Friday, March 15, 2013

కాబేజీ శతకము!


బాబూ, పాపా, అమ్మా, అయ్యా - ఇదిగో ఒక శతకము మొదలుపెట్టితిని

పేరు "కాబేజీ శతకము"...పూర్తవుతుందో లేదో తెలియదు కానీ - ఇప్పటికి ఈ నాలుగు బే జీ లు అందుకోండి

కాబేజీని చూస్తే పరమ చిరాకు - అందువలన కలిగిన పైత్యము ఈ కవిత్వము, కాబేజిత్వము - ఓం తత్సత్ 

వంటలక్కల దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగా
ధారాళమైన వాయువులు
ప్రాపూరగ జవులు పుట్ట నుడివెద కాబేజీ

అక్కఱకు రాని వంటలక్క
మ్రొక్కిన ఉడకని కాబేజీ, మొహరమున దా
నేసిన బాఱని తాళింపు
గ్రక్కున కక్కవలయున గదరా వంశీ

అడిగిన కమ్మదనంబియ్యని
మిడిమేలపు కాబేజీని చూచి మిడుకుట కంటెన్
వడిగల వంకాయ గుత్తుల
శైత్యము వలన బ్రతుక వచ్చు మహిలో వంశీ

డోకిచ్చువారు వంటలక్క
నెప్పుడు నెడతెగక పాఱు కడుపున్
జొరపడిన బాతురూమున నుండుము
కాబేజీ దయవలన ఇలలో వంశీ