Monday, December 31, 2012

కోటికి తీసుకెళ్ళేదాకా నిద్రపోనని, పోలేనని భగీరథ శపథం చేస్తూ!

వెబ్సైటు హిట్సు - ఈ సంవత్సరం (జనవరి 1 - డిసెంబరు 31) లెక్కలు చూసుకుంటే యాభై లక్షల పై చిలుకుకు చేరిందని సంతోషం!

పైది డిసెంబరు, అన్నిటికన్నా కిందిది జనవరి 



నా అంచనాలకు కొద్దిగా తగ్గింది కానీ, నేనే ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టుండాల్సింది ....

ఏక్ నిరంజన్ పనులిలాగే ఉంటాయి బాబూ!

ఈ సంవత్సరం, అనగా 2013లో మళ్ళీ విశృంఖలంగా విజృంభించి వెబ్సైటు హిట్లను కోటికి తీసుకెళ్ళేదాకా నిద్రపోనని, పోలేనని భగీరథ శపథం చేస్తూ...

సాయం చేసిన సన్మార్గులకు నమోవాకాలతో...

వీలుంటే ఇప్పటిదాకా చేసినట్టే ఇంకా సాయం చేయండి.

వీలుకాదా? ఫరవాలా ఎప్పట్లానే బేతాళుడి పని చేసుకుంటూ ఉంటా - సాయానికి మరో విక్రమార్కుడొచ్చి దింపేదాకా

భవదీయుడు
వంశీ

2 comments:

  1. మీ సైటు చూడని పాఠకుడు ఎవరైనా ఉంటారని అనుకోము. కోటేమిటండి, " కోట్లు" అన్నా తప్పులేదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    -- భమిడిపాటి సూర్యలక్ష్మి, ఫణిబాబు

    ReplyDelete
  2. ఫణిబాబు గారు, సూర్యలక్ష్మి గారు

    పెద్దవారు మీకు, మీ కుటుంబానికి నమస్కారాలతో కూడిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల నూతన సంవచ్చరాలు, అవీ నేను జరుపుకోను గానీ మీ ఆదరాభిమానాలకు శతధా కృతజ్ఞుణ్ణి.

    ReplyDelete