Tuesday, July 21, 2015

కట్టప్ప పొడిచిన పోటు!

**********************

అంకితం బాహుబలీ నీకే అంకితం.
రాజమౌళీ నీకూ అంకితం.
సెంథిలూ నీకూ అంకితం.

************************

నల్లటి నిశీధ నిశ్శబ్దపు నీడలు
మాహిష్మతిలో నిద్రలేని నీ కాళ్ళు
దేవసేన శిధిల జీవితాల కైవారాలు
కొలుచుకుంటూ కుమిలిపోతలు
చెండాడే కత్తుల చుక్కలు
కనుసైగల పై నడకలు
కదలని కొండలై కదలే మనసులు
నల్లటి కారుమేఘాల ఉరుములు
ఎక్కడో ఎప్పుడో కనపడని అమరేంద్రుడు
అలసి సొలసి విరిగిపడిన తుఫానులా
బలం పుంజుకొని చేయెత్తి పిలిచాడు
నడిసంద్రాన సుడిగుండంలో
చితి పేర్చింది. కట్టెల చితి పేర్చింది
మునిగిపోయిన ఓడలా ఎలుగెత్తి దేవసేన మనసులోనే అరచింది
ఆ అరుపు కడలి గుండె పగిలిన బడబాగ్ని కీలికలా
ఆకాశం మొదటి అంచులో అవంతికను చేరింది
ఆమె వెంట గిరగిరా తిరుగుతూ పెనుగాలిలా శివుడు
కెరటంలో మునకకొడుతూ నెత్తురు మరిగించే
అడుగుజాడల్లా బుసగొడుతూ పడగెత్తింది
ఎప్పుడో రాలిపోయిన చుక్క శివగామి
శివుడి తెరచాపలా లేచింది
నిప్పులబాణం దిగబడింది
చీకటి ఒడిలో ఊపిరి విడిచిన సరీసృపం
భళ్ళాలదేవుడిలా రివ్వున దూసుకువస్తుంటే
కన్నూ మిన్నూ ఏకమై కాలకేయుడిని యుద్ధంలో నులిమేసింది
అప్పుడు విరిసింది ఒక పారిజాతం
విరిగిముక్కలైన ఎముకల పంజరంలోని నరాల
నెత్తురు మరిగిస్తూ జలపాతధ్వనిలా
మరోజగత్తు ముఖద్వారం దాకా వంతెనలు కడుతూ పునాది వేసింది
ఇంతలో బీటలువారిన బిజ్జలదేవుడి గోడలు
వాటి వెనక తెగిపడ్డ శృంఖల నినాదం
నినాదపు కుబుసాల గుట్టలో వెనుకటి కాలం
ప్రతీకార ధ్వనులు చేస్తూ నిశీధాంతాన
మేలుకొలుపులు షడ్జమంలో పాడుతోంది
నీ కోసమే పాడుతోంది
లే! ఇక లే! గర్జించు! బాహుబలీ గర్జించు
పదునెక్కిన పరశువుతో నిర్జించు
కాటిమంటల్లో పగిలి శకలాలు
నిదరోతూ ధరించిన నెత్తుటి ధగధగల కిరీటం
ఆ ధగద్ధగల కాంతుల్లో కట్టప్ప పొడిచిన పోటు
ఉషః కిరణంలా కంక్లూజన్ భవిష్యత్తులోకి దూసుకుపోయింది!

No comments:

Post a Comment