Friday, September 16, 2016

అదిగదిగొ గోడ బాట - అందాల పోష్టు బాట

అదిగదిగొ గోడ బాట
అందాల పోష్టు బాట
ఎటనుండో ఎటనుండో
ఏ కీబోర్డు మీటనుండో

నిలకడ నిదర లేని
నీరువలె ప్రవహిస్తు
గమ్యం గృహం లేని
గాలివలె విహరిస్తు
మానస జీవనవర్తిని
కిలకిలగా కలకలగ
వెలుగుతున్న నరాలు
జివ్వున లాగేస్తుంటే
రివ్వున చెయి గులిచేస్తుంటే

ఏ తలపున పుట్టిందో
ఎటుల చెప్పగలము మనం
ఏవాడు వస్తాడో
ఏవాడు లైకుతాడో
ఎవరు చెప్పగలరు నిజము

షేరుఖాను వస్తాడో లేడో
షేరు చేస్తాడో లేదో
ఇరాకు పోతుందో
మొరాకో పోతుందో
ఈజిప్టు పోతుందో
సిరియాకు పోతుందో
ఎక్కడికో ఎక్కడికో
ఎవరెరుగని ఏ లైకరు దగ్గరికో

అడవి చూసి హడలిపోదు
గుట్ట చూసి కృంగిపోదు
నీరు చూసి నిలచిపోదు
మిట్ట చూసి బెదరిపోదు
మండే ఎడారులు కాని
మంచు దిబ్బలె కాని
కందకాలు కాని
కంటకాలు కాని
దాటిపోదు ఏదీ
నా సునిశిత దృష్టిని
నా గరుకు గోడని

అన్నిటినీ పట్టేస్తా
అన్నిటినీ వేసేస్తా
నా ఆలోచనల గ్రైండరులో
తిప్పి తిప్పి తొక్కేస్తా
కస కస కొరికేస్తా
పస పస నలిపేస్తా
గుస గుస లాడేస్తా
పొలో మని అరిచేస్తా

ఆగిపోదు నా పోష్టుబాట
సాగిపోవు పోష్టుబాట

టికెటే లేక డిల్లీ పోతా
పాస్పోర్టు లేక మాస్కో పోతా
డాలరు లేక డలసు పోతా
ఉత్తర దక్షిణ ధ్రువాలు
నా కాలి కింద పడిగాపు
ఉరల్ పర్వతశ్రేణులు
నా వేలి కింద పడిగాపు

పోష్టులోన బలముంటె
ఎవరెష్టే ఎక్కేస్తా
సీజను టికెటే అక్కరలా
సృష్టంతా తిరిగేస్తా
విప్లవం దీన్నణిచేయలెదు
ప్రళయం దీన్ని చెరపలేదు
యుద్ధం హద్దు గియ్యలేదు
నా బాట రూపు మాసిపోదు

ఎవడేమన్నా ఎవడేమనుకొన్నా
కరకు సైనుబోర్డులాటిదన్నా
బ్రహ్మజెముడు కంపన్నా
దిట్టమైన కంచెన్నా
ఊగిపోయే జొన్నకంకన్నా
అన్ని దిసలా నేనున్నా
అల్లి బిల్లిగా నేనున్న

మర్యాదస్తులు, గిర్యాదస్తులు
కూలివాళ్ళు పాలవాళ్ళు
టీచర్లు ప్రీచర్లు
ఎవరైనా అంతే
అందరూ నాకు దణ్ణాలే

నా బాటే కాలిబాట
పరుగెత్తే ధూళిబాట
విసిరేసే అగ్నితోట
పొష్టుబాట గోడబాట
కలకాలం వర్ధిల్లు ఇచట


- పొట్లపల్లి రామారావు గారని ఒక అభ్యుదయ కవిగారు అలనాడెప్పుడో 1950ల్లో కాలిబాట అని ఒక కవిత రాస్తిరి. అది 2012లో దోశ భూతం ఆవరించుకుని ఉన్నప్పుడు దానికి వాడుకున్నా. దాన్నే పూర్తిగా రీవాంపు చేసి పోష్టులకి, గోడలకి, ఫేసుబుక్కుకు అన్వయించే ప్రయత్నం  చేస్తిని.

After couple of re-reads - I laughed at myself, pretty hard for the poor execution and choice of words but I have a bad habit of not changing anything once I pen it down..so take it easy, and I am not a poet. If you are feel free to shove your experience and massage it. Have fun

Thursday, September 15, 2016

ఎందుకో ఇది గుర్తొచ్చిందయ్యోయ్!

ఎందుకో ఇది గుర్తొచ్చిందయ్యోయ్!

**************

ఏమిటోయ్ కొత్త కొత్త వ్యాసాలు రాస్తున్నావట

ఆం , ఏదో - బసవడు శ్రీశ్రీ మీద రాస్తున్నాను

బసవడెప్పటివాడు ? శ్రీశ్రీ ఎప్పటివాడు ? ఇద్దరికీ సాపత్యం ఎట్లా కుదుర్తుంది ? దేనిలో కుదురుతుంది

ఇదిగో చూడు, సాపత్యాలు చూపించాలంటే బోల్డుంటాయ్. ఆయనకు రెండు చేతులున్నాయ్, ఈయనకు రెండు చేతులున్నాయ్, అది చాలదూ రాయటానికి ?

అదొక్కటి రాస్తే మిగిలినవి ?

అవే ఆ మిగిలినవే, రెండు కాళ్ళు ఓ ముక్కు ఓ నాలిక ఎట్లా ఉన్నాయో ఏమిటోనని ఒక 50 పుస్తకాలు ముందేసుకుని రాస్తున్నాను

ఆ సరీపోయింది. తోక సాపత్యం కూడా ఉన్నదేమో చూడు. 50 పుస్తకాలు ముందేసుకుని రాస్తే అదేదో కతుందే అట్లా అవుతుంది

ఎట్లా ? ఏ కత?

ఓ కెమిష్టు, ఓ ఫిజిసిష్టు, ఓ ఎకనామిష్టు ఓ పాడుబడ్డ ద్వీపంలో ఇరుక్కుపోయారట.

ఎట్టెట్టా! ఏం రోగమొచ్చిందీ అందరూ కట్టకట్టుకొని అక్కడికి పోటానికి ? సరే పడుబడ్డదంటున్నావుగా, బేతాళుడున్నాడా అక్కడ?

చెప్పెది ఇనకుండా ఎదవ దిక్కుమాలిన ప్రశ్నలు నువ్వూనూ - బేతాళుడి సంగతి తర్వాత చెప్తా కానీ, ముందు వాళ్ళ తిండిగోల చూద్దాం, వాళ్ళు బతికుంటేనే మన కత

సరే చెప్పు

అలా పాడుబడ్డ ద్వీపంలో ఆకలైకి మలమలమాడిపోతూ కింద మీదా కందమూలాలేవన్నా దొరుకుతయ్యేమోనని తవ్వి పారేశారు

బావుంది, వేరే చెట్లూ గిట్లూ పిట్టలూ ఏమీ లేవా అక్కడ?

లేవు. ఆముదం చెట్టొక్కటే ఉందిట నువ్వెళ్ళి ఆముదం తాగటానికి

ఆ, ఓ సారి తాగి చచ్చేపనయ్యింది మరుగుదొడ్డిని వదలాలలంటే. ఆ గోడలకే కరుచుకుపోయా

తవ్వారు తవ్వారు కందలు దొరకలా, మూలాలు దొరకలా, కానీ ఓ బిందె దొరికింది. మాట్లేసి మూత గాట్టిగా బిర్రుగా ఉన్నా దానికో చిన్న చిల్లు ఉంటం వల్ల అందులో ఏదో తినే పదార్థం ఉన్నదని వాసన ద్వారా కనిపెట్టారు వాళ్ళు

ఆ ఆ తర్వాత...

కెమిష్టు గాడన్నాడు - బిందె కింద మంటెడితే ఈలావున గాసొచ్చి ఆ ప్రెషరుకు మూతూడిపోద్ది అప్పుడు అందులో ఉన్నది చక్కా తినొచ్చు అని

ఎకనామిష్టు గాడన్నాడు - ఓ ముళ్ళచక్రం తయారు చేసి దాంతో మూత మీద తిప్పి తిప్పి దాన్ని ఊడగొట్టొచ్చు

ఫిజిషిష్టు గాడన్నాడు - ఛస్! ఆ కొండ మీంచి కింద పడేస్తే దెబ్బకు పగిలి అన్నీ బయటకొస్తాయ్ అని ఛటాలున లాక్కుని పరిగెత్తి కొండ మీంచి విసిరేశాడు

అట్లా విసరగానే ఆ బిందె ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందన్న సంగతి అర్థమై ఇక తిండి లేదన్న సంగతి ఎరికలోకొచ్చి కెమిష్టు, ఎకనామిష్టు లబోదిబోమని ఫిజిషిష్టు గాడిని చావగొట్టి చెవులు మూసి ఏడుస్తూ కూర్చున్నారు

ఆ తర్వాత ఏమయ్యింది

మిగిలిన కత నీ ముందున్న పుస్తకాల్లో ఉన్నది, వ్యాసం రాస్తూ ఉంటే నీకే తెలిసిపోతుంది

ఆ ఊర్కో! నేనేదో ఆ పుస్తకంలోదొక లైను, ఈ పుస్తకంలోదొక లైను ఎత్తి కాపీ చేసి ఇంతబారున రాస్తున్నా కానీ, అందులో సంగతేమిటన్నది నాకు తప్ప ఇంకెవడికీ తెలీదు

మరి అట్లాటి దానికి రాయటం ఎందుకు ?

రాయకపోతే ఊరుకోరుగా ?

ఎవరు ?

నా మనసు, ఆ బేతాళుడు వాళ్ళు

ఓ! సరి సరి. బాగుంది బాగుంది ఆ విధంగా ముందుకు పోతూ ఉండాలి అధ్యక్షా!

(ఫిబ్రవరి 26, 2013)

Wednesday, September 7, 2016

ఇంతకీ......

వ్యాసం కంటే ఇచ్చిన రెఫెరెన్సు పుస్తకాల లిష్టు అమెరికా నుంచి యూరపు దాకా గీసిన లంబకోణ గీతలా బారుగా ఉన్నది.....

ఇంతకీ 38 పుస్తకాలు రిఫరు చేసి రాసిన ఆర్టికలు మొదటి భాగం చదవాలా , ఆ 38 పుస్తకాలు చదివితే సరిపోతుందా అన్నది అర్థం కాలా

వెల్చేరు రాసిన సూరి - గిడుగు వ్యాసం ఈమాటలో చూసినాక అనిపించిన ఆలోచన పంచుకోవాలని...అంతే, అంతకు మించి ఏమీ లేదు...

పోనీ నువ్ రాయ్, ఎంత బారు రాస్తావో చూద్దాం అంటున్నావా?

బాగా పండిపోయావురా అబ్బాయ్! బాగా! ఇంతబారున ......