Thursday, September 13, 2012

"అది" గారికి, "ఇది" గారికి! ...........


మొన్నాదివారం లచ్చ మైళ్ళ హద్దు దాటేసి పరుగులు పెట్టింది....

ఏంటి పరిగెత్తుతోంది? ఎక్కడికి పరిగెత్తుతోంది?

ఎం.ఎల్.500 అనే నా వాహనమున్నూ, నా కాళ్ళూ చేతుల కిందన్నూ....

ఇది లచ్చ మైళ్ళు, అది రెండు లచ్చల 40 వేల మైళ్ళు.....

 ఇది అంటే అర్థమయ్యింది....మరి అదా? అదంటే?

అదంటే ఇది.....(Click on the link)

అల్లప్పుడెప్పుడో లచ్చ 97 వేల మైళ్ళున్నప్పుడు ఎక్కిచ్చా....

చంద్రుడు మనకి 2,38,900 మైళ్ళు లేదా 3,84,400 కిలోమీటర్లు దూరంలో ఉన్నాడయ్యా......చంద్రుడు ఆకాశంలో ఉండబట్టి బతికిపోయాడు కానీ ! అక్కడిక్కూడా రోడ్డేదన్నా ఉంటే వెళ్ళొచ్చేసే పనే ....

మరి అది + ఇది - ఈ రెండు కలిపితే వచ్చిన 3,40,000 మైళ్ళతో (5,44,000 కిలోమీటర్లు) చంద్రుడి దగ్గరకెళ్ళకుండా భూమ్మీదే చేసిన విహారానికి మనకొచ్చిందేమిటి?

28 రాష్ట్రాల పూర్తి సందర్శనానందం, ఒక్క మవుంట్ రష్మోర్ తప్ప మిగిలినవన్నీ చూసేసిన తృప్తి, బ్రహ్మాండమైన అనుభూతులు, ఎదుర్కున్న కష్టాలు, వివిధ ప్రదేశాల్లోని మనుషుల తీరులు తెన్నులు జాగ్రత్తగా గమనించే అవకాశం - అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే బోలెడన్ని......

అదిలో, ఇదిలో -  చేసిన/వేసిన పేద్ద ట్రిప్పుల్లో కలకాలం గుర్తుండిపోయేవి బోల్డన్ని ఉన్నా వాటి గురించి తీరిగ్గా తర్వాతెప్పుడైనా......

 ఇన్ని లచ్చల మైళ్ళు ఎక్కడికెళ్ళినా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన అది గారికి, ఇది గారికి సహస్రాధికంగా - కృతజ్ఞతలతో  ...




No comments:

Post a Comment