Saturday, December 16, 2017

ఈనాడు ఆదివారం - "అనగనగా" వాల్యూం 1 - పుస్తక పరిచయం

ఇందుమూలముగా తెలియచేయునదేమనగా

ఈ రోజు ఈనాడు ఆదివారంలో పద్మ గారి పుణ్యాన "అనగనగా" వాల్యూం 1 మీద ఒక చిన్న పుస్తక పరిచయం

ఈ ప్రపంచకంలో అపురూపమైనవన్నీ చిన్న చిన్న సంగతులే - ఇది, ఈ సమీక్ష నాకు అపురూపమే!


Tuesday, November 7, 2017

వాల్యూం 6 - ఈ సాయంత్రం విడుదల చేసిన శుభసందర్భంగా మీకో నోట్ - అంతే!

ఈ రోజు ఇంకో పుస్తకం 
వాల్యూం 6 - ఈ సాయంత్రం విడుదల చేసిన శుభసందర్భంగా మీకో నోట్ - అంతే!

లంకె

https://www.amazon.com/dp/1979542538/

కొనుక్కునేవాళ్లు కొనుక్కోవచ్చును

ఓం తత్ సత్

Thursday, October 26, 2017

కథాపుస్తకానికి ముందే రెక్కలు వచ్చినాయి !

నెల నెలా మార్కెటుకు వచ్చే కథాపుస్తకానికి ముందే రెక్కలు వచ్చినాయి

నవంబరు మొదటి వారంలో విడుదలకు సిద్ధం చేసిన అయిదవ సంపుటం, కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆ వారంలో ఉండే పని వత్తిడి వల్లా కాసంత ముందుకు జరపటమైనది.. అనగా ఈ నెలలో రెండు పుస్తకాలు వచ్చినవి.... పునర్దర్శనం డిసెంబరు నెలలో....

సరే - ఇదిగో - లంకె ఇక్కడ...

https://www.createspace.com/7737118

పుస్తకాలు కావాలనుకున్నవాళ్ళు కొనుక్కుంటారని తెలియచెయ్యటం

మొదటి నాలుగు పుస్తకాల లంకెలు ఇక్కడ

Volume 1 - https://www.createspace.com/7261755

Volume 2 - https://www.createspace.com/7437100

Volume 3 - https://www.createspace.com/7522951

Volume 4 - https://www.createspace.com/7648717

Wednesday, October 18, 2017

మీరడుగుతున్న పుస్తకం, మీరు కొనాలనుకుంటున్న పుస్తకం - అనగనగా - ఇప్పుడు భారద్దేశంలో లభ్యం

అయ్యా, అమ్మా

మీరు పుస్తక ప్రియులైతే, మీ ఇంట దీపావళి కాస్త ముందే వచ్చిందనుకోండి

ఎందుకనగా - గత నాలుగైదు నెలలుగా మీరడుగుతున్న పుస్తకం, మీరు కొనాలనుకుంటున్న పుస్తకం - అనగనగా - ఇప్పుడు భారద్దేశంలో లభ్యం

పోతి డాట్ కాం ద్వారా  

ఇహ మీదే ఆలస్యం

లంకె ఇక్కడ


కవరు పేజి నేను నారింజ రంగులో పెడితే వారు enhancement పేరుతో ఎరుపు రంగుకు తీసుకువచ్చినారు. అదొక్కటే కాస్త ఇది కాని, సంప్రదింపుల విషయంలో చాలా సహాయకారుగా ఉన్నారు పోతి వారు

పోతే ఆ కవరు పేజి బొమ్మ మీద నొక్కితే ఆత్మీయ సోదరులు శ్రీ చైతన్య ప్రసాద్ గారు ఈ పుస్తకం గురించి రాసిన 15 పేజీల ముత్యాల మూట వంటి అభిప్రాయం కనపడుతుంది (Sri Chaitanya Prasad - Bahubali lyricist) 

ఆయనదే కాక ఇంకా గురువుగారు షాడో మధుబాబు గారిది, సోదరి చంద్రలత గారిది, సంగీత సరస్వతి పంతుల రమ గారిది అభిప్రాయాలు జత చేసినాను పుస్తకంలో ( Sri Madhusudana Rao V, Smt Chandra Latha, Smt Pantula Rama and Sri Pantula Raghu) 

6 బై 9 సైజు కావటం వల్ల, ఇక్కడ అమెరికాలో అమ్ముడవుతున్న పుస్తకానికి భిన్నంగా ఇంకో పది కథలు అదనంగా జోడించినాను

ఇక అంతా మీ చేతుల్లో

దీపావళి బాంబులు అదిరేలా పేలుస్తారని ఆశిస్తూ

ఓం తత్ సత్

Monday, June 19, 2017

First Book Published!

ఇందువలన సమస్త ప్రజానీకానికి తెలియచేయునదేమనగా

600 పేజీల పుస్తకమొకటి అమెజాను క్రియేటు స్పేసు వారి సర్వీసు ఉపయోగించుకొని సంకలనము చేసి ఇటీవలే యాభై సంవత్సరాల జీవన సాహచర్యపు గోల్డెన్ జూబిలి జరుపుకున్న దంపతులు, జన్మనిచ్చిన తలిదండ్రులు శ్రీమతి జ్ఞానప్రసూన , శ్రీ శివరామ శర్మ గార్లకు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా అంకితమిచ్చినాను. క్రియేటు స్పేసు వారి సైటుయందు ఉంచినాను.

మీరు ఆ కథలు వీలుంటే చదువుకుంటారేమోనని తెలియచెయ్యటం.

పుస్తకం ధర చూచి ఆశ్చర్యపడబోకుడి. ఆ అమెజాను వారు 600 పేజీల పుస్తకమనగానే 16 డాలర్ల 29 సెంట్లుగా వారి ధర వారు నిర్ణయించినారు. నేను ఒక డాలరు అధికము చేసినాను. ఎందుకనగా - ఆ పుస్తకం ఒక వేళ మీలో ఎవరైనా కొంటే, ఆ కొనగా వచ్చే అధికస్య డాలరు నేను ప్రతి సంవత్సరం సపోర్టు చేసే ఛారిటీ సంస్థల ఉపయోగార్థానికి వేణ్ణీళ్ళకు చన్నీటి తోడులా ఉంటుందని.

ఆ పరమాత్ముడు, ఆ దేవదేవుడు, భగవంతుడు నాకు చాలినంత ఇచ్చినాడు. నాకు ఆ డాలరు అవసరమే లేదు. వచ్చినవి వచ్చినట్టు ఆ సంస్థలకే అప్పగిస్తాను. మీ డాలరు దానం ఒకరికి ఉపయోగపడును. పుస్తకం మీకు ఉపయోగపడును. అవి యే సంస్థలు ఏమిటి అని ప్రశ్నలు వలదు. ప్రతి సంవత్సరం ఒక సంస్థ. నా దృష్టిలో యే సంస్థలకు అవసరం ఎక్కువగా ఉన్నదో ఆ సంస్థలకు అందచేయబడును

ఈ డిజిటల్ సెల్లింగు ఉత్తర అమెరికాలోను, యూరపులోను మాత్రమే లభ్యం. అందువలన భారద్దేశంలో వారికోసం ప్రెస్ ప్రింటు వర్షను ఒకటి త్వరలోనే తీసుకొని వస్తాను. ఆ కసరత్తులు జరుగుతున్నవి.

వారి జీవనవిధానంతో నాకు ఆదర్శంగా నిలచి తరువాయి వచ్చే పుస్తకంలో ఇక్కడ, ఈ పుస్తకంలో చేసిన తప్పులు దిద్దుకునేందుకు ఆలోచనావకాశం కలిపించిన

•    సినీ గేయ రచయిత, ఆప్తమిత్రులు శ్రీ చైతన్యప్రసాద్
•    ఆచార్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు
•    తానా అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి
•    నాన్నా అని నన్ను ఆప్యాయంగా పిలిచే ఆచార్యులు డాక్టర్ శ్రీ పారనంది లక్ష్మీనరసింహం
•    రేగడివిత్తులు నవలా రచయిత్రి సోదరి చంద్రలత
•    అపర సంగీత సరస్వతి శ్రీమతి పంతుల రమ
•    ఆప్తమిత్రులు శ్రీ పంతుల రఘు
•    సంగీత ఆచార్యులు డాక్టర్ శ్రీ కొమాండూరి శేషాద్రి
•    నేను అపరిమితంగా అభిమానించే డాక్టర్ గారు - శ్రీమతి లైలా యెర్నేని
•    షాడో సృష్టికర్త శ్రీ మధుబాబు గారు

వీరందరికి సహస్రకోటి కృతజ్ఞతలు

ఇక ఈ క్రింది వారిని పేర్కొనకపోతే ఈ పుస్తకానికి అర్థమే లేదు 

వారి రచనలతో నాకు ప్రేరణగా నిలిచిన గురువులు శ్రీ డాక్టర్ కె.బి.గోపాలం, శ్రీ సుధామ, శ్రీ జె.కె.మోహనరావు, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు, శ్రీ పామర్తి సత్య, శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ 

ఇతరంగా, రోజువారీ విషయాలతో ఆలోచనలు రేకెత్తించిన మరి కొంతమంది మిత్రులు - సర్వశ్రీ - కూచిభొట్ల ఆనంద్, బాలాంత్రపు హేమచంద్ర దంపతులు, చంద్ర రెంటచింతల, రొంపిచర్ల భార్గవి, పరుచూరి శ్రీనివాస్, మండా కృష్ణమోహన్, నండూరి శశిమోహన్, శీలా వీర్రాజు దంపతులు, రవి ఇ.ఎన్.వి, భరద్వాజ్ వెలమకన్ని, సురేశ్ కొలిచాల, కిరణ్ ప్రభ, వలబోజు జ్యోతి, తాటిపామల మృత్యుంజయుడు, భాస్కర్ కొలచన, విజయభాస్కర్ రాయవరం, సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి, సినీ గేయ రచయిత శ్రీమణి, అనిల్ అట్లూరి, శ్రీ అట్లూరి, అఫ్సర్, ఇస్మాయిల్ పెనుకొండ, సురేశ్ కాజ, డాక్టర్ సావిత్రి, అంజని యలమంచిలి - ఇంకా లెక్కకు మిక్కిలిగా ఎందరో, ఇక్కడ స్థలాభావం వల్ల పేర్కొనని మరెందరో ఆత్మీయ మిత్రులు, గురుసమానులు, శ్రేయోభిలాషులందరకు లక్ష కోట్ల కృతజ్ఞతల వందనాలతో

లంకె ఇక్కడ

https://www.createspace.com/7261755

భవదీయుడు
వంశీ 

Wednesday, June 7, 2017

Digital Art - Set 13

గత సంవత్సరంగా వేసిన డూడుల్స్, ఇతరాలు - డిజిటలు దారి వైపు మళ్ళించి చేసినవి ఇవి. 99 శాతం ఉత్త కాయితాల మీద చేతితో పుచ్చుకున్న పెన్నుతోనూ, షార్పీతోను గీసినవి - ఆ తర్వాత డిజిటల్ హంగులు అద్దినవి... మిగిలిన 1 శాతం అచ్చ డిజిటల్ సాఫ్టువేరుతో చేసినది

చాలా మటుకు కానన్ డిజిటల్ సాఫ్ట్వేరు ఉపయోగించి చేసినా, అదనంగా ఒకటి రెండు సాఫ్టువేర్లు ఆప్స్ కూడా వాడబడినవి


Digital Art - Set 12

గత సంవత్సరంగా వేసిన డూడుల్స్, ఇతరాలు - డిజిటలు దారి వైపు మళ్ళించి చేసినవి ఇవి. 99 శాతం ఉత్త కాయితాల మీద చేతితో పుచ్చుకున్న పెన్నుతోనూ, షార్పీతోను గీసినవి - ఆ తర్వాత డిజిటల్ హంగులు అద్దినవి... మిగిలిన 1 శాతం అచ్చ డిజిటల్ సాఫ్టువేరుతో చేసినది

చాలా మటుకు కానన్ డిజిటల్ సాఫ్ట్వేరు ఉపయోగించి చేసినా, అదనంగా ఒకటి రెండు సాఫ్టువేర్లు ఆప్స్ కూడా వాడబడినవి