Wednesday, June 6, 2012

బుడ, బుడ, బుడ - బుడుకో, బుడక్

(1952 గోసేవ పత్రిక నుండి)

అంబపల్కు
జగదంబ పల్కవే
ఆదిశక్తి
త్రిపురాంభ పల్కవే
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్

ఓంకారమే జపించు దేవరా
ఓంకారమే జపించు దేవరా
మనసులో మాటా
చెబుతాం బాబూ
మూడు లోకముల
ముచ్చటలన్నీ
ముందు జరిగెడివి
జరగబోయెడివి
అన్నీ మాకవగాహన బాబూ
ఆదిశక్తి దయవల్లను బాబూ
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్


దోసపండ్ల విధాన బిడ్డలు
దొర్లుదురు నీయింట తల్లీ
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్

No comments:

Post a Comment