Saturday, July 30, 2016

చుక్కలు చుక్కలు చుక్కలు చుక్కలు!

చుక్కలు! చుక్కలు
చక్కని చుక్కలు!


వజ్రపు ముక్కలు
వలపుల రెక్కలు
ప్రేయసి పిలుపులు
రేయసి ఝళుపులు

చుక్కలు||

అందపు దీవులు
అమృత బావులు
శోభ వహములు
సురభు వనములు

చుక్కలు ||

ముత్తెపు సరులు
ముద్దుల ఝరులు
తెలుగు వెలుగులు
వెలుగు తెలుగులు

చుక్కలు ||

తలతల లాడే
మిలమిల లాడే
కన్నులు కన్నులు
అచ్చర మిన్నలు
అందపు మిన్నులు
విరిసిరి విలసిన్నవమాధురితో

చుక్కలు ||

ఆరని ఆశలు
ఆంధ్య రజనిలో
దీప్తులు! దీప్తులు!!
దివి నా కాప్తులు

చుక్కలు ||

చెలి చికురములో
చెదరిన మల్లెలు
తీరని తేనియ
తీయని వాంఛలు

చుక్కలు ||

జృంభిత నవయుగ
కీలలు జ్వాలలు
తారుణ్యపు కరు
ణారుణ లీలలు
'చుక్కలు ||


చుక్కలు చుక్కలు
చుక్కలు చుక్కలు

-- శ్రీ కొమర్రాజు వినాయక రావు
-- 1935 (వీణ పత్రికలో)

 

No comments:

Post a Comment