Thursday, November 29, 2012

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 7

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 7

Here it comes, have fun

Link

Cheers
Vamsi

Wednesday, November 28, 2012

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 6

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 6

Here it comes, have fun

Link

Cheers
Vamsi

Tuesday, November 27, 2012

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 5


సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 5

Here it comes, have fun

Link

Cheers
Vamsi

Monday, November 26, 2012

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 4

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 4

Here it comes, have fun

Link

Cheers
Vamsi

Sunday, November 25, 2012

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 3

Here it comes, have fun

Link

Cheers
Vamsi

PS: From now on magazines will be in an alphabetical order. AND it will be a daily file.....

Saturday, November 24, 2012

సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 2

 సరుకున్న బ్లాగర్లకు ఉపయోగపడే వార్త - 2

Break From Painting Routine today led to something useful. Useful for you that is.

While browsing the press academy archives over many many months, which I still do even today, I have made tonnes of "index" files from various magazines I read.

Index files means, index of the articles in that particular issue of the magazine.

Grabbed one of those INDEX text files and imported into excel sheet. You can sort it by author or article name or the issue....

Here is the file and have fun, while I go grab the other files and make more excel files.

Here it comes

Link

Cheers
Vamsi

Friday, November 23, 2012

కక్కారంభం కరిష్యామి వరదే వాంతిరూపిణి!! - Life Of Pi Review

1. వాంతారంభం కరిష్యామి వరదే డోకురూపిణి
2. డోకారంభం కరిష్యామి వరదే వాంతిరూపిణి
3. (ప్రాస కోసం పాకులాడే వారికి)

కక్కారంభం కరిష్యామి వరదే వాంతిరూపిణి

ఇదయ్యా "లైఫ్ ఆఫ్ పై" సినిమా చూసిన తర్వాత కలిగిన భ్రాంతి .....

మీరు ఈ సినిమాకు ఎప్పుడు వెళ్ళొచ్చంటే ? 

1. సముద్రంలో - విష్ణుమూర్తి శయనం, బుద్ధుడి పయనం చూడాలనుకుంటే
2. తామరాకు మీద నీటి బొట్లని బుర్రుపిట్ట ఎలా తాగిందో చూడాలనుకుంటే
3. మోండా మార్కెట్టులో కిషోర్ కుమార్ పాట ఎలా వినపడుతుందో చూడాలనుకుంటే
4. సముద్రంలో ఈషణ్మాత్రం కదలికలు లేకుండా నీళ్ళు నిశ్చలంగా ఎలాగుంటాయో చూడాలనుకుంటే
5. కృష్ణ పరమాత్మ నోట్లో విశ్వం ఎలా కనపడిందో చూడాలనుకుంటే
6. తిమింగలం ఎలా నీళ్ళల్లోంచి పైకొచ్చి మళ్ళీ పడుతుందో చూడాలనుకుంటే
7. వందలకొద్దీ క్లోన్డ్ "మీర్ కాట్స్" ఎలాగుంటాయో చూడాలనుకుంటే
8. హాలీవుడ్ సినిమాలో అడుక్కుతినే భారతీయం కాకుండా "హార్మోనియస్" భారతీయం చూడాలనుకుంటే
9. సర్వైవల్ అవసరమైనప్పుడు సేపలు ఎట్లా తినాలో చూడాలనుకుంటే
10. సివరాఖరిగా దేవుడు అనే కాన్సెప్టు అర్థం కాకూడదు అనుకుంటే

సూరజ్ శర్మ యాక్షను భవిష్యత్తులో భూతేశ్వరి - భూతో భవిష్యతి అనుకునేరు...అవును "న" లేకుండానే ...ఖర్మ రా నాయనా ఖర్మ....

ఇర్ఫాన్ ఖాను యాక్షనుకు హాలీవుడ్డు సరిపోదు, చాణక్య సీరియల్ సరిపోతుంది...

టబు గారు ఇహ రిటైరైపోవచ్చు ....

చెత్త కథను ఆంగ్ లీ మహాశయులు చెత్తలోంచి తిసుకొచ్చి చెత్తకుప్ప మీద పడేసాడు...దానికి మెచ్చుకోవచ్చు....

నిన్న చూసిన "రైజ్ ఆఫ్ ద గార్డియన్స్" ఆనందం అంతా ఇగిరిపోయింది....

దీనికి అవార్డులొస్తే మీరాశ్చర్యపోనఖ్ఖరలేదు...రాకపోతే ఆంగ్ లీ, హాలీవుడ్డు గుండె పగిలి బీటలు వారుతుందని నా ఉవాచ....

వార్తలు ఇంతటితో సమాప్తం....

భవదీయుడు
వంశీ

You have kids and you have a kid in YOU - go watch ....

You have kids and you have a kid in YOU - go watch 

Rise Of The Guardians....

One word - Awesome





Wednesday, November 21, 2012

ఈ సంఘటనలు నా జీవితంలో చాలా చాలా తక్కువ!! - విపరీతమైన ఆశ్చర్యం

ఏడ్చిన లేదా కళ్ళూ, మనసు చెమర్చిన సంఘటనలు నా జీవితంలో చాలా చాలా తక్కువ, వేలి గోళ్ళ మీద లెక్కెట్టొచ్చు....

ఎవడన్నా వేళ్ళ మీద అంటాడు, నువ్వేమిటి బాబూ వేలి గోళ్ళంటున్నావు?

ఓ అదా, వెరైటీగా ఉంటుందని వాడాలే!

మొట్టమొదటిసారి ఏడ్చింది, అమ్మమ్మ ఇక లేదు అన్న సంగతి తెలిసినప్పుడు (ఏడ్చా, చాలాసేపు ఏడ్చా), రెండోసారి షిండ్లర్స్ లిష్ట్ సినిమా చివర్లో లియాం నీసన్ ఏడ్చినప్పుడు (చెమర్చా!), మూడోసారి మురారి సినిమాలో లక్ష్మి మాట్లాడుతుంటే మహేశ్ బాబు కిటికీ పక్కన నుంచుని ఏడ్చినప్పుడు (చెమర్చా!), నాలుగోసారి మా ఇంటి పక్క జపానాయన, వాళ్ళ తలిదండ్రులను చూట్టానికి జపాను వెళ్ళీ, సునామీ రాగా అందులో తనవాళ్ళను పోగొట్టుకున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడు (ఏడ్చా!), అయిదోసారి నిన్నరాత్రి ......

పెయింటింగయిపోయాక 9.30 గావాలు పక్కెక్కా, రోజూ జరిగినట్టుగానే ఎక్కటమేమిటి తల దిండు మీద పెట్టటమేమిటి అలా నిద్దర్లోకి జారిపోటమేమిటి శరీరం దాని పని అది చేసుకుపోయింది....12.30కి చెయ్యి మీద నీళ్ళు పడుతున్నట్టు అనుమానం వచ్చి లేచి చూడటానికి ప్రయత్నం....మసక మసకగా ఉన్న కళ్ళు తుడుచుకుని చూస్తే దిండు మీద ఓ చెరువు రూపంలో ధారగా నీళ్ళు, తడుముకుంటే బుగ్గల మీద నీళ్ళు - ఓ నిముషం అర్థం కాలా.....బుఱ్ఱ ఓ దెబ్బేసుకుని అటూ ఇటూ ఊపుకుని ఈ లోకంలోకి నిజంగానే వచ్చి పడి, ఆలోచిద్దును కదా - అంతకుముందు నిముషంలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది....ఆ సంఘటనకు ఓ రూపం ఇచ్చే ప్రయత్నం ఈ కింది రెండు మాటలు....

సైకిలు మీద ఓ చిన్న పిల్లనేసుకుని ఉషారుగా ఈలలేసుకుంటూ, వానపడి చిత్తడి చిత్తడిగా ఉన్న ఓ పల్లెటూర్లోని మట్టిరోడ్లమీద యమస్పీడుగా వెళ్తున్న నాకు ఆ ఊళ్ళో ఉన్న గుడి పక్కనే ఉన్న మలుపు తిరగ్గానే, గుడి గోడ వెంబడి ఓ పేద్ద చెక్క మొద్దు- ఓ పదడుగులు ఉంటుందేమో - బంగారు రంగులో మెరిసిపోతూ, కుడి భుజం మీద ఓ పక్కకు తిరిగి పడున్న రూపంలో కనపడింది....సగం చెక్క ఆ చిత్తడి నేలలో మునిగిపోయుంది...

ఏమిటో చూద్దాం అని సైకిలు దిగి చూస్తూంటే ఆ చెక్క నెమ్మదిగా ఓ రూపు సంతరించుకోటం మొదలుపెట్టింది...ముందు ఒక మొహం, ఆ తర్వాత శరీరం కనపడ్డాయి....సరే ఇది తీసుకెళ్ళి మనింట్లో పెట్టుకుందాం అని అతి కష్టం మీద ఆ చెక్కను ఆ చిత్తడినేలలోంచి లేపి పక్కకు తిప్పి (అప్పటికి ఒక మోకాళ్ళ పర్వతం వద్ద ఉండే మెట్లంత ఎత్తున్న ఓ పేద్ద మెట్టు, సుమారు ఆరడుగులుంటుందేమో - దాని మీద ఉన్నా!) ఆ మెట్టు మీదనుంచి దింపి కిందనున్న నేల మీద ఆ చెక్కను నిలబెట్టటానికి చూసా....ఇంతలో శరీర పై భాగం పూర్తయ్యి కాళ్ళొచ్చేసినాయి ఆ చెక్కకు....అయితే అప్పుడే తప్పటడుగులు వేస్తున్న పిల్లాడిలా నిలబడలేక కూలబడిపోయింది ఆ శరీరం....నేను వెంటనే ఆ మోకాళ్ళ పర్వతం మెట్టు నుంచి కిందకు దూకి ఆ శరీరాన్ని లేపి నిలబెట్టటానికి ప్రయత్నిస్తూ తలెత్తి చూస్తే చాక్లెట్ రంగు, ధగ ధగ బంగారం రంగు కలగలిసి ఉన్న మనిషి కనపడ్డాడు.

మెరిసిపోతున్నాడు ఆ వ్యక్తి.....ఎంతందంగా, బలిష్టంగా, అజానుబాహువులా ఉన్నాడో... చాలా చాలా బావున్నాడు.....ఎంతలా అంటే చెప్పలేనంత....

(ఇక్కడేం జరిగిందో గుర్తుకురావట్లేదు, గుర్తులేదనటం కన్నా - చాలా అస్పష్టంగా ఉన్న అనుభవం...ఎలా రాయాలో తెలియదు....)

కట్ చేస్తే

ఆ వ్యక్తి చెయ్యి, చెయ్యి అనటం కన్నా మోచెయ్యికి ఆసరాలా పట్టుకుని ఆ గుడి మెట్లు ఎక్కించా....ఆయన రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసాడు....ఆ రూపం ఎవరిదో అర్థం అవ్వటానికి ఓ నిముషం పట్టింది....అర్థం అవ్వటమేమిటి, పూర్తి స్వరూపం కనపడటమేమిటి - కళ్ళల్లో నీళ్ళు ధారగా, విపరీతమైన ధారలు....కళ్ళు మూస్కుని చేతులు కట్టుకుని కూలబడిపోయా......ధార ఆగితేగా దిండు తడిసిపోయింది, మెలకువా వచ్చేసింది.....

ఆ రూపం ఎవరిది అనుకున్నారు?

హనుమయ్యది.....

జైశ్రీరాం అంటూ చెయ్యి చూపిస్తూ, ఓ పేద్ద గదతో నిలబడిన ఆ సుందర విగ్రహం ఈ జన్మలో మర్చిపోలేను....

ఆయన ఎందుకు కనపడ్డాడో తెలియదు కానీ బోల్డంత ఆనందం....నేను ఆయనకు భక్తుణ్నే కాని వీరభక్తుణ్ణీ కాను , కాకుంటే వీర శివభక్తుడినవటంతో అప్పుడప్పుడు ఆ శివయ్య కలలోనన్నా కనపడితే బాగుండని అనుకుంటూ ఉండేవాడిని కానీ, హటాత్తుగా ఆ శివస్వరూపం ఈ రూపంలో దర్శనమిచ్చిందేమో ! తెలియదు...సర్వం జగన్నాధం....

ప్రతి శనివారం అభిషేకంలో పాలు పంచుకుంటాను, అలంకారంలో పాలుపంచుకుంటాను కాబట్టి ఇలా దర్శనమిచ్చాడేమో తెలియదు కానీ మరచిపోలేని కల, గుర్తుండిపోయే కల....

సాధారణంగా మనిషికొచ్చే కలల్లో 99.5 శాతం నిద్ర నుంచి లేస్తూనే పలక మీద తడిగుడ్డేసి తుడిచేసినట్టు సోదిలోకి రాకుండా ఎక్కడికో పరుగులెత్తుకుంటూ వెళ్లిపోతాయ్. మిగిలిన .5 శాతం కలల్లో .3 శాతం కలలు కొద్దిగా నిద్ర లేచాక కూడా కొద్దిగా గుర్తు ఉంటవి. అయితే ఆ "గుర్తు" మిగలడానికి, మిగుల్చుకోడానికి కొద్దిగా కష్టపడాలి. మిగిలిన .2 శాతం మటుకు కష్టపడనఖ్ఖరలేకుండా గుర్తు ఉంటాయి. ఇదీ నా థియరీ. అలా .2 శాతంలోకి పడిపోయింది నిన్నరాత్రి వచ్చిన ఈ కల.

జై శ్రీరాం.....జై హనుమాన్..

భవదీయుడు
వంశీ

PS: నమ్మనివారు ఈవేళ రేపట్లో మా ఇంటికి వస్తే ధారల దిండు చూపిస్తా....అసలు చాలా ఆశ్చర్యంగా, చాలా అంటే విపరీతమైన ఆశ్చర్యంగా ఉన్నది నాకు ఈ సంఘటన......

Sunday, November 18, 2012

ఆసక్తి ఉన్నవారు ఈ లంకె నొక్కొచ్చు

ఆసక్తి ఉన్నవారు ఈ లంకె నొక్కొచ్చు

Very exciting experience!!

Friday, November 16, 2012

నరకానికి నిచ్చెనేసుకునెళ్ళి మర్డరు చేసిన చంద్రయ్య?

నరకానికి నిచ్చెనేసుకునెళ్ళి మర్డరు చేసిన చంద్రయ్య?  విడగొడితే - ఇలా


ఆకాశంలో మర్డరా?

Acrylics on 16 by 20 inches canvas..... This one took about an hr or so!





నరకానికి నిచ్చెన

This is pure palette knife painting in acrylics. Done in about 35 - 40 mins





చిరునవ్వుల చంద్రయ్య

Acrylics on 16 by 20 inches canvas - Done in about 1 hr




ఆనందో బ్రహ్మ

భవదీయుడు
వంశీ

Monday, November 12, 2012

మన సిపాయిలు ఎలాటి డ్రెస్సులేసుకునేవాళ్ళో !!

నిన్న మా ఊళ్ళో ఉన్న పాత పుస్తకాల కొట్టుకెళితే ఒక బిందె లభించింది....అది లంకెబిందె అని అనుకోవచ్చునేమో....1979లో ఆస్ప్రీ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించిన మిలటరీ సిరీస్ లో మొదటి సెట్టు ఓ వంద పుస్తకాలు అలా గజిబిజిగా పడేసున్నయ్ ......

వాటిలో భారద్దేశానికి సంబంధించిన పుస్తకాలు కనపడటంతో అవీ, వాటితో పాటు నాకు నచ్చిన ఇంకో ముప్ఫై పుస్తకాలు, అన్నిటికీ కలిపి ఓ వంద సమర్పించుకుని ఎత్తుకొచ్చా.......ఒక్కోటి మూడు రూపాయలు.....

అన్నీ ఫోటోలు తీసి పెట్టలేను కానీ, ఇండియన్ ఇంఫాంట్రీ రెజిమెంట్స్ 1860 - 1914 , ద ఇండియన్ మ్యూటినీ పుస్తకాల బొమ్మలు కొన్ని ఇక్కడ ఎక్కిస్తున్నా చూస్కోండి....

ఆసక్తికరమైన సంగతులున్నయ్ వీటిల్లో....అంతకుమించి మన సిపాయిలు ఎలాటి డ్రెస్సులేసుకునేవాళ్ళో చూడొచ్చు....




















ఆనందో బ్రహ్మ
 
భవదీయుడు
వంశీ

PS: ఎల్లుండి బుధవారం ఇంకో 322 పుస్తకాలొస్తయ్ అంట.....అవును అచ్చంగా మూడు వందల ఇరవై రెండు పుస్తకాలు - అప్పుడెళ్ళి ఆ బిందెల్లో ఎన్ని లంకెలున్నయ్యో చూడాలి....ఇంకో వందో ఎంతో సమర్పించుకోడానికి రెఢీ అయిపొయ్యా ! ఏక్ నిరంజన్

Disclaimer - Osprey Publications - No Copyright Infringement Intended....




Tuesday, November 6, 2012

సత్యసాయి మాష్టారుగారమ్మాయి నిజంగా శ్రావ్యమే!- Part 2


సత్యసాయి మాష్టారుగారమ్మాయి నిజంగా శ్రావ్యమే!- Part 2

tyAgarAjula vAri kRti - Very very nice rendition in "madhyamAvati"






శ్యామాశాస్త్రులవారి "ఓ జగదంబా" కూడా చాలా బాగా పాడింది శ్రావ్య...Wonderful....God Bless her!

ముఖ్యంగా మొట్టమొదటి లైను "ఓ జగదంబా" చాలా చాలా బాగా వచ్చింది.....మాంచి పట్టు పట్టింది ఆ లైనును మటుకు ! 2.04 వరకు - She nailed it

ఆతర్వాత కూడా చాలా బాగుంది కానీ, హైలైట్ మటుకు మొదటి రెండు నిముషాలు....అదిరిపోయింది...



సత్యసాయి మాష్టారు గారమ్మాయి నిజంగా శ్రావ్యమే!

మన కొవ్వలి సత్యసాయి మాష్టారు గారమ్మాయి నిజంగా శ్రావ్యమే! అమ్మాయి తప్పు లేకపోయినా, అనగా అక్కడక్కడ వాద్యకారుల తప్పులున్నా బాగా సద్దుకొచ్చింది.....

వేల ఆశీస్సులు, వందల అభినందనలు ....ముత్తుస్వామి వారిని అలా నిలబెట్టింది నా ముందు....

చాలా బాగుంది నాగగాంధారి...ఇదే వినటం ఆ కీర్తన.....ఎంత బాగుందో! చాలా బాగుంది...





ఆసక్తి ఉన్నవారికోసం - సమాచారం!

ఆసక్తి ఉన్నవారికోసం - సమాచారం : 

ఆకాశవాణి వారి బ్లాగు ఇక్కడ


Friday, November 2, 2012

కొంగర జగ్గయ్యగారు - వారి హాలీవుడ్ తాతగారు!

ఫీనిక్స్ నుంచి శాక్రమెంటో వస్తుంటే ఎయిర్పోర్టులో మా గేటు దగ్గర - కలకలం, కలకలం, కలకలం......

ఎనిమిది గేట్లవతల ఉన్న ఒక గేట్లోకి మిస్టర్ పీటర్ కల్లెన్ ఇప్పుడే వెళుతున్నారు అన్న వార్తే ఆ కలకలానికి కారణం....

పీటర్ కల్లెన్ అన్న మాట వినగానే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకునిపోయినయ్....ఆ గేటు దగ్గరికి పరుగులెత్తుతున్న జనాల మధ్యలో బుల్లెట్ ఏదన్నా ఉందంటే అది మనమే....

అలా జనాల మధ్యనుంచి దూసుకెళ్ళిపోయా, ఇహ ఆ గేటు ఓ ముప్ఫైఅడుగుల దూరంలో ఉందనగా పోలీసులు కట్టకట్టుకుని రావటంతో అందరూ ఆగిపోయారు...మన స్పీడుకు బ్రేకులేసినా బండి ఆగలా....సరాసరి ఒక పోలీసాయన దగ్గరికెళ్ళాక గానీ బ్రేకు పనిచెయ్యలా.....హేయ్ స్టాప్ దేర్ అంటూ ఆయన గన్ను మీద చెయ్యెయ్యటంతో ప్రమాదం ముంచుకొచ్చింది అని అర్థమైపోయి ఆగిపోటమేమిటి, చెమట్లు పట్టటమేమిటి అన్నీ జరిగిపోయినయ్....

అయితే ఆయన మర్యాద రామన్నలా స్టాప్ రైట్ దేర్, బిహేవ్ యువర్సెల్ఫ్ అని ఓ వార్నింగు ఇచ్చి వదిలిపెట్టాడు...అంత మటుకు అదృష్టమే....

అయితే ఆ అదృష్ట వార్నింగు అయ్యేప్పటికి పీటర్ గేట్లోకి వెళ్ళిపోయాడు.....

దురదృష్టం, తలరాత, కర్మ, ఖర్మ మణుగుల్లెక్కన కలిసి కుమ్మక్కయిపోయి మీదడిపోతే ఎంతటి అదృష్టవంతుడూ తప్పించుకోలేడు...

Hope I will get ONE more chance to meet that legendary soul. One day.....

ఇంతకీ పీటర్ కల్లెన్ అంటే ఎవరో తెలియని వారికి - ఆయన హాలీవుడ్ లో ఒక సీనియర్ వాయిస్ ఓవర్ ఆర్టిష్టు. మన సినిమా నటుడు జగ్గయ్యగారికి తాతగారు - స్వరంలోలెండి....

ఆయన పేరు విన్నప్పుడల్లా, నమ్మండీ నమ్మకపోండి మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడతయ్ నాకు, ఆప్టిమస్ ప్రైం అలా కళ్ళముందుకొచ్చేస్తాడు....

ఏంటీ ఆప్టిమస్ ప్రైం తెలీదా?

ఎందుకు బాబూ నాకు ఈ చిత్రహింస? ....

ఆప్టిమస్ ప్రైం అనే పాత్ర ట్రాన్స్ఫార్మర్స్ సినిమాలో సర్దార్ పాపారాయుడన్నమాట......

అంతటి పాత్రకు గాత్ర దానం చేసింది ఈయనే....ఆ స్వరం వింటే రోమాలెందుకు నిక్కబొడుచుకుంటయ్యో నీకే అర్థం అవుతుంది...

ఓ యూట్యూబులో పడి ఎతుక్కునే కష్టం నీకెందుకు గానీ, ఇదిగో ఇక్కడ చూడు.....

ఆతర్వాత ఓ సారి రీప్లే చేసి కళ్ళు మూసుకుని విను....ఆతర్వాత ఓ సారి రీప్లే చేసి కళ్ళు మూసుకుని, చెవిలో Ear Phones పెట్టుకుని విను....ఆ తర్వాత ఇక్కడో కామెంటు పడెయ్....ఏం?


ఆయన విశ్వరూపం 1 నిముషం 54 సెకన్ల దగ్గరనుంచి మొదలవుతుంది.... 

2.19 నుంచి 2.44  - నా ఆస్తంతా రాసిచ్చేస్తా, నా సర్వస్వం ఆ స్వరం ముందు పడేసి మోకరిల్లుతా.....అదంతా ఆయనకు ఓ సెంటుకు సమానం కాకపోయినా సరే!

We are here. We are waiting - వి ఆర్ వెయిటింగ్ అన్నదగ్గర విరుపు వింటే, అందులోని అర్థం అర్థమైతే మీ జన్మ ధన్యమే!




Blessed by GOD, yes by GOD himself - may Peter live long, long and long and make us happy.....What a heavenly voice he has. Just amazing....Can't stop talking about it, I will control myself and stop it right here....

Few others whom I adore, love, like are
  • Mel Blanc (He is a man of thousand voices, just can't name one - Tom, Jerry, bugs bunny, daffy duck, tweety bird. yosemite sam, woody wood pecker etc etc - list is end less)
  • Frank Welker (If you know Scooby you know Frank)
  • James Earl Jones (If you know Mufasa, you know James)
  • Ian McShane (If you know Tai-Lung, you know Ian McShane)
  • Randall Duk Kim (if you know Master Oogway, you know Randall)
  • Billy Crystal (If you know Mike Wazowski, you know Billy)
  • Steve Buscemi (If you know Randall Boggs, you know Steve)
  • William Hanna, Daws Butler (If you know Tom, Spike you know these guys)