Thursday, January 12, 2017

టీం - గౌతమిపుత్ర శాతకర్ణి

ఉన్న తెలుగుని కాపాడుకునే పరిస్థితికి తొలిమెట్టు - దరిద్రుల చేతుల్లో పడి పాతాళానికెళ్ళిపోయిన పాత చరిత్రను నిర్దయాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా ఉద్ధరించెయ్యటమే! దానికోసం అడ్డదారులు తొక్కేసినా ఫరవాలా. ఎవరినీ పట్టించుకోవక్కరలా. ప్రపంచాన్ని అసలే. వ్యతిరేకించేవాళ్లని అసలే.

చరిత్ర అంటే స్వచ్ఛమైన నిజాలు అనే భ్రమలో పడిపోయిన మన పండితవర్గాలు ( Linguists / Historians / Elite Who? ) చేయాల్సిన ద్రోహం చాలానే చేసినాయ్. దేశద్రోహులకన్నా హీనమైన జాతి అది. విశ్వనాథ మీద, కోట వెంకటాచలం మీద, మన భాషను ఎంతో ఎత్తులో నిలపాలని ప్రయత్నించిన ఇంకా ఎంతో మంది మీద పేడకళ్ళెలు చల్లుకుంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుని గుడ్డలూడదీసుకుని నగ్నంగా తిరుగుతున్న పండిత జాతి అది.

ఇంట్లో నలుగురు పిల్లలు ఉండగా బయటినుంచొచ్చిన పిల్లవాడి మీద ప్రేమ చూపిస్తావా అని చిన్న ప్రశ్న వేసుకొవాలె.

ఇంట్లో ఉన్న సొంత పిల్లల మీద ప్రేమ చూపించేదానికి, సొంత కుటుంబానికి ఇచ్చే ఆవశ్యకాన్ని, మన చరిత్రను మనమే ఎత్తుగా చూపిచుకోవటానికి తేడా లేదు. ఇక్కడ ఇల్లు మన రాష్ట్రం అవ్వాలె, భాష మన పిల్లలవ్వాలె. ఇతర భాషల్ని పక్కనబెట్టెయ్యాలె. ఇతరాల గురించి ఆలోచించాలంటే ముందు మనం ఆరోగ్యంగా బాగుండలె కదా! ఆ ఆరోగ్యం కోసం కసరత్తు చేసో, అవసరమున్నచోట స్టెరాయిడ్స్ ఎక్కించో బలిష్ఠంగా నిలపాలె. అది చూసి అచ్చెరువైపోయిన మాసు జనాల్లో ఒక కదలిక రావాలె.

ఆ పని చెయ్యడానికి ఒకప్పుడు సాహిత్యం ఉండేది. స్వార్థం కోసం, అవతలివాణ్ణి, సాటివాణ్ణి అణగదొక్కి తను పైకి రావాలి అనే నీచమైన తెలుగు జాతి జన్యువుల్లో స్థిరపడిపోయిన అలవాట్ల సహాయంతో ఆ పని చేసినవాళ్ళను గత వందేళ్ళలో వాళ్ళను, వాళ్ళ సాహిత్యాన్ని తుంగలో తొక్కారు. తొక్కితే ఫరవాలా, వేరేవాడు చెప్పినవి నెత్తిన బెట్టుకొన్నారు. సిగ్గుచేటు విషయం.

ఆ సాహిత్య మాధ్యమాన్ని, ఆ స్థానాన్ని సినిమా తీసుకొన్నది నేడు. దాని చేతులు పెద్దవి. కబంధుడి హస్తాల వంటివి. సరిగా ఎత్తు చేసి చూపగలిగితే పైననుకున్న కదలిక రావటం ఖాయం. కదలిక కాకపోయిన పరిచితి రావటం ఖాయం.

ఎట్లా తీసుకున్నా చరిత్రలో పాతిక శాతమే నిజమని మిగిలిన ముప్పాతిక శాతం ఆ చరిత్ర రాసినవాడి అభిప్రాయాలేనని చాలామందికి తెలిసిన విషయమే. 2000 సంవత్సరాల క్రితం తెలుగు లేదనే అబద్ధమైన చెత్త చారిత్రక నిజాన్ని నమ్మడం కన్నా దానికన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నదన్న నిజమైన చారిత్రక నిజాన్ని నమ్మడం, ఆ నిజాన్ని ఎవరన్నా చెపితే వాళ్ళను ఆకాశానికి ఎత్తి మన నెత్తి మీద పెట్టుకోవటం తక్షణ కర్తవ్యం.

ఆ పైన చెప్పిన నీచమైన జన్యువులను అణగదొక్కుకుంటూ, చరిత్రను తిరగరాసేసుకుంటూ, తెలుగును - ఆ దేశ అఖండ భారత చక్రవర్తులను హిమాలయమంత ఎత్తున నిలిపి, ఆ పని ఒక తెలుగువాడు చక్కగా చేయగలడని చేసి చూపించిన టీం గౌతమిపుత్ర శాతకర్ణికి సాష్టాంగ నమస్కారాలు.

Be a dictator in upbringing your language, your history. And Satakarni team did just that. That awareness, that manufacture of proudness and injecting into mass was efficiently done. Thank you. Satakarni is a telugite and will remain one. If some one else wants to claim him as their own, they have no chance, we already did that and that is HISTORY for future generations. Get it ? If you did not get it, get the heck out of here!

Thank you Satakarni. Thank you balakrishna. Thanks to every one on that cast and helpers.

15 bucks is nothing. I will watch it 100 times and help with money if you gonna get me another telugu story like this Krishhhh......

No comments:

Post a Comment