Sunday, October 21, 2012

కాపీ కొడితే మటుకు మాది మీదవుతుందా ! తెలుగు పిల్లల డాన్సొకటి...

ఓ రెండు వారాల క్రితం ప్రపంచ సంగీత దినోత్సవం లాటిది జరిగింది మా ఊళ్ళో.....చిన్న పిల్లలకు కథలు (స్టోరీ టెల్లింగ్), నానాదేశసంగీత నాట్య విభావరులు జరిగినయ్...ఆ విభావరుల్లో మచ్చుకి రెండు ఈ కింద చూడొచ్చు.....అనగా కిందిచ్చిన లంకెలె మీద నొక్కుడు.....

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సంగీత నాట్య విభావరుల్లో పాల్గొన్నవారంతా, అంటే పెర్ఫార్మర్స్ అంతా చిన్నపిల్లలు అనగా 13 ఏళ్ళ లోపువారు....

మొదటిది బొలీవియా దేశ నాట్యం, పాటతో సహా....పాటకేగా నాట్యం చేసేది...నిశ్శబ్దానికి కాదుగా...అది అర్థమైతే తమరి జన్మ ధన్యమే.....ఆ పిల్లల కాస్ట్యూములు బాగున్నయ్, చాలా కలర్ఫుల్ గా ఉన్నయ్ ....అడిగితే మా దేశంలో ఇంతకన్నా జిగేల్ జిగేల్ మనే వస్త్రాలు వాడతాం అని ఓ పిల్ల సమాధానం చెప్పి నన్ను ఆశ్చర్యపరిచింది....మన మువ్వల పట్టీల్లా, పెద్దసైజు మువ్వలు ఒక సన్నపాటి ఇనప/అల్యూమినియం షీటు మీద గుచ్చేసి కాళ్లకు కట్టుకుని బ్రహ్మాండంగా చేసారు....

ఈ నాట్యం దాదాపు మన సంక్రాంతిని పోలి ఉండే ఒక పండగకు చెయ్యటం ఆచారమని పిల్లవాడు చెప్పాడు. పట్టివిప్పి చూపించాడు....అంత బరువూ, అంత తేలికా కాకుండా ఉన్నది...ప్రతి ఊళ్ళో ఆ నాట్యం అయిపోయాక అలా చేసిన పిల్లలందరికీ ఆ సంవత్సరానికి సరిపడే స్కూల్ యూనిఫారంలాటి బట్టలు, ఆ పిల్లల గురువుగారికి ఉన్నితో చేసిన కోటు ఒకటి బహూకరిస్తారట....మనవాళ్ళు పిల్లలకు పప్పు బెల్లాలు పంచినట్టు, భలే ఆశ్చర్యం వేసింది.....

ఇదేం చూసారు, మా దేశం వెళ్ళిరండి, జులై నెలలో అదేదో పండగొస్తుందిట, అప్పుడు పెద్దవారు చేసే నాట్యాలు, అప్పుడు ప్లే చేసే మ్యూజిక్కు ఇంకా బావుంటయ్ అని చెప్పింది ఈ నాట్యంలో పాల్గొన్న ఒక చిన్నపిల్ల......ఆ అమ్మాయి ఇక్కడే, అంటే అమెరికాలో పుట్టింది కానీ వాళ్ల తలిదండ్రులు బొలీవియా వారనీ, అందుకే మా దేశం వెళ్ళిరండని చెపుతున్నానని కూడా పెద్ద ఆరిందాలాగా చెప్పింది...ఆ అమ్మాయి చెప్పిన తీరుకి నవ్వొచ్చింది నాకైతే...

వాళ్ళ గురువుగారితో ఓ రెణ్ణిముషాలు మాట్లాడి, మీ మ్యూజిక్కు మా సినిమాల్లో వాడుకుంటున్నట్టు అనుమానంగా ఉంది అని అన్నా....రవూల్ మోంటెస్ అనే పేరు కల ఆ గురువుగారు, మాది మాదే, కాపీ కొడితే మటుకు మాది మీదవుతుందా అని నవ్వు నవ్వి ఊరుకున్నాడు....నేనూ మన సిగ్గులేని మ్యూజిక్ డైరెక్టర్లని తలుచుకుని ఓ నవ్వు నవ్వి ఊరకున్నా....

Links here:

Link 1

Link 2

NOTE: On the Video - Click the PLAY button once and wait until the video buffers. Also use Internet Explorer for best results. Firefox may not work.

సరే అదయ్యాక, స్టోరీ టెల్లింగు టైమని అందరూ పొలో మంటూ పిల్లలనేసుకుని ఒక థియేటరులోకి పరిగెత్తారు...సరే చూద్దామని మేమూ వెళ్ళాం....డెల్టా అనే పేరుకలావిడ రెండు గోప్ప కథలు చెప్పింది....

చిన్నపిల్లలంతా మెస్మెరైజ్డ్.....కథలు చెప్పటం మాంఛి కళయ్యా....అందునా పిల్లల అటెన్షన్ తప్పుకోకుండా అట్టిపెట్టుకోటం గోప్ప లక్షణం....ఆ పని / బాధ్యత ఆవిడ చాలా బాగా నిర్వర్తించింది.....ఆ వీడియో తర్వాతెప్పుడైనా.....

అదయ్యాక, ఈ లంకె నొక్కి అక్కడున్న డాన్సు మెడలు వంచుకుని చూడండి.... ఫ్లాషులోకి కన్వర్టు చేసేప్పుడు దానికేం రోగం వచ్చిందో, అలా మెడలు ఒరగేసి చూసేట్టు చేసిపెట్టింది....

సరే మెడలు ఒరగటం అయి, చూసేసాక - ఈ నాట్యం ఏ దేశందో మీరు చెప్పాలని మిగిలిన డీటెయిల్స్ వదిలేస్తున్నా....

అలా ఇంకా బోల్డు దేశాల నాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ఇంటికొచ్చేప్పటికి సాయంత్రమయ్యింది....

అనుకోకుండా వెళ్ళినా, బోల్డంత ఆనందం మిగిలింది....


సరే ఇదంతా అయ్యాక మనవాళ్ళ పిల్లలదొక వీడియో ......మొన్న ఆగష్టు పదిహేనుకు జరిగిన ప్రోగ్రాముల్లో తెలుగు పిల్లల డాన్సొకటి ఇక్కడ...

You have to wait until 2 minutes and 20 secs on this video for the smaller kids to appear.... and they did a fantastic job...all of them , well most of them are 5 and 6 year olds

ఇహ మీరు ఆనందోబ్రహ్మ.....
2 comments:

 1. నొక్కి నొక్కి ప్చ్ ఉపయోగం లేకపోయిందండీ

  ReplyDelete
 2. శర్మగారు

  భీముడు బకాసురుని గుద్ది గుద్ది....గుద్ది....గుద్ది....చంపెను లాగున మీరు అన్ని సార్లు నొక్కితే ఎలాగండి?

  ఆ వీడియోలు సైజులో పెద్దవి, అందువల్ల మీరు కొద్దిగా ఓపిక చేసుకుని ఓ సారి ప్లే నొక్కి, ఓ సారి మాత్రమేనండోయ్, నొక్కి బఫర్ అయ్యాక చూడండి....

  అప్పటికీ ఆ వీడియో కనపడకపోతే ఇక్కడో కామెంటు రాయండి...అప్పుడు దాని సంగతి తేలుస్తా...

  ReplyDelete