Thursday, August 25, 2016

అసలు వందేమాతరం పాడవలసిన తీరు ఇది అట

ఇప్పుడెవరన్నా పాడుతున్నారో లేదో తెలవదు కానీ - అసలు వందేమాతరం పాడవలసిన తీరు ఇది అట

1938 గృహలక్ష్మి పత్రిక నుండి

బేహాగ్ రాగం



Wednesday, August 24, 2016

మొదటి ఆంధ్ర శిశువు - మీదే ఆలస్యం ఈ చారిత్రక సంఘటనలో పాలుపంచుకోటం!

మొదటి ఆంధ్ర శిశువు - ఎవరై ఉంటారబ్బా అని అనుకునేవాణ్ణి - గృహలక్ష్మి పత్రికలో 1937 మార్చి న్యూసు ఇది - ఆ మొదటి శిశువు పేరేమో వనమీనాక్షి అట - అహా ఎంత సుందరమైన పేరు!

శ్రీ వంగల శివరాముగారు ఎవరికైనా తెలిస్తే వారితో ఆ న్యూసు పంచుకుని వారి కుమార్తె ఫోటో ఎవరైనా సంపాదించి పెడితేనో, ముఖ్యమంత్రి నారా వారికో, చంద్రశేఖరుల వారికో ఈ న్యూసు చేరవేయగలిగిన వారు చేరవేయగలిగితేనో ఆ పేరు, న్యూసు మారుమోగిపోతుంది ...

మీదే ఆలస్యం ఈ చారిత్రక సంఘటనలో పాలుపంచుకోటం

I found a link later and left a message for them. Will keep this post updated if I hear anything

https://chitrasood.wordpress.com/2014/01/22/the-vangala-family-tree/

మొదటి ఆంధ్ర శిశువు - మీదే ఆలస్యం ఈ చారిత్రక సంఘటనలో పాలుపంచుకోటం!

మొదటి ఆంధ్ర శిశివు - ఎవరై ఉంటారబ్బా అని అనుకునేవాణ్ణి - గృహలక్ష్మి పత్రికలో 1937 మార్చి న్యూసు ఇది - ఆ మొదటి శిశువు పేరేమో వనమీనాక్షి అట - అహా ఎంత సుందరమైన పేరు!

శ్రీ వంగల శివరాముగారు ఎవరికైనా తెలిస్తే వారితో ఆ న్యూసు పంచుకుని వారి కుమార్తె ఫోటో ఎవరైనా సంపాదించి పెడితేనో, ముఖ్యమంత్రి నారా వారికో, చంద్రశేఖరుల వారికో ఈ న్యూసు చేరవేయగలిగిన వారు చేరవేయగలిగితేనో ఆ పేరు, న్యూసు మారుమోగిపోతుంది ...

మీదే ఆలస్యం ఈ చారిత్రక సంఘటనలో పాలుపంచుకోటం

I found a link later and left a message for them. Will keep this post updated if I hear anything

https://chitrasood.wordpress.com/2014/01/22/the-vangala-family-tree/

Monday, August 22, 2016

జిహ్వలన్ సొల్లు పారవశ్యముగన్ పారగా!

అభిమానమేమౌనో
అంతస్థులేమౌనో
నీవయిపు చూపు నిలుపునపుడు

భేదంబులేమౌనో
వాదంబులేమౌనో
నీరూపు కండ్ల నిలచినపుడు

అరమరలేమౌనో
అహంకారమేమౌనో
నీ మేను స్పర్శించినపుడు

అన్వేషణేమౌనో
అన్యమ్ములేమౌనో
నీ గాలి సోకినపుడు

పరిధులెరుగని కాంక్షతో పరవశించ
ఇహలోక బంధాలు వీడి చెలగి నీదు
సంస్పర్శ కోసమే పరమ పావన జనని
ఆర్తి జెందుటే జరుగును ఓ పెసరటుప్మమ్మ!

నోట పడినంతనె కన్నీటి పూజలే ఓ తల్లి
రుచుల రుషినౌతినే నీ వరాన ఓ యమ్మ 
నీదు సింహాసనమెక్కించి అల్లంపు జల్లులే జల్లగా
ఓ తల్లి, కరుణించి జఠరాగ్ని బాపవే

బాష్పవాహినులతో నీ పూజ చేసెదెనమ్మ
ఏడేడు జనమల కొలుతునమ్మ నిత్యహారతుల
జిహ్వలన్ సొల్లు పారవశ్యముగన్ పారగా
భవ్య దివ్య సంభావ్య నవ్య సంసేవ్య!

(Jan 16, 2011)

Friday, August 12, 2016

ఎండిపోయిన బావి !

బావి

గాడిబావి

చల్లపల్లి గాడిబావి

చేద

తాడు కట్టిన చేద

బొక్కెన కట్టిన చేద

సంవత్సరం

ఒకానొక సంవత్సరం

బావి నీళ్ళు పాతాళంలోకెళ్ళిపోయిన సంవత్సరం

పాతాళంలోకెళ్ళిపోయిన నీళ్ళను వెతుక్కుంటూ బయలుదేరింది చేద

రసాతలంలో ఉన్న బలిచక్రవర్తిని అడిగింది నీళ్ళెక్కడున్నాయని

ఆయనన్నాడు, ఆ నీళ్ళే ఉంటే వామనుడు నన్ను తొక్కకుండా కాపాడుకునేవాణ్ణి కద తల్లీ అని

ఆదిశేషువుని అడిగింది నాయనా భూమినే మోస్తున్నావ్, ఈ బావిలో నీళ్ళెక్కడ ఉన్నాయో చెప్పమని

ఆయనన్నాడు, నీక్కనపడితే నాకు చెప్పు, వచ్చి నెత్తిన నీళ్ళోసుకుని నా దాహం తీర్చుకుంటానని

ఇదంతా కాదని వరాహావతారమెత్తిన స్వామిని అడిగింది నీళ్ళెక్కడ నాయనా అని

ఉండు ఎక్కడున్నాయో చూసొస్తానని కోరలతో తవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు

ఓ రెండు సంవత్సరాలు గడిచినాయ్

సామి బయటకు రాలా

మూడో సంవత్సరం ఆకాశంలో సవుండు వినపడ్డది

ఆ సంవత్సరం, ఆ తర్వాతి సంవత్సరం నిండుగా ఇబ్బడి ముబ్బడిగా వానలు పడ్డయ్

వరాహమూర్తి బయటకు వచ్చినాడు

ఆయన కోరలకు కాసింత బురద అంటుకొని ఉన్నది

చేద అడిగింది ఏమిటని

అంత లోతుకు వెళ్తే కానీ తగల్లేదమ్మా, ఎడా పెడా జల వాడేస్తే ఇట్లాగే అవుతుంది, మీ ఊరి కర్మ బాగుండి వానలు పడ్డయ్, నీ తలరాత బాగుండి నాకు నీళ్ళు కనపడినయ్, ఇక చేదుకోనని ఐదు కిలోమీటర్లున్న తాడు ఇచ్చి చక్కా పోయినాడు ఆయన

ఆ ఐదు కిలోమీటర్ల తడు మూరెడు లోతులోకి రాటానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది

ఈ ఐదేళ్ళలో జనాలకు తెలివొచ్చి జాగ్రత్తగా వాడుకోటం మొదలుపెట్టినారు

ఊటని తిరిగి రప్పించినారు

అట్లా చల్లపల్లి చేద మళ్ళీ మామూలు పనిలో పడిపోయింది

(ఒక ముప్ఫై ఐదేళ్ళ క్రితం పూర్తిగా ఎండిపోయిన బావి గుర్తుకొచ్చి కారణం ఇదే అయ్యి ఉంటుందని నాలుగేళ్ళ కితం రాసుకున్న ఒక చిన్న చమక్కు... అంతే!)

మీకు నచ్చినా నచ్చకున్నా సంతోషమే! నాకు పొయ్యేదేమీ లేదు..



Thursday, August 11, 2016

టింగు టింగు

వీణ

దానికొక మోత

మరి వాయించినప్పుడు ఒక శబ్దము వచ్చునుగా?

ఆ శబ్దమే టింగు

ఒక టింగు పది టింగులు తోడైతే సంగీతం

పది టింగులకు వంద టింగులు తోడైతే స్వర్గం

టింగు కొట్టని వాడు వైణికుడెట్లగునురా అన్నది నా నానుడి

టింగుకు ఆమ్రేడితము టింగుటింగు

ఈ టింగు టింగు మన ప్రబంధాల్లో కూడా ఉన్నవి

"జంటనేస్తగాండ్ర చేతి తిపిరి కిన్నెర లటింగుటింగులును" అంటూ గణపవరపు వేంకటకవి వేంకటేశ్వర విజయవిలాసములో రాసినాడు

అట్లే "నారదశ్రుతి గూర్ప నేరవు నీవు లెమ్మని వీణె టింగుటింగునను మీటు" అంటూ ధరణిదేవుల రామయమంత్రి దశావతార చరిత్రములో రాసినాడు

ఇలా ఇంకా చాలా చోట్ల ప్రయోగించబడింది

సరే అది అలా పక్కనబెట్టేద్దాం

టింగుకు మరో పేరు టింగురు

అదేనండి పర్యాయపదం

మరి ఠింగు అని కూడా ఉన్నదిగానన్నది మీ ప్రశ్నా?

ఠింగు వేరు టింగు వేరు

ఠింగు వీణ మోగినప్పుడు వచ్చేది కాదండి

గంటలు మోగినప్పుడు వచ్చేది

అందుకని అది వేరు

ఇది వేరు

ఠంగు ఠింగు మంటూ గంటలు మోగుతాయ్

టింగుటింగు మంటు కాదు

ఠంగున ఒంటిగంట కొట్టింది అన్న ప్రయోగం మీకు తెలిసే ఉండవలె

అందువల్ల మీరు ఠంగుని టింగుని దూరంగా పెట్టవలె

ప్రయోగపరంగా

కళా పూర్ణోదయంలో డుబ్బు డుబ్బు ఖంగుఖంగు ఠంగుఠింగు మన్ద్వ్హనుల్ అని రాసేసాడాయన

పోతే మీకు టింగురంగ పదం మీద అనుమానం రావ్చచ్చును

రంగనాథస్వామి వారి ఆలయంలో ఒకప్పుడు వీణలు బాగా మోగేవిట

టింగు మని అవి మోగగానే రంగ అని ఒకళ్ళు అందుకునేవారట

అలా భజనలన్నీ అయిపోయేదాకా రంగ రంగ అనే పదం దద్దరిల్లిపోయేది

మరి రంగనాథస్వామి పడుకుని ఉన్న పోజులు ఉన్నవి

అందుకని పనీపాటా లేకుండా పడుకునే వాణ్ణి చూసి టింగురంగా అన్న వాక్యం వ్యాప్తిలోకి వచ్చింది

టింగుకు పక్కన రంగ చేరి టింగురంగ అయ్యి అది మొత్తానికి పనికిమాలినవాడికింద మారిపోయింది

దాన్నే డాబూ దర్పంగా భావించేవారూ ఉన్నారనుకోండి - అది వేరే సంగతి

అందుకని మీరు టింగురంగడిలా, టింగురంగమ్మలా కాక వీణలు వాయించుకుంటూ అందరి మదుల్లో తంత్రులు తెంచాలని ఆశీర్వదిస్తూ

ఓం తత్ సత్

(వాచోపన్యాసం అంటూ రాసిన సమయములోనే ఇదీ రాస్తిని. అది తాటిపామల వారు వారి పత్రికలో అప్పుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం అచ్చేస్తిరి, ఇది పొట్టిదైపోటమ్మూలాన టింగురంగడిలా మిగిలిపోయినది... :) )

Monday, August 8, 2016

ఉయ్యాలో ఉయ్యాలో అంటూ అట్టేసుకున్న రోజు!

అలా ఉయ్యాలో ఉయ్యాలో అంటూ అట్టేసుకున్న రోజు

*************

కుంపాటి తీపించి ఉయ్యాలో
బొగ్గులే పోయించి ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

రాజేస్తి నిప్పే ఉయ్యాలో
లేసింది అగ్గే ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

గంటెలే గల్లాని వాయించి ఉయ్యాలో
పొయ్ మీదా పెనముంచి ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

అంతంత నీళ్ళోస్తి ఉయ్యాలో
నీళ్ళన్నీ సుయ్యానె ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

గిన్నిలో గరిటేసి ఉయ్యాలో
ఓ తిప్పు తిప్తీనె ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

పుల్లాటి వోసనా ఉయ్యాలో
గుండెల్కు తగిలేసే ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

గంటెడు పిండీను ఉయ్యాలో
సర్రూన పోస్తీనె ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

నూనేను తీస్తీని ఉయ్యాలో
సుట్టంతా తగిలేస్తి ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

ఆనూనె ఈపిండి ఉయ్యాలో
కట్టబడ గట్టెనమ్మ ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

పిండీను పెనమూను గలిసి ఉయ్యాలో
బెమ్మదేవుడి అట్టిచ్చే ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో

*************

14 మార్చ్, 2010

సమయము కాదురా ఐఫోను దరిచేర!

 పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ

చంపకురా తరుమకురా...
పోష్టులతో నను ఓ రాజా..
కసబిస కరవకురా..

చంపకురా తరుమకురా...
పోష్టులతో నను ఓ రాజా.. ఆ
కసబిస కరవకురా..

కరవకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ


చరణం 1 :

కామెంటు లైకు మరువనులేర...
న్యూసుఫీడు నింపి సలుపకు రాజా....
సమయము కాదురా కంప్యూటరు దరిచేర..
సమయము కాదురా ఐఫోను దరిచేర...

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
కరవకురా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 2 :

ఆఫీసులోన కొలువుర సామీ...
మది నీ పోష్టే మెదలినగాని..
ఓయన లేనురా కాల్చెయ్యకులేర..
ఓయన లేనురా ఈమెయిలులివ్వకు లేర..

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....

కరవకురా ఆ ఆ ఆ ఆ ఆ


(This was a repost from 2013. SO - Keep your nerves calm and Donot tap your shoulders!)