Thursday, July 30, 2015

అంతటి ఖ్యాతిబడసిన ఆ మాహిష్మతీనగర ....

*******************************
మాహిష్మతీపురవర్ణనము..
********************************

శ్రీదంబగు నిద్ధరాసరసీరుహాననకు నాననంబునాదనర్చు నీభరతఖండంబునకు చెందిరచుక్కయనందగు మాహిష్మతీనగరంబొండుగలదు. ఆ పట్టణంబు జాంబూనదరత్నఖచితంబులగుచు గగనంబునందిజిగిమిగులుగోపురంబులచేతను, సారతరహీర భూరివినిర్మితంబులగు ప్రాకారంబులచేతను, మీనాది నిఖిలజలచర నికరసంగతంబగుచుపారావారంబుంబోలుపరిఖ చేతను, కపిద్ధాశ్వద్ధఘోటజటీపున్నాగ వంజులకరంజరసాలజంబుజమీరాదిపాదపబృదంబులపై కీరమయూరశారికాద్యనేక దేవసేనవిహరింప, నానడుమసరసీరుహకైరవాది పుష్పపరిశోభితంబులై చక్రచక్రాంగ చక్రవిలసితంబులగు కమలాకరంబులచే జెన్నలరారు నారామంబులచేతను, నవమణిమయచంద్రకాంత శిలానిర్మితంబులగు కాంచనహర్మ్యంబులచేతను, ముక్తాఫలంబులరంగవళ్ళులచేనొప్పుచు, వివిధసుగంధతావులొసంగువీధులచేతను, మేరుపర్వతసంకాశంబులగుకనకరథంబులచేతను, దిగ్దంతావళంబులంబోలుదంతిరాజంబులచేతను, నాదిత్యునిరథాశ్వంబులమించు నంచితంబులగుతురగంబులచేతను, యమకింకరులనైన కొంకకనుక్కడందుకాల్బంటులచేతను, యజనయాజనాది షట్కర్మనిరతులగుచువేదాంతవిచారణాంబుధినోలలాడువిప్రవరులచేతను, గురుసేవాదురంధరులగు పంటనెచ్చెలినుత్సాహింపింజేయుచు భక్తివైరాగ్య శిష్యులచేతను, నవరసశృంగార నాయికామణులగుచు, సరససంగీతసాహిత్యభరతశాస్త్రనైపుణిని రంభాదిదేవభామినులమించునభినవయవ్వనలావణ్యవంతులగు గణికామణులచేతను నొప్పుచు, సత్యశీలత్వమ్మునకు బ్రహ్మలోకసమానముగను, ననంతభోగాస్పదంబునకుభోగవతినింబురడించుచు, నిత్యవిభవాతిశయంబుల నమరావతింగేరడముసేయుచు, సకలరత్నసమగ్రంబున రత్నాకరంబుమీరుచు, సర్వజనశ్లాఘనీయంబై ధర్మదేవతకు బుట్టిల్లనందనర్చునప్పురంబు, దిశాంతవ్యాప్తహారనీహారతార పూరశారదనీరదాభకీర్తిమంతుండును, నిజజ్ఞాన జంఝావాతసముద్ధూత మాయాప్రతిబింబ కంధరుండునునగు అమరేంద్రబాహుబలి భూపాలుడేలుచుండెను. అతనిరాజ్యంబున ననావృష్టిలేకనతివృష్టియుంగానక మితవర్షంబులుగురియుచు వసుధ సర్వసస్యాఢ్యసంభరితయైయుండు, భూరుహంబులెల్ల సురభూరుహమబుల తెరంగున ఋతుషట్కంబుల కుసుమఫలపరిశోభితంబులైయుండు, ధేనువులెల్ల కామధేనువులంబోలె ననూపయోధారనొసంగుచుండు. అప్పురిజనులసత్యంబన్న వింతజూతురు, కలహంబులన్న యులికిపడుదురు. మదాందీభూతులగునప్రయోజకులు మందునకైననిగానరారైరి. సజ్జనావళి మనోవిన్యస్త నిగమాంతవిచారణా తత్పరులగుచునెయ్యెడలంబ్రబలియుండిరి.

అట్టియెడ...

****************************
అంతటి ఖ్యాతిబడసిన ఆ మాహిష్మతీనగర సౌందర్యమును గణనయంత్రముల చేతబట్టి అర్కమీడియాయనువారు పేకమేడలయందుచూపుగట్టినారు, రామోజీఫిలుముసిటీవారు నిజప్రయోజకులవలె సాంత్వన చేకూర్చినారు. అయ్యదిమేల్ వలన, ప్రేక్షకులు ఉస్సురుస్సుననక బయల్పడిరి.

No comments:

Post a Comment