Wednesday, March 13, 2013

ఒక పోష్టులోని లైను చదివిన తర్వాత కలిగిన ఆవేశం!

కవితనై అరుస్తాన్
కవినై కరుస్తాన్
కవితనై చరుస్తాన్
పెన్నుతో పొడుస్తాన్

కవితనై ముంచుతాన్
కాన్సరై చంపుతాన్
కవితనై కాలుస్తాన్
బుర్రలే తినేస్తాన్

కవితనై నరికేస్తాన్
పారుకునేట్టు చేసేస్తాన్
కవితనై తిట్టేస్తాన్
పచ్చడి కింద కొట్టేస్తాన్

కవితనై భయపెట్టేస్తాన్
పంచెలు తడిపేస్తాన్
కవితనై కాటేస్తాన్
విషం చిమ్మేస్తాన్

మార్గశిరంలో మంచుకత్తిలా
కార్తీకంలో కుడితికుండలా
అన్నీ నేనై చేసేస్తాన్
అందరినీ వేటాడేస్తాన్

పడండి, భయపడండి
భ్రాంతులవ్వండి, భయభ్రాంతులవ్వండి
నిశాచరమై, పిశాచరమై వస్తాన్
నిద్ర లేకుండా చేసేస్తాన్

పారాహుషార్ పెట్టేస్తాన్
ఖబరస్తాన్ చేసేస్తాన్
కవినై పుడతాన్
ఈ లోకంలోకి వచ్చేస్తాన్

మీ అంతు తేల్చేస్తాన్
కండలూడేలా కరిచేస్తాన్
కవినై పుడతాన్
ఈ లోకంలోకి వచ్చేస్తాన్

ఒక మిత్రుడు వేసిన ఒక పోష్టులోని లైను చదివిన తర్వాత కలిగిన ఆవేశం, కవితావేశం.... :)...

దీన్నే ఇంకా బోల్డు ఇదిగా చెప్పొచ్చు కానీ, కంట్రోలుండాలిగా, కంట్రోలు !

No comments:

Post a Comment