Monday, December 31, 2012

కోటికి తీసుకెళ్ళేదాకా నిద్రపోనని, పోలేనని భగీరథ శపథం చేస్తూ!

వెబ్సైటు హిట్సు - ఈ సంవత్సరం (జనవరి 1 - డిసెంబరు 31) లెక్కలు చూసుకుంటే యాభై లక్షల పై చిలుకుకు చేరిందని సంతోషం!

పైది డిసెంబరు, అన్నిటికన్నా కిందిది జనవరి నా అంచనాలకు కొద్దిగా తగ్గింది కానీ, నేనే ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టుండాల్సింది ....

ఏక్ నిరంజన్ పనులిలాగే ఉంటాయి బాబూ!

ఈ సంవత్సరం, అనగా 2013లో మళ్ళీ విశృంఖలంగా విజృంభించి వెబ్సైటు హిట్లను కోటికి తీసుకెళ్ళేదాకా నిద్రపోనని, పోలేనని భగీరథ శపథం చేస్తూ...

సాయం చేసిన సన్మార్గులకు నమోవాకాలతో...

వీలుంటే ఇప్పటిదాకా చేసినట్టే ఇంకా సాయం చేయండి.

వీలుకాదా? ఫరవాలా ఎప్పట్లానే బేతాళుడి పని చేసుకుంటూ ఉంటా - సాయానికి మరో విక్రమార్కుడొచ్చి దింపేదాకా

భవదీయుడు
వంశీ

Friday, December 28, 2012

భారతీయ వైద్య ప్రపంచకంలో మొట్టమొదటి మహిళట!

India's first woman in medicine. That is - one who graduated from world's first medical college for women in US. Yeah, you can translate into different headings!

First picture is about her details in a magazine - Pravasi Bharatiya Nov 2007 print.

While the second one is grabbed from Rare Book Society Of India FB page with the following details - "A memento of the Dean's reception, held Oct 10, 1885.Anandibai Joshee graduated from Woman's Medical College of Pennsylvania (WMC) in 1886; Kei Okami graduated from WMC in 1889; Sabat Islambooly graduated from WMC in 1890.All rights reserved - Drexel University, Philadelphia, PA"
Wednesday, December 26, 2012

తెలుగు సినిమా ప్రపంచకంలో నేనమితంగా ఇష్టపడే యాభై మంది!

తెలుగు సినిమా ప్రపంచకంలో నేనమితంగా ఇష్టపడే యాభై మంది. ఆల్ఫబెటికల్ వరుసలో....

వీరంతా ఎవరికి వారే హేమాహేమీలు. లిష్టుకెక్కని వారంతా హేమలు, హేమీలు కాదని కాదు కానీ - వీళ్ళు మటుకు అసలు సిసలైన యాకటేరులు....

ఇలాటిదే మీ లిష్టేదన్నా ఉంటే మీ మీ గోడల మీద వేసి, ఇక్కడో లంకె పడేస్తే చూసి సంతోషిస్తాం

అల్లు రామలింగయ్య
అంజలి
బట్టల సత్యం
భానుమతి
భానుప్రియ
బి.సరోజ
చదలవాడ
ఛాయాదేవి
ధూళిపాళ
ఎల్.విజయలక్ష్మి
ఎన్.టి.ఆర్
ఎస్.వి.ఆర్
గిరిబాబు
గిరిజ
గొల్లపూడి
గోవిందరాజుల
గుమ్మడి
జగ్గయ్య
జమున
జి.వరలక్ష్మి
కైకాల
కన్నాంబ
కోట
కృష్ణ
కృష్ణకుమారి
లింగమూర్తి
మాడా
నాగభూషణం
నాగయ్య
నల్ల రామ్మూర్తి
నిర్మలమ్మ
నూతన్ ప్రసాద్
పెరుమాళ్లు
పి.ఎల్.నారాయణ
పొట్టి ప్రసాద్
రాజనాల
రాజసులోచన
రాజేంద్రప్రసాద్
రమణారెడ్డి
రమాప్రభ
రావు గోపాలరావు
రేలంగి
ఋష్యేంద్రమణి
సాక్షి రంగారావు
సావిత్రమ్మ
షావుకారు జానకి
సి.ఎస్.ఆర్
సూర్యాకాంతమ్మ
తనికెళ్ళ భరణి
వంగర వెంకట సుబ్బయ్య

Tuesday, December 25, 2012

Movie - Django Unchained - Short Review!

Ok - Here comes Django - close to 3 hrs movie.

Huge crowd, long lines never seen before at palladio, atleast by me. 20 mins in line, never even did that in hyderabad, grabbed a top corner seat. 3 minutes hall is full. After the usual trailer stuff, movie starts and it starts with a bang. Lovely.

Waltz was stupendous, amazing and fantastic - ruled the movie like a king - for close to 2 hrs. Jamie's presence was nominal, though in every scene - it was a cents worth. Now comes DiCaprio around half way. And boy o boy, he was his usual - amazing performance as a bad boy.

Costumes - Outstanding. Music / Songs - Fantastic. Blood Spilled - Badastic, Makeup - Good.

Being a fan or western themed movies and country music myself - loved all the songs. photography - awesome, excellente.

Has it's slow moments, but well I have to get the spoiler alert in - After Waltz and Dicaprio are gone, Jamie picks up and you can see a little bit of action from him. Well, not anything worth, but there is no one else...so....

And surprisingly Samuel L Jackson - darn he did some acting. I never thought he was fit to be a actor, let alone in movies. He was superb for 20 mins.

Final straw - the score -
  • Movie: 7 out of 10, 
  • DiCaprio: 8 out of 10, 
  • Samuel L Jackson: 7 out of 10, 
  • Jamie Foxx - 4 out of 10, 
  • Tarantino - 7 out of 10, 
  • Waltz: 400 out of 10, yes you saw it right 400 out of 10....

There ends the review.

Now, All the best for your movie experience....

Have fun tarantino, waltz, dicaprio fans!.....because I did...

Monday, December 24, 2012

A wonderful illustration series of the epic "ramayana"

A wonderful illustration series of the epic "ramayana"

LINK

I bought this book in a waukegan book store long time ago. However while moving to sacramento, lost a big box and unfortunately this book was in that box.

Anyways...Take a look and get immersed!

Cheers
Vamsi


Saturday, December 15, 2012

The HOBBIT - Movie and Little more

The HOBBIT - Background Score, Stone Men Fighting , Eagles - Awesome. 
 Apart from the BG score, it's 10 mins. 
So rest of 2hrs 40 mins is DUNGEONS DEEP! ....
Well, Lord Of The Rings fans can go, watch and entertain themselves. 
I watched in 3 D and the D is Doomed.....
Well, not for my wife and kid, they think it's awesome! 
Am I glad that I have L O T R fans in my home or what ?

Thursday, December 13, 2012

సితార్ రవిశంకర్ ఇక లేరు!

సితార్ రవిశంకర్ ఇక లేరు (And it happened on 12.12.12)

Link 

May his soul RIP

Amazing musician

Salutes from the bottom of my heartTuesday, December 11, 2012

ప్రాంక్ కాల్స్ - రాయ్ డి మెర్సర్

అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం టల్సా, ఓక్లహోమాలో పనిచేస్తున్నప్పుడు అక్కడి రేడియోలో వినవచ్చే రాయ్ డి మెర్సర్ ప్రోగ్రాం భలేగ ఉండేది. ఉన్నట్టుండి అదెందుకు గుర్తొచ్చిందంటే ఈరోజు ఓ దినపత్రిక చదువుతుంటే అందులో ఆస్ట్రేలియా రేడియో వాళ్ళెవరో ఒక ప్రాంక్ కాల్ చేసి ఆ దరిద్రపు లండన్లో ఒక నర్సావిడ ప్రాణాలు పోటానికి కారకులయ్యారని, దానికి మూల్యం ఐదు లక్షల డాలర్లు చెల్లిస్తున్నారని వచ్చిన / చదివిన వార్త.

అలాటి ప్రాంక్ కాల్స్ చేసి జనాలను సతాయించే రేడియో ప్రోగ్రాముల్లో ఈ రాయ్ డి మెర్సర్ ప్రోగ్రాము కూడా ఒకటి ...

సరే ఈ కాండిడేటు ఇంకా ఆ ప్రోగ్రాములు చేస్తున్నాడా లేదా అని వెతికి చూద్దును కదా, ఏకంగా ఒక వెబ్సైటే పెట్టుకున్నాడు....ఆ లంకె ఇక్కడ కింద ఇస్తున్నా....

ఆ సైటుకెళ్ళాక, (ప్లగ్ ఇన్ ఏదన్నా అడిగితే ఇన్స్టాల్ చేసుకోండి) అక్కడ కిందనున్న లంకెల్లో స్పీడ్ డయల్ అన్న లంకె నొక్కి, వచ్చిన పేజీలో ఆరో (6) నంబరు పక్కనున్న బటన్ నొక్కి పోలీస్ చీఫ్ ను ఆటాడుకున్న ఆడియో విని చూడండి....అయితే మీకు కొద్దిగా త్వరగా అర్థం కావాలంటే ఆ సదర్న్ ఆక్సెంట్, యాస అలవాటన్నా అయ్యుండాలి, లేదా చెవులు రిక్కించన్నా వినాలి....ముందు ఆ పోలీస్ చీఫ్ ఆడియో విని ఆ తర్వాత వేరేవి వినొచ్చు....Be prepared to listen to some offensive language too!  Don't blame me...

మా శాక్రమెంటోలో కూడా 107.9 స్టేషన్లో సోమవారం పొద్దున్న ఆరున్నరకు, మంగళవారం పొద్దున ఏడున్నరకు ఇలాటి ప్రోగ్రామే ఒకటొస్తుంది....వార్ ఆఫ్ ద రోసస్ అని....ఈ ప్రోగ్రామేమంటే ప్రేమికులు అసలైన ప్రేమికులా కాదా అని తేల్చే ప్రోగ్రాము....ఉదాహరణకి ఒకావిడ ఒకాయన్ని ఆరు నెలలుగా డేటింగు చేస్తోందనుకోండి, ఈ ఏడో నెలలో ఆవిడకేదో అనుమానం వచ్చి ఆయన నన్ను నిజంగానే డేట్ చేస్తున్నాడా? నా వెనకాల ఇంకెవరితోనన్న తిరుగుతున్నాడా అని ఈ ప్రోగ్రాం ద్వారా కనుక్కోవచ్చన్నమాట....

కొన్ని బాగుంటయి, కొన్ని దరిద్రంగా ఉంటాయి...ఆ స్టేషను వాళ్ళకదో ఆనందం

అది సరే కానీ ఇదిగో రాయ్ డి మెర్సర్ లంకె

http://www.roydmercer.com/main.htm

ఆనందో బ్రహ్మ

Thursday, December 6, 2012

బాబూ - ఇదిగో కొన్ని అపురూపమైన ఫోటోలు!!

మూడువారాల తర్వాత ఈరోజు మళ్ళీ విల్లు - బాణాలు పట్టుకున్నామయ్యా! ప్రతివారం పోయి మా గురువుగారు పాల్ యీగర్ గారి వద్ద నేర్చుకుంటున్న విలువిద్య కొద్దిగా, కొద్దిగా ఏమిటిలే బానే వంట పట్టింది....

అప్పుడెప్పుడో నాలుగు నెల్ల క్రితం కొత్తపాళీ (Narayana Swamy) మీ విలువిద్య గురించి ఓ పోష్టేస్తే బాగుంటుందని అన్నా, ఎందుకో కుదరలా....సరే ఈవేళ మా గురువుగారి చేత ఫోటొలు తీయించుకుని ఇక్కడేస్తున్నా....అసలు విద్య గురించి వివరాలు రాయాలంటే బోల్డంత సమయం పడుతుంది కానీ, టూకీగా నా విద్య గురించి, వాడే పరికరాల గురించి చిన్నగా చెబుతా...

మొట్టమొదటి ఫోటోలు ఉన్నవి భవదీయుడి విల్లు, బాణాలు...ఈ రకమైన విల్లును కాంపవుండ్ బౌ అంటారు....రీకర్వ్ బౌ అని ఇంకో రకం ఉన్నది కానీ అది కొద్దిగా ఈ కాంపవుండ్ బౌ మీద తర్ఫీదు పూర్తయ్యాక, విలువిద్య కొద్దిగా అలవాటు అయ్యాక దాని మీద పడొచ్చన్నమాట. లేదా ఈ కాంపవుండ్ బౌ లోనే పరమవీరచక్ర బౌలు ఉన్నాయి....అవీ వాడుకోవచ్చు...మనం ఈ విద్యకు ఇంకా కొత్తపెళ్ళికొడుకులమే కాబట్టి , ఆర్నెల్లు కూడా కాలేదు కాబట్టి ఈ కాంపవుండ్ బౌ, జెనిసి వారి తయారీ - ఇప్పటికి సరిపోతుందని మా గురువుగారి ఉవాచ...

ఆ విల్లు పక్కనున్న బాణాలు - నానారకాలు....ఇక్కడున్నవి కొద్దిగా ఖరీదు తక్కువ, ట్రెయినింగుకు పనికొచ్చేవి...ఆ బాణం అంచున మూడు రెక్కలు ఉంటాయి....అందులో రెండు రంగువి, ఒకటి తెలుపుది. బాణం వింటినారి మీదికెక్కేప్పుడు తెల్ల రెక్క నీ వైపు ఉండాలి, దానికో కారణం ఉన్నది....ఆ తెల్ల రెక్క పడవలౌ ఉండే రడ్డర్లా పనిచేస్తుంది...అంటే బాణాన్ని సరైన దిశలో, సూటిగా వెళ్ళేట్టు సహాయపడుతుంది....

నువ్వు పొజిషన్ తీసుకున్నాక, బాణం వింటినారికెక్కాక విల్లెత్తి గురి చూసుకుని, పెదాల దాకా నారిని లాగి (ఆ లాగేప్పుడు చేతి బలంతో కాకుండా, భుజబలం ఉపయోగించాలి, లేకుంటే చేతులు రెండోరోజుకు పనిచెయ్యకుండా పోతయ్), మోచెయ్యి భూమికి సమాంతరంగా పెట్టి, కుడి మోచెయ్యిని (అంటే నారి లాగే మోచెయ్యి) కొద్దిగా వెనక్కు జర్క్ ఇచ్చినట్టు ఇచ్చి బాణం వదిలి - ఫాలో త్రూగా పెదాల దగ్గర ఉన్న వేళ్ళు చెవులవరకు వెళ్ళేలా చూసుకోవాలి...ఈ బాణం నారి మీదకెక్కించేప్పుడు, ఎక్కాకా, వదిలేప్పుడు - మొదటి మూడువేళ్ళు మాత్రమే ఉపయోగించాలయ్యోయ్...

అలా గురిచూసుకున్న బాణం వదిలితే , మీ అదృష్టం బాగుంటే అనగా గాలి దుమారాలు గట్రా లేకుండా ఉంటే సర్రున దూసుకెళుతున్న బాణం మనం చూడలేకపోయినా, ఆ వెళ్ళే చప్పుడు ఆ ఫీలింగు వివరించలేని ఆనందాన్ని కలిగిస్తయ్.... అదయ్యా క్లుప్తంగా కథ....

రెండో ఫోటో విల్లెక్కుపెడుతున్నప్పటిది (ఇందులో బాణం చూడవచ్చు), మూడో ఫోటో బాణం వదిలినతర్వాత (ఇందులో ఫాలో త్రూ చూడవచ్చు) ...నాలుగో ఫోటోలో దిగబడిన బాణాలు చూడొచ్చు (ఈ రోజు ప్రాక్టీసు 40 గజాల దూరం నుంచి చేసింది)

అలా ఈ రోజు ప్రాక్టీసు ముగిసి ఇంటికి చేరామయ్యా!

బాబూ - ఇదిగో ఆ అపురూపమైన ఫోటోలు ....చూడు ...ఆనందించు ... LOL....