Thursday, December 6, 2012

బాబూ - ఇదిగో కొన్ని అపురూపమైన ఫోటోలు!!

మూడువారాల తర్వాత ఈరోజు మళ్ళీ విల్లు - బాణాలు పట్టుకున్నామయ్యా! ప్రతివారం పోయి మా గురువుగారు పాల్ యీగర్ గారి వద్ద నేర్చుకుంటున్న విలువిద్య కొద్దిగా, కొద్దిగా ఏమిటిలే బానే వంట పట్టింది....

అప్పుడెప్పుడో నాలుగు నెల్ల క్రితం కొత్తపాళీ (Narayana Swamy) మీ విలువిద్య గురించి ఓ పోష్టేస్తే బాగుంటుందని అన్నా, ఎందుకో కుదరలా....సరే ఈవేళ మా గురువుగారి చేత ఫోటొలు తీయించుకుని ఇక్కడేస్తున్నా....అసలు విద్య గురించి వివరాలు రాయాలంటే బోల్డంత సమయం పడుతుంది కానీ, టూకీగా నా విద్య గురించి, వాడే పరికరాల గురించి చిన్నగా చెబుతా...

మొట్టమొదటి ఫోటోలు ఉన్నవి భవదీయుడి విల్లు, బాణాలు...ఈ రకమైన విల్లును కాంపవుండ్ బౌ అంటారు....రీకర్వ్ బౌ అని ఇంకో రకం ఉన్నది కానీ అది కొద్దిగా ఈ కాంపవుండ్ బౌ మీద తర్ఫీదు పూర్తయ్యాక, విలువిద్య కొద్దిగా అలవాటు అయ్యాక దాని మీద పడొచ్చన్నమాట. లేదా ఈ కాంపవుండ్ బౌ లోనే పరమవీరచక్ర బౌలు ఉన్నాయి....అవీ వాడుకోవచ్చు...మనం ఈ విద్యకు ఇంకా కొత్తపెళ్ళికొడుకులమే కాబట్టి , ఆర్నెల్లు కూడా కాలేదు కాబట్టి ఈ కాంపవుండ్ బౌ, జెనిసి వారి తయారీ - ఇప్పటికి సరిపోతుందని మా గురువుగారి ఉవాచ...

ఆ విల్లు పక్కనున్న బాణాలు - నానారకాలు....ఇక్కడున్నవి కొద్దిగా ఖరీదు తక్కువ, ట్రెయినింగుకు పనికొచ్చేవి...ఆ బాణం అంచున మూడు రెక్కలు ఉంటాయి....అందులో రెండు రంగువి, ఒకటి తెలుపుది. బాణం వింటినారి మీదికెక్కేప్పుడు తెల్ల రెక్క నీ వైపు ఉండాలి, దానికో కారణం ఉన్నది....ఆ తెల్ల రెక్క పడవలౌ ఉండే రడ్డర్లా పనిచేస్తుంది...అంటే బాణాన్ని సరైన దిశలో, సూటిగా వెళ్ళేట్టు సహాయపడుతుంది....

నువ్వు పొజిషన్ తీసుకున్నాక, బాణం వింటినారికెక్కాక విల్లెత్తి గురి చూసుకుని, పెదాల దాకా నారిని లాగి (ఆ లాగేప్పుడు చేతి బలంతో కాకుండా, భుజబలం ఉపయోగించాలి, లేకుంటే చేతులు రెండోరోజుకు పనిచెయ్యకుండా పోతయ్), మోచెయ్యి భూమికి సమాంతరంగా పెట్టి, కుడి మోచెయ్యిని (అంటే నారి లాగే మోచెయ్యి) కొద్దిగా వెనక్కు జర్క్ ఇచ్చినట్టు ఇచ్చి బాణం వదిలి - ఫాలో త్రూగా పెదాల దగ్గర ఉన్న వేళ్ళు చెవులవరకు వెళ్ళేలా చూసుకోవాలి...ఈ బాణం నారి మీదకెక్కించేప్పుడు, ఎక్కాకా, వదిలేప్పుడు - మొదటి మూడువేళ్ళు మాత్రమే ఉపయోగించాలయ్యోయ్...

అలా గురిచూసుకున్న బాణం వదిలితే , మీ అదృష్టం బాగుంటే అనగా గాలి దుమారాలు గట్రా లేకుండా ఉంటే సర్రున దూసుకెళుతున్న బాణం మనం చూడలేకపోయినా, ఆ వెళ్ళే చప్పుడు ఆ ఫీలింగు వివరించలేని ఆనందాన్ని కలిగిస్తయ్.... అదయ్యా క్లుప్తంగా కథ....

రెండో ఫోటో విల్లెక్కుపెడుతున్నప్పటిది (ఇందులో బాణం చూడవచ్చు), మూడో ఫోటో బాణం వదిలినతర్వాత (ఇందులో ఫాలో త్రూ చూడవచ్చు) ...నాలుగో ఫోటోలో దిగబడిన బాణాలు చూడొచ్చు (ఈ రోజు ప్రాక్టీసు 40 గజాల దూరం నుంచి చేసింది)

అలా ఈ రోజు ప్రాక్టీసు ముగిసి ఇంటికి చేరామయ్యా!

బాబూ - ఇదిగో ఆ అపురూపమైన ఫోటోలు ....చూడు ...ఆనందించు ... LOL....

1 comment: