Wednesday, July 29, 2015

కరికాల కట్టప్ప నాడార్ దండకము!

కరికాల కట్టప్ప నాడార్ దండకము

******************************


శ్రీమన్మహానాడారుపుత్రా! సదాసాధుమిత్రా! మాహిష్మతీభద్రా కరికాలకట్టప్పభద్రా! విశేషానుకంపా సముద్రా జగద్వర్ణనీయాప్రమేయ స్వకీయప్రచేష్టావిశేషాతి సంప్రీణితస్వాంతరుద్రా! నీ గడ్డమున్ నీ గుండుయున్ నీ కత్తియున్ సైన్యమ్మును ఉరకలెత్తించగా ప్రేమతో వీక్షించి శివగామికోర్కె సంపూర్తిగావించి బాహుబలిన్ దీవించి రక్షింపుమయ్యా అష్టదిక్పాలకాతీతసద్వైభవారుద్రదేహోద్భవా! అనుపపరాక్రమౌదార్యగాంభీర్యధైర్యాతి శౌర్యాదిభాస్వద్గుణాధార! ఆయుధాగారాధిపమందార శ్రీకోటిమార్తాండతేజా! ఆగ్రహంబుద్భువంబయ్యెనేని అస్లమ్ముఖాను ఏమి ఎవరేమి, ఏ శాత్రవ కరవాలమ్మునైన వాలమ్ము కత్తిరించి దాని చిత్తుచేసిన్ చెత్తబుట్టనుందున్ విసిరివైచు మహాధీరా మహారుద్రాగ్రహాముద్రా! రాజమాత శివగామి నీ పేరు తలచినంతనే, ఒక్కమారు పిలచినంతనే గవాక్షాబురుజుకిటికీలన్ సుళువుగా దుమికి శత్రుసంహారమొనరించు నీకడ్డమై నిల్చువారెవ్వరు మహావీరా కరికాలా! చలనచిత్రాంతవేళ సిద్ధా సిద్ధాయని యరచుచు కత్తిచేజారినవేళ వానలో వంగులో మెరుపులో బాహుబలిన్ జూచి రాజ్యరాజరాజపదములెత్తి నెత్తింబెట్టుకొను నీదు సౌమ్యమనంబుకు నా నామస్కారముల్ సమర్పింతు నీకెప్పుడున్ భక్తుడన్ బ్రేమతో స్వీకరింపుమయ్య, మము ప్రేక్షకులను బ్రోవుమయ్యా నీనామమంత్రంబు నేప్రొద్దునాసక్తితోడం జపంబూను ప్రేక్షకులౌ వారికిన్ శాకినీఢాకినీ భూతభేతాళకూశ్మాండకాదిగ్రహానీక బిజ్జలభళ్లాలదేవ సంబంధి బాధావిశేషంబులెల్లన్వినాశంబునొందున్ సదాసౌఖ్యమబ్బున్ శుభంబుల్ఘటించున్ మరింభక్తి నీదండకంబెవ్వరేనిన్ పఠింపన్ నీ శక్తియున్ విశ్వాసముంగల్గు భక్తకల్పద్రుమా నమస్తే నమస్తే నమ:


**************************************

No comments:

Post a Comment