Wednesday, September 12, 2012

ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా?

ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా?

ఎక్కలేదు బాబయ్యా....కావాలంటే చూస్కో.....

సంగతేంటంటే - ఐదున్నర నెలల తర్వాత, షికారుకెళ్ళి చాలా రోజులయ్యింది కదాని ఈరోజు డాక్టర్ దగ్గరికెళ్ళొచ్చా.....

వాళ్ళిచ్చే డబ్బులంటే చిరాకు లేకపోయినా వారానికోసారొచ్చి కనపడిపోయే పేషంట్లంటే చిరాకు పడే ఈ డాక్టర్లకు ఆర్నెల్లకోసారి కనపడేవాళ్ళంటే ప్రాణం లేచొస్తుందనుకుంటా....మీ డాక్టరు సంగతేంటో నాకు తెలియదు కానీ కనీసం మా డాక్టర్ గారి తీరది.....

పోలండ్ జాతీయుడు, అదేదో నోరు తిరగని ప్రతిష్టాత్మకమయిన విశ్వవిద్యాలయం నుంచి పట్టా పుచ్చుకున్నవాడు - మా డాక్టరు గారు....చాలా నెమ్మదైన వ్యక్తి, సమయం గురించి పట్టించుకోకుండా చక్కగా - అంటే శ్రద్ధగా మనమేం చెపుతున్నామో విని అర్థం చేసుకుని, సందేహాలకు విసుక్కోకుండా విపులంగా సమాధానాలిచ్చే మహానుభావుడాయన....

రోగానికో, నొప్పికో వెడితే - లక్షణాలు చెప్పగానే సంగతి (అనగా డయాగ్నోసిస్) ఇట్టే పట్టేసి ఒరే నీకున్నది ఇదిరా, నీకేం భయం లేదు, ఈ మందులేసుకో ఫో అని చక్కగా భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించేస్తాడు....ఆయనిచ్చిన మందు అలానే పని చేస్తుంది కూడా.....

ఎంతమందికి ఆ ఇది ఉంటుందో తెలియదు కానీ, నాకు ఆయన మీదున్న నమ్మకం కూడా ఆ మందు పనిచెయ్యడానికి ఓ కారణం అని ఘాట్టిగా నమ్మేస్తాను కాబట్టి గొడవే లేదు....

సరే ఈ రోజు వెళ్ళగానే రోగం లక్షణాలు అవీ చెప్పి చెప్పగానే ఓ మందిచ్చి ఎప్పట్లానే ఫో అనబోతూ, నా మెడికల్ రికార్డొంక చూస్తూ రెండేళ్ళయిందిగా ఇయర్లీ ఫిసికల్ కోసం రక్తపరీక్ష చేద్దామని చెప్పి అది ఆర్డరిచ్చేసి, ఆ ఆర్డరైపోగానే బాడీ కాంపోసిషన్ ఫాక్టరు కూడా చూద్దామని ఓ మెషీనెక్కించి రెండు చేతుల్తో అటూ ఇటూ ఉన్న ఇనప ముక్కలు ఘాట్టిగా పట్టుకో ఓ పది సెకన్లు అన్నాడు...సరే అని పట్టుకున్నా.....

పది సెకన్లయ్యాక ఓ ఐదు పేజీలు ప్రింటయ్యాయి పక్కనున్న ప్రింటర్లో....అందులో సమ్మరీ పేజీ ఒకటి తీసి నా చేతిలో పడేసి, అంతా బాగుంది.....ఎక్సెర్సైజు, వాకింగు గట్రా గట్రా గట్రా చేస్తూ ఇలాగే కంటిన్యూ అయిపో అన్నాడు.....

సరే సార్, చేస్తున్న బైకు రైడు మీద ఇంకొద్దిగా ఉద్రేకపడతా అన్నా.....అంతొద్దులే కానీ ఇప్పట్లానే కంటిన్యూ చేస్కో, ఎక్కువైతే నిన్నిక్కడ ఎక్కువసార్లు చూడాల్సొస్తుంది అన్నాడు.... వాకే అనేసి బయటికొచ్చి బ్లాగు మీదకెక్కి ఆ సమ్మరీ పేజీ చించా (అదేనయ్యా పబ్లిష్ చేసా!)

ఇహ ఆలస్యం లేకుండా నువ్వు కూడా సైకిలెక్కి, మా డాట్రారు చెప్పినట్టు నీ కొవ్వు శాతం 10 లోపల పెట్టు, కుదరదంటే "12" అంకె దగ్గర ముసుగేసెయ్యి....నువ్వూ, నీ జీవితం బాగుంటాయి....ఆ రెండూ బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, ఆ తర్వాత చుట్టుపక్కలవాళ్ళు బాగుంటారు...అదీ లెక్క.....

ఏదన్నా నువ్వు సొంతంగా చేసుకోవాల్సిన పనులే ఇవన్నీ.....గుంపులో దూరదాం, సంఘ జీవిని కదాని ఇతర జీవాల్ని కలుపుకుని చేద్దాం అనే లంపటం లేకుండా, ఏదైనా సరే - సాహిత్యమైనా, సంగీతమైనా, ఫ్లూటైనా, పెయింటింగైనా, సైకిలైనా, విలువిద్యైనా, పాటరీ అని నువ్వు పాషుగా పిలుచుకునే కుమ్మరి పనైనా -  నాలాగా ఏక్ నిరంజన్ టైపులో చేస్కో.....బాగుపడతావ్.....ఏం ?


అవునూ ఇంతకీ చూస్కో అన్నావ్....ఏదీ ?

అడిగావూ ?

ఇదిగో.....ఆరోగ్యోబ్రహ్మ

పైనిచ్చిన కాలరీల సంగతి కూడా చూస్కుంటూ తిను, అలా చెయ్యలేకపోతే సైకిలు ఎక్కువ తొక్కు, సైకిలు తొక్కలేకపోతే మంగలాయన దగ్గరికెళ్ళుNo comments:

Post a Comment