Saturday, August 25, 2012

అప్పారావు పంచదార మాత్రలు, స్త్రీలు......

**********************************

గురజాడ అప్పారావు కథానికలు

-- శ్రీ దాశరథి


**********************************

అప్పారావుగారి పంచదార మాత్రలు

-- శ్రీ ఆరుద్ర


**********************************

గురుజాడ స్త్రీ పాత్రలు

-- శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ


********************************** ఎక్కడ?

వెబ్సైటులో అపూర్వ సాహిత్యము సెక్షన్లో

Friday, August 24, 2012

కీలుగుఱ్ఱము మీద బాలీసునానుకొని ప్రాణాలు లేనట్టి భగవంతుడొచ్చాడు

కీలుగుఱ్ఱం

-- శ్రీ తెన్నేటి సూరి (1954)

కీలుగుఱ్ఱము మీద బాలీసునానుకొని
ప్రాణాలు లేనట్టి భగవంతుడొచ్చాడు
ఊరంత ఊరేగుతూ ఉత్సవము సాగించుతూ
కూలి మాటడగండిరా!
అన్నాలు చాలవని చెప్పండిరా!

కంచుగుండెకు గూడ కనికరము కలదన్న
మాయసిద్ధాంతాల మాటేటొ సూడాలి
జాలిగిలబడి మ్రొక్కరా
వినకుంటె చెవిటి మొద్దని వీడరా
కోఱచేతులుసాచి కంచుగుండెలు కరుగ
కూలి మాటడగండిరా!
అన్నాలు చాలవని చెప్పండిరా!


PS: One of the best reads of this week from one of my all time favorite writers!

Thursday, August 23, 2012

ఈ వారం వెబ్సైటుకెక్కినవేమిటంటే ?

 వెబ్సైటులో అపూర్వ సాహిత్యము సెక్షన్లో


************************************************

రాయలనాటి కవితా జీవనము (పరిశోధన పత్రిక - 1954)

-- శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

************************************************


తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం (పరిశోధన పత్రిక - 1955)

-- శ్రీ తిమ్మావజ్ఝల కోదండరామయ్య

************************************************


నాచన సోమన నాటి సంగీత సాంప్రదాయం (పరిశోధన పత్రిక - 1955)

-- శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు

************************************************


ప్రచార సాధనాలు - సాహిత్యము (అవగాహన పత్రిక)

-- శ్రీమతి వి.రతన్ ప్రసాద్ (చిన్నక్క), శ్రీమతి పండా శమంతకమణి

************************************************


రాష్ట్రేతర ఆంధ్రులు - సంస్కృతీ వికాసం

-- శ్రీ కొడవటిగంటి కుటుంబరావు

************************************************


కళలు

-- శ్రీ కొడవటిగంటి కుటుంబరావు

************************************************


శ్రీరంగం నారాయణబాబు

-- శ్రీ మానేపల్లి సత్యనారాయణ

One of the best write up I have read about this great man, poet, litterateur. Thank you Sri Manepalli gaaru


************************************************

సాహిత్య ప్రయోజనం లేని రచన

-- శ్రీ కొడవటిగంటి కుటుంబరావు

************************************************


యంత్రాలు

-- శ్రీ అల్లం రాజయ్య

బ్రహ్మాండమైన రచన (సబ్జెక్టివ్ గానే!)

************************************************

కుండలు - బిందెలు కొట్టుకుంటే?


వేసవి కాలం
కుళాయి దగ్గర
గుంపులు గుంపులు
కుండలు బిందెలు

మూగ భయాలై
ఒదిగే కుండలు
విర్రవీగుతూ
అరిచే బిందెలు

కుండలు బిందెలు
కలహం కదనం

కదనంలో పడి
మూల్గే కుండలు
తలతళ కన్నుల
నవ్వే బిందెలు

మెరిశే బిందెలు
సంధ్యా కాంతులు

---శ్రీ సోమసుందర్

(వేసవి - రచనాకాలం - 1966)

Wednesday, August 22, 2012

పాండిత్యం ఉంటే బలాత్కార అభియోగం నుంచి తప్పించుకోవచ్చా?

పాండిత్యం ఉంటే బలాత్కార అభియోగం నుంచి తప్పించుకోవచ్చా?

తప్పించుకోవచ్చుట

ఎలాగ?

ఇలాగ

గేహేగేహే జంగమా హేమవల్లీ
వల్యాం వల్యాం పార్వణశ్చంద్రబింబః
బింబే బింబే కోకిలానాం విరావో
రావే రావే జాయతే పంచబాణః


రావే రావే అని వెంబడి పడి బలాత్కారం చెయ్యబోతే తప్పించుకుని ఆ అమ్మాయి రాజు గారి దగ్గరికెళ్ళి విన్నవించుకోగా, రాజు గారి వీణ్ణి పిలిచి ఏమిరా "రావే రావే" అని వెంబడి పడ్డావుట అని అడిగాట్ట....

లేదండీ - ఆ అమ్మాయికి ఈ శ్లోకం నేర్పిద్దామని వెంబడి పడ్డానంతే అని పైనిచ్చిన శ్లోకం వదిలాట్ట....అదీ సంగతయ్యా!

అది విని రాజుగారు వాణ్ణి సన్మానించి పంపాట్ట....

ఆ రాజూ సరే, వీడి పాండిత్యమూ సరే....పాపం ఆ అమ్మాయే...

ఇది చదివితే మన రాజకీయనాయకుల బలాత్కారాలు గుర్తుకు రావట్లా? 

PS: 

ఇంతకీ ఆ శ్లోకానికి అర్థం ఇదీ

ప్రతిగృహంబున చరియించు పసిడితీగె
పసిడితీగె వసించు పార్వణశశాంకు
డతని బింబంబు కోకిలాద్భుతరవంబు
తద్రవము మరునగ్ని కింధనము వినుము 


ఇంకా అర్థం కానివాళ్ళకి అర్థం ఇదీ, ఇది కూడా అర్థం కాకపోతే మీ మీ భాషల్లో మీ మీ యాసల్లో తర్జుమా చేయించుకోండేం ? 

ప్రతి ఇంటిలోనూ ఊగాడుతున్న బంగారు తీగ లాటి అమ్మాయి, ప్రతి తీగలోనూ శుక్లపక్షంలో ఉన్న చంద్రబింబం లాటి ముఖమున్నదని, ప్రతి బింబంలోంచీ కోకిలల శబ్దాలొస్తున్నవని, ప్రతి శబ్దంలోనూ మన్మధుడు పుడుతున్నాడని అర్థం

ఇది కాళిదాసు చెప్పాడని కొంతమందంటారు, కాదు కాదు అవంతీ దేశపు ఆస్థాన పురోహితుడి కథని కొంతమందంటారు.... పురోహితుడి కథైతే ఆ రాజుగారు అవంతీ దేశాధినేతన్నమాట చెప్పనఖ్ఖరలేదుగా....


Wednesday, August 15, 2012

శ్లిష్టాకర పదబంధము - శ్రీశ్రీ - 1928 పజిల్

శ్లిష్టా.క.ర పదబంధము - శ్రీశ్రీ - 1928 పజిల్

Credits: Press Academy Archives
Tuesday, August 14, 2012