Friday, November 2, 2012

కొంగర జగ్గయ్యగారు - వారి హాలీవుడ్ తాతగారు!

ఫీనిక్స్ నుంచి శాక్రమెంటో వస్తుంటే ఎయిర్పోర్టులో మా గేటు దగ్గర - కలకలం, కలకలం, కలకలం......

ఎనిమిది గేట్లవతల ఉన్న ఒక గేట్లోకి మిస్టర్ పీటర్ కల్లెన్ ఇప్పుడే వెళుతున్నారు అన్న వార్తే ఆ కలకలానికి కారణం....

పీటర్ కల్లెన్ అన్న మాట వినగానే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకునిపోయినయ్....ఆ గేటు దగ్గరికి పరుగులెత్తుతున్న జనాల మధ్యలో బుల్లెట్ ఏదన్నా ఉందంటే అది మనమే....

అలా జనాల మధ్యనుంచి దూసుకెళ్ళిపోయా, ఇహ ఆ గేటు ఓ ముప్ఫైఅడుగుల దూరంలో ఉందనగా పోలీసులు కట్టకట్టుకుని రావటంతో అందరూ ఆగిపోయారు...మన స్పీడుకు బ్రేకులేసినా బండి ఆగలా....సరాసరి ఒక పోలీసాయన దగ్గరికెళ్ళాక గానీ బ్రేకు పనిచెయ్యలా.....హేయ్ స్టాప్ దేర్ అంటూ ఆయన గన్ను మీద చెయ్యెయ్యటంతో ప్రమాదం ముంచుకొచ్చింది అని అర్థమైపోయి ఆగిపోటమేమిటి, చెమట్లు పట్టటమేమిటి అన్నీ జరిగిపోయినయ్....

అయితే ఆయన మర్యాద రామన్నలా స్టాప్ రైట్ దేర్, బిహేవ్ యువర్సెల్ఫ్ అని ఓ వార్నింగు ఇచ్చి వదిలిపెట్టాడు...అంత మటుకు అదృష్టమే....

అయితే ఆ అదృష్ట వార్నింగు అయ్యేప్పటికి పీటర్ గేట్లోకి వెళ్ళిపోయాడు.....

దురదృష్టం, తలరాత, కర్మ, ఖర్మ మణుగుల్లెక్కన కలిసి కుమ్మక్కయిపోయి మీదడిపోతే ఎంతటి అదృష్టవంతుడూ తప్పించుకోలేడు...

Hope I will get ONE more chance to meet that legendary soul. One day.....

ఇంతకీ పీటర్ కల్లెన్ అంటే ఎవరో తెలియని వారికి - ఆయన హాలీవుడ్ లో ఒక సీనియర్ వాయిస్ ఓవర్ ఆర్టిష్టు. మన సినిమా నటుడు జగ్గయ్యగారికి తాతగారు - స్వరంలోలెండి....

ఆయన పేరు విన్నప్పుడల్లా, నమ్మండీ నమ్మకపోండి మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడతయ్ నాకు, ఆప్టిమస్ ప్రైం అలా కళ్ళముందుకొచ్చేస్తాడు....

ఏంటీ ఆప్టిమస్ ప్రైం తెలీదా?

ఎందుకు బాబూ నాకు ఈ చిత్రహింస? ....

ఆప్టిమస్ ప్రైం అనే పాత్ర ట్రాన్స్ఫార్మర్స్ సినిమాలో సర్దార్ పాపారాయుడన్నమాట......

అంతటి పాత్రకు గాత్ర దానం చేసింది ఈయనే....ఆ స్వరం వింటే రోమాలెందుకు నిక్కబొడుచుకుంటయ్యో నీకే అర్థం అవుతుంది...

ఓ యూట్యూబులో పడి ఎతుక్కునే కష్టం నీకెందుకు గానీ, ఇదిగో ఇక్కడ చూడు.....

ఆతర్వాత ఓ సారి రీప్లే చేసి కళ్ళు మూసుకుని విను....ఆతర్వాత ఓ సారి రీప్లే చేసి కళ్ళు మూసుకుని, చెవిలో Ear Phones పెట్టుకుని విను....ఆ తర్వాత ఇక్కడో కామెంటు పడెయ్....ఏం?


ఆయన విశ్వరూపం 1 నిముషం 54 సెకన్ల దగ్గరనుంచి మొదలవుతుంది.... 

2.19 నుంచి 2.44  - నా ఆస్తంతా రాసిచ్చేస్తా, నా సర్వస్వం ఆ స్వరం ముందు పడేసి మోకరిల్లుతా.....అదంతా ఆయనకు ఓ సెంటుకు సమానం కాకపోయినా సరే!

We are here. We are waiting - వి ఆర్ వెయిటింగ్ అన్నదగ్గర విరుపు వింటే, అందులోని అర్థం అర్థమైతే మీ జన్మ ధన్యమే!
Blessed by GOD, yes by GOD himself - may Peter live long, long and long and make us happy.....What a heavenly voice he has. Just amazing....Can't stop talking about it, I will control myself and stop it right here....

Few others whom I adore, love, like are
 • Mel Blanc (He is a man of thousand voices, just can't name one - Tom, Jerry, bugs bunny, daffy duck, tweety bird. yosemite sam, woody wood pecker etc etc - list is end less)
 • Frank Welker (If you know Scooby you know Frank)
 • James Earl Jones (If you know Mufasa, you know James)
 • Ian McShane (If you know Tai-Lung, you know Ian McShane)
 • Randall Duk Kim (if you know Master Oogway, you know Randall)
 • Billy Crystal (If you know Mike Wazowski, you know Billy)
 • Steve Buscemi (If you know Randall Boggs, you know Steve)
 • William Hanna, Daws Butler (If you know Tom, Spike you know these guys)

1 comment:

 1. ఇది కాస్త పక్కదారి పట్టించే స్పందన. ఇలా జరగటం సహజం, ఒకటి వింటే మరొకటి తలపుకి వస్తం అని రాస్తున్నాను.

  ఒకసారి ఒక మిత్రునితో నేను ఆశ్చర్యానందభరిత క్షణాల్లో మునిగిన అనుభవం షేర్ చేసాను - ఒక విద్యార్థికి కేవలం H4 వీసా స్టేటస్ కారణం గా జరుగుతున్న న్యాయసమ్మతం కాని వ్యవహారమై - illinois secretary of state legal department, Dick Durbin, Obama గార్ల ఆఫీసులకి ఆవేశంగా కానీ వివేచనతో ఉత్తరాలు రాసాను. అదీ ఇలా థాంక్స్ గివింగ్ సమయాల్లో. వారం గడిచే సరికి, ఒబామా గారి ఆఫీసు నుంచి ఫోను, మిగిలిన ఇద్దరి ఆఫీసు నుంచి ఈ-మెయిల్ ఆరాలు వచ్చాయి. దాదాపు ఒక నెల వరకు అబామా వారి తరఫున నాకొరకు లావాదేవీలు నడిచాయి. అది చెప్తే, ఆయన అది సరే, మీరు వారిని సంప్రదించారు కనుక ఆ వ్యవహారం. ఇదేమిటి మరి, ప్రముఖులు ఎదురైతే - వారిని గుర్తించే స్థలాల్లో లేకపోతే ఇలాగ అయిందిట అని చెప్పారు ఈ లింక్ ఇస్తూ...


  http://www.washingtonpost.com/wp-dyn/content/article/2007/04/04/AR2007040401721.html

  ఈ ప్రసిద్ధ వయొలినిస్టు ఒకసారి రద్దీగా వుండే సబ్వేలో ప్రదర్శన ఇచ్చాడట.. తనని ఎవరూ గుర్తు పట్టకుండా చేసుకుని.. మామూలుగా అతను ప్రతీ ప్రదర్శనకీ చాలా ఖర్చు వుంటుందట..కానీ ఈ ప్రదర్శన ఇచ్చినపుడు... అంతమందీ నడుచుకుంటూ పోయారే తప్ప వందలమందిలో కేవలం ముగ్గురనుకుంటా... విన్నారు ఆసక్తిగా
  ప్రస్తుతం రోజూవారి రద్దీ జీవితాల్లో కళకి ఏ మాత్రం విలువుందో నిరూపించే తార్కాణంగా...దాని గురించి వ్యాసం రాసారు.

  ReplyDelete