Monday, June 4, 2012

అత్త కొట్టిన కుండ - కోడలు కొట్టిన కుండ

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ



6. ఒక అత్తింటికోడలు గుంటలో పోసిన ధాన్యం దంచుకుంటూ అలసట తీర్చుకోడానికి పాడుకుంటూ సహాయం చేయమని తోటికోడల్ని రమ్మని పిలుస్తుంది



కొట్టారబోసిన కొలకల్లు దంచా
తోడైనరాయోలె తోటికోడల్లా

అరగదంచిన బియ్యం చేటల్లకెత్త
తోడైనరాయోలె తోటికోడల్లా

ముంగిటబోసిన మునివడ్లనెత్త
తోడైనరాయోలె తోటికోడల్లా

అంబటియేరొచ్చె అత్తగారా అంటె
కొలబుర్ర ఉన్నది కోడలన్నాది

అత్తకొట్టిన ఆ కుండ
అడుగోటి కుండైతె
కోడలు కొట్టిన కుండ
కొత్త కుండౌనా!

No comments:

Post a Comment