Monday, October 15, 2012

పోసికోలు బ్లాగర్లకు కాకుండా సరుకున్న బ్లాగర్లకు పనికొచ్చే వార్త!

ఉస్కుటపా బ్లాగర్లు, చెత్త కబుర్ల బ్లాగర్లు, పోసికోలు బ్లాగర్లకు కాకుండా సరుకున్న బ్లాగర్లకు పనికొచ్చే వార్త!

ఇదిగో ఇక్కడ....


LINK

1900 ల్లోని పుస్తకాలు ఒక ఇండెక్సు ప్రకారం, తెలుగులో టైటిల్సుతో ఉన్న పుస్తకాలు పి.డి.ఎఫ్ రూపంలో కావాలంటే అక్కడ నొక్కండి.....దించుకోండి....చదువుకోండి....ఆనందించండి....

కాదూ, కూడదు, కానేరదు - మాకు డి.ఎల్.ఐ సైటే యహ్హాహు, ఉహ్హాహూ అనుకుంటే  ఈ లంకెలో నేనెప్పుడో తయారు చేసిపెట్టుకున్న ఎక్సెల్ షీట్లు దించుకుని అక్కడున్న పేర్లతో , డి.ఎల్.ఐ కెళ్ళాక సెర్చి చేస్కోండి...

ఆనందో బ్రహ్మ

భవదీయుడు
వంశీ

10 comments:

  1. చాలా చాలా ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఛాలా ఉపయోగకరమైన లంకె ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు.

    ReplyDelete
    Replies
    1. పంతుల గోపాలకృష్ణ గారు, శర్మ గారు, ఆశ, చెప్పాలంటే - ఉపయోగపడితే ఆనందమే

      Delete
  3. తెలిసుండడమే కాదు. తెలిసినవి అందరితోనూ పంచుకోవాలని ఉంటుందే, అదీ గొప్పతనమంటే !! అసలు మీ వెబ్ సైటు చూడడమే ఒక గొప్ప అనుభూతి. ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. వాటికి సాయం, మళ్ళీ ఈ లింకులు--
    ఎంత షడ్రసోపేతమయిన విందు భోజనమైనా, మరీ ఇలాగ చేసేయడమే.....

    ReplyDelete
    Replies
    1. ఫణిబాబు గారు - అవునండి చేసెయ్యడమే, చేసెయ్యడమే, పంచెయ్యడమే - అది షడ్రసమైనా, ఏకరసమైనా ... :)

      Delete
  4. నేను సరుకున్న బ్లాగరుగా మారటానికి ఉపయోగించుకుంటాను. ఎనీ అభ్యంతరం? చాలా చాలా ధన్యవాదాలండి.

    ReplyDelete
  5. వంశీ గారు,

    శుభోదయం! దుర్లభమైన ఈ చిరత్న రత్నసందోహాన్ని విద్యార్థిత్వం కలవారికోసం కరతలామలకంగా అందజేసి - అంతులేని పుణ్యాన్ని మూటగట్టుకొన్నారు.

    ఒక్కొక్కటిగా చదువుకొంటున్నాను. మీకు నా మెప్పుల కుప్పలు!

    సర్వ శుభాకాంక్షలతో,

    భవదీయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    ReplyDelete
  6. వంశీ గారూ!
    'సరుకున్న బ్లాగర్ల' సరసన చేరే అత్యాశతో--- లంకె ఉండగా XL, XXL ఏలనని, దించేసుకుని-దంచేసుకుంటూ- ఆనందించేస్తున్నామండీ బాబూ! పంచుకుంటే దుఖ్ఖం తరిగి, సంతోషం పెరుగుతుందట. మీకు సంతోషం పెరుగుతూనే ఉండాలి. ఉంటుంది. బహుదా,శతధా ధన్యవాదాలు.
    రాజా. gksraja.blogspot.in

    ReplyDelete