Monday, August 8, 2016

సమయము కాదురా ఐఫోను దరిచేర!

 పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ

చంపకురా తరుమకురా...
పోష్టులతో నను ఓ రాజా..
కసబిస కరవకురా..

చంపకురా తరుమకురా...
పోష్టులతో నను ఓ రాజా.. ఆ
కసబిస కరవకురా..

కరవకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ


చరణం 1 :

కామెంటు లైకు మరువనులేర...
న్యూసుఫీడు నింపి సలుపకు రాజా....
సమయము కాదురా కంప్యూటరు దరిచేర..
సమయము కాదురా ఐఫోను దరిచేర...

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
కరవకురా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 2 :

ఆఫీసులోన కొలువుర సామీ...
మది నీ పోష్టే మెదలినగాని..
ఓయన లేనురా కాల్చెయ్యకులేర..
ఓయన లేనురా ఈమెయిలులివ్వకు లేర..

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....

కరవకురా ఆ ఆ ఆ ఆ ఆ


(This was a repost from 2013. SO - Keep your nerves calm and Donot tap your shoulders!)


No comments:

Post a Comment