Monday, August 22, 2016

జిహ్వలన్ సొల్లు పారవశ్యముగన్ పారగా!

అభిమానమేమౌనో
అంతస్థులేమౌనో
నీవయిపు చూపు నిలుపునపుడు

భేదంబులేమౌనో
వాదంబులేమౌనో
నీరూపు కండ్ల నిలచినపుడు

అరమరలేమౌనో
అహంకారమేమౌనో
నీ మేను స్పర్శించినపుడు

అన్వేషణేమౌనో
అన్యమ్ములేమౌనో
నీ గాలి సోకినపుడు

పరిధులెరుగని కాంక్షతో పరవశించ
ఇహలోక బంధాలు వీడి చెలగి నీదు
సంస్పర్శ కోసమే పరమ పావన జనని
ఆర్తి జెందుటే జరుగును ఓ పెసరటుప్మమ్మ!

నోట పడినంతనె కన్నీటి పూజలే ఓ తల్లి
రుచుల రుషినౌతినే నీ వరాన ఓ యమ్మ 
నీదు సింహాసనమెక్కించి అల్లంపు జల్లులే జల్లగా
ఓ తల్లి, కరుణించి జఠరాగ్ని బాపవే

బాష్పవాహినులతో నీ పూజ చేసెదెనమ్మ
ఏడేడు జనమల కొలుతునమ్మ నిత్యహారతుల
జిహ్వలన్ సొల్లు పారవశ్యముగన్ పారగా
భవ్య దివ్య సంభావ్య నవ్య సంసేవ్య!

(Jan 16, 2011)

No comments:

Post a Comment