Sunday, January 5, 2014

నేలనూతల వారి ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతయ్యో ఎవరైనా చెపుతారా అధ్యక్షా?

అయ్యా, అమ్మా - ఆ పైన అధ్యక్షా! దయ వుంచి నేలనూతల వారి ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతయ్యో ఎవరైనా చెపుతారా అధ్యక్షా? ఇప్పటివరకు ఓ పదిమందిని అడిగినవాడిని అడిగినట్టే వున్నా! మాకు తెలవదు అంటే మాకు తెలవదు అనేవారే కానీ ఎవరికీ కరుణ కలగలా అధ్యక్షా...అందువల్ల ఇలా పోడియం వద్దకు దూసుకు వచ్చి మీ మీదకు ఇది విసరాల్సి వచ్చింది అధ్యక్షా...క్షమించాలి అధ్యక్షా!






పోతే ఇది - "భారతి సూచి" అని డాక్టర్ ఎం శంకర్ రెడ్డి గారు సంకలించిన పుస్తకం నుండి కత్తిరించింది అధ్యక్షా...తెలియనివారికి - అందులో 1973 నుండి 1991 వరకు భారతి పత్రికలోని దాదాపు 6000 వ్యాసాలను సూచి చేసి పెట్టితిరి...సాహిత్య అకాడెమీ వారు, ఆయన ఇద్దరూ అభినందనీయులు అధ్యక్షా...అయితే నేలనూతల వారు మటుకు ఒంటిచేత్తో ఈ తెలుగు సాహిత్యాన్ని చిటికెనవేలు మీద నించోబెట్టినా, ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది అధ్యక్షా...విధి రాత అధ్యక్షా! విధి రాత!

2 comments:

  1. వంశీగారూ:

    "వ్యాసరచనల సూచి" (1977) తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదులో అమ్మకానికి ఇంకా ఉన్నాయి. దాదాపు 1700పేజీల పుస్తకము 100రూపాయలు - దీనిపై డిస్కౌంటుకూడా యిస్తారు!

    "తెలుగు రచయితలు-రచనలు" 1985 లో అచ్చయింది. 60రూపాయలు.
    దీనిని అక్కడ అమ్మకానికి చూసిన గుర్తులేదు.

    ఈ రెండూ DLIలో ఉన్నాయి - వాటి టైటిళ్లు
    "Vyasa_Rachanala_Suchi_Artha_Sasthramu"
    "telugu rachayitalu rachanalu"

    నమస్తే,
    శేషతల్పశాయి.

    ReplyDelete