Wednesday, June 6, 2012

శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారి దస్తూరి!

శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారి దస్తూరి

1935 చంద్రిక మాస పత్రిక నుండి

7 comments:

 1. అచ్చతెలుగును ఒక ఉద్యమంగా వ్యాపింపజేసి, భాషాక్షేమం పునాదిగా మన నుదుటివ్రాతను మార్చాలని కలలు కన్న మహామహుని చేతివ్రాత ఇది!

  తెలుగు దేవభాషకు దీటైనదని, ఎందులోనూ తీసిపోదని కవితను ప్రారంభించి, పాశ్చాత్యభాషావ్యామోహంతో పుంస్త్వాన్నీ, చివఱికి స్వత్వాన్నీ కోల్పోతున్న జాతి పతనావస్థను చూసి శోకించిన దేశభక్తుని రక్తాశ్రువు ఇది.

  పదవిన్యాసంలో, అర్థవిభూతిలో, పద్యరచనలో, యతిస్థానాల కూర్పులో ఆయన అధికారాన్ని, ప్రామాణికతను ఇందులో మనస్తర్పణగా దర్శింపవచ్చును.

  ప్రగల్భమైన భావం, పరిశుద్ధమైన భాష, ముత్యాలను మూటగట్టిన అక్షరరాశి - "చంద్రిక" పత్రిక ఈ కవితను కవి స్వహస్తాక్షరాంకితంగా ప్రకటించటంలో ఎంత ఔచిత్యం ఉన్నదో - దానిని మీరు సంపాదించి పునఃప్రకటించటం అంత ప్రశంసనీయం!

  తెల్లవారుజామున మీరు వ్రాసిన లేఖ మూలాన ఈ దివ్యమైన, భవ్యమైన కవితను చదువుకొని, కంఠస్థమైనాక - నిండైన కృతజ్ఞతతో ఈ నాలుగు మాటలు వ్రాశాను, వంశీ గారు!

  ReplyDelete
 2. శ్రీ ఏల్చూరి వారికి నమస్కారాలు

  మీరు వ్రాసిన ప్రతి అక్షరం సత్యం. ఎంతో విలువైన మాటలు చెప్పారు.

  మీలాటి వారి వ్రాతలు చూసేందుకు, శంకరయ్య మాష్టారు గారి వంటి వారి మాటలు వినేందుకు మాకు, మా తరానికి ఈ మాత్రం భాగ్యమన్నా ఉన్నది...మా తర్వాతి తరాలకు ఆ భాగ్యం దాదాపు సున్న అని చెప్పడానికి జంకుతూనే, ఏదో మూల - ఎప్పటికైనా ఆ సున్నా పక్కన ఒకటి చేరుతుందేమో అన్న ఆశ మటుకు మిణుకుమిణుకుమంటోంది అని తెలియచేసుకుంటూ .....

  పెద్దవారు మీరు, నన్ను "గారు" అని , నాకు "కృతజ్ఞతలు" అని వ్రాసి - సంకటస్థితిలోకి నెట్టివెయ్యొద్దు అని విన్నవించుకుంటూ....

  జ్ఞానంలోనూ, వయసులోనూ చిన్నవాడిని కాబట్టి మీరు చక్కగా పేరు పెట్టి పిలుస్తూనే, కృతజ్ఞతల బదులు ఆశీర్వాదాలు అందచెయ్యాలని ఆశిస్తూ....

  భవదీయుడు
  మాగంటి వంశీ

  ReplyDelete
 3. wonderful!

  ఈయన నడయాడిన వీధులలో ఆ పాద స్పర్శను గుర్తుచేసుకుంటూ తిరగడం నా అదృష్టం. ఎందరో మహానుభావులను కన్న ఊరు నన్నూ కన్నదంటే నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో!

  ఆదిభట్లాయన స్వీయచరితము మీ దగ్గర ఉందా అండీ??

  ReplyDelete
 4. శ్రీ నారాయణదాసు గారి స్వీయచరిత్ర “నా యెఱుక” కోసం, వారి ఇతర రచనలకోసం లోనూ;

  వారి సమగ్ర జీవితచరిత్ర – రచనల సమీక్ష “నారాయణదర్శనం” కోసం, మఱికొన్ని లఘురచనలకోసం
  http://archive.org/stream/narayanadarshana021674mbp#page/n3/mode/2up
  లోనూ చూడవచ్చును.

  ReplyDelete
 5. శ్రీ నారాయణదాసు గారి స్వీయచరిత్ర “నా యెఱుక” కోసం, వారి ఇతర రచనలకోసం http://books.google.co.in/books/about/Na_yeruka.html?id=WwMIAQAAIAAJ లోనూ;
  వారి సమగ్ర జీవితచరిత్ర – రచనల సమీక్ష “నారాయణదర్శనం” కోసం, మఱికొన్ని లఘురచనలకోసం
  http://archive.org/stream/narayanadarshana021674mbp#page/n3/mode/2up లోనూ చూడవచ్చును.

  ReplyDelete