స్నేహితుడుండేవాడు సార్ నాకు

మరికనేం ?

మరికనేం అని వదిలెస్తే ఎట్ల సార్....చెప్పండి..

ఆ ఫుల్ల వికసించి మన వారి చేత వికృతిగా పుల్ల గా మారి నామధేయానికి ఎక్కి పుల్లారెడ్డి అయ్యింది

ఓ! అసలు ఫుల్ల అంటే ఏంది సార్ ?

ఫుల్ల అంటే వికసించినది అని - నిజం వేరుగా ఉండవచ్చు కానీ పూర్తిగా జ్ఞానసంపన్నుడవుతాడని ఆనాటి మన దేశపెద్దలు గ్రామ్యంగా పెట్టుకున్న పేరు, ఆ తర్వాత దాని సంగతి తెలియక అనువంశికంగా పెట్టుకున్న పేరు.

మీరు రాయలసీమ ఎప్పుడైనా వెళ్ళినారా ?

ఎందుకు అలా అడిగినారు?

మీకు ఈ పేర్ల సంగతి ఎట్లా తెలుసునని

పేర్ల కథా కమామీషు తెలియటానికి రాయలసీమ వెళ్ళనక్కరలేదండి, చదువుకుంటుంటే జ్ఞానదీపం మన చీకటిని కాస్త కాస్తగా తొలగిస్తుంది. అంతే

సంతోషం సార్. ఇంకెప్పుడు ఆ పేర్లని చిన్నపుచ్చి మాట్లాడను సార్!

No comments:

Post a Comment