Wednesday, June 22, 2016

అరెరె! డిండీర చేల అట....

అరెరె! డిండీర చేల అట....నురగకు అంత చక్కని పేరిరికించిన భాషకు ఏం నమస్కారాలు చెప్పుకోవాల? అంత భాషను ఔపోసన పట్టి పద్యంలో ఇరికించిన కవికి ఏమి కృతజ్ఞతలు చెప్పుకోవాల? నమోన్నమ: శ్రీ గరికిపాటి

అలాగే ఆ తర్వాత లాలి పాటలో జోగుతూ నిద్దరోవచ్చు సామీ! ... అందువల్ల మరోసారి నమోన్నమ:

******

జోజో! తరంగ బాలా!
జోజో! డిండీర చేల! జో! ఘననీలా!
జోజో! మౌక్తిక డోలా!
జోజో! మృదుభావలీల! జో! జలకీలా!


********

అగ్నిహోత్రుని పుత్రి కార్ద్రభావము లాలి
మేఘదేహకు క్రొత్తమెరుపు లాలి
జీవనాధారకు జీవ గుణములాలి
రసమయాత్మకు రసలక్ష్మిలాలొ

ఋణపదార్ధమునకు గణబద్ధమౌలాలి
రమణీయ గమనకు ప్రాసలాలి
చతురబ్ధిసారకు సరసయతుల లాలి
తీర సంచారికి తెలుగు లాలి

చిన్ని ఊయెలకిట సీసపద్యము లాలి
లోతుగుండె కెత్తు గీతి లాలి
హత్తుకొన్న తరగ కెత్తుగడల లాలి
లాలి లాలి లాలి లాలి లాలి

*****************

BTW - you can access his website at www.srigarikipati.com


దక్షిణ భారద్దేశంలో 350 వెరైటీలు ఉండేవట!

దక్షిణ భారద్దేశంలో 350 వెరైటీలు ఉండేవట

అందులో కొన్ని పేర్లు సౌత్ ఇండియన్ ఫ్రూట్స్ (1948) అనే పుస్తకంలోంచి అప్పుడెప్పుడో టైపు చేసి పెట్టుకున్నవి
వీటిల్లో మీకెన్ని తెలుసో అన్నీ టిక్కులు పెట్టండి

ఒక్క దక్షిణ భారద్దేశంలోనే ఇన్ని ఉండుంటే మొత్తంగా ఎన్ని ఉండేవో

అసలిందులో ఎన్ని పోయినయ్యో, ఎన్ని బతికున్నయ్యో?


And this is just a list of Mangoes and nothing else

****************   

లడ్డు
పేట తీయ మామిడి
ఎన్నమండల తీయ మామిడి
దేశవాళి తీయ మామిడి
బ్లాక్ ఆల్ఫోంజో (కాలా ఇషాదా)
మూల్కి 1
రుమాని
సన్నకులు (హామిల్టన్)
అతిమధురం
యెర్ర ముల్గోవా
నజీం పసంద్
ముండప్ప
ఆండర్సన్
ఛోట జహంగీర్
బేనజీర్
భుట్టో
పచార్సి
నల్ల అండ్రూస్
ముల్గోవా
కదిరి
పంచవర్ణ
కొడెత్తుర్
పాణ్యం
ఫిర్గంగిలుడ్వా
యెర్రకకవలు బారామసి
నీలం
కాజాలడ్డు
గద్దెమార్
జహంగీర్
తారిపడి
గుండు బాదామి
పతంజలి
అల్ఫోంజో
కొథపల్లి కొబ్బరి
సువర్ణరేఖ
పెద్దసువర్ణరేఖ
చిన్న సువర్ణరేఖ
బెన్నెట్ ఆల్ఫోంజీ
ఊల్లూర్
ఫెర్నాండిన్
హఫీజ్ బె గోలా
అమ్రుతకలశం
గురువం
మాధవరావ్ పసంద్
అమృతరసాయనం
పంచదార కలశం
సిందూరం
ఖుద్దూస్
కట్టి నీలం
యెర్ర గోవా
గోహా బందర్
సెలం బంగలోరా
రెడ్డి పసంద్
బనగనపల్లి
జలాల్ సాహెబ్
దొండకాయల మాను
ఆచార్ పసంద్
పొర్కళ్
చిన్నరసం
చెరుకు రసం
కలకత్తా బారామసి
జైలర్
చంద్రకరణ్
జనర్దన్ పసంద్
కిల్లి మొక్కు
కోలంక గోవా
పెద్ద కలెపాడు
మెట్టవలస పీచుమాను
పానకాలు
పెద్దరసం
సఫేద్ అమిని
రాజు మాను
నాగులపల్లి ఈర్సాల
యెర్ర అయోధ్య
హిమాయుద్దిన్ (ఇమాం పసంద్)
ఆలంపూర్ బనేషాన్
మనోరంజని
దోఫల
పెద్ద నీలం
పదిరి

Sunday, June 19, 2016

తెలుగు డిక్షనరీ అంటే.....

ఒకాయన ఎవరో అడిగితే అప్పుడెప్పుడో వెబ్సైటులోకి Galletti's Telugu Dictionary (1933) అప్ లోడు చేస్తిని. ఈవేళ ఎందుకో మళ్ళీ ఒకసారి తిరగేస్తుంటే, మీలో ఎవరికన్నా ఉపయోగపడుతుందనిపించి లంకె ఇవ్వటం...

http://www.maganti.org/pressarch/gallettis.pdf


తెలుగు డిక్షనరీ అంటే, తెలుగులో ఉండే డిక్షనరీ అనుకునేరు పొరపాటున ..:)

Friday, June 17, 2016

అదొక లైబ్రరీ

అదొక లైబ్రరీ
లైబ్రరీ అన్నాక పుస్తకాలు
అందులో రెండు గ్రంథాలు మాట్లాడుకుంటున్నాయ్

***************

"ఎందుకంత ఇది? నా మీదట్లా పడతావెందుకు ? ఒరిగిపోతూ నీ బరువంతా నా మీద వేస్తావేం?"

"నీ మీద కొరుగుతానా, కరుస్తానా, జాగ్రత్త ఖబడ్దార్"

" తమరి పేరేమి నాయనా?"

"నా పేరే తెలియదా నీకు, అరేయ్ వీడెవడో నన్ను పుస్తక ప్రొఫైలింగు చేస్తున్నాడు చూడండిరా"
(చంపండి, నరకండి, చించెయ్యండి....దూరంగా వేరే పుస్తకాల అరుపులు)

"అరెరె, అంత ద్వేషమేమిటండి. అయినా ఇక్కడెవరూ మనుషులు లేరే. చంపుకోడానికి, నరుక్కోడానికి. మనమంతా పుస్తకాలమేగా"

"ఏయ్! తగ్గు తగ్గు. మనం మనుషులం కాకపోతే, మనల్ని చదివేవాళ్ళు మనుషులేగా! మనం ఏది చెపితే అదే వాళ్ళు ఆచరిస్తారు. అయినా అదంతా పక్కనబెట్టు - అసలు నువ్వంటేనూ, నీ పేరంటేనూ, నీ జాతంటేనూ, నిన్ను చదివే వాళ్ళంటేను నాకు పడదు"

"ఎందుకలాగ, అనవసరంగా అరుస్తూ అంత రక్తపోటు తెచ్చుకోకండి. మరి మనం చెప్పేది వాళ్ళు ఆచరిస్తారంటే, మన బాధ్యత ఎక్కువ ఉన్నట్లేగా. చెప్పేదానిలో మంచే ఉండాలిగా. చెడు, ద్వేషం పంచకూడదుగా. ఆ మంచే చెప్పకపోతే మనం ఎందుకు మన బతుకెందుకు. అట్టలోపలున్న పేపర్లు చింపేసుకుని గాల్లో కలిసిపోటం మంచిది."

"చూడూ! అదంతా నాకు తెలియదు. అయినా నీ పేరుతో ప్రాబ్లం నాకు. నీ పక్కనే ఉన్న ఆ రెండు మూడు పుస్తకాలు రామాయణం, భాగవతం, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, శృతులు ఇలా మిగతావంటే కూడా కచ్చ నాకు. నీ పేరు భారతం. నీ పేరులోనే ఒక భాగం భారత్. విన్నావా భారత్ ఉన్నది. భారత్ అంటే పడదు నాకు"

"నాయనా! అదా నీ భాగోతం. ఇప్పటికే విడదీయలేని సంకెళ్ళలో పడి ఎవడూ నే చెప్పిన మంచిని ఆచరించకుండా సుడిగుండాల్లో పడి తిరుగుతున్నారు. కాసంత ప్రశాంతంగా ఉండి సమాజానికి ఉపయోగపడే పనులు ఏవన్నా చెయ్యొచ్చుగా? అసలు మన పుట్టుకే దాని కోసంగా!"

"అది ఇందాకే చెప్పావ్. నాకు నచ్చలేదు ఆ పాయింటు. మా తాతను చూశావా, అదిగో అక్కడ ఆ షెల్ఫులో చిరిగిపోయి పడి ఉన్నాడు. ఆయన పిచ్చాసుపత్రి లైబ్రరీ షెల్ఫులో ఉండేవాడు చిరిగిపోకముందు. ఆయన అక్కడికి వెళ్ళటానికి కారణం ఒక రాజకీయనాయకుడి లాటి లైబ్రేరియన్ అని, చిరిగిపోయాక చెప్పాడు నాకు. అక్కడ, ఆ పిచ్చాసుపత్రిలో చించేశారట ఆయన్ని. ఆయన పరిస్థితికి, ఆయన తరఫున ఆయన పగ నేను తీర్చుకోవాల్సిందే. నా మిత్రులతో కలిసి సాధిస్తా"

"ఆయనెవరో రాజకీయాలు నేర్చినవాడు మీ తాతను అక్కడికి పంపిస్తే, అది మా తప్పెలా అవుతుందో ఏమిటో! ఆ పిచ్చాసుపత్రిలో వాళ్ళంతా నీలా ఉద్రేకపరులేగా. అందుకే తట్టుకోలేక చించేసి ఉంటారు. అయినా మన బుద్ధి ఏమయ్యింది? మన బుద్ధి సరిగ్గా లేకపోతేనే, ఇప్పటి మీడియాలా కలగాపులగా ఐకమత్యం అవసరం పడుతుంది అనుకుంటా"

"ఏయ్! మా ఐకమత్యం గురించి నీకేం తెలుసు. అంతే, మేమంతా అంతే, మాలో అంతా ఐక్యత ఉన్నది. మాలో ఒకరు రాముడి మీద పడి పడి ఏడుస్తారు. ఒకరు కృష్ణుడి మీద పడి ఏడుస్తారు. ఒకరు మనుషుల మీద పడి ఏడుస్తారు. ఒకరు మతం మీద పడి ఏడుస్తారు. ఒకరు పాత రచయితల మీద పడి ఏడుస్తారు. ఒకరు అన్ని కులాలు, లేని కులాల మీద పడి ఏడుస్తారు. ఇలా వారు వీరు అని లేకుండా అందరి మీద పడి అందరం ద్వేషంతో ఏడుస్తూనే ఉంటాం"

"అందువల్ల లాభం ఏమిటో నాకు అర్థం కాలా! "

"లాభం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అయినా నా లాభం నాకు తెలుసులే. మా ద్వేషమే మా ఏడుపు. ఆ ఏడుపే వరదలుగా పారిస్తాం. అందరినీ ముంచేస్తాం"

"నాయనా! ఎప్పుడూ ఏడ్చేవాణ్ణి లోకం నమ్మదు. కొద్దిరోజులు పోయాక చరిత్రలో ఏడుపుగొట్టు పుస్తకాల్లానే మిగిలిపోతారేమో ఆలోచన చేసికోండి"

"ఆలోచనా! అంటే ఏమిటి ? ఏమిటి చేస్తారు దాంతో"

"ఓ! అర్థమయ్యింది. పూర్తిగా అర్థమైపోయింది. సరే, దాని గురించి చెప్పటం కన్నా నిన్నిలా ఏడుస్తూనే ఉండమనటం మంచిదేమో. సరే! లైబ్రేరియన్ వస్తున్నాడు, అరుపులు అవీ తగ్గించుకుంటే అందరికీ మంచిది"

సోదరులారా! నేను కవితను.

సోదరులారా!

నేను కవితను. కవిత్వమును. ఈ కాలములో నన్నెరగనివారుండబోరు. సర్వవ్యాపకత్వం కల్గుటవల్ల నేను విష్ణుస్వరూపం వదిలి కేవలం విస్తుస్వరూపము దాల్చినాను. విష్ణుమూర్తే దశావతారములు వెయ్యగా లేనిది నేను వెయ్యలేనానని పదిహేను అవతార మారుముఖములు నెత్తిన పెట్టుకొంటిని. అవసరానిని బట్టి ఆయా అవతారపు మారుముఖము దాల్చెదను. వచన ముఖము, పచన ముఖము, నానీ ముఖము, వమన ముఖము, వెర్రి ముఖము, విప్లవ ముఖము, నానో ముఖము, పాఠకాంతక ముఖము, దురదగొండాకు ముఖము, మతిభ్రమణ ముఖము నా దశావతార సహిత పదైదు మారుముఖనామములు. ఇప్పటికి దశావతార నామములు మాత్రము చాలును. మిగిలిన్ యైదు నామములలో అనంత శక్తి దాగియున్నది. అవి బయల్పడినచో నీవు లేవు. నేను లేను. అందువలన నావద్దనే యట్టిపెట్టుకొందును. అది యలాగుంచుము.

సమస్త జీవులు శ్రీ పరమేశ్వరుని భిన్నరూపమైనట్లు ఆదియైన కవితా ముఖస్వరూపమైన నేను కవిని బట్టి, వాని మస్తిష్కములోనున్న ఆచారమును బట్టి వివిధానేక విధాలుగా పరిణమించినాను, పరిణమించుచున్నాను. బౌద్ధావతార సిద్ధాంతమువలె జాతిభేదవివక్షతలను పాటింపక కర్మకాండయే, పాఠక ఖర్మకాండయే ముఖ్యమైనదని యెల్లరకును బోధించుచున్నాను, వ్రాయుచున్నాను. పృథివాయురాకాశములును, సత్వరజస్తమో గుణములును, మాయ, మాయారాహిత్యము, సమ్యోగ వియోగాలచేత భగవత్స్వరూపైనట్లు ప్రత్యక్షసుధాప్రపూర్ణమగు కలము, చుబ్బనచూరలాడిన అక్షరములు, పచ్చి పిచ్చి వాక్యములు, మరికొన్ని యితరవస్తువులును సమ్మిళితము చేసి మీమీదకు వదిలిన అది నాదివ్యస్వరూపమగును. సమయమును బట్టియు, సందర్భమును బట్టియు, బాజాభజంత్రీల బట్టియు నాయందు యితర వస్తుభూతప్రేతపిశాచములు కలియు వేళ కొత్త కొత్త ప్రభావములు కలిపించుకొని కొత్త కొత్త పుంతలు తొక్కుచుందును.

ఈతెలుగుదేశములో నేనాడెడిది ఆట, పాడినది పాటగను నాకవిత వేదాక్షరముగను చెల్లుచున్నది. పాఠకుడు నిదురపోక పూర్వము ఒకసారి వాని చెంత చేరితినేని బీభత్సభయము పెట్టి వానికి నిదుర కలలో కూడా రాకుండ చేసెదను. స్నానసంధ్యలకు పూర్వము, దంతధావనమునకు పూర్వము భోజనమునకు పూర్వము యిలా యిప్పుడప్పుడనకుండా కోడివలె కొక్కొరొకోవితకవితయని కూస్తూ తిరిగి రాత్రి నిదురపోయేవరకూ సర్వకాల సర్వావస్థలయందు నాన్ను సేవింపమని దండోరా వేయుచుందును. దైవప్రార్థనమును తోసిరాజను ప్రాతఃకాలమున శంకరా! నారాయణా అని కాక కవితా! ఓ కవితా! యని సకల జనులు లేవవలసిన కాలము రావలెనని నా అత్యాశ. నా దర్శనము చేయకపోయినచో ఆ దినమందు వేరొక పనికాదని శాపావకాసంబొసంగగల వరము నాకు ప్రాప్తియగుగాక. సకలజనాంధ్రమండలమున పాఠక ఆరాధనా నిమ్మిత్తముకాకుండగా భయభ్రాంతులను చేయుచు చాలమందిని వణికించుచున్నానను ఆనందము మాత్రము మిగిలినది.

నాకు భాషతో అసఖ్యము కుదిరినట్లు మరి దేనితోనూ జతకుదరకపోయినను కొన్నికారణముల వల్ల నన్నాంధ్రులు, తెలుగువారు, తెలంగాణమువారు తమ తమ యాసలతో అలంకరించిననూ ఊరకుండవలసి వచ్చినది. "రాకన్ మానదు హానిపాఠకులు మహారణ్యంబులో దాగినన్" అను నీతి నేనెరుగునట్లు వేరెవరెరుగరు. కొందరు అరస విరస సరస పనస నస శషభిష కవులతో కలిసి సఖ్యము నొసంగుచున్నాను. పాఠకులేలాగు సరిపుచ్చుకొనుచున్నారన్నది నాకు యనవసరము. నాకుగల దినదిన ప్రవర్ధమానత్వము ఈదేశములో మరిదేనికి లేదని నేను నొక్కి చెప్పగలను. ప్రతిదినమును నేను నూటికి మున్నూరు జిహ్వలలోనుందును. వార వీర నార కాంత గృహోన్ముఖుల చేతులందు తాండవమాడుచుందును. నేనాంధ్రతెలంగాణపు జిల్లాలలో మొత్తముమీద సంపూర్ణశక్తిని చూపజాలనని యనుకున్నవారందరినీ నాశనమొనరించినాను. నన్ను సేవింపనిచో ఇతరుల బ్రతుకుకూడా నంతియేనని హెచ్చరికలు చేసితిని. చెవిన పెట్టినవారు కవితాకు తిని బతికినారు. చెవిన పెట్టనివారు బలుసాకు తిని ఊర్ద్వ్హ ముఖముగా పైకి పోయినారు.

బహిర్భూమికి, బాతురూముకి తేడా తెలియని పాఠకపుంగవులు వదలకుండ ఆ సమయములో కూడా నన్ను తలచుకొని వెక్కుతూ పూజించవలెనని ఆ మాతనుండి వరమొక్కటి పొందవలె. అదియొక పని మిగిలియున్నది. శుభకార్యములందు నన్ను, నాపుత్రీపుత్రికలను జదువుట సంగతి యేమో కానీ అశుభకార్యములందునూ, తద్దినపు దినములందును, పండుగదినములందును తేడా లేకుండగా చదివెడు పురుషోత్తములను కనవలసిన అవసరము ఈజాతికి యున్నది. నాధాటికాగగలేక తలత్రిప్పట, మతిప్రోవుట, కండ్లుతేలవ్రేత జరుగగా అవుషధప్రాయమని తలచుచు ప్రాణభిక్షకొరకు ప్రార్ధించవలె. వారందరూ నాకు లొంగిన పిమ్మటనే వారికి మోక్షము. నాకటాక్షమునకు పాత్రుడైన నరుడు, పాఠకుడు రోజునకధమము మున్నూరుముమ్మారుసారులు నను సేవింతురు. మద్దెల వాయింతురు. మేళాలతో మరి తాళాలతో ఒకరి మీద ఒకరు శునకముద్రలు జవ్వాజి వలె జల్లుచూ ఊరేగుదురు. నాబరువు కుయ్యోమొర్రోమంచున్ననూ విధిలేక కర్మవశాత్తూ వారు మోసెదరు. వారిజీవితకాలములో నాసఖ్యము మానకుండుటవల్లను ప్రతిరోజు ప్రతిక్షణము తమతమ స్నేహితులను చిత్రవధ చేయుచు నలిమెల పిశాచము వలె కళ్ళురుముచూ క్రొత్తబాధితుల కొరకు ఆవురావురుమంచు వెదకుదురు.

నాబరువు సామాన్యమైనది కాదు. యిక్కడ మీకొక విశేష కథ చెప్పవలెను. మహాభారత కాలము నాటిది.

అలనాడు భీముడు నా రూపాకారములలో యొక రూపమైన ఒకానొక వచనకవితనొకటి చదివి యిటుల బ్రతుకుట కంటె దుర్యోధనుని పాదాల మీద పడి చచ్చుట నయమని అటులనే పడిపోయి పెద్దన్నా నీ గదతో నా తొడలు విరగకొట్టుమని ప్రార్థించెను. అంత దుర్యోధనుడు కూడా వెక్కుచూ నాయనా తమ్మూ నేనునూ నీవు చదివినదే చదివితిని, నేను వెళ్ళి ఎవరి వద్ద మొరపెట్టుకొనవలెను. పెద్దవాడినైనఅందువలన నాకు దిక్కుతోచుటలేదని చెప్పుటకు ఆత్మాభిమానము అడ్డువచ్చుచున్నది. అయిననూ సరే మనమిద్దరమూ ఇప్పుడే పోయి ఆ శిఖండిచే తలలు బద్దలు కొట్టించుకొందము రమ్మనుచు వాలిపోయిన భీమసేనుని భుజముమీద వేసుకొని అతికష్టము మీద జలస్తంభన చేసెను. అది చూచి కృష్ణపరమాత్మ చిరునవ్వు నవ్వి నన్ను ఆ చివర ఈ చివర పట్టుగొని పరపర చించి జరాసంధుని శరీరభాగముల వలె అటునిటు విసరినాడు. అంత నామాయ వారిద్దరి మీద తొలగిపోయి కురుక్షేత్ర యుద్ధము కొనసాగినది.

కృష్ణపరమాత్మకు చెపుదామనుకొంటిని. అయ్యా మీరు అంతమందిని అన్ని ఆయుధాలతో చంపవలసిన యవసరము లేదు, నన్నొకసారి ఆ పదునెనిమిది అక్షౌహిణుల మధ్య నిలబెట్టి యొక్కసారి చదివిన చాలునని చెపుదామనుకున్నంతలో నన్ను గింగిరాలు తిరిగేట్టు చిటికెనవేలి గోరుతో గోవర్ధనపు గీరు గీకు గీకినాడు. చచ్చినాను. ప్రాణములు కడబట్టినవి. అచ్చటినుండి ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయి వస్తిని. ఆ కసిని పిశాచ రూపములో మీయందు తీర్చుకొనుచున్నాను. మీరు ఈ కలికాలములో నానుండి తప్పించుకొనలేరు. అది బ్రహ్మలిఖితమైనట్టిది. లిఖింపకున్ననూ మీ కర్మ యంతియే అని సమాధానపడుడు. లేనిచో మీ సంగతీ చేసెదను.

ఓం తత్ సత్!

-- 2009 లో అప్పుడెప్పుడూ జంఘాల శాస్త్రిగారి కవుల చెండాట వ్యాసము వ్రాసిన తరువాతి నెలలో వ్రాసిన యొక చిన్ని పొత్తపు వ్యాసము. ఇప్పుడు మీ కొరకు యూనీకోడు రూపము దాల్పించితిని.
-- ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్!

యిప్పుడైనా తెలిసిందా, నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నానో?

ఎందుకు ప్రేమిస్తాను?

నిన్నెందుకు ప్రేమిస్తున్నాననా, నీ ప్రశ్న?

నీ గుండ్రని ఒళ్ళు చుట్టూ ఉన్న మెలికల కాంతులు, నా హృదయకోరకాన్ని వికసింపచేస్తాయి - అందుకే నిన్ను ప్రేమించేది

నీ బంగారపు వర్ణం, సూటిగా నా హృదయాంతరాఅంతరాంతరాంతరాళంలోకి చొచ్చుకొని వెళ్ళి నాలో, నివురుగప్పిన నిప్పుకుమల్లే కలకాలం నుండీ అణగారి వున్న మానవత్వాన్ని ఔగరితం చేస్తుంది - అందుకే నిన్ను ప్రేమించేది

నీ త్రికోణపు గుండ్రాయి ఒంటి అంచులు నా హృదయాన్ని కదిలించి, అనంతవిశ్వంలోని ఆనందాన్ని ఒక్కుమ్మడిగా ప్రోగుచేసి, నా దృష్టిపథంలో నిలుపుతుంది - అందుకే నిన్ను ప్రేమించేది

నీ శరీరపు వాసన, నా నున్నని చెంపల్లో సన్నని గుంటలు పడనిస్తాయి. తదేకధ్యానంగా నా చెంపల గుంటలని నీ నున్ననైన చెంపకు ఆనించి చూస్తూ ఉంటే ప్రపంచమంతా మిథ్య అని, నీ మెత్తనైన ఒళ్ళే పరమసత్యమనీ తోస్తుంది - ఈ ప్రపంచ సత్యాలని తెలుసుకోవడానికే నేను నిన్ను ప్రేమించేది

నీ అంచలాగ్రము, తుషారాద్రిని జ్ఞప్తికి తెచ్చే నీ అంచులు నీలోని నిర్మలత్వాన్ని స్ఫురింపచేస్తాయి - అందుకే నేను నిన్నింతగా ప్రేమించేది

నువ్వు నా నోటిలోకి సూటిగా చూసి, చివరికి నీవు నా కొంండనాలుకనే గాంచిన పిదప, బెల్లపుభారము చేత ధగధగలాడుతున్న నీ అపూర్వ సౌందర్యము, కరకరలాడుతున్న కొబ్బరి ముక్కలు, యాలకులు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేయగా జన్మజన్మాంతరముల మన అవినాభావసంబంధాన్ని, మెరుపుకు మల్లే నా నోట్లో, నా పళ్ళ మధ్య, యిట్టే మెరిపింపచేసేసాను

- యిప్పుడైనా తెలిసిందా, ఓ పూర్ణంబూరె నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నానో?

వాదం - అతివాదం

వాదం
అతివాదం
మితవాదం
జతివాదం
అస్తిత్వవాదం
వగైరా వాదం

పిచ్చి
దౌర్బల్యం
మానసిక పిచ్చి
శారీరిక పిచ్చి
వగైరా పిచ్చి

పట్టణం
విశాఖపట్టణం
పిచ్చాసుపత్రి పట్టణం
వగైరా పట్టణం

విశాఖపట్టణానికి పిచ్చాసుపత్రి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో, తెలుగు సాహిత్యానికి ఈ వాదాలు అంత పేరు తెచ్చిపెట్టినాయి

పిచ్చి తానై
వాదము తానై
పిచ్చి - వాదముల మధ్య
చెలరేగుచున్నాడే గురుడు
విరవీగుతున్నాడే ....

అని కొంతమంది పాడుకోగా విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారట

తెల్లారిలేస్తే పిచ్చాసుపత్రి ఎన్ని పేచీలు తెచ్చిపెడుతుందో, ఈ వాదాలు కూడా సాహిత్యానికి అన్ని పేచీలు తెచ్చిపెడుతాయి.

పిచ్చాసుపత్రిలో శిగపట్లు, వాదాల్లో శిగపట్లు ఒకటే

పిచ్చాసుపత్రిలో సభలు, వాదపు గుప్పిట్లో సభలు ఒకటే

పిచ్చిగా మాట్లాడిందాన్ని కప్పిపుచ్చుకోడానికి మరో పిచ్చి ప్రసంగం. అంత బారు ఇంత బారుగా కాకుండా ఏకాంబరం బారంత బారు

తలపాగా అని పెట్టుకునే కుచ్చుటోపీల పిచ్చోళ్ళకు, వాదాలు టోపీలుగా పెట్టుకునే వాదగాళ్ళకు తేడాలేదు

వీరంతా ఇలా పత్రికల్లో పడి ఆంధ్రదేశానికి గర్వకారణం అవటానికి కారణం మరి విశాఖపట్టణంలోని పిచ్చాసుపత్రే కారణమో ఏమో తెలియదు కానీ, అనుకోకపోతే మటుకు అది పిచ్చితనమే!

ఇక పిచ్చగాళ్ళు, వాదగాళ్ళు పండగ చేస్కోండి

ఓం తత్ సత్!

(జనవరి 16, 2011)

అప్పుడు రాసుకున్నది ఇప్పుడెందుకో గుర్తుకొచ్చింది అబ్బాయ్!

Is it the GOD Or Is it the human who serves him

Is it the GOD
Is it the human who serves him
Who is closer to you
Depends on who influences you most
I guess, yes, just a guess

I will narrate my experience
Yours might be different
And you can write one up
I will be eager to read it

My grand pa was close
Close to the god
He served him all his life
His father did
And his fathers father did
And his fathers fathers father did
And his......
Yes, for so many centuries

He was close to me
Than the god himself
And he was the one who introduced me to god
Just not God, he introduced me to many other things
The concept of it
The educative part of it
The learning part of it
He was diligent
He was very strict
There was a protocol
If you missed that protocol, you got what you deserved
I still have the etchings of his "toDapASam" in my heart
When I chant something wrong his voice wakes me up
Involuntarily my hand goes and touches my ear and my lips
It is a way of saying sorry
To him or to the god ?
I donot know

I love that old man
So much that when he was gone, I lost it
I lost the chanting power
I lost the brain exercise
I lost my god
I did not do anything diligently for few years
But then, there was a dream
Whether you believe or not - I dont care
He was in my dream
He was standing that tall
He whispered, what is wrong with you? Why did you leave it?
There was jolt.
I was shaken
And I decided to return
Yes, to my routine
Slowly but steadily

By that time, I forgot almost everything
Everything what he taught me
But then my grand pa knew it may be ?
Or may be he himself descended in Subba Rao's form
Who is Subba Rao, you may ask
He is the head priest in our temple
Siddhi Vinayaka temple
He is my guru
He is about 65 years old
But he's young at heart

He serves the god
As diligently as my grand pa
He saw me one day
A pradosham day
It was by accident
11 years ago

I did not know that it was pradosham
I went to get some peace and some blessing
And yes, there was peace

Sivabhishekam was going on
I was muttering rudram, in my self
Just trying to recollect the broken pieces
He saw that
After all was done, he called me aside
You, you seem to know rudram, but why are you murmuring ?
I was shocked, because that murmur was my grand pa's word
The grand old man never liked murmur
Though he was a soft speaker himself, he never liked murmur
I said to Subba Rao garu, I don't know, may be I did not want to disturb others
Subba Rao garu smiled and said can I see you this sunday morning ? Please!
I said yes and I went
It was gaNapati abhishEkam
And he made me sit by his side
The other priest was doing the abishekam
Subba Rao garu said, lets start rudram, and I want you to chant it loud with me
I was stunned
I did not do that in a long time
I, I , I.... was stutterring
There was large crowd
They were looking at me, I thought
I was embarassed
He saw my hesitation and he stood up
I said Oh, oh to myself
But he went and got a "mahAnyAsam" book
Opened the pages and handed it over to me
Said - lets do it
And I did
Without any mistakes

And from then on, I never missed the chant

He was there for me to revive all my uccAraNa
He taught me taittirIyOpanishat
He taught me many
He makes me sit by him
He summons me
He corrects me
With out any hesitation
Just like my grand pa

Ramanavami, Dasara, Vinayaka Chaviti - just not one, I was sitting beside him for each every abhishekam, festivity and what not

Now, he is gone from the temple
He went on a india trip
He decided to retire, may be
He did not tell me
Rumors are that he may not come back

It has been a while already
I now am slowly losing it
I can see that my history is repeating
I have lost the interest to go to the temple
I am doing it at my home

But there is no peace
There is this "alajaDi"
There is this something missing feeling
I just go to the temple like a robot
Do things and come back

And he is not even my relative
May be more than a relative, he is my guru?
Is that why ?

Is human bonding more influential?
Is that a destiny that almighty writes on your forehead?

May be!

But I dearly wish him to come back
I do... And hope the god is listening

I will be waiting

(June 17, 2016)