Friday, January 10, 2014

ఇల్లారోండ్ల పదాలు!

ప్రొద్దుటూరు తాలూకాకు ఐదారుమైళ్ళ దూరంలోగల ఇల్లూరు గ్రామంలోని ఎరుకలు పాడుకునే పాటల్లో ఒకటి...

ఇల్లారోండ్ల పదాలు

ఇల్లారోడు కట్టెబట్టి
ఇల్లారోడు కత్తిబట్టి
ఇల్లారోడు మంచెనెక్కి
ఇల్లారోడు వరిసెలిసర
ఇల్లారోడు దట్టిగట్టి
ఇల్లారోడు జబ్బచరచ
ఇల్లారోడు ఈతగొట్టి
ఇల్లారోడు కూతకూయ
ఇల్లారోడు ఇల్లుగట్టి
ఇల్లారోడు పెళ్ళిజేయ
ఇల్లారోడు అల్లికేయ
ఇల్లారోడు దొజ్జ మేయ
ఇల్లారోడు పిల్లజూడ
ఇల్లారోడు పెత్తనమాడ
ఇహ మెల్లా కన్నుమూయాలోయ్
గుహలలోని
గుడ్లగూబె గురకబెట్టాలోయ్

-- మల్లేల నారాయణ (సేకరణ)
-- ఆంధ్రప్రభ 1960

*ఇల్లారు - గృహముల కుంతి గవాచీలకు వర్షము వచ్చినప్పుడు లోపలి భాగము తడవకుండా వుండుటందుకు పైన ఉపయోగించెడు గుండ్రని ఆకారము కల్గిన దొన్నె అని నారాయణ గారి వివరణ 

1 comment:

  1. 1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీరు కవులు కాబట్టి ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.

    http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html

    ReplyDelete