Thursday, May 21, 2015

గ్రామొఫోన్ - 78RPM ఆడియోలు

గురువుగారు డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో ఈరోజు వెబ్సైటులో గ్రామొఫోన్ - 78RPM సెక్షన్లో పబ్లిష్ చేసిన ఆడియోలు:

డాక్టర్ సి.హె.బి.వెంకటాచలం గారు
  • ఈ పాండిత్యము
  • మనసు నిలిపినంత

శ్రీ మరాఠీ (బెజవాడ) సీతారామయ్య గారు
  • ఆనందభైరవి - హార్మోనియం
  • శృంగారలహరి - హార్మోనియం

శ్రీ మరుంగపురి గోపాలకృష్ణ అయ్యర్
  • వయొలిన్ - బంటురీతి - హంసానాదం
  • వయొలిన్ - హెచ్చరికగ రారా 

వీలు చేసుకుని వింటారని

భవదీయుడు
వంశీ

Sunday, May 17, 2015

గ్రామోఫోన్ - 78 RPM Records - అరుదైన ఆడియోలు కొన్ని!

గ్రామోఫోన్ - 78 RPM Records - అరుదైన ఆడియోలు కొన్ని గురువుగారు శ్రీ డాక్టర్ కె.బి.గోపాలం గారు సహృదయంతో అందించగా, మీకోసం - వెబ్సైట్లో - గ్రామోఫోన్ 78RPM సెక్షన్లో పబ్లిష్ చెయ్యడమైనది. వీలున్నప్పుడు, వీలుచేసుకుని వింటారని ....

1) శ్రీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి
2) శ్రీ అద్దంకి శ్రీరామ మూర్తి 
3) శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్

భవదీయుడు
మాగంటి వంశీ

PS: Audios are best played in IE browser

Wednesday, May 13, 2015

ఆత్మహననం నాటకం - A wonderful and rare piece

(A wonderful and rare piece)

ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం కేంద్రాల నుండి ప్రసారం

ఆత్మహననం నాటకం

రచన - శ్రీ పాలగుమ్మి పద్మరాజు
సంగీతం - శ్రీ పాలగుమ్మి విశ్వనాథం

ఇందులో
శ్రీమతి గాలి ప్రభావతి
శ్రీమతి సావిత్రి
శ్రీ భానుప్రకాష్
శ్రీ కాశీ విశ్వనాథ శాస్త్రి
శ్రీ వెంకట రమణమూర్తి
శ్రీ వి.భవానీశంకర్
శ్రీ సి.హెచ్.దేవదాస్
శ్రీ ఎ.వేణుగోపల్

గాయనీ గాయకులు

శృతి
స్మిత
శారద
శ్వేత
ఎన్.గంగాధర శాస్త్రి
హెచ్.హేమవతి
వి.జయంతి

సాంకేతిక సహాయం - శ్రీమతి అన్నపూర్ణ

నిర్వహణ - శ్రీమతి శారదా శ్రీనివాసన్

ఆడియో సౌజన్యం - శ్రీ డాక్టర్ కె.బి.గోపాలం

Link here

As the file is huge, about 50 mb, If you cannot hear because of your internet speed / connection - here is the mp3 link

http://maganti.org/audiofiles/air/dramas/atma.mp3

Wednesday, May 6, 2015

అంతే!

ఆ రోజు.
ఒక బ్రహ్మాండమైన రోజు.

కూర్చున్న శివయ్య లేచి నిలబడ్డాడు.
మంచుకొండ మీద అలా నిలబడ్డాడు.
ఒళ్ళు విరుచుకొన్నాడు.
జటాజూటమ్మీది గంగమ్మ ఉయ్యాలలూగింది.
చంద్రుడు తడబడి దాక్కున్నాడు
యక్ష కిన్నెర కింపురుష గాంధర్వులకు పిలుపు వెళ్ళింది.
హుటాహుటిన అంతా వచ్చేశారు.

శివయ్య పిలిచాడంటే మాటలా!
ఎక్కడివి అక్కడ వదిలేసి హాజరీ వేసేసుకోవద్దూ ?
స్వామీ - ఆజ్ఞ అన్నారు.
భూలోకంలో పనుంది, ఎవరు చేస్తారన్నాడు!
ఏం పని అని తిరుగు ప్రశ్న వేసారు యక్ష కిన్నెర కింపురుషులు.

గంధర్వుల వొంక చూచాడు శివయ్య.
మీ ఆజ్ఞ కోసం చూస్తున్నామయ్యా అన్నారు వాళ్ళు.

శివయ్య పెదాల మీద చిరునవ్వు వచ్చె.
కరిగిపోండి అన్నాడు.
గంధర్వులు కరిగిపోయారు.
శరీరాలు వదిలేసారు.
గాంధర్వం కరిగిపోయింది.
కరిగి నీరైపోయింది.
చేతిలో ఒడిసి పట్టుకున్నాడు ఆ జలాన్ని శివయ్య.

ఆదిత్యుణ్ణి పిలిచాడు.
భారద్దేశంలో ఉదయించేశెయ్యమన్నాడు.
బంగరు కంకణాలు డెక్కలకు తాపడం చేసిన గుర్రాలు పూంచేశాడు ఆదిత్యుడు.
జలాన్ని ఒక కమండలంలో పోసి ఆదిత్యుడి చేతిలో పెట్టాడు.
భూలోకంలో రాముడు, సీత దగ్గరికి వెళ్ళి వాళ్ళకిచ్చేసిరా అన్నాడు.
ఆదిత్యుడు బయలుదేరాడు.
ఆకాశమ్మీద ఆ డెక్కలు టక టకలాడుతున్నై.
నభోంతరం పులకించిపోతోంది.
మబ్బుల మీద చిందరవందరగా అమృతబిందువులు పడిపోతున్నై.

రాముడికి, సీతకు దాహం వేస్తోంది.
వచ్చేశాడు ఆదిత్యుడు.
కమండలం ఇచ్చేసాడు.
శివయ్య ఇచ్చిన కమండలం ఇచ్చేశాడు.
శలవు అని తన ఇంటికి వెళ్ళిపోయాడు.

రాముడికి, సీతకు దాహం తీరింది.
కమండలం ఖాళీ.
అంతే! 

బ్రహ్మాండం ఉదయించింది.
బ్రహ్మం ఉదయించింది.
త్యాగబ్రహ్మం ఉదయించాడు.

కాకర్ల రామబ్రహ్మానికి, సీతమ్మకు త్యాగబ్రహ్మం జన్మించాడు.

తెలుగింట గాంధర్వం ఉదయించింది.
గంధర్వులు తమ జీవితం ఈ విధంగా ధన్యమయ్యిందని పులకించిపోయారు.
అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయారు.
గాంధర్వమూ ఇక్కడే ఉండిపోయింది.
సంగీతమూ ఇక్కడే ఉండిపోయింది.
సాహిత్యమూ ఇక్కడే ఉండిపోయింది.
భక్తీ ఇక్కడే ఉండిపోయింది.

శివయ్య చిరునవ్వు నవ్వాడు.
వెండి కొండ మీద కులాసాగా కూర్చున్నాడు.
గంగమ్మ ఉయ్యాలలు ఆగినై.
చంద్రుడు బయటికొచ్చాడు.

అంతే!

***********************

నిన్న సాయంత్రం "చలమేలరా" విన్నాక రాసుకున్న చిన్న కథ

Monday, May 4, 2015

అపురూపమైన మీరాబాయి నాటకం!

అపురూపమైన మీరాబాయి నాటకం

విజయవాడ, హైదరాబాదు కేంద్ర ప్రసారం

శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు

మీరా - కుమారి శ్రీరంగం గోపాలరత్నం
మీరా చిన్నతనంలో - కుమారి వై.కృష్ణకుమారి
మీరా తల్లి - శ్రీమతి ఎ.కమలకుమారి
రాస్ మణి - శ్రీమతి ఎం.నాగరత్నమ్మ
దేవి - శ్రీమతి వి.బి.కనకదుర్గ
రంగిణి - శ్రీమతి లత
రతన్సింహ - శ్రీ బండి కోటేశ్వరరావు
భోజ్ రాణా - శ్రీ ఎ.బి.ఆనంద్
రతన్ రాణా - శ్రీ ఎ.లింగరాజు శర్మ
రాయదాస్ - శ్రీ కందుకూరి చిరంజీవిరావు
అక్బర్ - శ్రీ సి.రామ్మోహన రావు
తాన్ సేన్ - శ్రీ బందాకనకలింగేశ్వరరావు
హరిరాందాస్ - శ్రీ చిట్టూరి శ్రీరామ మూర్తి

రచన, నిర్వహణ - శ్రీ బందా కనకలింగేశ్వరరావు
సంగీత పర్యవేక్షణ - శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు

ఆడియో సౌజన్యం - గురువుగారు శ్రీ కె.బి.గోపాలం.
వారికి హృదయపూర్వక నమస్కారాలతో.

అత్యంత అపురూపమైన ఈ నాటకం http://www.maganti.org/ వెబ్సైట్లో "అపురూప శబ్దాలయం" సెక్షన్లో వినవచ్చు.

తా.క - మరిన్ని అపురూపమైన ఆడియోలు త్వరలో  ఒకటొకటిగా తాజీకరించబడతాయి.