Friday, August 24, 2012

కీలుగుఱ్ఱము మీద బాలీసునానుకొని ప్రాణాలు లేనట్టి భగవంతుడొచ్చాడు

కీలుగుఱ్ఱం

-- శ్రీ తెన్నేటి సూరి (1954)

కీలుగుఱ్ఱము మీద బాలీసునానుకొని
ప్రాణాలు లేనట్టి భగవంతుడొచ్చాడు
ఊరంత ఊరేగుతూ ఉత్సవము సాగించుతూ
కూలి మాటడగండిరా!
అన్నాలు చాలవని చెప్పండిరా!

కంచుగుండెకు గూడ కనికరము కలదన్న
మాయసిద్ధాంతాల మాటేటొ సూడాలి
జాలిగిలబడి మ్రొక్కరా
వినకుంటె చెవిటి మొద్దని వీడరా
కోఱచేతులుసాచి కంచుగుండెలు కరుగ
కూలి మాటడగండిరా!
అన్నాలు చాలవని చెప్పండిరా!


PS: One of the best reads of this week from one of my all time favorite writers!

3 comments:

  1. తెన్నేటి సూరి గారి ఈ కవిత నాకెంతో ఇష్టం.అవును వంశీ మోహన్ గారూ! మీ ఫేస్ బుక్ అక్కౌంట్ మూసేశారా?

    ReplyDelete
  2. ఈ కవిత చదివిన నాలుగైదు సార్లు, నాలుగైదు రకాల భావాలు కలిగినై సార్!

    సూరి గారు, నేను విపరీతంగా అభిమానించే రచయితల్లో ఒకరు. అయినా సరే, ఈ కవితలో "వినకుంటె చెవిటి మొద్దని వీడరా" అన్న లైను భోజనంలో పంటికింద రాయిలా తగిలింది. మిగతాదంతా ఈనాటి పరిభాషలో ఒక "కిల్లర్ కవిత". సింప్లీ అమేజింగ్ అన్నమాట... లేకపోతే అది అక్కడ వెయ్యడానికి ఆయనకు కలిగిన భావావేశం నాకు అర్థం కాలేదో....

    "వీడరా" అన్న వెనకే "కంచుగుండెలు కఱుగ" అంటూ భావం వ్యక్తం చెయ్యడానికి ఏదన్నా బలమైన కారణం ఉన్నదేమో....

    ఫేస్ బుక్ అక్కవుంటు మూసేసి నాలుగైదు నెలల పైనే అయ్యిందండి. జీవితం ప్రశాంతంగా ఉన్నదిప్పుడు..... :)


    ReplyDelete
  3. wow....తెన్నేటి సూరి గారి కవితలు ఎప్పుడూ చదవలేదండీ. ఆయన రాసిన చంఘీజ్ ఖాన్ చదివి విపరీతంగా అభిమానించాను. ఇప్పుడు ఈ కవిత చదివాక్ అనిపిస్తోంది నేను చాలా మిస్ అయ్యానేమో అని. తప్పకుండా చదవాలి ఆయన కవిత్వం.

    ReplyDelete