Friday, June 26, 2015

అనగనగా.....

అనగనగా ఒక యుగం.
యుగానికి కొన్ని కట్టుబాట్లు.
యుగంలో కొన్ని కట్టుబాట్లు.
యుగానికి కొన్ని పద్ధతులు.
యుగంలో కొన్ని పద్ధతులు.
ఏ యుగానికి ఆ యుగమే.

ఈ కథలోని యుగంలో బ్రాహ్మలంటే మంచి గౌరవం.
అదీ ఆ యుగపద్ధతి.

అలాటి యుగంలో ఒక రాజ్యం.
ఆ రాజ్యానికి ఒక రాజు.
రాజుగారన్నాక సేన.
యుద్ధాలు. పొలిమేరలు.
కొన్ని రోజులు పరమ శాంతం.
కొన్ని రోజులు భీకర యుద్ధం.
అలాటి రోజులు అలా నడిచిపోతున్నయ్.

పక్కనే ఇంకో రాజ్యం.
దానికో రాజు.
ఆయనకో సైన్యం.
అయితే అక్కడా బ్రాహ్మలకి మంచి గౌరవం.
ఆ పక్కరాజుగారికి ఒక రోజు దురద పుట్టింది.
పొలిమేర పెంచుకోవాలన్న దురద పుట్టింది.
ఇంకేముంది సైన్యాన్ని లేపాడు.
పరుగులు తీయించాడు.
పక్కరాజ్యమ్మీదికి.

మన రాజ్యంలో వున్న సైన్యంకన్నా ఆ పక్కరాజ్యం సైన్యం సంఖ్యలో పెద్దది.
మన రాజ్యం రాజుగారికి కొద్దిగా చెమట్లు పట్టినై.
కానీ మహావీరుడవటం వల్ల శాంతంగానే వున్నాడు.
బాగా దగ్గరికొచ్చాక చూసుకోవచ్చు, మన పెతాపంతో అందరినీ ముక్కలు ముక్కలు చెయ్యొచ్చులేనని ఊరుకున్నాడు.
ఎంత శాంతంగా వున్నా పెళ్లాం దగ్గర బయటపడిపోవటమే.
అలా రాణిగారు పసిగట్టేసింది.
సంగతి తెలుసుకొని అట్లా అయితే కష్టం కదా అని నచ్చచెప్పింది.
మంత్రులకు కబురెళ్ళిపోయింది.
అంతా వచ్చేసారు.
లెక్కలు డొక్కలు వేస్తున్నారు.

వార్తాహరుడు ఒకడొచ్చాడు.
సైన్యం సంఖ్య తెచ్చాడు.
లెక్క తేడా వచ్చేసింది.
తాసు అటువైపు తూగిపోయింది.
రాజు గారి గాంభీర్యం అంతా సడలిపోయింది.
ఇరుకున పడ్డాడు.
చేతులు నలుపుతున్నాడు.
అంత సంఖ్యతో వస్తున్న సైన్యాన్ని నిలవరించటం కష్టమేనని తెలివిడికొచ్చింది.
అది చూసి మంత్రుల్లో ముఖ్యుడైన ఒకాయన నేను చుసుకుంటాలెండి, మీరు ఖంగారు పడకండి అని భరోసా ఇచ్చాడు.
ఎలా చూసుకుంటావ్ ? ఏం చూసుకుంటావ్ ? అన్నడు రాజుగారు.
అంతా నే చూసుకుంటా కానీ, ముందు ఓ పని చెయ్యండన్నాడీయన.
ఏవిటన్నాడు రాజుగారు.

ఊళ్ళో, రాజ్యంలో ఉన్న బ్రాహ్మలందర్నీ లాక్కొచ్చెయ్యమని ఆర్డరేసెయ్యండి అన్నాడు.
ఆర్డరు పాసైపోయింది..అందరు బ్రాహ్మలూ వొచ్చేసారు.
ఇంకో ఆర్డరు వెయ్యండన్నాడు ఈయన.
ఏవిటన్నాడు రాజుగారు.
ఊళ్ళో, రాజ్యంలో ఉన్న గోమాతలని కట్టకట్టుకొని లాక్కొచ్చెయ్యమని ఆర్దరేసెయ్యండి అన్నాడు.
ఆ ఆర్డరూ పాసైపోయింది.
గోవులన్నీ వొచ్చేసినయ్.
సైన్యం అంతా రెడీ అయిపోండి అన్నాడీయన.
సైన్యమూ రెడీ అయిపోయింది.
ఇక యుద్ధమే ఆలస్యం.

అప్పుడన్నాడు మంత్రిగారు.
ఓయ్ బ్రాహ్మలూ! ఎక్కండి ఆ గోమాతల మీదకెక్కండి అని.
అందరూ ఒక్కోదాని మీదకు ఎక్కేసారు.
ఆ గోవులెక్కిన బ్రాహ్మలంతా ఒక చిన్న సైన్యంలా వున్నారు.
వాళ్ళందర్నీ, ఆ గోవుల్నీ, వాటినెక్కిన బ్రాహ్మల్ని అసలు సైన్యం ముందు నుంచోబెట్టాడు.
చలో, ఏక్ నిరంజన్ అన్నాడు.
అంతే! అంతా బయల్దేరారు.

క్షేత్రానికొచ్చారు. యుద్ధక్షేత్రానికొచ్చారు.
అవతలి రాజుగారి సైన్యం విస్తుపోయింది.
ఈ బ్రాహ్మలేంటి, ఈ గోవులేంటి.
వీళ్ళందరూ సైన్యానికి ముందుంటే యుద్ధం చేసేదెట్లా?
పైకి గురిపెడితే బ్రహ్మహత్య.
కిందకు గురిపెడితే గోహత్య.

మరి ఆ యుగానికేమో బ్రహ్మహత్య, గోహత్య మహాపాతకాలు.
అదీ ఆ యుగపద్ధతి.

అలాటి పద్ధతి ఉండటం వల్ల ఉపయోగం.
ఆ పద్ధతి వీళ్లకు ఉపయోగపడింది.
ముందు వీళ్ళంతా పోతే కానీ వెనకొచ్చే సైన్యం పని పట్టటానికి లేదు.
అది కుదిరే పనీ కాదులే అవతలి సైన్యాన్ని ఆ యుగపద్ధతి తిప్పి పంపించేసింది.
అలా మన రాజ్యం బతికిపోయింది.

యేదన్నా పద్ధతి ఉన్నదంటే దానివల్ల ఆ యుగానికి ఉపయోగించుకునేవాడి విధానం వల్ల అంతే లాభం.
అయ్యా అదీ సంగతి.
అందువల్ల...ఇంతే సంగతులు చిత్తగించవలెను.

ఓం తత్ సత్!

Monday, June 8, 2015

An oil painting after a while.....

An oil painting after a while.....

I was impressed with the action of this majestic bengal tiger in a framed picture, [well, it was a sketch printed on a paper and framed] at a friend's place. So borrowed it for reference and did it in oils.

Almost in a monochromatic mode. 16 by 20 canvas.

Haven't used oils lately, been on acrylics for a while. And yes, it was a refreshing change...

Some more layers of paints need be added though!...

Thanks for stopping by...Sunday, June 7, 2015

ఆ 103 చిత్రాలు చూస్తే .....

ఆ 103 చిత్రాలు చూస్తే ఆనందం!

ఇక్కడ

ప్రసార ప్రముఖులు సెక్షన్లో కొత్తగా జతచేసినవి

భవదీయుడు
వంశీ

Saturday, June 6, 2015

అయ్యా, మీలో ఎవరికైనా ఈ ఆకాశవాణి నాటకం గురించి ...

అయ్యా,

మీలో ఎవరికైనా ఈ ఆకాశవాణి నాటకం గురించి పూర్తి వివరాలు తెలిస్తే పంచుకోమని విజ్ఞప్తి. ఆడియో సౌజన్యం గురువుగారు డాక్టర్ కె.బి.గోపాలం గారు

పానుగంటివారు తను వ్రాసిన అసంఖ్యాకమైన నాటకాల్లో ఓం ప్రథమమైన ఐదిట్లో నాలుగవ నాటకం ఈ "రాధాకృష్ణ".

నావద్దనున్న ఒక ఫోటోలో వున్నవారిని బట్టి ఈ నాటకంలోని తెలిసిన పాత్రధారులు వీరు..


బాలమురళీకృష్ణ
బందా కనకలింగేశ్వరరావు
రత్నం
వింజమూరి లక్ష్మి
ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు
సి.రామ్మోహన రావు
నండూరి సుబ్బారావు
వి.బి.కనకదుర్గ

మీ సాయానికి ముందస్తు ధన్యవాదాలు

భవదీయుడు
మాగంటి వంశీTuesday, June 2, 2015

ఆకాశవాణి ప్రసారితాలైన సంగీత రూపకాలు లిష్టు ఇంచుమించుగా దొరికేసినట్టే!

శ్రీమతి పద్మజా భూషణ్ గారు "నాట్యకళ" వింశతి వార్షికోత్సవ ప్రత్యేక సంచికకోసం వ్రాసిన వ్యాసం చదువుకుంటే ఆకాశవాణి ప్రసారితాలైన సంగీత రూపకాలు లిష్టు ఇంచుమించుగా దొరికేసినట్టే

వ్యాసం ఇక్కడ చదువుకోవచ్చు.

భవదీయుడు
వంశీ