Monday, November 12, 2012

మన సిపాయిలు ఎలాటి డ్రెస్సులేసుకునేవాళ్ళో !!

నిన్న మా ఊళ్ళో ఉన్న పాత పుస్తకాల కొట్టుకెళితే ఒక బిందె లభించింది....అది లంకెబిందె అని అనుకోవచ్చునేమో....1979లో ఆస్ప్రీ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించిన మిలటరీ సిరీస్ లో మొదటి సెట్టు ఓ వంద పుస్తకాలు అలా గజిబిజిగా పడేసున్నయ్ ......

వాటిలో భారద్దేశానికి సంబంధించిన పుస్తకాలు కనపడటంతో అవీ, వాటితో పాటు నాకు నచ్చిన ఇంకో ముప్ఫై పుస్తకాలు, అన్నిటికీ కలిపి ఓ వంద సమర్పించుకుని ఎత్తుకొచ్చా.......ఒక్కోటి మూడు రూపాయలు.....

అన్నీ ఫోటోలు తీసి పెట్టలేను కానీ, ఇండియన్ ఇంఫాంట్రీ రెజిమెంట్స్ 1860 - 1914 , ద ఇండియన్ మ్యూటినీ పుస్తకాల బొమ్మలు కొన్ని ఇక్కడ ఎక్కిస్తున్నా చూస్కోండి....

ఆసక్తికరమైన సంగతులున్నయ్ వీటిల్లో....అంతకుమించి మన సిపాయిలు ఎలాటి డ్రెస్సులేసుకునేవాళ్ళో చూడొచ్చు....




















ఆనందో బ్రహ్మ
 
భవదీయుడు
వంశీ

PS: ఎల్లుండి బుధవారం ఇంకో 322 పుస్తకాలొస్తయ్ అంట.....అవును అచ్చంగా మూడు వందల ఇరవై రెండు పుస్తకాలు - అప్పుడెళ్ళి ఆ బిందెల్లో ఎన్ని లంకెలున్నయ్యో చూడాలి....ఇంకో వందో ఎంతో సమర్పించుకోడానికి రెఢీ అయిపొయ్యా ! ఏక్ నిరంజన్

Disclaimer - Osprey Publications - No Copyright Infringement Intended....




2 comments:

  1. దారుణం. వందకు ఇన్ని పుస్తకాలా? నా దిష్టీ, అసూయగ్రస్త దృష్టీ తగిలినయ్ ఆ పుస్తకాలకి, మీరోమాటు దిష్టి తీసేయండి. :)

    ReplyDelete
    Replies
    1. సరస్వతి అమ్మవారికి దిష్టి మనం పెట్టలేమండి...మీరు ఎంత తపస్సు చేసినా సరే!... :)

      మొన్న బుధోరం పుస్తకాలొచ్చినై కానీ అనుకున్నట్టు మూడొందలు రాలా, మళ్లీ ఓ వందే వచ్చినై - పూర్తి లాటు రేపొస్తుందని ఆ కొట్టాయన చెప్పాడు...రేపెళ్ళాలి మళ్ళీ....

      Delete