Tuesday, July 28, 2015

నాడారు నహీ"డర్" అనుచు బురుజు కిటికీలు జంపు !

బాహుబలి
అమరేంద్ర బాహుబలి
మహేంద్ర బాహుబలి

ఇతని సామాన్యునిగ మీర లెంచవలదు
దుష్టసంహరణబును శిష్ట రక్ష
ణంబొనర్చగ నితడు జ న్మంబునందె
శివుని యవతారమిది మేలు చేయగలడు
మాహిష్మతికి నెంతయో గాన శక్తి కొలది
జేజేలనొసంగి రక్షింప వలయునతని


సంగ వొడిని వీడి
అవంతికను తలదాల్చి
తుట్టతుదదాక ఆమె సన్నుల
మెలగిన యట్టివాడు
శివుడొక్కడె యన నతిశయంబె
అవ్వీరునకు, ఆ సుందరునకు,
అబ్బాహుబలికి, అమ్మహేంద్రునికి
సాటి యెవ్వరు గలరు సినీముజ్జగములందు


దబ్బపండంటి మోము, పచ్చనైన
ఛాయ; నవరత్న మయకర్ణ కుండలములు
తెల్లనగు పలువరుస ముత్తెముల సరులు
పసిడి వర్ణంబు గల పట్టు పంచె గలిగి
మదగజమువోలె నడచుచు మనదు దెసకు
సరిగ వచ్చె నా బలిష్ఠుండు
వాని తనుకాంతిచేత సినిమ యెంతో
ముదము గొలిపె బంగరు నీరు పోసినట్లు


దేవసేన యన లోకమాత ఆ శీలవతిని
బట్టి సంకెలల గ్రుచ్చి గానుగెద్దును తిప్పినట్టి
మహాపాతకంబొనరించిన బిజ్జలకొమరుడు
బాహుబలి తోడి పోరాటమూని భళ్ళలుడు
తన వంశనాశన మొనరింప ఎవరాపగలరు?


కపట నాటకధారి వీడు భళ్లాలుడు బి
జ్జలదేవ పుత్రుడు జనులమోస
పుచ్చ మదోన్మత్త వేసంబు పూనినాడు
దనుజకుల సార్వభౌము వలె
వాని వేషములు బాహుబలి వద్దనా
యని మాహిష్మతి దద్దరిల్లె


దాటిపోవు ముహూర్తంబు త్వరితగతిని
శివగామి ఆనదీర్పంగ కరికాల కట్టప్ప
నాడారు నహీ"డర్" అనుచు బురుజు కిటికీలు జంపు
చేసొచ్చి తిరుగుబాటుదారుల వధియించె
జైమాహిష్మతి యనుచు మరి అంత సుందరంబుగనూ

వహవ్వా శివగామి
వహవ్వా కాలకేయా
వహవ్వా సెంథిలూ
వహవ్వా రాజమౌళీ
వహవ్వా బాహుబలీ
అమరేంద్ర బాహుబలీ
మహేంద్ర బాహుబలీ
అవంతికా బాహుబలీ
వహవ్వా వహవ్వా
వహవ్వా వహవ్వా!

No comments:

Post a Comment