Monday, September 10, 2012

సైకిలు షాపు మస్తాను - గంటకు ముప్పావలా - రికార్డు బ్రేక్ !!

పాతిక మైళ్ళ సరిహద్దు విరగిపోయిందంతే! శభాషో

దిక్కుమాలిన బ్లాగులు, దరిద్రం వదిలేసి ఆరోగ్యం మీద, గ్రామీ అవార్డులు పుచ్చుకున్న గురువుగారి దగ్గర అమెరికన్ ఇండియన్ ఫ్లూటు క్లాసుల మీద, ఫుల్ టైం ఆర్చరీ క్లాసుల మీద పడ్డాక జీవితం ప్రశాంతంగా ఉంది.....

సరే ఈ టపాకొచ్చేస్తే - మూణ్ణెళ్ళ క్రితం సహోద్యోగి విన్సెంట్ మయోన్ సైకిలు మీద ఆరు గంటల్లో 100 మైళ్ళ రికార్డు బ్రేక్ చేశానని చెపుతూ ఉంటే ఆశ్చర్యపోయిన నేను, చిన్నప్పుడు చల్లపల్లి నుంచి వెంకటాపురం, ఘంటసాల మొదలైన ఊర్లు, సైకిలు షాపు మస్తాను దగ్గర గంటకు ముప్పావలా అద్దె ఇచ్చి తీసుకున్న అట్లాస్ సైకిలు మీద చెరుకు ముక్కలు నములుకుంటూ మావయ్యలతో పోటీ పడి అలాగ్గా తొక్కేసిన రోజులు గుర్తుకుతెచ్చుకుని , కసిగా బైసికిల్ ప్లానెట్ షాపుకెళ్ళి ఓ సింగిలు చెయిను బైకెత్తుకొచ్చి  - అదే బాబూ కొనుక్కొచ్చి ( గేర్ల బైకులు నచ్చలా నాకు!) వారంలో నాలుగు రోజులు తొక్కడం మొదలెట్టి, రోజుకో మైలు చొప్పున పెంచుకుంటూ ఈరోజు పాతిక మైళ్ళ కంచె / సరిహద్దు దాటేసా.....

ఖచ్చితంగా 28.4 మైళ్ళు - రెండు గంటల్లో (2 hrs and 13 mins precisely)......శభాషో!  


Entry Point On The Bike Trail: 17
Ending Point: 31 (Beales Point) 

See the Bike Trail photo (last one) - and this is one way for clarification

ఇంటి పక్కనే అమెరికను రివరు, దానినానుకునున్న బైకు ట్రెయిలు ఈ రోజు మా బైకు టైరుఘట్టనల కింద పడి నలిగిపోయింది .......ఉహహ.... ఉహహహ...

ఈ దేశంలో బైకు రైడ్ల గురించి ఓ పేద్ద పోష్టేసుకోవచ్చు - నెమ్మదిగా 50 మైళ్ళ రికార్డుకెక్కాక వివరంగా వివరిస్తా.....అందాకా మా రివరు, ట్రెయిలు, కొన్ని ఫుటోలు చూస్కోండి..... 













1 comment:

  1. 50వ మైలురాయిని కూడా అలాగ్గా తొక్కేసుకుంటూ దాటేయాలని శుభాభినందనలు.

    ReplyDelete